ప్రభుత్వ పాఠశాలకు తాళం
● పాఠశాల ఎదుట విద్యార్థులు, గ్రామస్తుల ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుసాని సమితి కేంద్రంలో ఎన్న పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం తాళం వేశారు. పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. అక్టోబర్ 27న గుసానిలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని ఏకారణం చేతో సస్పెండ్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువులు సక్రమంగా ఉపాధ్యాయులు చెప్పకుండా కాలక్షేపం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో చట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు ఆలస్యంగా రావటమే కాకుండా.. వాళ్లలో వాళ్లు వివాదాలకు దిగి విద్యార్థులకు చదువులు చెప్పడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తరువాత డిజిటల్ బోర్డు తెరిచి వెళ్లిపోతున్నారని, ఉపాధ్యాయులు పిక్నిక్‌లు, మొబైల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడ్ని తిరిగి ఇక్కడికి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయడు దిలీప్‌ను అకారణంగా సస్పెండ్ చేశారని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ సమస్య పరిష్కారంపై కలెక్టర్ చొరవ తీసుకువాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలకు తాళం


