సాక్షి, అమరావతి: 1971లో జరిగిన యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రదమైన నివాళి అర్పిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘విజయ్ దివస్ నాడు అమర జవాన్ల పరాక్రమాన్ని ప్రతియేటా మనం స్మరించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు జవాన్లు శాశ్వత ప్రేరణగా నిలుస్తారు’ అని వైఎస్ జగన్ కొనియాడారు.


