YS Jagan Mohan Reddy
-
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
జగన్ కన్నా ఎక్కువ ఇస్తామన్నారు.. ఏమైంది
-
ఏపీలో చాలా దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. క్యాలెండర్ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు. మనం రాకముందు ఎలా ఉండేవి? గత వైఎస్సార్సీపీ పాలనను వైఎస్ జగన్ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం. వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం. కురుపాలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్ ఇచ్చేవేకావు.. జగన్‌కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపుమరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు. రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్ జగన్ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు. -
రంపచోడవరం కేడర్‌తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రంపచోడవరం నియోజకవర్గ కేడర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. -
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): విషాదంలో ఉన్న కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనంతగిరి మండలం వాలసి పంచాయతీ జాంబవలస పరిధిలోని మూలంగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో త్రిష, రత్నకుమారి, పవిత్ర అనే విద్యార్థినులు రెండు నెలల క్రితం దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనను బుధవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాల దీనావస్థను తెలుసుకున్న ఆయన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన సొంత నిధుల నుంచి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ప్రజా సమస్య లపై వైఎస్ జగన్ చూపే చొరవ, ఆయనలోని మానవీయ కోణాన్ని ఈ ఘటన మరోసారి నిరూ పించిందని బాధిత కుటుంబాలు కొనియాడాయి. -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారు. రెడ్‌బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
రేపు రంపచోడవరం నియోజకవర్గ కేడర్‌తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రంపచోడవరం నియోజకవర్గ కేడర్‌తో రేపు(జూన్ 18, గురువారం) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
వచ్చే నాలుగు వారలు..బీ అలర్ట్ : YS Jagan
-
ఓటు విషయంలో జాగ్రత్త.. YSRCP నేతలకు YS జగన్ ఆదేశాలు
-
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్సీపీ నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
-
నీకు జూలై 1 వరకే టైం.. తర్వాత అసలైన సినిమా చూస్తావ్ బాబుకు జగన్ వార్నింగ్
-
ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే.. ‘ఆక్వా’పై అల్టిమేటం
సాక్షి, అమరావతి: దారుణంగా పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వతేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్‌కు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే యూనిట్ విద్యుత్‌కు 2014–19 మధ్య రూ.3.85 చొప్పున వసూలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.2కే అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని.. ఆ దిశగా వారం క్రితం జీవో ఆర్టీ 169 జారీ చేశారని.. క్లాజ్ నెం 4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్ పెట్టారని దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు.. ఫిషరీస్ అసిస్టెంట్లు.. అప్సడా ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్‌ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి ఛైర్మన్‌గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా, రైతులకు ద్రోహం జరగకుండా చూశాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్..యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశాం. మనం ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాక.. చంద్రబాబు యూనిట్ విద్యుత్ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా అమలు మాత్రం చేయలేదు. అక్కడా విద్యుత్ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.అవార్డులు, భారీగా ఎగుమతులు.. రూ.వంద కోట్లతో ఆక్వా వర్సిటీ..మన హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు కూడా దక్కాయి. నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు.. ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. తాత్కాలిక భవనాల్లో క్లాస్‌లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.నెలాఖరులోగా ధరలు తగ్గించాల్సిందేఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రాష్ట్రమంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకూ పనికిరావు. 3 సార్లు ఉపసంహరించేలా చర్యలు..నాడు ‘అప్సడా’ ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచితే మూడుసార్లు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నాం. థాయ్‌లాండ్‌కు చెందిన సీపీఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు. రొయ్యల ధరలపై నిరంతర సమీక్షనాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్ రొయ్యలు రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యలు రూ.470 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు ఐపీఆర్ మోహన్‌రాజు, దుగ్గినేని గోపీనాథ్, జి.రాజ్‌కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్‌రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్‌రెడ్డి, సీహెచ్ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరి ఇది.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని తెలియడంతో ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెబుతూ పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు అంతా సిండికేట్‌గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధరలు సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి ఫీడ్ రేటు పెంచుతున్నారు. అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఆక్వా ఫీడ్, సీడ్ రంగంలో సహకార వ్యవస్థ వస్తే ఇలా సిండికేట్‌గా మారడం, దోపిడీ చేయడం సాధ్యం కాదు. మనం డెయిరీ రంగంలో అమూల్‌ను తీసుకురావడం వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో సిండికేట్ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మన ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు వారికి తోడుగా నిలిచేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020 అమలు చేసి ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్‌పై కేజీకి రూ.10, టైగర్‌పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ట్యాక్సా? వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి.బాబు బంధువులే ఉత్పత్తిదారులుటీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పీఎఫ్ ఫ్యాక్టర్‌తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు (వైఎస్ జగన్) వచ్చాకే విద్యుత్ సబ్సిడీతో పాటు అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుజీవామృతంలా అప్సడా ఏర్పాటుఆక్వా రైతులకు జీవామృతంలా వైఎస్ జగన్ ‘అప్సడా’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్సడాను బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. వేట నిషేధ సమయంలో ఫిష్ మీల్ రేట్లు పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతున్నారు. ఫీడ్ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10 వేల కోట్లు నష్టపోతున్నారు. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. లోకల్ మార్కెట్ పెంచడానికి ఫిష్ ఆంధ్రా కార్యక్రమం చాలా ఉపయోగపడింది. – ఐపీఆర్ మోహన్‌రాజు, భీమవరంఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెంచారుఆక్వా ఫీడ్ ధర ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. వంద కౌంట్ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 అయ్యింది. నెల క్రితం వరకూ రూ.250కు కొనుగోలు చేశారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇప్పుడు రూ.225కు తగ్గించేశారు. నాడు వైఎస్ జగన్ రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడంతో రైతులు పండుగ చేసుకున్నారు. – జి.శ్రీనాథ్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకోవిడ్లోనూ సరుకు అమ్ముకున్నాంవైఎస్ జగన్ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో మా పంట ఎవరూ కొనకపోతే జగన్ ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సిండికేట్ ఆగిపోయింది. సీడ్ కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్ ఉచితంగా ఇప్పించారు. అంతర్జాతీయ కంపెనీ సీపీఎఫ్ ఛైర్మన్నే రాష్ట్రానికి రప్పించి ఫీడ్ ధరలు తగ్గించారు. ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండా కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ రేట్లు పెంచాయి. మళ్లీ మే 11న ఫీడ్ ధరలు పెంచారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం. – దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లాసబ్సిడీని దూరం చేసే కుట్ర..ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నంబర్ 169 కాలమ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) గురించి ఉంది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎకరా లీజు రూ.లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్ రూ.యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది. – సీహెచ్ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లుసొంత మనుషుల కంపెనీలకు వత్తాసుడాలర్ విలువ రూ.90 అయినా ఆక్వా రైతుకు రేటు రూ.240 దాటడం లేదు. డాలర్ విలువ రూ.40 ఉన్నప్పుడు వనామీ రేటు రూ.300 పలికేది. కరెంట్ సబ్సిడీ బూచిగా చూపించి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు. – ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లాథాయ్లాండ్ విధానాలు అనుకూలం థాయిలాండ్‌లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – రాజ్కుమార్ప్రభుత్వం నిద్రపోతోంది..ఆక్వా కంపెనీలు ముంబై మాఫియాలా నడుస్తున్నాయి. సీజన్ చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతోంది. ఆర్నెల్ల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు కిలోకు రూ.4 తగ్గించామని చెబుతున్నారు. కాని దాన్ని డీలర్ కమీషన్ తగ్గించినట్టు చూపించారు. క్రాప్ హాలిడే ఇస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తుప్పుపట్టిపోతుంది. – పెద్దిరాజు, పశ్చిమ గోదావరి జిల్లాఆక్వాకు జగన్ తోడుగా నిలబడాలిగత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడ్, సీడ్ ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాసెసింగ్ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు దించేస్తున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు. ఆక్వాకు జగన్ మరింత తోడుగా నిలబడాలి. – జి.నారాయణమూర్తి, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లామిమ్మల్ని ఓడించినందుకు ఇలా..ఆక్వా రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు మీరు అండగా నిలబడ్డారు. బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడ్, సీడ్. ఆక్వాపై ఆధారపడ్డ వారి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. – జయకృష్ణంరాజు, ఉండిఆక్వా సంక్షోభంతో ఉపాధికి గండిఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గిపోతుంది. కరెంటు సబ్సిడీని పీఎఫ్‌కి లింకు చేయడం అన్యాయం. కరోనా సమయంలో కూడా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఆ రోజు జగన్ చర్యలు తీసుకోకుంటే ఆక్వా రంగం కుదేలయ్యేది. – ధర్మరాజుజగన్ గళం విప్పితే.. పరిష్కారంనాణ్యమైన సీడ్ ఇవ్వడం లేదు. జగన్ గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేం ఇక్కడ మీటింగ్‌కు వస్తుంటే అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు. – నానిరాజు, అమలాపురంఫీడ్ కంపెనీలపై తిరగబడతాంఫీడ్ కంపెనీల మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేం ధైర్యంగా పోరాడగలం. ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది. – అండ్రాజు చల్లారావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ఆర్బీకేల ద్వారా పంపిణీవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికేషన్ చేసేవాళ్లు. ఇవాళ అందుకోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పుడు ఫీడ్ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు. – నరసింహారావు, ఆక్వా రైతు -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్‌ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్‌కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్‌కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్‌కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్‌ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
రూపాయిన్నరకే .. మాటిస్తున్నాను ఆక్వా రైతులకు వైఎస్ జగన్ భరోసా
-
వైఎస్ జగన్ తో సమావేశమైన ఆక్వా రైతులు
-
చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్‌తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్‌కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్‌గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్‌కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్‌కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్‌కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్‌లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
కాలం మారింది.. మీకు మిగిలింది మూడేళ్లే జనం మనసులో జగన్
-
లోకేష్ ను ప్రశ్నిస్తే మధ్యలో రెచ్చిపోతున్న అనితమ్మ
-
నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023–24 స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో 60.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించగా, ఆంధ్రప్రదేశ్‌లో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే పేర్కొంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించలేదని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే 90.5 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించినట్లు సర్వే తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైఎస్ జగన్ అత్యధిక కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కటుంబాలకు ఆరోగ్యానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వార్షికాదాయ పరిమితిని పెంచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.1 శాతం కటుంబాలకు, పట్టణాల్లో 85.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినట్లు సర్వే పేర్కొంది. -
ప్రశ్నించే గొంతును నులిమేస్తున్నారు.. చంద్రబాబుపై జగన్ సీరియస్..
