రెండు నెలలైనా డబ్బు జమ కాలేదు
ఆరు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో 4.50 ఎకరాల్లోని ఉల్లి పంటను దున్నేశాం. మిగిలిన ఎకరన్నర భూమిలో పండిన 72 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను గత సెప్టెంబర్ 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకెళ్లాం. వ్యాపారులు క్వింటా రూ.198 ప్రకారం కొన్నారు. మద్దతు ధర రూ.1,200 కాగా.. వ్యత్యాసం రూ.1,002 ప్రకారం రూ.72,144 బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లో విడుదలవుతాయని చెప్పారు. ఇప్పటికి రెండు నెలలవుతున్నా ఆ ఊసే లేదు. రైతులను మోసం చేయడం సరికాదు. – బి.రామలింగడు, లింగందిన్నె, గోనెగండ్ల మండలం


