కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
కాలనీలో ఎన్నో రోజులుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలోని డబుల్ బెడ్‌రూం ఇండ్లకు నీరందించేందుకు గతంలో రోడ్లు తవ్వి పైప్‌లైన్ వేశారని తెలిపారు. ఇప్పటికీ కాలనీకి తాగు నీరు రాలేదన్నారు. మురికి కాలువలు సక్రమంగా లేక మురికంతా రోడ్లపై పారుతోందన్నారు. మురికి నీరు రోడ్లపైకి రావడంతో గుంతలు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. ఇకనైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.