-
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
భట్టికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలుతో వర్ధిల్లాలని కోరుకుంటూ’ విషెస్ చెప్పారు. Heartiest birthday greetings to Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka garu. Wishing you a long, healthy, and happy life.@Bhatti_Mallu pic.twitter.com/8ExVWBQud7— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026 -
ఆర్చర్ ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ధీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విజయవాడకు చెందిన 24 ఏళ్ల ధీరజ్ ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్‌తో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం గెలిచిన ధీరజ్... ఆ తర్వాత రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ధీరజ్–కుంకుమ్ (భారత్) ద్వయం 5–1 (37–36, 37–36, 39–39) సెట్ పాయింట్ల స్కోరుతో కిమ్ జె డియోక్–ఒహ్ యెజిన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించి బంగారు పతకం గెల్చుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించడం విశేషం.Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra… pic.twitter.com/QWlyRJkLi9— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026 -
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి... వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం... చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్‌బుక్‌ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్‌ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. ⇒ ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్íÙప్, సంస్థల దురి్వనియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.This is not just an attack on YSRCP; it is an… pic.twitter.com/rJHq8BZ2pm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2026 -
కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు. -
నీకు వయసు మాత్రమే పెరిగింది! విడదల రజని స్ట్రాంగ్ కౌంటర్
-
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు'!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో రాజధాని అమరావతిలో భవనాలు, రోడ్ల నిర్మాణ వ్యయం భారీగా పెంచేసి, అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు సర్కారు.. నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్న తీరును సాక్ష్యాధారాలతోసహా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. రాజధాని సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బండారం బట్టబయలైంది. దీంతో ఆ అక్రమాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ యథాప్రకారం తప్పుడు లెక్కలు వల్లె వేశారు. శనివారం రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగులపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. దీనితో పోల్చి చూస్తే రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని వివరించారు. అవినీతి బట్టబయలవడంతో బెంబేలుసచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే.. గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడంతో చంద్రబాబు సర్కార్ అవినీతి బట్టబయలైంది. ఇక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్‌బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కారు అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అవినీతి బట్టబయలవడంతో బెంబెలెత్తిపోయిన చంద్రబాబు సర్కారు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు లెక్కలు వల్లె వేస్తూ యథావిధిగా అబద్ధాలు చెబుతోంది. తప్పు లెక్కలు చెబితే అక్రమం సక్రమమవుతుందా?రాజధానిలో నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ప్లాట్లను హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తోంది. మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను రూ.856.31 కోట్లకు ఎన్సీసీ దక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్ వంటి సీనరేజీ పన్నుల రూపంలో రూ.153.05 కోట్లు సీఆర్డీఏ రీయింబర్స్ చేస్తుంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.1,009.36 కోట్లు. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి కాంట్రాక్టు విలువ రూ.4,689.48. హ్యాపీనెస్ట్ పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో! దీన్ని బట్టి చూస్తే హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయంపై మంత్రి నారాయణ చెప్పిన లెక్కలన్నీ తప్పేనన్నది స్పష్టమవుతోంది. తప్పుడు లెక్కలు చెబితే అక్రమం సక్రమం అవుతుందా? కాదు కదా. ఈ చిన్న లాజిక్‌ను మరచిపోతే ఎలా అంటూ మంత్రి నారాయణను ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక రాజధానిలో గెజిటెడ్ అధికారులకు నివాసాల కోసం ఎస్+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ప్లాట్లను 27,24,080 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్డీఏ చేపట్టింది. ఈ పనులను 2018లో రూ.707.40 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించింది. 2019 నాటికి రూ.389.11 కోట్ల విలువైన పనిని పూర్తి చేసింది. అంటే.. మిగిలిన పనుల విలువ రూ.318.29 కోట్లు. ఆ మేరకు బిల్లులు చెల్లించింది. కానీ.. 2024లో ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. మిగిలిన పనులను రూ.514.40 కోట్లకు అదే సంస్థకు గతేడాది అప్పగించింది. మరో రూ.89.27 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఇక ఆ భవనాలకు ప్రహరి, ఎస్టీపీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.67.69 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచింది. పన్నుల రూపంలో మరో రూ.12.42 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులు, మిగిలిన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించిన విలువతో కలిపి నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.1,072.89 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.3,938.54కు చేరింది. పనులు పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో? -
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్‌కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్‌కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్‌కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్‌లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్‌పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
DSC పేపర్ లీక్‌కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్‌లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్‌కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్‌కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్‌డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం సక్సెస్ పై జగన్ హర్షం
-
YSRCP నంగి రెడ్డి శరత్ కుమార్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన జగన్
-
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు
మంత్రాలయం: వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం కావడాన్ని జీరి్ణంచుకోలేక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ మూకలు వీరంగం వేశాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెలగబడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి ఇంటి సమీపంలో పోలీసుల ఎదుటే తుఫాను వాహనాన్ని, మోటారు సైకిల్‌ను తగులబెట్టారు. మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు. కోసిగి మండల కేంద్రంలో జరిగిన నిరసనకు మంత్రాలయం మండలం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివెళ్లారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటిముందు రహదారి మీదుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా వెళ్లారు. కోసిగిలో జరిగిన ఈ నిరసనకు అనూహ్య స్పందన లభించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక రాఘవేంద్రరెడ్డి వర్గీయులు అక్కసు వెళ్లగక్కారు. నిరసన ముగించుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాఘవేంద్రరెడ్డి ఇంటి ముంగిట పోలీసుల కళ్లెదుటే దాడికి పాల్పడ్డారు. ముందుగా సూగూరు గ్రామానికి చెందిన దేవదాసు, లక్ష్మీరెడ్డి బైకును అడ్డగించి దాడిచేశారు. పోలీసులు కలుగజేసుకుని టీడీపీ మూకల నుంచి తప్పించి వారిని గ్రామంలోని స్టేషన్‌కు తరలించారు. తరువాత టీడీపీ గూండాలు అదేదారిలో వస్తున్న వైఎస్సార్సీపీ తుఫాన్ వాహనంపై విరుచుకుపడ్డారు. అందులోని కార్యకర్తల మీద, ఆ వెనుక బైక్‌పై వస్తున్న మరో ఇద్దరిపైన దాడిచేశారు. ఈ దాడుల్లో బూదూరుకు చెందిన పూజారి ఈరన్న, సూగూరు వాసి గొల్ల అంజినప్ప, 52–బసాపురం గ్రామస్తుడు గొల్ల రాముడు గాయపడ్డారు. వీరు ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బసాపురం గ్రామానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్ బైక్‌లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్ సైకిల్‌ను, నారాయణపురానికి చెందిన చిన్నబాబు తుఫాన్ వాహనాన్ని తగులబెట్టారు. ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అడ్డగించిన పోలీసులు నిరసన ముగించుకుని స్వగ్రామం రాంపురానికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, అనుచరుల వాహనాలను పోలీసులు కోసిగిలో అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి వెళ్లకుండా ఆయన వాహనాన్ని రాంపురం అడ్డరోడ్డులో నిలిపేశారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడిమాచర్ల ర్యాలీకి వెళ్లినందుకే దాడి చేశారని బాధితుడి ఆవేదన బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పీఆర్కే రెంటచింతల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( పీఆర్కే) ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న మంచికల్లు వైఎస్సార్సీపీ నాయకుడు పాశం వెంకటరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. వెంకటరెడ్డిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. కాగా దాడి విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి గౌతమ్‌రెడ్డి మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వెంకటరెడ్డిని పరామర్శించారు. బాధితుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ర్యాలీకి వెళ్లి వచ్చి సెంటర్లో కూర్చున్న తనపై ర్యాలీకి ఎందుకు వెళ్లావు...నీవు గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గోగుల వెంకటరామిరెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, గోగుల పున్నారెడ్డి, గోగుల మహేష్ రెడ్డి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. -
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇంటింటికీ బాండ్లు రాసిచ్చి మరీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, ఈ రెండేళ్లలో చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేదని చెప్పారు. నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు, చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మోసపోయిన, దగా పడిన యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాలపై వైఎస్ జగన్ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాగ్రహానికి అద్దం పట్టిన వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీల ఫొటోలను ట్యాగ్ చేశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలో.. బాండ్ల రూపేనా పెట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ అని అడుగుతున్నారు.రైతులను మోసం చేశారు. మహిళలను మోసం చేశారు. యువతను మోసం చేశారు. విద్యార్థులను మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్‌ల మయమే. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు. పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజా పాలన కాదు.. రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బ తీశారు. జంగిల్ రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడిని ఏమంటాం?అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నింటిలోనూ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు చార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది. విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు. ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయ పూర్వక అభినందనలు.చంద్రబాబుకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అబద్ధాలతో కొంత కాలం ప్రజలను మోసం చేయొచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు. -
వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ దగా చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహ జ్వాల నింగికెగిసింది. చంద్రబాబు మోసాల పాలనపై ప్రజలతో కలసి ఎక్కడికక్కడ వైఎస్సార్ సీపీ క్యాడర్, నాయకులు తిరగబడ్డారు. నల్ల బెలూన్లు ఎగరవేశారు.. బైక్ ర్యాలీలు నిర్వహించారు.. కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ అడుగడుగునా బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులకు దిగినా ప్రజలు ఖాతరు చేయలేదు. మా పేర్లు రాసుకోండి..! ఏమేం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి..! వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల్లో పాల్గొని తీరుతామంటూ నియోజకవర్గాల కేంద్రాలకు శుక్రవారం జనం స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. యువత, మహిళలు, రైతులు పోటెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ–జనసేన కూటమి సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి సమరశంఖం పూరించారు. పులివెందులలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు నెల్లూరులో బైక్ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో టీడీపీ–జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారం చేసింది. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను తుంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల దగా పాలనపై ఈనెల 4 నుంచి 12వతేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకు నిరసన కార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు.చంద్రబాబు చేసిన మోసం, దగా, వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసి.. అది గ్రామ గ్రామానా, ఇంటింటికీ చేర్చాలని దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో జనం స్వచ్ఛందంగా కదలివచ్చి కదం తొక్కుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేశారు. ఈనెల 8, 9న నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు సర్కార్ దగా పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన సదస్సులకు ప్రజలు కదలివచ్చి.. కూటమి సర్కార్ మోసాలను వివరిస్తూ గళం విప్పారు. రెండేళ్లలో ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న సర్కారిదే.. నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం కదలివస్తారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పసిగట్టిన చంద్రబాబ సర్కార్ యధావిధిగా పోలీసులను ప్రయోగించింది. నియోజకవర్గాల కేంద్రాలకు ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉప్పెనలా కదిలి రావడంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్ చేశారు.‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది...విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు...ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు...చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన… pic.twitter.com/07PTqq4ojb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2026 -
శరత్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. ఈ మేరకు శరత్ భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. -
11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్
-
రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, మాజీ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్‌లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్‌లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్‌లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్‌చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ఈ ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. దగాపడ్డ రైతులు, మహిళలు, పిల్లలు ఇలా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్‌లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్‌గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్‌మాల్‌తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్‌జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్‌కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్‌లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్‌లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్‌లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్‌కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్‌లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనల్లో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని గుర్తు చేశారు. ‘నిరుద్యోగ యువతకు నెల నెలా రూ.3 వేలు ఇస్తామన్నారు. రూ.3 వేల మాట దేవుడెరుగు.. వాళ్లకు హక్కు(రైట్పుల్)గా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కామ్‌లు చేశారు.అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పక్కన పడేశారు. బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారు. మహిళలు నాశనమైపోయారు. యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. దగా పడ్డ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో, ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్‌లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. -
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం. స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్‌కు స్కెచ్ వేశారని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..నిజమైన క్రీడాకారులకు అన్యాయం» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు. » గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు. » స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది. డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23 క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్స్పోర్ట్స్లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్‌లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు. క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగంవివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్‌లోడ్‌లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్‌లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. » ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. » ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం. కోట్లాది కాక్రోచ్‌ల్లో నేనూ ఒకడినవుతా... కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.ఇది జెన్‌జెడ్ కాలం» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. » విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా. » రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్‌లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. » ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది. -
వైఎస్ జగన్ ప్రెస్ మీట్ .. దుర్గయ్య ఏం అన్నారో విన్నారా
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు..చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు. -
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
వెన్నుపోటుకు రెండేళ్లు.. రేపు వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. -
1:1 అంటే అర్ధం ఏంటి చంద్రబాబు.. ఇలాంటి మోసాన్ని నా జన్మలో చూడలేదు
-
వెళ్తూ వెళ్తూ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
స్పోర్ట్స్ కోటాలో స్కామ్స్ వింటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..బాబు, లోకేష్ పై జగన్ మాస్ ర్యాగింగ్
-
ఏపీలో కూడా కాక్రోచ్ లు వస్తాయి జాగ్రత్త.. లోకేష్‌కు జగన్ వార్నింగ్
-
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికి ఇస్తాం.... సంచలన ఆడియో లైవ్ లో ప్లే చేసి..!
