నిజామాబాద్‌అర్బన్: నగరంలోని నాలుగోటౌన్ ఎస్‌హెచ్‌వోగా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ పోలీస్ స్టేషన్‌కు ఎస్సైస్థాయి అధికారి కొనసాగారు. స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడం, కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఇటీవల దీని పరిధిని ఎస్‌హెచ్‌వోగా విస్తరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారిని నియమించగా, సతీష్ బాధ్యతలు స్వీకరించారు.
బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారా యి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగి బాటసారులకు నీడనిస్తున్న చెట్లను కొందరు నిరక్షరాస్యులైన రైతులు నరికి వేస్తున్నారు. పోచారం తండా శివారులో కొన్నేళ్లుగా ఉపాధి హామీలో భాగంగా పెంచిన సుమారు 10 చెట్లను నరికివేశారు. నరికివేతకు గురైన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సుభాష్‌నగర్ : స్వదేశీ, స్వాభిమానము, స్వావలంబనతో కూడిన సమాజ నిర్మాణమే రాష్ట్రీయ స్వ యంసేవక్ సంఘ్ లక్ష్యమని.. అందుకోసం 100 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రతి హిందూ గృహానికి వెళ్లి వారి కర్తవ్యా న్ని గుర్తు చేయడమే లక్ష్యంగా రానున్న నెల రోజులపాటు స్వయం సేవకులు పర్యటించనున్నారని తెలిపారు. ఇందూరు నగర పథ సంచలన్ కార్యక్రమా న్ని చంద్రశేఖర్ కాలనీలోని హెచ్‌పీఎస్ పాఠశాల నుంచి ప్రారంభించి కంఠేశ్వర ప్రాంతంలోని వివిధ కాలనీల గుండా కదిలిన వందలాది మంది స్వయం సేవకులు తిరిగి అక్కడికే వచ్చి ప్రార్థనతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కతిక విలువల పరిరక్షణలో ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పథ సంచలన్ సందర్భంగా దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. జిల్లా సంఘచాలకులు డాక్టర్ కాపర్తి గురు చరణం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహలు సుమిత్, వెంకటేశ్ పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
బాధ్యతల స్వీకరణ


