ఎంతో ఆనందంగా ఉంది
ఇప్పపువ్వు లడ్డూను తొలుత స్వయం ఉపాధి కోసం తయారు చేశాం. తొలి నాళ్లలో అంతగా అమ్ముడుపోయేవి కావు. ఐటీడీఏ చేయూతతో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలతో పాటు బయట మార్కెట్‌లోనూ అమ్ముతున్నాం. ప్రతి నెలా రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. ఖర్చులన్నీ పోనూ సభ్యులకు తలా రూ.20వేల వరకు మిగులుతుంది. మేం చేసే లడ్డూలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ లడ్డూ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో మా లాంటి మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం చేయూతనందిస్తే మరింతగా ముందుకు సాగుతాం.
– బాగుబాయి భీంబాయి, ఆదివాసీ
మహిళా సహకార సంఘం అధ్యక్షురాలు


