ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య
హసన్‌పర్తి: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన హసన్‌పర్తిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన అరుణకు హసన్‌పర్తికి చెందిన కాలె తిరుపతి(41)తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం తిరుపతి ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వర్షానికి ఇల్లు కూలిపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


