పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లు అమలులోకి రాకముందే పలు కంపెనీల యాజమాన్యాలు కార్మికుల నడ్డి విరుస్తున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఆరోపించారు. ఆదివారం నర్సాపూర్– తూప్రాన్ రూట్ ఆటో యూనియన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం అమలు చేయడం లేదని, కంపెనీల యాజమాన్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సీఐటీయూ పలు పోరాటాలు చేసి అవి అమలులోకి రాకుండా కృషి చేసిందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఆయన వెంట ఆటో యూనియన్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్, అనిల్, నర్సింలు, సురేశ్ తదితరులు ఉన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని, ధారణతో కూడిన అవధా నం తెలుగు సాహిత్యంలోనే ఉందని అవధాని గౌరిభట్ల రఘురామశర్మ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశపతి శ్రీనివాసశర్మ, రుక్మాభట్ల కొదండరామశర్మలు సంగీతంతో అలరించారు. అష్టావధానం అవధాని డాక్టర్ గౌరిభట్ల రఘురామశర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు తదితరులు పాల్గొన్నారు.
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి భక్తులతో పోటెత్తింది. కార్తీకమాసం ఆదివారం సెలవురోజు కార్తీక వ్రతాలు, దీపారాధనలతో శోభిల్లింది. హరిద్రానది వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో కార్తీక సత్యదే వుని వ్రతం జరిపించుకున్నారు. రాత్రి సహస్ర కార్తీక దీపోత్సవంలో భాగస్వాములై కార్తీక దీపాలు వెలిగించారు. గర్భగుడిలో నృసింహస్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని త రించారు. క్షేత్రంలో 198 సత్యదేవుని వ్రతా లు జరగగా, ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లం పాయసం తయారు చేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న ఎల్లమ్మ ను దర్శించుకుని తమపిల్లా పాపలను చల్లంగా చూడలని వేడుకున్నారు.
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం


