నీటిగుంతలో పడి బాలుడి మృతి
బిజినేపల్లి: నీటిగుంత లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పాలెం గ్రా మం సుబ్బయ్య కాలనీ లోని ప్రాథమిక పాఠశా ల సమీపంలో శనివారం సాయంత్రం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రా మానికి చెందిన మంజుల తన కుమారుడు శశిధర్(3)ను ఇంటి వద్దనే ఉంచి కూలీ పనికి పో యింది. సాయంత్రానికి వచ్చి కుమారుడి కో సం వెతకగా కనిపించలేదు. ఇటీవల పాఠశాల సమీపంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలు తీయడంతో వాటిలో వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ గుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి సంవత్సరం క్రితమే చనిపోయాడు. భర్త, కుమారుడు ఇద్దరు చనిపోవడంతో తాను ఒంటరిదాన్ని అయ్యాయని మంజుల పడుతున్న వేదన స్థానికులను కంటతడి పెట్టించింది.
పాము కాటుతో
వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: పాముకాటుతో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన కుమ్మరి జయరాములు(44) వృత్తిరీత్యా వ్యవసాయం. భార్య పద్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం సొంత పొలంలో ఆయిల్ పాం తోటలో గెళలు తెంపుతుండగా 4గంటల ప్రాంతంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కాల్వలో వ్యక్తి గల్లంతు
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన గల కాల్వలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వినుకొండ మండలం దర్గాపేట గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. లారీ హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కొత్తకోట మండలం అమడబాకుల సమీపంలో గల కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతయ్యాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కుర్మయ్య గౌడ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకు ని గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అదృశ్యమైన వ్యక్తం ఆచూకీ లభ్యం కాలేదని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాల్వకు నీటి విడుదల చేయిస్తామన్నారు. అనంతరం సిబ్బందితో పా టు గ్రామస్తుల సహకారంతో గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
శుభకార్యానికి
వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం
● అక్క దుర్మరణం, ఇద్దరు చెల్లెళ్లు,
కవలలకు గాయాలు
మిడ్జిల్: మండలంలోని బోయిన్‌పల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందగా.. ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు కవలలకు గాయాలైన ఘటన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మల్లేశ్వరి(30) ఆదివారం సాయంత్రం తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి మల్లాపూర్‌లో తమ అక్క ఇంట్లో శుభకార్యం ఉండడంతో బంతిపూలు, ఇతర సామగ్రి తీసుకొని ఇద్దరు చెల్లెళ్లు మానస, మమతతోపాటు తన కవల పిల్లలతో ఆటోలో వెళ్తుండగా.., మార్గమధ్యంలో బోయిన్‌పల్లి సమీపంలో పత్తి లోడ్‌తో వస్తున్న బొలేరో ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో మల్లేశ్వరి అక్కడికక్కడే మృతిచెందగా.. మానస, మమతతోపాటు మల్లేశ్వరికి చెందిన ఇద్దరు కవలలు, ఆటో డ్రైవర్ ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
జడ్చర్ల: స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ తీవ్రగాయాలపాలై దుర్మరణం చెందింది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని నసరుల్లాబాద్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోనెమోని వనజ(38), వెంకటేశ్ ఆదివారం బైక్‌పై జడ్చర్లకు వస్తుండగా నిమ్మబాయిగడ్డ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వనజను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన అక్క వనజ మరణానికి కారణమైన బావ వెంకటేశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు సదానందం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నీటిగుంతలో పడి బాలుడి మృతి
నీటిగుంతలో పడి బాలుడి మృతి


