ఐబీ భవనం అంతేనా?
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలోని తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన నిరుపయోగంగా ఉన్న ఐబీ భవనం నిరుపయోగంగా ఉంది. ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. భవనాన్ని బస్‌స్టేషన్ కోసం వినియోగిస్తే ప్రయాణికుల ఇబ్బ ందులు తీరడంతో పాటు వినియోగంలోకి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


