breaking news
Chandrababu Naidu
-
చంద్రబాబు డబుల్ యాక్షన్.. విజయ్ ముందు పవన్ కు అవమానం
-
కూటమిలో సీట్ల హైడ్రామా.. బాబు Vs పవన్
-
సత్వర విచారణ షాకా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మోపిన కేసుల్లో రోజువారీగా విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. కేసులు సత్వరం ముగిసేలా సీబీఐతో పాటు ఈడీ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తూ ఉండగా, అందుకు న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈడీ పీపీకి ఆదేశాలు జారీచేసి విచారణ ప్రారంభించారు. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ చార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీలైనంత త్వరగా కేసులను ముగించాలని వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. మరోవైపు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌ను ప్రజాక్షేత్రానికి దూరం చేసి కోర్టుల చుట్టూ తిప్పాలన్న చంద్రబాబు అండ్ కో కుట్రలు ఫలించలేదు. జగన్ వ్యక్తిగత హాజరు కోరుతూ బాబు డైరెక్షన్లో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, ఎల్లో మీడియా మాత్రం వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్కసును వెళ్లగక్కింది. జగన్ న్యాయవాది విజ్ఞప్తికే న్యాయమూర్తి అంగీకరించగా.. జగన్‌కు షాక్ అంటూ విషం చిమ్మడం ప్రారంభించింది. సీబీఐ, ఈడీతో కలసి చంద్రబాబు.. వైఎస్ జగన్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. బాబు మెప్పుకోసం పచ్చ మీడియా రోజంతా శివాలెత్తిపోయింది. ఆర్డర్ లేదు.. కాపీ కూడా లేదు.. బుధవారం ఉదయమంతా స్క్రోలింగ్‌లతో హడావుడి సృష్టించి పచ్చ మీడియా పైత్యాన్ని వెళ్లగక్కింది. కోర్టులో జరిగే పరిణామాలకూ వక్రీకరణలా? న్యాయస్థానాల్లో జరిగే పరిణామాలను ఎల్లోమీడియా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఈడీ కేసుల విచారణ విషయంలోనూ ఇదే ధోరణి స్పష్టమవుతోంది. ఈ కేసుల్లో సత్వర విచారణ చేపట్టాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తిని, జగన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు చిత్రీకరించడం వెనుక రా>జకీయ దురుద్దేశం తేటతెల్లమవుతోంది. సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసులను రోజువారీగా విచారించాలన్న జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసి.. విచారణ ప్రారంభిస్తున్నామని తెలిపారు. జగన్ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేదు. అయినా, వ్యక్తిగత హాజరుపై ఆదేశాలిచ్చినట్లుగా ప్రచారం చేస్తూ కోర్టు పరిణామాలను వక్రీకరించడమే కాకుండా ప్రజలను కూడా ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంది. సత్వర విచారణ కోరితే షాకా? నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారు. నిజానికి కేసుల విచారణ త్వరగా పూర్తికావాలని కోరడం న్యాయపరమైన ప్రక్రియలో భాగం. దశాబ్దకాలంగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా తేల్చాలని జగన్ కోరుతున్న నేపథ్యంలో రోజువారీ విచారణకు న్యాయస్థానం అంగీకరించడం ఆయనకు అనుకూల న్యాయపరమైన పరిణామం. కానీ.. బాబు, భజన మీడియా మాత్రం జగన్‌కు షాక్ అంటూ ప్రచారం చేసింది. కోర్టు ఉత్తర్వుల్లో లేని అంశాలను జోడించి సంచలనాత్మక కథనాల పేర పచ్చ మీడియా బాబు బాకా ఊదుతోంది. ప్రజలను కలవడం కోసం జగన్ ప్రారంభించనున్న మహా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని కొన్నాళ్లుగా చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. దీని కోసం సీబీఐ, ఈడీ కేసులను వినియోగించుకోవాలని తెర వెనుక అక్రమ రాజకీయం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈడీతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఉన్నత న్యాయస్థానం.. ఈడీ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు తాము ఎప్పటికప్పుడు సీబీఐ, ఈడీ కేసులను పర్యవేక్షిస్తున్నామని తేల్చిచెప్పింది. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పచ్చ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా జగన్ చేస్తున్న విజ్ఞప్తిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. దీనికి కూడా పచ్చ మీడియా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఆయన విజ్ఞప్తిని ఎక్కడా ప్రస్తావన చేయకుండా సీబీఐ కోర్టు ఆదేశాలంటూ విషం చిమ్మింది. తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే.. నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? -
మళ్లీ తలొగ్గడమేనా?
