పద్మపూర్‌లో 36 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని పద్మపూర్ సమితి కార్యాలయం సమావేశం హాల్‌లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 36 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 29 వ్యక్తి గత సమస్యలు కాగా ఏడు సామూహిక గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. గ్రామసమస్యలను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్ సంబంధిత శాఖ అధికారులను అదేశించారు. వినతుల స్వీకరణలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ముండొ, సదరు డీఎస్పీ నవీంద్ర నాథ పాత్రో, జిల్లా ముఖ్య వైధ్యాధికారి సరోజిని దేవి, పద్మపూర్ సమితి అధ్యక్షురాలు మణిమాల సబర్ పాల్గొన్నారు.


