అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పూడూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంకల్ గ్రామానికి చెందిన ఉవగుంట కృష్ణ(36) పరిగిలో ఫుడ్ డెలవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆయన శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా స్పందన లేదు. తెలిసిన వారికి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం మన్నెగూడ–చన్గోముల్‌కు వెళ్లే రోడ్డు సమీపంలో అనుమానాస్ప స్థితిలో ఓ మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పరిశీలించి మృతుడు కృష్ణగా గుర్తించారు. మృతుడి ఒంటిపై బలమైన గాయాలు కన్పిస్తుండటంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లలిత ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


