పులివెందుల : కమిటీ సభ్యులతో మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, తదితరులు
పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు గంటమస్తాన్ వీధిలో అనుబంధ విభాగాల కోర్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ వార్డు నాయకులు బండల మురళి, చంద్రమౌళిల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అనుబంధాల కోర్ కమిటీ సమావేశాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
ప్రతి నాయకులు, కార్యకర్త సైనికుల్లా పనిచేస్తేనే కూటమి నాయకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చునన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వార్డులోని ప్రజలకు వివరించాలన్నారు. 2.0 జగనన్న పాలనలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే పదవులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కమిటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సోపాల వీరా, కనక, సంపత్, దశరథరామిరెడ్డి, రత్న, కిశోర్, మాబ్‌జాన్, బాషా, వినోద్, రమేష్, బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 
వేముల : గొందిపల్లె సమావేశంలో మాట్లాడుతున్న మండల ఇన్‌చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి , పెద్దముడియం : బీటిపాడులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
పులివెందుల రూరల్ : గ్రామస్థాయి కమిటీలతో వైఎస్సార్‌సీపీ బలోపేతమవుతుందని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బలరామిరెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బాల గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్‌రెడ్డి, బాల ఓబుళరెడ్డి, గంగిరెడ్డి, చిన్న, మస్తాన్, ఎంపీటీసీ గంగన్న, రవీంద్రారెడ్డి, గుండాలయ్య, చంద్రమోహన్‌రెడ్డి, రామకృష్ణ, సూర్యుడు, రామచంద్ర, మనోహర్, వేణుగోపాల్ యాదవ్, రమేష్, అర్జున్, కృష్ణయ్య, రఫి, రజాక్, కొత్తపల్లె గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
లింగాలలో..
లింగాల : ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతోంది. కమిటీలు వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోనాల గ్రామంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కమిటీలు అహరి్నశలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, అబ్జర్వర్ పి.శ్రీనివాసులరెడ్డి, ఐటీ వింగ్ సుదర్శన్‌రెడ్డి, సోషల్ మీడియా సుమంత్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, బోనాల గ్రామ నాయకులు, సర్పంచ్ రాము కార్యకర్తలు పాల్గొన్నారు.
వేములలో..
వేముల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పటిష్టతకు సంస్థాగత కమిటీలతో గ్రామస్థాయి నుంచే శ్రీకారం చుట్టారని ఆ పార్టీ మండల ఇన్‌చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకటబయపురెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గొందిపల్లె గ్రామంలో శనివారం సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే సంస్థాగత కమిటీలే పారీ్టకి పట్టుకొమ్మలన్నారు.
గ్రామాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై గ్రామ సమస్యలతోపాటు పార్టీ పటిష్టతపై చర్చించుకోవాలన్నారు. రాబోవు కాలంలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలలో సంస్థాగత కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.0 పాలనలో కమిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, గంగిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్‌రెడ్డి, నాగేంద్రారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డ, శేషారెడ్డి, దేవేంద్రారెడ్డి, రామాంజనేయులు, ముసలయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
సింహాద్రిపురంలో..
సింహాద్రిపురం : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో శనివారం సింహాద్రిపురం మండలం సుంకేసుల, బి.చెర్లోపల్లె, లోమడ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అబ్జర్వర్లు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, నీలవర్థన్‌రెడ్డి, కె.భాస్కర్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, లోమడ వైఎస్సార్‌సీపీ నాయకులు పవన్ చంద్రారెడ్డి, హృషికేశవరెడ్డి, జనార్థన్‌రెడ్డి, బషీర్, జయచంద్రారెడ్డి, దేవపుత్రారెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజబాబు, వి.రాజా, వీరప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, భరత్‌రెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి, భార్గవ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, రామకోటిరెడ్డి, సోమశేఖరరెడ్డి, చంద్రమౌళి, వివేకానందరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, సురేష్, షబ్బీర్, మనోహర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, శాలివాహనరెడ్డి, శంకర్‌రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, రాజశేఖరరెడ్డి, హాజివలి, గోవర్థన్‌రెడ్డి, తిరుమన్‌రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆయా గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మలమడుగులో..
జమ్మలమడుగు : గ్రామ కమిటీలే పారీ్టకి బలమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దముడియం మండలంలోని బీటిపాడు, పాపాయపల్లె గ్రామాల్లో గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గ్రామ స్థాయి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ విష్ణువర్థన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షుమయ్య, రామలింగేశ్వరరెడ్డి, చౌడయ్య, వెంకటరామిరెడ్డి, గిరీష్‌రెడ్డి, విశ్నాథ్‌రెడ్డి, పాపాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, చిట్టేపు విశ్వనాథ్‌రెడ్డి, రెండు గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరపునాయునిపల్లెలో
వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు గ్రామంలో గ్రామ కమిటీ అనుబంద విబాగాల కమిటీలు సర్పంచు వెంకటేసు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, స్థానిక నాయకులు గోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, నందకుమార్‌రెడ్డి, రాంబాబు. జగన్, వీరపునాయునిపల్లె ఎంపీటీసి రాఘవ యాదవ్, వెంకటరామిరెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసుల్‌రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
మైలవరంలో..
మైలవరం : వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాలను గ్రామాలలో ఎగరడంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చేసుకుందామని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొమెర్ల, కర్మలవారిపల్లె గ్రామ పరిధిలో ఉన్న గ్రామాల కార్యకర్తలతో ఆయన గ్రామ సభను నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో వైఎస్సార్‌సీపీ మరింత బలం పెరగాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త మన ప్రభుత్వంలో చేసిన పనిని, ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు, అమలు కాని హామీల గురించి వివరించాలన్నారు.
కష్టపడిన ప్రతికార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచిగుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమెర్ల మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివగుర్విరెడ్డి, రామాంజనేయుల యాదవ్, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వేంపల్లెలో..
వేంపల్లె : మండలంలోని గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, వేంపల్లె 5వ ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ కమిటీ నియామక కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మునీర్‌బాషా, రవిశంకర్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, మణిగోపాల్‌రెడ్డి, కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, నిస్సార్ బాషా, ఎంపీటీసీ ఎం.హెచ్.హబీబుల్లా, బండల షుకూర్, బీఎస్ షేక్షావలి, సురేంద్ర, ముత్యాల రమేష్‌బాబు, మల్లయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


