హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకండానే విచ్చలవిడిగా అప్పుల తెస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ) సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ నంచి మాట్లాడిన ఆయన.. ‘బేవరేజ్‌ల బాండ్లను రూ. 5,750 కోట్లకు మార్కెట్‌లో పెట్టారని విమర్శించారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ కోంస అమ్మకం పెడితే నానా రాద్దాంతం చేశారన్నారు.
‘‘ప్రస్తుత కూటమి ప్రభుతం బేవరేజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. బేవరేజ్ చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బేవరేజ్‌లకు వచ్చే ఆదాయంలో డైరెక్ట్‌గా అప్పుదారుడు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మా ప్రభుత్వం హయాంలో గగ్గోలు పెట్టింది. కూటమి మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు.
బాండ్లు తాకట్టుపెట్టి రూ. 5,750 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. 9 శాతం పైగా వడ్డీతో రూ. చంద్రబాబు అప్పు తెచ్చారు.స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్య నిషేధం ఉండదని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విషపు మాటలు, ఈనాడు విషపు రాతలు రాసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు.
మా ప్రభుత్వంలో బాండ్లు ఇష్యూ చేస్తే అప్పుకిక్కు అని వార్తలు రాసిన కూటమి పత్రికలు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అప్పు కిక్కి కనిపించడం లేదా.మేము చేస్తే అప్పు. కూటమి ప్రభుత్వం చేస్తే మాత్రం సంపద సృష్టి అన్నట్లు వారి మీడియా వార్తలు రాస్తుంది’ అని మండినడ్డారు బుగ్గన.



