చంద్రబాబు బాగోతం లెక్కలతో బయటపెట్టిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Tweet on Chandrababu GSDP Cooked Up figures | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బాగోతం లెక్కలతో బయటపెట్టిన వైఎస్‌ జగన్‌

Dec 9 2025 7:39 PM | Updated on Dec 9 2025 7:54 PM

YS Jagan Tweet on Chandrababu GSDP Cooked Up figures

సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దొంగ లెక్కలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని.. ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని అన్నారు.

కాగ్‌ (Comptroller and Auditor General) విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే.. 

  • ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది
  • అప్పులు గణనీయంగా పెరిగాయి
  • అభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయింది
  • వినియోగం, పెట్టుబడులు పడిపోయాయి
  • రెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయి
  • అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయి

ఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని జగన్ మండిపడ్డారు. ఆయన అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ, “కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు” అని చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా..

  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే, ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు?
  • 2014–19లో టీడీపీ పాలనలో GSDP వృద్ధి గొప్పదైతే.. ఇప్పుడు రాష్ట్రం జాతీయ GDPలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019–24లో 4.78%గా ఉన్న సంగతేంటి?..
  • టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏమిటి?.. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని..  కానీ కాగ్‌ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అబద్ధపు ప్రచారాలు.. 2019–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ సమాచారాన్ని ఆయన మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement