●ఆలయాలకు కార్తీక శోభ
శివ్వంపేట(నర్సాపూర్): ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి, చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి, దొంతి వేణుగోపాలస్వామి, శివ్వంపేట బగలాముఖి శక్తిపీఠం, గూడూర్ శ్రీ గురుపీఠంలోని దత్తాత్రేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తులను దర్శించుకొని కార్తీక దీపోత్సవం నిర్వహించి వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయాల ఈఓలు శ్రీనివాస్, శశిధర్, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
●ఆలయాలకు కార్తీక శోభ


