ఆత్మవిశ్వాసమే విజయానికి మైలురాయి
జయపురం: ఏ విజయానికై నా ఆత్మవిశ్వాసం, ఉన్నత విద్యలే మైలురాళ్లని జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి అన్నారు. సోమవారం జయపురం టౌన్ హాల్‌లో ప్రముఖ ఒడియా దినపత్రిక సంబాద్ జయపురం ఎడిసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒడిశా 50 గ్రామీణ మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కళ ఆరాధ్య దైవం జగన్నాథుని ప్రతిమకు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈస్ట్రన్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ మోనిక నోయెర్ పట్నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ప్రయత్నాలకు ప్రతికూల వాతావరణం ఎదురైనా చింతించకూడదన్నారు. ప్రతీ మహిళ భయం వీడి ముందడుగు వేయాలన్నారు. ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ లొతికా మిశ్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్నత విద్యా శాతం అతి తక్కువగా ఉందని, ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఉన్నత విద్య పట్ల అంతగా ఆసక్తి చూపటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండియ రాణి డాక్టర్ రొయిమతి ఘివురియ, న్యూ జోన్ గ్రూపు పరిచాలన డైరెక్టర్ జ్యోశ్న మంజరి మిశ్ర, మిశన్‌శక్తి నవరంగపూర్ జిల్లా కోఆర్డినేటర్ నిరంజన్ టంగ్‌రంగ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తున్న అతిథులు
ఆత్మవిశ్వాసమే విజయానికి మైలురాయి
ఆత్మవిశ్వాసమే విజయానికి మైలురాయి


