మాకు న్యాయం చేయాలి..
కన్నాయిగూడెం : తమ కుమారుడి మృతికి వైద్యులు, సిబ్బందే కారణమని, ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చే యాలని పాముకాటుతో మృతి చెందిన బాలుడి త ల్లిదండ్రుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం పీహెచ్‌సీ ఎదుట బాలుడి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బా ధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని గుర్రేవులకు చెందిన తిరునగరి రాజు కుమారుడు హరినాథ్(7) శనివారం ఇంటి ఎదుట ఆడుకుంటుండండగా పాముకాటు వేసింది. గమనించిన బంధువులు వెంటనే బాలుడిని స్థానిక పీహెచ్‌సీకీ తరలించగా పాము కాటుకు సంబంధించిన యాంటీడోస్ లేదని, డాక్టర్‌కు ఫోన్ చేయాలని, తాను చికిత్స చేయలేనని స్టాఫ్ నర్సు చెప్పింది. దీంతో వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీనికి కారణం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వైద్యుడు అందుబాటులో ఉండి ఇక్కడి పీహెచ్‌సీలోనే వైద్యం చేసి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ సర్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్సర్ పాషా ఘటనాస్థలికి చేరుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీనికి మంత్రి స్పందిస్తూ బాలుడి వైద్యంపై నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని, డ్యూటీకి రాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి మీడియా ప్రతినిధులను తప్పుతోవ పట్టించిన వైద్యుడిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఏటూరునాగారం తరలించారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పాముకాటుతో మృతి చెందిన
బాలుడి తల్లిదండ్రుల డిమాండ్
తమ కుమారుడి మృతికి వైద్యులు, సిబ్బందే కారణం
వారిని వెంటనే విధుల నుంచి
తొలగించాలి
పీహెచ్‌సీ ఎదుట బాలుడి
మృతదేహంతో ఆందోళన


