అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని, త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన తొడసం బాలు కోరాడు. కంది, మొక్కజొన్న పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కెరమెరి మండలం పిప్రి గ్రామానికి చెందిన నాయుడి ఎల్లక్క వేడుకుంది. తన పేరిట పట్టా ఉన్న భూమిని నిషేధిత జాబి తా నుంచి తొలగించాలని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన అన్వరుల్లా హుక్ దరఖాస్తు చేసుకున్నాడు. దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అర్జీలు అందించారు. సాగు భూమికి పట్టా మంజూరు చే యాలని కాగజ్‌నగర్‌కు చెందిన తెలంగె లింబారా బు దరఖాస్తు చేసుకున్నాడు. కౌటాల మండల కేంద్రంలోని వారసంతలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించి న మూత్రశాలలకు బిల్లులు మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన డి.మత్తయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన షెడ్యూల్డ్ కులా లు, తెగలు, బీసీలకు పట్టాలు మంజూరు చేయాల ని వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం శ్యాంరావు కోరాడు. దహెగాం మండలం గెర్రె గ్రామాని కి చెందిన రైతులు 25 ఏళ్లు సాగు చేసుకుంటున్న అ టవీ భూముల్లో పండించిన పత్తిని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, రెవెన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే చేయాలని గ్రామానికి చెందిన దుగుట నానయ్య వేడుకున్నాడు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ ఆగింది
పదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడి కాలు, కుడి చేయి పని చేయవు. సదరం సర్టికెట్ తీసుకుని దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా, గత జూలై నుంచి సర్టిఫికెట్ రెన్యువల్ చేయలేదని పింఛన్ ఆగింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరగా పింఛన్ పునరుద్ధరించాలి.
– నైతం భీమ్‌రావు, జన్కాపూర్, ఆసిఫాబాద్
పాస్‌పుస్తకం జారీ చేయాలి
మా తాతల నుంచి టోంకిని గ్రామ శివారులోని ఐదెకరాల పరంపోగు భూమిని సాగు చేసుకుంటున్నాం. అయినా పట్టా పాస్‌పుస్తకం లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. సర్వే చేపట్టి పట్టా పాస్‌పుస్తకం జారీ చేయాలి.
– చౌదరి గణపతి, టోంకిని, సిర్పూర్(టి)
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు


