ఎన్‌ఎంఎంఎస్ స్క్రీనింగ్ పరీక్షకు 600 మంది హాజరు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రెండు కేంద్రాల్లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) స్క్రీనింగ్ పరీక్షకు సుమారు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో 400 మంది, అలాగే హన్వాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 200 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారని మహబూబ్‌నగర్ ఫస్ట్ కోఆర్డినేటర్ గుండా మనోహర్ తెలిపారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వందమంది విద్యార్థులకు జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి శ్రీలలితాంబికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 12 నుంచి 22 వరకు పది రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నామన్నారు. ఫైనల్ పరీక్ష ఈ నెల 23న జరుగుతుందన్నారు. కాగా, ఆ యా పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఏఎంఓ శ్రీనివాస్, వందేమాత రం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి, హన్వాడ ఎంఈఓ గోపాల్‌నాయక్, హెచ్‌ఎంలు దత్తు, రవి, బాలుయాదవ్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