-
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...
-
బాబూ జాగ్రత్త.. కాక్రోచ్లు బయటకొస్తాయి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమేనని.. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో బాబు హయాంలో జరిగిన పేపర్ లీకేజీల చిట్టాను చదివి వినిపించిన వైఎస్ జగన్.. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబుగారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది. ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది. అందుకే ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుగారూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది జెన్‌జీ కాలం. ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. దేన్నీ ఆపలేరు. మీరు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది. దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టదు. తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి. జాగ్రత్త..! ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్ర్రబాబు ముందుకు రాడు. సరికదా.. ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘వారంరోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని.. ఒకవేళ అప్పటికీ కాకపోతే.. మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని హామీ ఇచ్చా’’ అని వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు. -
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్‌తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్‌మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్‌లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్‌బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్‌కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
మోసానికి, దగాకి.. ప్యాంట్, చొక్కా తొడిగితే అదే చంద్రబాబు..
-
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
Watch Live: YS జగన్ ప్రెస్ మీట్
-
వైఎస్ జగన్ మీడియా సమావేశం హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పుకొచ్చారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్‌జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అలాగే, రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరి తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా షాక్ కలిగిస్తున్నాయి.లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది.స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది.ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు.అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం అత్యంత దారుణం.అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కాముకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు.చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా,ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.16వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు..మా ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చాం.లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాం.దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం.2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చాం.19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదు.నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశాం.ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు. రికార్డు అంటే వైఎస్సార్సీపీదే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఐదు తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశాడు.ఇదికూడా పెద్ద మోసమే.దీంట్లో మెగా డీఎస్సీ అనేది ఒక సంతకం.వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చాం.వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు.పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారు.ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా?రికార్డు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలోనే జరిగింది.గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చాం.జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం.జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం.సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు.ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం.ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు.అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసాం.అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు?మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు?డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి.కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు.డీఎస్సీ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది.పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ పరీక్షల నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించి పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది.అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్వాస్పదం.. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్నం తయారీ, అప్‌లోడ్‌ను ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు.ఆ విషయం తెలిసి కూడా వారికే అప్పగించారు.తప్పు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టాలనే ఈ పని చేశారు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి..ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా?.ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ జోన్-2లో ఆరో ర్యాంకుఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణల్లో ఉండటం, అదే వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం స్కామ్ కాదా?.ఇదంతా కనిపించింది మాత్రమే.. కనిపించని ఎన్ని లీక్‌లు ఉన్నాయో.మెరిట్‌తోనే ర్యాంక్ సాధిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?.అతడి ఐడీ, డేటాను మాయం చేశారు.మెరిట్ లిస్టులో మార్పులు చేసి అతని పేరును మాయం చేశారు.తప్పు జరిగింది కాబట్టే అతని డేటాను మాయం చేశారు కదా?.మెరిట్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు?.చివరికి ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.మొదటి ర్యాంక్ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదట. చంద్రబాబే పోలీసు.. లాయరు.. ఆదేశాలు...మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?ఒక కేండిడేట్‌కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు.పేపర్ లీక్‌ను దాచిపెట్టడానికే ఈ కబుర్లన్నీ చెప్తున్నారంటూ అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు మీ నుంచి సమాధానం ఏమిటి?మీరు చెప్పేవి నిజాలు అయితే ఆ అభ్యర్థి కోర్టుకు ఎందుకు పోయాడు?పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు?డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది?ఎంతమందికి లీక్ వెళ్లింది?ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు, ఆయనే పర్యవేక్షిస్తారు.అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?పైగా విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకే. మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి?రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?పారదర్శకత ఎక్కడ?ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెల్లడి అయినా అత్యంత పారదర్శకంగా ఉంటుంది.ఇప్పటికీ యూపీఎస్సీ-సివిల్స్ పరీక్ష ఫలితాలు చూస్తే చాలా పారదర్శకంగా మెరిట్లిస్టులు డిస్ప్లే చేస్తారు.కానీ, చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తి విరుద్ధంగా సాగింది.మెరిట్ లిస్టులు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు పబ్లిక్‌గా డిస్ప్లేలో పెట్టలేదు?సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకువచ్చారు.మరి పారదర్శకత అనేది ఎక్కడ ఉంది. ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా?అసలు డీఎస్సీ అంటేనే “డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ’’.. జిల్లాస్థాయిలో, కలెక్టర్ నేతృత్వంలో జరుగుతుంది.అలాంటి కలెక్టర్ కార్యాలయాల్లోనే పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు లిస్టు పెట్టలేదు.మొత్తం ప్రక్రియను దాదాపుగా సెంట్రలైజ్ చేశారు. ఎందుకు ఇలా చేశారు? దీనికి కారణం, మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా?ఉమ్మడి రాష్ట్రంలో కాని, ఈ రాష్ట్రంలో కాని అనేకమార్లు DSC పరీక్షలు జరిగాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులను డిస్ప్లే చేసేవారు.అక్కడ ఇచ్చిన కటాఫ్ మార్కులు, రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసినవారు, ఆ పోస్టు తనకు వస్తుందా? లేదా? అని దాదాపుగా ఒక అంచనాకు పారదర్శకంగా వచ్చే వాళ్లు.కానీ, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అంతా దాపరికం, గందరగోళం. మెరిట్ లిస్టులు, రోస్టర్స్ను, మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. ఆన్లైన్ అంటూ సెంట్రలైజ్ చేశారు.ఆ ఆన్లైన్లో కూడా అనేక సార్లు, అనేక మార్పులు చేశారు..ఎవ్వరికీ ఏ సందేహం ఉన్నా, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే, వారు పట్టించుకోకుండా, పైన విద్యాభవన్‌కు వెళ్లాలని అని వారు చెప్తారు.తీరా ఇక్కడకు వస్తే, మీరు అక్కడికి పోండి, మాకు సంబంధం లేదని వీరు చెప్తారు. ఎవరి కోసం సర్దుబాట్లు..చివరకు ఒక పోస్టుకు ఒకరు, అంటే 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి, వారిని పిలిచి,వారి సర్టిఫికెట్లు వెరిఫై చేసిమరీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. 1:1 అంటే అర్థం కాదా?ఒక పోస్టుకు, ఒక అభ్యర్థి అనే కదా అర్థం? ముందుగానే మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్‌లెటర్లు జారీచేశారు?సెలెక్షన్స్ రూల్స్‌లో రూల్ నంబర్ 20 ఇదే చెప్తోంది.ఎందుకంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలుసు, వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? అన్నది తెలుసు.వర్టికల్ రిజర్వేషన్ తెలుసు. హారిజాంటల్ రిజర్వేషన్ తెలుసు.ఎన్ని OC పోస్టులు ఉన్నాయో తెలుసు?ఎన్ని SC, ST, BC, EWS పోస్టులు ఉన్నాయి?ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు?స్పోర్ట్స్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద ఎన్నిపోస్టులు? ఇవన్నీ ముందుగానే చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు.ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు?వారి ర్యాంకులు ఏంటి? అన్న విషయాలన్నీ ముందుగానే వారికి తెలుసు.ఇవన్నీ తెలిసిన తర్వాత, 1:1లో పిలిచిన తర్వాత, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోవడం ఏంటి?వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్లు అన్నీ సరైనవి అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి?రిజెక్ట్ లిస్టులో కూడా పేరు లేకపోవడం ఏంటి?ఇది దగా కాదా? మోసం కాదా? దోపిడీ కాదా? స్కాం కాదా?ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీచేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేంటి?మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు.సర్టిఫికెట్లలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప 1:1లో కాల్‌లెటర్ వచ్చిన వాళ్లకు పోస్టు తప్పకుండా ఇవ్వాలా? వద్దా?1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా?అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూపిన తరువాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్లు, అన్నీ చూసిన తర్వాతే 1:1లో పిలిచి, సర్టిఫికెట్లు అన్నీ బాగున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.మళ్లీ సర్దుబాటు జరిగింది అంటే, ఎవరికోసం జరిగింది ఈ సర్దుబాటు? ఎవరికోసం వీరికి అన్యాయం చేశారు?స్పోర్ట్స్ కోటా పెద్ద స్కామ్..స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కాం. ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్‌కు కూడా అన్యాయం జరిగింది.జీవో నంబర్-4, జీవో నంబర్-47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన “స్కామ్‌ల పాలసీ స్కెచ్’’ ఇది.గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని..ఒక బ్యాక్‌డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు.దీని కోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, మీరు అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు, తెచ్చిన జీవోలను తీసేశారు.గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది.కాని, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరుకూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. అది రూల్.అలాంటి రూల్‌ను చంద్రబాబు మొత్తం మార్చేశాడు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచాడు.అసలు పరీక్షే రాయల్సిన అవసరం లేదంటూ జీవోలు ఇచ్చాడు.రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, ఇంకా ఇలాంటి సబ్జెక్ట్‌లకు.. డీఎస్సీ పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా, స్కామ్‌లు చేస్తూ తన వాళ్ల కోసం చంద్రబాబు ఒక తప్పుడు దారి వేశాడు.దీనికి ముందుగానే, వారి వద్ద నుంచి వసూళ్లు చేసి, వారికి అడ్డగోలుగా గేట్లు ఎత్తడానికి ఈ జీవోలు జారీచేశారు.అందులో కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత, డీఎస్సీ పరీక్ష ఎలాగూ లేదు, నింపాదిగా డిగ్రీ కూడా సాధించడానికి ఐదేళ్ల సమయం కూడా ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది.క్రీడా ప్రతిభను కూడ చూడలేదు. పతకాలు చూడలేదు. బ్యాక్అప్ సర్టిఫికెట్లు కూడా లేవు.కేవలం ఆ ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్శిటీల తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగాలు ఇచ్చేశారు.ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీరే ఇచ్చారు.సమాధానం చెప్పాల్సిందే..బాల్‌బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ కాగా, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్.వీళ్లే పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్లే వాటిని ధృవీకరిస్తారు.ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పోలవరంలోని మారుమూల ప్రాంతంకు చెందిన వ్యక్తి.ఆయనకు 1:1 కాల్ లెటర్ అందుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదు.కచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం ఇది. క్రీడాకారుల పేరుతో చేసిన స్కాం కాదా ఇది?ముందు తన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా, జీవో నంబర్ 4, జీవో నంబర్ 47తో గేటు తెరిచారు.వాళ్లు లోపలికి వెళ్లాక, జీవో నంబర్ 25, జీవోనంబర్ 56లతో గేటు మూసేశారు.తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారు.మీరు ఇచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఈరెండూ సరైనవే అయితే ఎందుకు మళ్లీ వాటిని తొలగించారు?దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలడా?అలాంటి వారికి ఉద్యోగాలా?...ఎంపికైన అభ్యర్ధుల డేటాను చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్శిటీల తరఫున పార్టిసిపేట్ చేసినందుకే 270 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి.వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు.జస్ట్ పాల్గొన్నారు అంతే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.ఇలా సర్టిఫికెట్ల ఇచ్చిన జాబితా చూస్తే ఆంధ్ర యూనివర్శిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 31, నాగార్జున యూనివర్శిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్శిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్శిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి 14, యోగి వేమన 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ 4, సంస్కృత యూనివర్శిటీ నుంచి 2, మిగతా యూనివర్శిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి.ఇంటర్ కాలేజ్ పోటీల్లో, అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీలలో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి.మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పాల్గొన్నందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.ఇక ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.జిల్లా తరఫున ఆడితే చాలు. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.ఈ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగాలను ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా, బేరసారాలు జరుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీగా పెట్టుకుని, ఒక కేండిడేట్‌తో బేరాసారాలు చేస్తున్న వీడియో ఇది.ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.కేసు పెట్టినా విచారణ శూన్యం. ఈ విషయాలేవీ కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు.ఎఫ్ఐఆర్ కాపీని ఒక్కసారి చూస్తే, వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది.పోలీసులు తలచుకుంటే ఈ నంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లో కనిపెడతారు.కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో, వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి, సస్పెక్ట్ అని రాశారు.పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలమ్‌లో ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయ్యిందని పెట్టారు.దీని అర్థం. ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తని తేలుతోంది.ఈ స్పోర్ట్స్ కోటా వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.పైగా బలమైన సెక్షన్లు పెట్టి, గట్టిగా విచారణ చేయకపోగా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం వెనుక అసలు ఏ జరిగిందనేది తేల్చాలా? వద్దా?లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది...అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమే ఉంటుంది.1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్.1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్.1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్.2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్.2019లో టెన్త్ పేపర్ లీక్.2025లో బీఈడీ పేపర్ లీక్,2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్.ఇప్పుడు DSC టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది.ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది.అందుకే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.ఇది Gen-Z కాలం. Gen-Alpha కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు చంద్రబాబూ.నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది.దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు, నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచస్ లేస్తాయి.ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం.లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందుకనే వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను.వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని చెప్పాను. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం.తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా.రేపు వైఎస్సార్సీపీ ర్యాలీలు..రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం.దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి.చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం.దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం. -
దటీజ్ జగన్..
