బుగులోని జాతర ఆదాయం రూ.12.22 లక్షలు
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర ఆదాయం రూ.12.22 లక్షలు వచ్చినట్లు ఈఓ బిల్లా శ్రీనివాస్, చైర్మన్ గంగుల రమణారెడ్డి తెలిపారు. ఆదివారం దేవాదాయ పర్యవేక్షణ అధికారి కవిత ఆధ్వర్యంలో జాతరలో హుండీలను లెక్కించినట్లు పేర్కొన్నారు. హుండీల ద్వారా రూ.5,99,709, బంగారం 2 గ్రాములు, మిశ్రమ వెండి 280 గ్రాములు, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,900, గండ దీపం రూ.3,890, కేశఖండన రూ.18,250, అర్చన రూ.17,750, తైబజార్ రూ.22,150, టెండర్స్ ద్వారా రూ.3,18,000, విరాళాలు రూ.3,021 వచ్చాయి. మొత్తం జాతర ఆదాయం రూ.12.22 లక్షలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు నిమ్మల విజేందర్, గంట గోపాల్, పన్నాటి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


