ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
● 12న కర్నూలులో ప్రజా ఉద్యమ ర్యాలీ
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న కర్నూలు నగరంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను ఆదివారం సాయంత్రం గిప్సన్ కాలనీలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలులో నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతున్నట్లు చెప్పారు. ఆర్‌డీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజలు, మహిళలు, విద్యార్థినీ, విధ్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో తమకు అనుకూలమైన టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలకులు పనిచేయాలని, అందుకు విరుద్ధంగా చేస్తే ప్రజలు సహించబోరన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి, కార్పొరేటర్ వి. అరుణ, నాయకులు షరీఫ్, కిషన్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కంటూ, రామాంజనేయులు , లాజరస్ తదితరులు పాల్గొన్నారు.