సాక్షి, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది. -
జగన్ వస్తున్నాడంటేనే టెన్షన్.. బాబు ప్లాన్.. కూటమి నేతలు అలర్ట్
-
కష్టకాలంలో కదిలొచ్చే మనసు
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాలు మారవచ్చు, అధికారం చేయి మారవచ్చు..కానీ మనసు మారదు. పేద కార్మికుని కన్నీటి ముందు ఆర్థ్రతగా కరిగే మనసుకు అధికారం అక్కరలేదు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మరోసారి అది నిరూపించారు. స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. 1600 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ప్రవాహంలో తొమ్మిది మంది కార్మికులు దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆ వేదన విన్న మరుక్షణమే జగన్ మనసు అటు పరిగెత్తింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. అంతటితో ఆగిపోలేదు..బుధవారం స్వయంగా విశాఖ వచ్చారు. సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలోనూ అదే సంస్కారం అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పరిగెత్తడం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బాధితుల వద్దకు వెళ్లే నాయకులు చాలా అరుదు. జగన్ ఆ అరుదైన వారిలో ఒకరు. స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువమంది సాధారణ కారి్మకులే. భారతీయ ఉక్కు సంస్థకు కాంట్రాక్ట్ కింద పనిచేసే వారు. వారి కుటుంబాలకు తక్షణ పరిహారం అందాలని, న్యాయం జరిగేంత వరకూ బాధితుల తరఫున పోరాడతామన్నారు. ఆత్మీయంగా మాట్లాడుతూ కొండంత భరోసా కల్పించారు. నేనున్నానంటూ కన్నీళ్లు తుడిచారు. -
రామోజీ తద్దినానికి 10 కోట్లు.. కార్మికుల కుటుంబాలకు 9 కోట్లు ఇవ్వలేరా..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు YS జగన్ భరోసా..
-
జగనన్న చెప్పిన ఆ ఒక్క మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది
-
స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ ఎమోషనల్.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే.. జననేత భరోసా..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
-
ఆరోగ్యం ఎలా ఉందన్నా..?
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి భరోసా కల్పించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ.. ఆరోగ్యం ఎలా ఉంది? వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? ప్రమాదం ఎలా జరిగింది? అని ఆరా తీశారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని హామీనిచ్చారు. విశాఖ రామ్‌నగర్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెదగంట్యాడ సీతానగరానికి చెందిన గోకివాడ సూరిబాబు (కాంట్రాక్ట్ వర్కర్), అగనంపూడి లక్కరాజుపాలేనికి చెందిన కార్మికుడు పి.శ్రీనివాసరావు(చార్జిమెన్)ను పరామర్శించారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రావూరి మల్లికార్జునరావు (సీనియర్ టెక్నీషియన్), గుడివాడ అర్జున అప్పారావు(చార్జిమెన్), ఒడిశాకు చెందిన సత్యానంద్ బాలువాను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. ఒక్కొక్కరి బెడ్ వద్దకు వెళ్లి.. బాధితుల చేతులు పట్టుకుని ‘నేనున్నాను... అధైర్యపడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారు. వైఎస్ జగన్‌ను చూడగానే ఆస్పత్రి వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రి పాలు కావడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను ఆసాంతం విన్న జగన్ ప్రతి ఒక్కరినీ ఓదారుస్తూ అండగా ఉంటానని మాట ఇచ్చారు.సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్ద..వైఎస్ జగన్: గోకివాడ సూరిబాబు అన్నకు వైద్యం సరిగ్గా అందుతుందా..?కార్మికుడు గోకివాడ సూరిబాబు బావమరిది శ్రీనివాస్: ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా భయంగా ఉందన్నా మాకు.. దేవుడి మీదే భారం వేశాం. వైఎస్ జగన్: అధైర్య పడొద్దు శ్రీనివాస్ అన్నా.. దేవుడి దయతో సూరిబాబు అన్నకు నయం అవుతుంది. శ్రీనివాస్: మీ రాకతో మాకు కాసింత ధైర్యం కలిగింది అన్నా..!వైఎస్ జగన్: ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేలా ఒత్తిడి తెస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోతే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తా. (యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఏ రకంగా అందజేస్తామన్నది సమగ్రంగా వారికి తెలియజేయాలని అక్కడే ఉన్న స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్ మేనేజర్ అనిల్ కుమార్‌కు వైఎస్ జగన్ సూచించారు)కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద...వైఎస్ జగన్: ‘‘ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్యం బాగా అందుతుందా..? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా అన్నా..?’’రావూరి మల్లికార్జునరావు: అందుతున్నాయి అన్నా..!వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? మల్లికార్జునరావు: నేను స్టీల్ ప్లాంట్ ఎస్సెమ్మెస్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేసున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ఉక్కు ద్రవం పడిన చోటకు నేను కాసింత దూరంలో ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాను అన్నా..!వైఎస్ జగన్: మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. ధైర్యంగా ఉండు మల్లికార్జున అన్నా.. నీకేమి భయం లేదు.. నీకు అండగా మీ జగనన్న ఉన్నాడు..! (మల్లికార్జున అన్న పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్యం అందించాలని అక్కడున్న వైద్యులు గోపాల్రాజుకు వైఎస్ జగన్ సూచించారు) వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్య సేవలందుతున్నాయా..? క్షతగాత్రుడు గుడివాడ అర్జున అప్పారావు: అందుతున్నాయి అన్నా..వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? అర్జున: నేను చార్జిమెన్గా పనిచేస్తున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో జరిగిన ప్రమాదంతో భయపడ్డాం. లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ద్రవం కింద పడినప్పుడు దూరంగా ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నా. అది టీ తాగే సమయం కావడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే పెరిగేది.వైఎస్ జగన్: ధైర్యంగా ఉండు అన్నా..! నీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడు. పూర్తిగా నయం అయ్యేవరకూ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది. ఎటువంటి ఆందోళన వద్దు.. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. -
కార్మిక నేతలతో కలివిడిగా!
విశాఖ విద్య: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో అరగంటకుపైగా సమావేశమైన వైఎస్ జగన్.. కార్మిక నేతలను ఒక్కొక్కరినీ ‘‘అన్నా..!’’ అని ఆప్యాయంగా సంబోధిస్తూ పరిచయం చేసుకున్నారు. ప్లాంట్‌లో నెలకొన్న పరిస్థితులను ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ముడి సరుకు నాణ్యత లోపం, భద్రతపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి వదిలేయడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు జగన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులపై వర్క్ లోడ్ పడుతోందని, కార్మికుల సంఖ్య 16 వేలకు తగ్గిపోవడంతో తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించడం ద్వారా ప్రమాదాలకు ఆస్కారమిచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ప్రాణ భయం పెంచాలన్నది యాజమాన్యం పథకమని పేర్కొన్నారు. ప్లాంట్ పునరుద్ధరణ పేరుతో కేటాయించిన రూ.11,440 కోట్లు కేవలం జీఎస్టీ, బ్యాంకు రుణాల వడ్డీలు, ఫస్ట్ ఫేజ్ వీఆర్ఎస్ అమలుకు వినియోగించారు గానీ విశాఖ ఉక్కు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడలేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వం వైఫల్యం ఉందని.. ఏదో రకంగా ప్లాంట్‌ని ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించకుండా ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదనను సావధానంగా విన్న వైఎస్ జగన్.. కార్మికుల పక్షాన ఉంటామని భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కార్మిక సంఘాల నేతలకు గుర్తు చేశారు. నష్టపరిహారం విషయంలో తాము ఎంత మానవత్వంగా ఉంటామో మీకు తెలుసు కదా.. ! అని పేర్కొన్నారు. మీరంతా విజయవాడ రావాలని.. మరోసారి కూలంకషంగా చర్చిద్దామని కార్మిక సంఘాల నేతలను వైఎస్ జగన్ కోరారు. సమావేశంలో శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేతలు బూడి ముత్యాల నాయుడు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గాజువాక సమన్వయ కర్త తిప్పల దేవన్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి జె.రామకృష్ణ, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, స్టీల్ వైఎస్సార్ టీయూసీ నేత ఎంవీ రెడ్డి, జేఎంఎస్ నేత వరసాల శ్రీనివాస్, సీఎఫ్‌టీయూఐ నేత డీ శ్రీనివాస్, డీఐటీయూ నేత బి.డేవిడ్, ఏఐటీయూసీ నేత పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వద్దకు వెళ్లొద్దు... ఉద్యోగం ఇచ్చేస్తాం..!
విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన జూనియర్ టెక్నీషియన్ బలిరెడ్డి పెంటయ్య కుటుంబానికి ఇంతవరకు నష్ట పరిహారం అందకపోవడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖ కూర్మన్నపాలేనికి చెందిన పెంటయ్య భార్య వెంకటలక్ష్మి, కుమారుడు ప్రసాద్ బుధవారం విశాఖలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ గోడు చెప్పుకున్నారు. యాజమాన్యం తమను మోసం చేస్తోందని వాపోయారు. పెంటయ్య గతేడాది మార్చి 14న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన ద్రవ ఉక్కు లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఏప్రిల్ 1న మృతి చెందినట్లు భార్య తెలిపారు. భద్రతా లోపాలపై ప్రమాదానికి ముందే తన తండ్రి ఉన్నతాధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పారు. ఏడాది దాటుతున్నా పరిహారం ఇవ్వకుండా సాకులు చెబుతున్నారన్నారు. తాము వైఎస్ జగన్‌ను కలవడానికి వస్తున్నట్లు తెలిసి స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులు, కొందరు స్థానిక నేతలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబలికారని తెలిపారు. బాధిత కుటుంబం ఆవేదనను విన్న వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే సమయంలో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
నా భర్త డ్యూటీలోనే మృతి చెందినా పైసా ఇవ్వలేదు
సాక్షి, విశాఖపట్నం: ‘‘నా భర్త దుంగ గోపాలకృష్ణ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. గత ఏడాది నవంబర్ 25న విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన పీఎస్వో విభాగంలో పనిచేస్తుండగా, ఆ రోజు ఎస్ఎల్ ఇంజినీరింగ్ విభాగంలోని కార్మికులు సెలవులో ఉండటంతో అక్కడ విధులు నిర్వహించేందుకు పంపించారు. అండర్ గ్రౌండ్లో పని చేస్తుండగా బాయిలర్ వేడి నీరు పడటంతో ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో ఉండగానే మరణించినప్పటికీ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు.కాంట్రాక్టర్ నాగేశ్వరరావు రూ.1 లక్ష ఇస్తానని చెప్పి, కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదు’’ అని దుంగ మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాది వడ్లపూడి వేటపాలెం. నాకు ఆరేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. నా కుమారుడు పూర్తిగా దివ్యాంగుడు కావడంతో అతడిని చూసుకోవాల్సి రావడంతో పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ ఎంతో కష్టంగా మారింది. నా భర్త మృతికి నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని కోరినా స్పందన లేదు. నాకు మీరే న్యాయం చేయాలి జగనన్న‘ అంటూ విశాఖలో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద దుంగ మల్లేశ్వరి తన గోడును వినిపించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని, అయినప్పటికీ పరిహారం అందకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.జగన్ రాకతో..ఉరుకులు పరుగులు!ఉదయాన్నే బాధితుల ఇళ్ల వద్దకు కూటమి నేతలు నయాపైసా పరిహారం ప్రకటించకుండా డ్రామాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ప్రకటించని చంద్రబాబు సర్కారు మరో డ్రామాకు తెర తీసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ వస్తున్నారని తెలిసిన వెంటనే కూటమి నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ పెద్దల ఆదేశాలతో కూటమి నేతలు బాధితుల ఇళ్ల వద్ద వాలిపోయారు. బాధితులకు ఏదో మేలు చేసేస్తామన్న బిల్డప్ ఇచ్చారు. కానీ కార్మికులకు హక్కుగా రావాల్సిన పరిహారం మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా నయా పైసా చెల్లిస్తామని చెప్పేందుకు కూటమి నేతలు సాహసించలేదు. మరోవైపు కార్మికులు, కార్మిక సంఘాలతో కేజీహెచ్ వద్ద మంత్రి లోకేశ్ మంగళవారం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి నేతలను రంగంలోకి దించినట్లు చర్చ జరుగుతోంది. ఆగమేఘాలపై పోస్టుమార్టం..! సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించిన పైడిరాజు మృతదేహాన్ని హడావుడిగా కేజీహెచ్ నుంచి తరలించారు. ఉదయం 8.30 గంటల సమయంలో పైడి రాజు మరణించగా 10 గంటలకే పోస్టుమార్టం ముగించి ఆగమేఘాలపై అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడం గమనార్హం. కార్మికుల ఘోష పట్టించుకోకుండా.. ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలపై కూటమి సర్కారు కనీసం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన సమయంలో కూటమి నేతల ఇళ్ల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నా స్పందించలేదు. కార్మికులను తొలగించకుండా చూడాలని సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వేడుకున్నా ఆలకించలేదు. స్టీలు ప్లాంట్‌లో సమస్యలపై మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక వీఆర్ఎస్ పేరుతో బలవంతంగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వారికి బెనిఫిట్స్ కూడా చెల్లించకపోవడంపైనా కూటమి నేతలు నోరు విప్పలేదు. ఏకంగా నాలుగున్నర నెలల పాటు వేతనాలు అందడం లేదంటూ కార్మికులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ప్రతి సందర్బంలోనూ వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచి విశాఖ ఉక్కు కార్మికుల గుండె ఘోషను ఎలుగెత్తింది. -
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : వైఎస్ జగన్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగుల వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ చంద్రబాబు నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే... దేవుడి దయతో మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కార్మికుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎంగా ఉన్న తాను స్వయంగా వచ్చి దేశ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వారి హక్కుగా వచ్చే మొత్తాన్ని.. ఈ ప్రభుత్వం ఏదో అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ధర్మమేనా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామంటూ వచ్చిన లోకేశ్ మాట్లాడిన మాటలు వింటుంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని అనిపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ వైఎస్సార్ సీపీ హయాంలో రెండుసార్లు లేఖలు రాయడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉంటే మంచి చేయండి...విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ వర్క్‌షాప్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. వేర్వేరు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఇంకా ఒక అన్న చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో మాట్లాడాల్సి వస్తోంది. ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. మానవత్వం ఏ మాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మంచి చేయండి. స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎలా బతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది బేరీజు వేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏమాత్రం లేదు. లిక్విడ్ మెటల్ పొంగి బ్లాస్ట్ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్ సరిగ్గా చేయకపోవడం, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్‌లో నాణ్యత లోపించడం కారణం. ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మానవీయంగా లేదు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రెండేళ్లల్లో 10 వేల మందికి పైగా తొలగింపు..మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 28 వేల మంది పని చేయగా... ఈ రెండేళ్లలో ఏకంగా 10,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈ రోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ 16 వేల మంది ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే మొదటిసారి...విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలను ప్రొడక్షన్‌తో లింక్ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు... లేకపోతే లేదు అన్న నిబంధన ఈ రెండేళ్లల్లోనే వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు. ఉద్యోగుల క్వార్టర్లకు (నివాస గృహాలు) వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తుకు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లల్లో కరెంటు బిల్లు యూనిట్‌కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు. ఉద్యోగులకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు.. నో బోనస్... నో మెడికల్ ఫెసిలిటీస్... నో హెచ్ఆర్ఏ... నో ఎల్టీసీ... నో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్... నో ఇన్సెంటివ్స్...! ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితుల్లో పని చేస్తున్నారు.ఆ ప్యాకేజీ.. వీఆర్ఎస్, జీఎస్టీ బకాయిల కోసమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని కేవలం ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు. ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు..బాధితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మానవీయంగా లేదు. నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలో ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి పెంటయ్యన్న చనిపోయాడు. పెంటయ్యన్న ఎంప్లాయి నెంబరు 124185. ఆయన పర్మినెంట్ ఉద్యోగి. ఎస్ఎంఎస్–2లో మాస్టర్ టెక్నీషియన్‌గా (ఐడీ కార్డు చూపించారు) పని చేసేవారు. 2025 ఏప్రిల్ 1న ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకు కుమార్తె భాగ్యశ్రీతోపాటు ఇద్దరు కుమారులు నవీన్, ప్రసాద్ ఉన్నారు. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇంకా దారుణంగా.. ఆ ఫైల్ పోయిందని అంటున్నారు. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా? అని అడుగుతున్నా. విశాఖపట్నంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మీరిచ్చేదేమిటి... ‘బోడి’!ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్ మాటలు చూస్తుంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిందే కదా...! అదనంగా నీవు ఏమిస్తున్నావని అడుగుతున్నా! ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్‌న్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్... అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. ఇవన్నీ కలిపి రూ.1.72 కోట్లు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా. మరి నువ్విచ్చేది ఏంది ‘బోడి’ అని అడుగుతున్నా. ఇది ధర్మమేనా? న్యాయమేనా?మా ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే..ఇకనైనా ఈ ప్రభుత్వం మానవత్వం చూపి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సహాయం చేయకపోతే.. బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే నెలలోపు ఆ సహాయం చేస్తాం. కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రతీ బాధిత కుటుంబానికి అందజేస్తాం. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, గణేష్, కంబాల జోగులు, అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, చింతాడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే...అప్పట్లో ఇదే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా చేసి ఈ ప్లాంట్‌ను నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. అనంతరం నెల రోజుల తర్వాత 2021 మార్చి 9న మరో లేఖ (లేఖ ప్రతులను మీడియాకు చూపించారు) రాశాం. అలా మొత్తం రెండు లేఖలు రాశాం. ఆ తర్వాత 2021 మే నెలలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం (అసెంబ్లీ తీర్మానం మినిట్స్ కాపీని ప్రదర్శించారు) కూడా చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పాం. ఏ విధంగా మార్పుచేర్పులు చేస్తే స్టీలు ప్లాంట్‌ను గొప్పగా నిలబెట్టవచ్చో వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని వివరాలతో కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని, ప్రైవేటు చేతుల్లో మేనేజ్మెంట్ను పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరాం. ఏ చర్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనే విషయాన్ని కూడా పేర్కొంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం. అంతేకాకుండా 2022 నవంబరు 12న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆ సభలోనే ప్రధానిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టే సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదుకున్నాం..గతంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోతే మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. కార్మికులకు హక్కుగా రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో కార్మికులకు కోటి రూపాయలు ఇచ్చి ఎలా అండగా నిలబడ్డామో... అదే మాదిరిగా ప్రతీ ఉద్యోగికి మేం చేసి చూపించిన తరహాలోనే మీరూ చేయాలని అడుగుతున్నాం. వారికి హక్కుగా వచ్చే రూ.1.72 కోట్లతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. నా పక్కనే ఉన్న పెంటయ్యన్న కుటుంబాన్ని కూడా అదే మాదిరిగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి చెబుతున్నాం. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మీ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
జగన్ అన్న దేవుడిలా వచ్చాడు... బాధితుల ఎమోషనల్ రియాక్షన్
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పవన్ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన జగన్
-
మాటకు మాట
-
వైజాగ్‌లో జగనన్న గర్జన
-
హాస్పిటల్ లో స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన YS జగన్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
కోటి రూపాయలు ఇచ్చే బాధ్యత నాది
-
వాళ్ళకి రావాల్సింది ఇవ్వండి.. లేదంటే.. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
2029లో వచ్చేది నేనే.. రాగానే
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు జగన్ హామీ
-
నువ్వు ఇచ్చింది ఏందయ్యా బోడే? లోకేష్ పై జగన్ ఫైర్
-
నీకింక మాట్లాడటం చేతకాదు..లోకేష్ కు జగన్ కౌంటర్
-
చంద్రబాబుకు కొంచెమైనా బుద్దుందా..!? వైఎస్ జగన్ ఫైర్!
