పోరు హోరాహరీ
ఉత్సాహభరితంగా సాగుతున్న కబడ్డీ పోటీలు
సత్తా చాటుతున్న బాలబాలికలు
పినపాక: రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కూడా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి క్రీడాకారుల వసతి, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రీడాకారులకు భోజనం వడ్డించారు. భోజనం అందిస్తున్న కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. మెదక్ జట్టుకు చెందిన బాలికకు మ్యాచ్‌లో దెబ్బ తగలగా, అధికారులు 108 ద్వారా పినపాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
రెండోరోజు పోటీలు ఎలా జరిగాయంటే..
బాలుర విభాగంలో కరీంనగర్ జట్టుపై నల్లగొండ, నిజామాబాద్‌పై ఖమ్మం విజయం సాధించాయి. మరికొన్ని మ్యాచ్‌ల్లో కరీంనగర్‌పై వరంగల్, నిజామాబాద్‌పై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌పై హైదరాబాద్, ఆదిలాబాద్‌పై హైదరాబాద్, మెదక్‌పై రంగారెడ్డి, మెదక్‌పై మహబూబ్‌నగర్ జట్లు గెలుపొందాయి.
బాలికల విభాగంలో..
కరీంనగర్‌పై నిజామాబాద్, మెదక్‌పై మహబూబ్ నగర్, నిజామాబాద్‌పై ఆదిలాబాద్, ఖమ్మంపై నల్లగొండ, మెదక్‌పై కరీంనగర్, రంగారెడ్డిపై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్, హైదరాబాద్‌పై వరంగల్, రంగారెడ్డిపై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, హైదరాబాద్‌పై రంగారెడ్డి, ఖమ్మంపై నల్ల గొండ జట్లు విజయం సాధించాయి.
పోరు హోరాహరీ


