గురుకుల విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్‌అర్బన్: మండలంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అండర్– 17 విభాగం పోటీల్లో క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. వాలీబాల్‌లో స్మృతి, ఖోఖోలో కావ్య, కబడ్డీలో వైష్ణవి, చెస్‌లో సహస్ర, డిస్క్‌త్రోలో హిమబిందు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని పీఈటీ ఫౌసియా తెలిపారు. అలాగే రన్నింగ్‌లో బిక్కుబాయి, షార్ట్‌పుట్‌లో సుజాత ద్వితీయస్థానంలో నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ సుకన్య, అధ్యాపకులు అభినందించారు.


