రూ.1.54 లక్షలు రావాల్సి ఉంది
నేను నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. సెప్టెంబరు 8న కర్నూలు మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే ఒక లాట్ క్వింటాలు ధర రూ,359, మరో లాట్ క్వింటాలుకు రూ.409 ధరతో వ్యాపారులు కొన్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి బ్యాలెన్స్ అమౌంటు నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని అధికారులు చెప్పారు. మాకు మద్దతు కింద రూ.1.54 లక్షల వరకు రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినప్పటికీ బ్యాలెన్స్ మొత్తం బ్యాంకు ఖాతా జమ కాలేదు. – చిన్నమద్దిలేటి, ఈర్లదిన్నె, సి.బెళగల్ మండలం