-
అసలు బ్లాస్ట్ ఎలా జరిగిందంటే..! జగన్ షాకింగ్ కామెంట్స్
-
YS Jagan: చాల బాధగా ఉంది
-
మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు లింకు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్‌ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా?స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా?ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్‌గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాంగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్‌ప్లాంట్ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్ జగన్ ప్రకటించారు. -
ఇదిగో నేను మోదీకి రాసిన లేఖలు... స్టీల్ ప్లాంట్‌పై వైఎస్ జగన్ సంచలన నిజాలు
-
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై జగన్ రియాక్షన్
-
మీరు జాగ్రత్త..! కార్మికులతో వైఎస్ జగన్
-
పైడిరాజు ఆఖరి వీడియో.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ జగన్
-
జగన్ ముందు కన్నీరు పెట్టిన బాధిత కుటుంబం
-
ఆసుపత్రిలో బాధితులను అడిగి... వివరాలు తెలుసుకున్న జగన్
-
పైడిరాజు కుటుంబంతో వైఎస్ జగన్
-
హాస్పిటల్ లో స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
-
పైడిరాజు మృతదేహాన్ని ఆగమేఘాల మీద అంత్యక్రియలకు 3 తరలించిన పోలీసులు
-
Seven Hills Hospitalకు చేరుకున్న వైఎస్ జగన్..
-
జగన్ రాకతో దద్దరిల్లిన విశాఖ..
-
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌ను అవమానించడానికి కుట్ర?
-
Exclusive Visuals: విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్
-
YS Jagan LIVE: విశాఖలో వైఎస్ జగన్..
-
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో బయట పడ్డ సంచలన నిజాలు
-
స్టీల్‌ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు సంబంధించి.. -
భారతీరాజా మరణం కళారంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా అని ప్రశంసలు కురిపించారు. ఆయన మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.భారతీరాజా మృతి పట్ల వైఎస్ జగన్ స్పందిస్తూ..‘భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వ్యాఖ్యానించారు. -
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
-
నేడు విశాఖకు వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. బుధవారం విశాఖకు చేరుకొని బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలిపింది. -
మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కుట్ర
సాక్షి, అమరావతి: అవసరాల కోసం ఒక ప్రవాసాంధ్రుడు (ఎన్నారై) చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన అనుచరుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలనే కుట్రకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరతీశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రవాసాంధ్రుడు మురళీమోహన్ భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై టీడీపీ కార్యకర్త అని, ప్రత్తిపాటు పుల్లారావు గెలుపు కోసం పనిచేశారని, అయినా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే, నాలుగేళ్లపాటు పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రవాసాంధ్రుడికి చెందిన చిలకలూరిపేటలోని మాల్ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. దీంతో ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న వైఎస్ జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేయడం లేదు బాధిత ఎన్నారై మురళీమోహన్ భార్య కృష్ణప్రియ మాట్లాడుతూ.. ‘20 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేసి కూడబెట్టిన సొమ్ముతో చిలకలూరిపేటలో ఒక మాల్ నిర్మించుకున్నాం. అందులో అత్యాధునిక టెక్నాలజీతో రెండు థియేటర్లు, బాంకెట్ హాల్, ఎల్రక్టానిక్ స్టోర్‌ని ఏర్పాటు చేశాం. కోవిడ్ సమయంలో వ్యాపారం లేని కారణంగా రూ.90 లక్షలు అప్పు చేశాం. దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా మాల్ని పూర్తిగా మూతపడేలా చేశారు. రూ.90 లక్షల అప్పులు చేస్తే నాలుగేళ్లలో రూ.7.50 కోట్లు అయ్యిందన్నారు. ఆమొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా మాల్ని అప్పగించేందుకు అంగీకరించడం లేదు. పైగా రూ.7.50 కోట్లు తీసుకుని పారిపోయారంటూ మా మామ ఫొటోలతో పాంప్లెట్లు ప్రింట్ చేసి ఊరంతా పంచి పెట్టి మా పరువును రోడ్డున పడేలా చేశారు. రైతుల సొమ్ము రూ.30 కోట్లు కాజేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మమ్మల్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోనివ్వాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా పట్టించుకోవడం లేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకొచ్చి కూర్చుంటారు. కళ్లముందు దౌర్జన్యాలు కనిపిస్తున్నా వారికేం సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. జనం థియేటర్లకు, మాల్కి రాకుండా రోడ్డుపై టెంట్ వేసి గుంపులుగా రౌడీలను మోహరించి అడ్డుకున్నా, సీసీ కెమెరాలను పగులగొట్టినా పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై మాట్లాడటానికి నా భర్త మురళీమోహన్ చిలకలూరిపేట వస్తే డ్రగ్స్ కేసులు పెడతామని వేధించి వెనక్కి పంపించారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాం. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు’ అని చెప్పారు. -
ఇది సర్కారీ నిర్లక్ష్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌లో హఠాత్తుగా విస్ఫోటం సంభవించి, అక్కడ పనిచేస్తున్న 8 మంది క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగలగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 1,600 డిగ్రీల సెల్సియస్‌తో సలసలకాగుతున్న ఆ ఉక్కు ద్రవం... సమీపంలోని భారీ క్రేన్‌పై పడి అది పూర్తిగా దగ్ధమైందంటే దాని తీవ్రత ఎంతటిదో గ్రహించవచ్చు. ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించిన పర్యవసానంగా చోటుచేసుకున్న ఈ మరణాలు నిజానికి హత్యలు. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబు పత్తాలేరు. ముందురోజు వెళ్లిన హోంమంత్రి అనిత కార్మిక కుటుంబాలను పలకరించే ధైర్యం లేక అట్నుంచి అటే పలాయనం చిత్తగించారు. లోకేశ్, పవన్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘అకటా వికటపు రాజుకు అవివేకపు మంత్రులు, చాదస్తపు పరివారం...’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. అందుకు తగినట్టే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్ప లేక, రంకెలేస్తూ ‘మీకెందుకు... మీ ఇంట్లో ఎవరైనా పోయారా?’ అంటూ లోకేశ్ మాట్లా డిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనం. రెండేళ్లనుంచి మంత్రిగా ఉన్నా పవన్ అపరిపక్వతను వదుల్చుకోలేకపోతున్నారని ఆయన తీరు తేటతెల్లం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తే తానే అడ్డుకున్నారట. ఘటన జరిగిన కర్మాగారం ఏమిటో, అది ఎవరి అధీనంలో ఉంటుందో కూడా ఆయనకు తెలియ దన్నమాట! పైగా పోరాడదామంటే కార్మికులు కదల్లేదట!! ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత, ఇలా చవకబారు మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గనిపించలేదు. పైగా 2021లో దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఅసెంబ్లీలో తీర్మానం చేయించి అడ్డుకుందని అదే నగరంలో కేంద్ర ఉక్కుగనుల మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పి ఇంకా 24 గంటలు గడవకుండానే అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి!ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వచ్చినవారిపై సహజంగానే ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయి. పైగా విశాఖ ఉక్కును రక్షిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చినవారు గనుక, మీరేం చేశారని ప్రశ్నిస్తారు. ‘అప్రయోజకుడికి అహంకారం ఎక్కువన్న’ట్టు గొంతు చించుకుని దబాయిస్తే కార్మికలోకం నోరుమూసుకుని పడి ఉంటుందని లోకేశ్ అనుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు వేలమంది ఉద్యోగులతో కళకళ్లాడుతూ ఉత్పాదనలో దేశంలోనే నంబర్ వన్‌గా, నవరత్నాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా చిదిమేస్తుంటే... ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతుంటే నిలదీయటం నేరమా? ఇంతవరకూ కర్మాగారంలో 7,500 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించారు. నిపుణులైన 6,000 మందిని పనిలో నుంచి తీసేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట మరో 2,000 మందిని పంపేశారు. మరోపక్క ఉత్పాదకత పెంచాలని కార్మికుల్ని వేధిస్తున్నారు. 30 ఏళ్లనాటి బ్యాటరీలేఇంకా వినియోగిస్తుండగా, కొన్ని విడి భాగాలు పనికి రాకుండా పోయాయని చెప్పినా అరణ్యరోదనైంది. పైగా విశాఖ ఉక్కు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉక్కు తయారీలో నాసిరకం రసాయనాలను వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత విషాద ఘటనకు ఇవన్నీ కారణమే. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఇదే నగరంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనువెంటనే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున అంద జేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో డ్రామాలు కట్టిపెట్టి దాని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. -
రేపు విశాఖలో జగన్ పర్యటన
-
రేపు విశాఖకు వైఎస్ జగన్.. స్టీల్‌ప్లాంట్ బాధితులకు పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖకు బయిలుదేరనున్నారు. అదేవిధంగా నిన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు.నిన్న ( సోమవారం) సాయంత్రం 150 టన్నుల ద్రవపు ట్రక్కున మెుసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్పోటనం చెందింది. దీంతో అది కార్మికులపై పడి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ ఇదివరకే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు స్వయంగా వైఎస్ జగన్, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, బాధిత కుటుంబాలను కలువనున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ ఎమోషనల్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. బాధితులకు విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి -
వైఎస్ జగన్‌ను కలిసిన నిడమానూరు ఫ్లైఓవర్ బాధితులు
