కంకర రోడ్లు.. ఏళ్లుగా వెతలు
మర్పల్లి: అధ్వాన రోడ్లతో పదేళ్లుగా మండలవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని మర్పల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రావులపల్లి వరకు వెళ్లే పంచాయతీ రాజ్‌శాఖ రోడ్డు, కోట్‌మర్పల్లి నుంచి ఇజ్రాచిట్టంపల్లి వెళ్లే రహదారి, మర్పల్లి నుంచి సయ్యద్ అల్లీపూర్ వెళ్లే రోడ్లు పాదచారులు సైతం నడువ లేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. ఇక ఇజ్రాచిట్టం పల్లి నుంచి తోర్మామిడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతుల కోసం సంవత్సరం కిత్రం నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు ప్రారంభించ లేదు. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారుల బాధ వర్ణనాతీతం. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుడుగుంట– రావులపల్లి వెళ్లే రోడ్డు దుస్థితి


