మానవత్వం చూపిన మహిళా కానిస్టేబుల్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో బిబిగూడ పాఠశాలలో శనివారం ఆర్‌ఐ పరీక్ష రాసేందుకు ఓ బాలింత వచ్చింది. రెండు నెలల పాపను అక్కడి అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని చెప్పారు. దీంతో పాపకు పాలు ఇవ్వడం కష్టమవుతుందని, పరీక్ష రాయనని అంటున్న భైరవి మండాల్ దగ్గరకు రజనీ మాఝి అనే మహిళా కానిస్టేబుల్ వచ్చింది. తాను బిడ్డను చూస్తానని, పరీక్ష రాసి రావాలని ఆమెను ప్రోత్సహించింది. రజినీ చూపిన మానవత్వం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాపకు పాలు ఇచ్చి తల్లి వచ్చేవరకు బాగా చూసింది. ఆమెకు తోటి ఉద్యోగులు సహకరించారు. రజినీకి కూడా 9 నెలల బాబు ఉన్నాడు. అందువల్లే మరో తల్లి బాధను అర్థం చేసుకుంది. రజినీ సహకారంతో తాను పరీక్ష బాగా రాశానని భైరవి మండాళ్ ఆనందం వ్యక్తం చేశారు.
మానవత్వం చూపిన మహిళా కానిస్టేబుల్