సాక్షి, గన్నవరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని సోమవారం గన్నవరం విమానాశ్రయంలో నిడమనూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు. రైల్వే బ్రిడ్జి కోసం ఎంతో కాలంగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంతో కాలంగా అక్కడ నివాసం ఉంటున్న 100 కుటుంబాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే బాధితుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యపై వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని అవసరమైతే వైఎస్సార్సీపీ తరపున బాధితులకు అండగా కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఫ్లై ఓవర్ బాధితుల సమస్యలను కృష్ణాజిల్లా పార్టీ అధికార ప్రతినిధి శీలం రంగారావు, వైఎస్ జగన్‌కు వివరించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాడ్యం పట్టుకుంది అర్దం అవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాలలో అవసరం ఉన్నా,లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం , రైతులపై దౌర్జన్యం చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఉండవల్లి ,పెనుమాక ,నిడమర్రు మొదలైన గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను కొంతమేర ఇచ్చారు. ఆ పైన ఇవ్వడానికి సిద్దపడడం లేదు. కొందరు భూమలు వదలుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో రైతులపై చంద్రబాబు సర్కార్ వేదింపులు మొదలుపెట్టింది.బాధితులైన రైతులు కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులపై జరుగుతున్న దాష్టికాన్ని ఎదుర్కోవడానికి న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇది టిడిపి మీడియాకు నచ్చలేదు. వెంటనే ఒక స్టోరీ అల్లేశారు. దానిలో జగన్ పైన, బాధితులపైన తప్పుడు రాతలు రాశారు. జగన్ ను కలిసినవారిలో కొందరు ఆయన సామాజికవర్గం వారని అంటూ ఎల్లో మీడియా కులం ప్రస్తావన చేసింది. అంటే ఏమి అనుకోవాలి?అమరావతికి మద్దతు ఇస్తే తప్ప, లేకుంటే ఎవరిపైన అయినా కుల ముద్ర, లేదా మరో ముద్ర వేసి ప్రచారం చేస్తారా?. ఈ కధనం చదివినవారికి ఏమనిపిస్తుంది.ఒక సామాజికవర్గ ఆధిపత్యం కోసమే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలను రాజధాని కోసం ఎంపిక చేసి, లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్దమైందన్న ఆరోపణలు ,విమర్శలు వాస్తవమే అన్న భావన కలగదా!అప్పట్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసి రాజధాని గ్రామాలలో అత్యధికంగా భూములు కొనుగోలు చేసినవారిలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వారి లబ్ది కోసం ఎల్లో మీడియా ఇలా దిగజారి వార్తలు రాస్తున్నదన్న అభిప్రాయం కలగదా?నిజానికి ప్రస్తుతం రాజధాని రైతులంతా కులాలతో సంబందం లేకుండా అంతా అవస్థలు పడుతున్నారు.2015లో ఉత్సాహంగా భూములు ఇచ్చినవారు సైతం నిస్పృహకు గురి అవుతున్నారు.మంత్రి నారాయణ పాల్గొన్న ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మరణించారు. అప్పుడు ఇదే ఎల్లో మీడియా కూల్ గా పడిపోయి మరణించారని దిక్కుమాలిన రాతలను రాసింది.ఆయన కూడా జగన్ సామాజికవర్గానికి చెందినవారేనా! అంతెదుకు రాయపూడి ప్రాంతంలో ఒక ప్రముఖ రైతు నేత తన భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్లలేదా!ఆయన ఏ కులం వారు?రాజకీయంగా పలుకుబడి,పరపతి, అధికారం ఉన్నవారికి మాత్రమే ఇబ్బంది లేని చోట్ల ప్లాట్లు కేటాయిస్తున్నారని, మిగిలినవారికి వరద ప్రాంతాలు,స్మశానాలలో సైతం ప్లాట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఓపెన్ గానే వస్తున్నాయి.బాధ పడుతున్నవారిలో చాలా మంది కమ్మవారు కూడా ఉన్నారు కదా!వారికి మాత్రం ఏమి న్యాయం జరిగింది?రెండో టరమ్ లో అధికారం వచ్చి రెండేళ్లు అయినా ఇంతవరకు ఎంతమందికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇచ్చారో చెప్పగలరా?రెండో దశ పూలింగ్‌లో వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్దం అయితే వ్యతిరేకిస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నది కమ్మ సామాజికవర్గం కాదా?అంతెందుకు! రెండో దశ కింద వేల ఎకరాలు సేకరించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించిన రిటైర్డ్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు ఏ సామాజికవర్గంవారు? అమరావతి నిర్మాణం పేరుతో రైతులను దోచుకుంటున్నారని, అదనంగా భూములు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కమ్మ వర్గం వారు కాదా?వాస్తవ పరిస్తితి ఇలా ఉంటే అదేదో రెడ్డి సామాజికవర్గం వారు కొంతమంది రాజధానికి అడ్డుపడుతున్నట్లు దుర్మార్గంగా వార్తలు ఇస్తారా?ఇవన్ని ఎందుకు!ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిని ఒక సామాజికవర్గ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని గతంలో ఆరోపించారా?లేదా?ఆయన స్వయంగా పెనుమాక ప్రాంత రైతులను కలిసి వారి గోడు అప్పట్లో విన్నారా?లేదా?ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు.అది వేరే సంగతి. ఇది అసలు కుల సమస్యకాదు. కులాలకు అతీతంగా వేలాది మంది రైతుల ఆక్రోశం.ఆవేదన.ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా వ్యవహరించడంపై వ్యక్తం అవుతున్న నిరసన అని గమనించాలి.భూములు ఇచ్చినవారిపై అక్కసుతో ఉండవలసిన అవసరం జగన్ కు ఏమి ఉంటుంది.వారికి ప్లాట్లు ఇవ్వవద్దని, డ్రైన్లు, కరెంటు,తదితర సదుపాయాలు కల్పించవద్దని జగన్ ఏమైనా అన్నారా?వారికి కూడా న్యాయం చేయమనే కదా కోరింది.ఇన్నివేల ఎకరాలు తీసుకోవడం,లక్షల కోట్లు రాజధాని పేరుతో వ్యయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.అందులో ఆక్షేపణ ఏమి ఉంది?అందుకే మచిలీపట్నం ,విజయవాడ,గుంటూరు కారిడార్ ను (మావిగన్) ప్రతిపాదించి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి లక్షల కోట్ల వ్యయం అవ్వదని ఆయన సలహా ఇచ్చారు.ఆ ప్రతిపాదన చేయడం వల్లే కదా ప్రభుత్వం భయపడుతోంది. టిడిపి మహానాడులో అమరావతికి సంబందించి చర్చను ఎందుకు విస్తృతంగా చేయలేదు?రెండు లక్షల ఎకరాలు తీసుకోవలసిన అవసరం, లక్షల కోట్ల నిధులు ఒకే చోట వ్యయం చేయడం ఎందుకు అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారే!ఈ నేపధ్యంలో కొందరు రైతులు జగన్ ను కలిసి తమను ప్రభుత్వం ఏ రకంగా హింసిస్తుందో వివరించారు. రైతుల భూములలో వారి అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవచ్చా?ప్రభుత్వమే ఇలా రౌడీయిజంగా వ్యవహరించవచ్చా?పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూములలో ప్లాట్లు వేయవచ్చా?వేరేవారికి ఆ ప్లాట్లు కేటాయించవచ్చా?అది చట్ట సమ్మతమా?ఒక సాధారణ రైతు ప్రభుత్వమే తన భూమిని ఎలా కబ్జా చేస్తుందని, ఐఎఎస్ అధికారులు అందులో వేరేవారికి ప్లాట్లు ఎలా రిజిస్టర్ చేస్తారని,ఇదేనా వారు చదువుకుంది అని ప్రశ్నించారు.తన పొలంలోకి కొండవీటి కాల్వకు గండి పెట్టి నీరువదలిలారని ఒక రైతు వాపోయారు.తాను కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చినా, ఇంకా భూమి కావాలంటూ వెంటబడుతున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.విశేషం ఏమిటంటే పెనుమాకలో జరిగిన గ్రామ సభలో కొందరు తెలుగుదేశం మద్దతుదారులు కూడా భూములు ఇచ్చిన తమకు జరుగుతున్నఅన్యాయాలను ఏకరువు పెట్టి అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చశారు.వారిలో రెడ్డి వర్గం వారు కూడా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సి.ఎమ్ గా ఉన్నప్పుడు పోలవరం ఎడమ కాల్వ తవ్వకానికి భూములు సేకరిస్తే,టిడిపికి చెందినవారు కొన్ని చోట్ల అడ్డుపడ్డారు.వారు కోర్టుకు వెళ్లారు.వీరిలో ఎక్కువ మంది ఏ కులం వారో అప్పుడు రాశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించిందా?అదే రైతులు టిడిపి అధికారంలోకి వచ్చాక ఒక రేటుకు ఒప్పందం అయి భూములు ఎలా ఇచ్చారు?ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది.అదేదో నేరం అయినట్లు విష ప్రచారం చేయడం దారుణం. సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా, ప్రభుత్వం రౌడీయిజం చేయడమే మంచి విధానం అన్నట్లు ఎల్లో మీడియా రాయడం అంటే అంతకన్నా నీచం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బస్సును చీల్చుకెళ్లిన లారీ ముగ్గురు ఏపీ వాసుల మృతి..
-
యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
నేనున్నా భయపడకు.. బొల్లాకు జగన్ భరోసా..
-
బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
సాక్షి,అమరావతి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలబడుతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బ్రహ్మనాయుడు అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆదివారం బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. -
బాబు.. లోకేష్.. పవన్ నో అపాయింట్మెంట్.. అందుకే జగన్ ను కలిసాం
-
సారం లేని సారా కథలు.. ఎల్లో మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు
-
క్రికెటర్ కేఎస్ భరత్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్-వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్‌కు శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ కేఎస్ భరత్ అంటూ పోస్ట్ చేశారు వైఎస్ జగన్.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్,. Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!@KonaBharat pic.twitter.com/uy5XpUI3h8— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2026 కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.లిస్ట్-ఏ క్రికెట్లో భరత్ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్లో భరత్ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు. -
విజయదుర్గ అధిపతి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
విజయదుర్గ పీఠాధిపతి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
దగా డీఎస్సీపై మెగా కవరింగ్..
సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్) పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్ (ఓపెన్ లేదా అదే రిజర్వేషన్) అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. అలాగే, ‘కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!డీఎస్సీ మెరిట్ బాధిత అభ్యర్థులను ‘ఫేక్’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారంకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్‌ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్‌లెటర్ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్‌లెటర్ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? » ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్‌లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
వైఎస్ జగన్, సజ్జలకు నోటీసులు అంబటి రియాక్షన్
-
రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదు
సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.లిక్కర్ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. చంద్రబాబు గతంలో లిక్కర్ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
‘జగనన్న ఉన్నప్పుడు ఇట్లా కాదు మామా!’
