వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి
ఎమ్మిగనూరుటౌన్: కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా తనను నియమించినందున బాధ్యత పెరిగిందని, వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని మాజీ ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఎమ్మిగనూరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనపై జగనన్నకు మంచి నమ్మకం ఉందని, పార్టీలో ఉన్న వారంతా కుటుంబసభ్యులమేనన్నారు. కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించినందున జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఉంటుందని, అదేవిధంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మిగనూరులో ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని అలానే కొనసాగించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బుట్టాఫౌండేషన్ అధినేత బుట్టాశివనీలకంఠ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


