పతకాల పంట
పర్లాకిమిడి: గంజాం జిల్లా బరంపురం సమీపంలో ఉన్న నిస్ట్ విశ్వవిద్యాలయంలో నిస్ట్ ఓపెన్ తైక్వాండ్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 8 నుంచి 9వ తేదీల్లో జరిగాయి. ఈ రాష్ట్ర స్థాయి తైక్వాండ్ పోటీల్లో గజపతి జిల్లా క్రీడాకారులకు 25 స్వర్ణ, 21 వెండి, 25 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్టు నిస్టు విశ్వవిద్యాలయం డీన్ తెలియజేశారు. ఈ పోటీలకు బరంపురం తైక్వాండ్ అసోసియేషన్, గజపతి తైక్వాండ్ అసోసియేషన్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. తైక్వాండ్ పోటీల్లో రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా 73 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గజపతి జిల్లా తైక్వాండ్ అకాడమీ నుంచి అత్యధికంగా తమ విద్యార్థులు పతకాలు గెలుచుకోవడం పట్ల తైక్వాండ్ అకాడమీ (గజపతి) కార్యదర్శి కార్తీక్ మహాపాత్రో అభినందనలు తెలిపారు.


