హ్యాండ్‌బాల్ టోర్నీ విజేత వరంగల్, ఆదిలాబాద్
● రన్నర్‌గా నిలిచిన
పాలమూరు బాలబాలికల జట్లు
కోస్గి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. అండర్–17 బాలబాలికలకు మూడు రోజులపాటు కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై వరంగల్ జట్టు 22–15 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు 16–07 పాయింట్ల తేడాతో విజేతగా నిలవగా.. మహబూబ్‌నగర్ బాలబాలికల జట్లు రన్నర్‌గా నిలిచాయి. కరీంనగర్ బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.


