కొనుగోలు కేంద్రాల తనిఖీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం, మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రధానంగా పోచారంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఖాళీ గన్నీ సంచుల దగ్ధం ఘటనను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నీ సంచులు దగ్ధమైన తీరుపై వారు వివరాలను సేకరించారు. గన్నీ సంచుల దగ్ధంపై వారు అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌కు సూచించారు. అనంతరం మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను స్థానిక సిబ్బందిని అడిగి వారు తెలుసుకున్నారు. రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ సురేష్, ఎస్సై భార్గవ్‌గౌడ్, ఏపీఎం రాంనారాయణగౌడ్, గ్రామసంఘం అధ్యక్షులు లక్ష్మి, సీసీ నారాయణ తదితరులున్నారు.