‘చంద్రబాబు ముఖంలో మార్పు వచ్చింది.. మారిన మనిషంటూ జనాన్ని నమ్మించి, గ్యారెంటీ బాండ్లని చేతిలో పెడితే.. మురిసిపోయి ఓట్లేసినందుకు మన బతుకులు బస్టాండ్ అయ్యాయి మామా!’ అంటూ బద్వేలు నియోజకవర్గం కలసపాడు పీర్ల చావిడి రచ్చబండ కాడ కూర్చుని జనం కూటమి సర్కార్‌ను ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్క పథకం డబ్బులు అకౌంట్లలో పడకపోగా, నిబంధనల పోట్లతో ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్న చందాన సాగుతున్న అరాచక పాలనపై పల్లెల్లో జనం తిరగబడుతున్నారు. ఇటీవల ఊర్లో శుభకార్యానికి హైదరాబాద్ నుంచి వచ్చిన రామచంద్రుడిని చూసి రచ్చబండ కాడ ఉన్న వెంకన్న పలకరించాడు. ‘ఏమిరా రామచంద్రా! ఎట్లుంది హైదరాబాద్‌ల నీ ఉద్యోగం? జీతం బాగానే ఇస్తున్నారా, ఏమన్నా ఎనకేస్తున్నావా? బంగ్లాలు, ఇండ్లు ఏమన్నా కట్టినావా సామీ?’ అని గుక్కతిప్పుకోకుండా అడిగేశాడు.దానికి రామచంద్రుడు నిట్టూరుస్తూ.. ‘ఏం సరిపోతాదిలే మామా! జీతాలు చూస్తే అణాపైసలు.. ఖర్చులు చూస్తే కొండంత! ఏది ముట్టుకున్నా రేట్లు సెగలు పుట్టిస్తున్నాయి. అంత సీన్ ఉంటే పిల్లోలను ఊర్ల ముసలోళ్ల కాడ ఎందుకు వదిలిపోతా? నా సామిరంగా.. ఈ రెండేళ్ల నుంచి నడ్డి విరిగిపోతాంది మామా! వెనకటికి మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మనకు ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ రుణాలు’ టైమ్‌కు వచ్చేవి. ఏడాదికి రూ.18 వేలకు పైగా ఒకేసారి చేతికొస్తే ఆడోళ్లు పొదుపుగా దాచుకునేవాళ్లు. పిల్లకు ‘అమ్మ ఒడి’ వచ్చేది, పెద్ద పిల్లోనికి ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వచ్చేది. ఇంటి పెద్దన్నగా జగనన్నే ఉండి ఆదుకునేటోడు. ఆ డబ్బులతో పిల్లల చదువులే కాకుండా ఇంట్లో ముసల్లోళ్ల వంటా వార్పుకు కూడా సాయపడేవి. ఊర్లో ఉపాధి పనులు ఉండి కూలి గిట్టుబాటయ్యేది. దాంతో పండగలకు మేం కూడా ఎంతో సంతోషంగా ఊరికొచ్చేవాళ్లం. కానీ ఇప్పుడేమైందో ఏమో గానీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ‘తల్లికి వందనం’ పోయింది, ‘వైఎస్ఆర్ ఆసరా’ పోయింది, ‘సున్నా వడ్డీ’ కూడా పోయింది! ఇక కడప దగ్గర్లో ఇంజినీరింగ్ చదువుతున్న నా కొడుకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని కాలేజీ వాడు రూ.75 వేలు కట్టమన్నాడు, లేకుంటే పరీక్షలు రాయనీయమన్నారట! చేసేది లేక నీ కూతురు పుస్తెల గొలుసు, ఇంకొన్ని చిన్న చిన్న వెండి సొమ్ములు ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజు కట్టినాం మామా.. జగనన్న ఉన్నప్పుడు ఇట్టాంటి తిప్పలు అస్సలు ఉండకపోయేవి, హాయిగా నిద్రపోయేవాళ్లం. మన బావమరిది కూడా అప్పట్లో ‘రైతుభరోసా’ డబ్బులతో హాయిగా వ్యవసాయం చేసుకునేటోడు. ఇప్పుడు వాడికీ వ్యవసాయంలో తీరని నష్టాలు వచ్చాయట. ఈసారి యూరియా దొరక్క వాడు వేసిన మొక్కజొన్న పంట అంతా ఎండిపోయిందట, వాడు కూడా దిగాలుగా కూర్చున్నాడు. ఏదో పిల్లలను, ముసల్లోళ్లను చూద్దామని ఆశగా ఊరికొస్తే.. ఇక్కడ ఎవరి ముఖంలోనూ సంతోషమనేదే కనిపిస్తలేదు మామా..!’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న యుగంధర్ మాటలో మాట కలిపాడు. ‘నిజమేరా రామచంద్రా..! మా అన్న భార్యకు గతంలో ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ’ డబ్బులు చక్కగా వచ్చేవి. ఇప్పుడు అవేవీ రావడం లేదు. మా అన్న పాడెక్కి ఏడాది కావస్తోంది. ఇంతవరకు నా వదినకు వితంతు పింఛన్ ఇవ్వలేదు! 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు.. వితంతువులను ఇలా నడిరోడ్డున పడేశాడు. మేం గ్రామ పెద్దను తీసుకుని సచివాలయానికి వెళ్తే.. ‘మీ అన్నకు ఇదివరకు పింఛన్ లేదు కాబట్టి, మీ వదినకు కొత్త పింఛన్ రాదు’ అని సాకులు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక నా వదిన కూలి పనులకు వెళ్లి బతుకీడుస్తోంది.గతంలో ఆమె కొడుక్కి వాలంటీర్ ఉద్యోగం ఉండేది. నెలకు రూ.5 వేలు వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడా ఉద్యోగం లేదు, వాడు కూడా రోడ్డున పడ్డాడు. అటు ఉద్యోగమూ లేదు, ఇటు నిరుద్యోగ భృతీ లేదు. జాబ్ క్యాలెండర్ రాకపోయే సరికి వాడు బతుకుదెరువు కోసం పట్టణం వెళ్లిపోయాడు. ఈ పండుగకు కూడా వాడు ఊరికి రాలేదు. ఇక్కడేమో నా వదిన మంచం పట్టింది. ఏందిరా రామచంద్రా..! ఇప్పుడు ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ నాయకుల కాళ్లు పట్టుకోవాలి. పిల్లల చదువుల కోసం ‘ఇ.డబ్ల్యూ.ఎస్’ సర్టిఫికెట్ కావాలన్నా నెలల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండేళ్లకే ఎంత దారుణమైన మార్పు వచ్చిందిరా అబ్బా! నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు.. ఇప్పుడు మాయమాటలు చెప్పి మనందరికీ వెన్నుపోటు పొడిచాడు! పాలిచ్చే బర్రెను కాదనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకుని ఇంట్లో కట్టేసుకున్నాం. ఇదేం కర్మరా రామా.. రెండేళ్లలోనే ఇట్లయిపాయె!’ అంటూ యుగంధర్ నిట్టూర్చాడు. అక్కడే కూర్చుని అన్నీ వింటున్న శ్రీకాంత్ ఒక్కసారిగా నోరు తెరిచి.. ‘నిజమేరా బావా..! జగనన్న పాలనలో మాకు కుట్టుపని నిమిత్తం ప్రతి ఏడాది రూ. 10 వేలు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఇచ్చేటోళ్లు. ఇప్పుడవి రాకుండా పోయాయి. ఊర్లో ఎక్కడైనా బతుకుదామన్నా అసలు పనే దొరకడం లేదు. చేసేది లేక కట్టుకున్న భార్యను, పిల్లలను, ముసలోళ్లను ఊర్లోనే వదిలేసి, బతుకుదెరువు కోసం హైదరాబాద్ పోయి దొరికిన కాడ కమిషన్‌కు బట్టలు కుడుతున్నా. ఓటు ఈ మోసగానికి వేసి పెద్ద తప్పు చేశామా అనిపిస్తోంది’ అని ఆవేదన చెందాడు. రాజశేఖర్ ఏకబిగిన అందుకొని.. ‘చంద్రబాబు పాలన అంతా ఉత్తుత్తిదేరా అబ్బా..! జనాన్ని నమ్మించడం, ఓట్లు దండుకొని మోసం చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇటు నిరుద్యోగ భృతి లేదు, అటు సూపర్ సిక్స్ హామీల అమలు అంతంతమాత్రమే. పేద పిల్లలు డాక్టర్లు కావాలని జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేసి, పేదల వైద్యాన్ని అంగట్లో అమ్మేసింది! ఆరోగ్యశ్రీని పూర్తిగా బొంద పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల నుంచి అమరావతి జపం చేయడం, ప్రజలకు మాయమాటలు చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం కనిపించడంలేదు’ అని ఊదరగొట్టాడు. దాంతో రచ్చబండ కాడ ఉన్న జనం అంతా ‘అవునురో అబ్బా.. ఇవన్నీ అక్షరాలా నిజాలేరో! ఓటేసి నిలువునా మోసపోయాం’ అంటూ తలలు పట్టుకున్నారు. – కాతా వెంకట నరసింహారెడ్డి, బద్వేలుమా ఉసురు తగులుతుంది! జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, నాలాంటి నిరుద్యోగులు లక్షలాది మందికి గౌరవంగా జీవనోపాధి కల్పించారు. అలాంటి ఉపాధిని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి లాగేసుకుంది. నమ్మించి మా బతుకులను రోడ్డున పడేసిన ఈ కూటమి సర్కార్‌కు మా ఉసురు తగులుతుంది. – షేక్ అర్షియా, మాజీ వలంటీర్, కలసపాడు.జీవనోపాధినే లాగేసుకున్నారు! వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించబోమని, పైగా జీతం రూ. 10 వేలు చేస్తామని ఎన్నికలపుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. వలంటీరుగా ఉన్నప్పుడు నెలకు రూ. 5 వేలు వచ్చినా మా సొంత ఊర్లోనే ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు ఆ కాస్తా లేకుండా చేసి ఘోరంగా మోసం చేశారు.– మల్లిఖార్జున, మాజీ వలంటీర్, బ్రాహ్మణపల్లె.నేడు ఆఫీసుల చుట్టూ తిప్పలు! మేము వలంటీర్లుగా ఉన్నప్పుడు నెలలో మొదటి ఐదు రోజులు ఎక్కడికెళ్లినా వెతికి పట్టుకొని మరీ అవ్వతాతల చేతుల్లో పింఛన్లు పె ట్టేవాళ్లం. ఇప్పుడు ఆ పరి స్థితి లేదు. రేషన్ కార్డు కావాలన్నా, ఇతర ప్రభుత్వ సేవ లు కావాలన్నా పేదలు తమ రెక్కాడితే గాని డొక్కాడరని తెలిసి కూడా ఉపాధి పనులు వదిలేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’– శ్రీనివాసులు, మాజీ వలంటీర్, కలసపాడు. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించడానికి నిబద్దతతో పని చేద్దాం. సుస్థిరత అనేది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి జీవితాల్లో అంతర్భాగం కావాల్సిన ఒక బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the occasion of World Environment Day, let us reaffirm our commitment to protecting nature and conserving the environment for future generations. Sustainability is not just a goal but a responsibility that should be integrated into our lives.#WorldEnvironmentDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2026 -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం), గొల్లపల్లి డేవిడ్ రాజు(కొత్తపేట), ఎస్.సత్యనారాయణమ్మ(కర్నూల్) పార్టీ కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులయ్యారు.అలాగే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జె.మారయ్య(ఆలూరు), ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి(పాణ్యం), గంధం వీర రాఘవరెడ్డి(ఆళ్లగడ్డ), నారపురెడ్డి జగదీశ్వర్ రెడ్డి(జమ్మలమడుగు), రాచంరెడ్డి భాస్కర రెడ్డి(పుట్టపర్తి), రాజులపూడి భాస్కరరావు(అమలాపురం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
దద్దరిల్లిన గుంటూరు.. జగన్ నినాదాలతో YSRCP భారీ ర్యాలీ
-
చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రకాశంలో విషాదంప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పారిపోలేవ్.. దాక్కోలేవ్.. జగన్ వస్తున్నాడు!
-
నిన్ను నీ కొడుకుని తగలపెట్టాలి అంబటి ఫైర్
-
ఎస్పీ బాలు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహా గాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహాగాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న… pic.twitter.com/X5hf8FqDgk— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2026 -
టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్
-
స్పెషల్ కమిషన్ వేస్తా.. మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేస్తా..! DSC అభ్యర్థులకు జగన్ హామీ
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్‌తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్‌కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ను కలవడానికి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్‌బెల్ట్ ఛాంపియన్‌ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్‌లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్‌కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్‌లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్‌లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్‌కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్‌లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్‌లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్‌లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్‌లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్‌లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్‌లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్‌బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్‌లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్‌కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.ఏ కమిటీల్లో ఎవరు?సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు సీఆర్డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రడీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్


