లారీ ఢీ.. నేలకూలిన విద్యుత్ స్తంభం
మంచాల: లారీ ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం నేలకూలింది. ఈ సంఘటన మండల పరిధి ఆరుట్ల ఎస్సీ కాలనీ ఎలమ్మగుడి కూడలిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణ యాజమాన్యానికి చెందిన లారీ(టీఎస్ 29టీఏ 0896) గ్రామంలో సిమెంట్ బస్తాలు అన్‌లోడ్ చేసింది. అనంతరం తిరుగు ప్రయాణంలో కూడలిలో కరెంట్ పోల్‌ను ఢీకొట్టగా.. అది కూలిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఎవరికీ ఏమీ కాలేదు. ఘటనకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, ప్రమాదం అనంతరం వాహనంతో పరారయ్యాడని కాలనీ వాసులు తెలిపారు. అధికారులు స్పందించి, డ్రైవర్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