సాక్షి, అమరావతి: ‘నలభై శాతం కావాలని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టాం. పోస్టర్లు వేసి ప్రకటించాం. మరి ఆ పట్టు ఎందుకు వదిలేశారు? ఎన్ని మేయర్ సీట్లు ఇస్తారో, ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని వార్డులు ఇస్తారో ఇంకా తేలనే లేదు. అలాంటప్పుడు సర్దుబాటు కుదిరిపోయిందని బయటకు వచ్చి ఎలా చెబుతారు? మన స్టాండ్‌పై మనం ఎందుకు గట్టిగా నిలబడటం లేదు?’ ఇదీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు తమ నాయకత్వాన్ని నిలదీస్తున్న తీరు. సీట్ల పంపకంపై చంద్రబాబుతో బుధవారం జరిగిన చర్చల తర్వాత జనసేన నేతలు చేసిన ప్రకటన చూసి ఆ పార్టీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. ఒక్కరోజు క్రితమే 2,091 పదవులు కావాలని పోస్టర్ విడుదల చేసిన పార్టీ, మరుసటి రోజే లెక్కలేమీ వేసుకోలేదనడం వారికి మింగుడుపడటం లేదు. ఇది దేనికి సంకేతం అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం కదా.. స్థానిక ఎన్నికల్లో మన బలానికి తగినట్టు సీట్లు కేటాయిస్తామన్నారు కదా.. ఇపుడు ఇలా జరుగుతున్నదేంటి? ఇంకెంత కాలం తగ్గి ఉండాలి? అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పోతుంది కదా.. ఇదే తగిన సమయం’’ అని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నిన్న పోస్టర్ విడుదల చేసిన మంత్రి.. నేడు సర్దుబాటు ప్రకటన మంగళవారం జనసేన మంత్రి కందుల దుర్గేష్ పార్టీ లోగోతో కూడిన పోస్టర్ ఒకటి ఎక్స్‌లో విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవుల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులు కేటాయించాలని జనసేన ప్రతిపాదించిందని ఎక్స్‌లో ప్రకటించారు. 6 మేయర్లు, 6 డిప్యూటీ మేయర్లు, 38 మున్సిపల్ చైర్మన్లు, 1,937 వార్డులు సహా ప్రతి పదవిలో వాటా అడిగినట్లు తెలిపారు. ఈ పోస్టర్‌ను జనసైనికులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈసారి తమ పార్టీ తగ్గదని సంబరపడ్డారు. కానీ బుధవారం సాయంత్రం చంద్రబాబుతో భేటీ ముగిశాక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు వారిని నిర్ఘాంతపరిచాయి. చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, స్థానిక పరిస్థితుల మేరకు ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటామని, ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదని ఆయన ప్రకటించారు. ఫ్రెండ్లీ పోటీలు ఉండవని, ప్రతి స్థానంలో కూటమి తరఫున ఒక్క అభ్యర్థే ఉంటారని తేల్చిచెప్పారు. పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల్లో కూటమిగా ప్రకటన చేస్తామని చెప్పారు. లెక్క తేలకుండా ఏకాభిప్రాయమా? ఎవరికి ఎన్ని సీట్లు అనేదే తేలకపోతే ఏకాభిప్రాయం దేనిపై కుదిరిందని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 40 శాతం అడిగి, ఇప్పుడు లెక్కలేమీ లేవంటే ఆ ప్రతిపాదనను వదిలేసినట్టేనా అని నిలదీస్తున్నారు. టీడీపీ మూడు మేయర్ సీట్లే ఇస్తామని తెగేసి చెబుతుంటే ఫ్రెండ్లీ పోటీ లేదని ముందే ప్రకటించేయడం వల్ల బేరమాడే బలం కూడా పోయిందని వారు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లతో సర్దుకున్నాం, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గామన్నారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికల్లో కూడా అదే జరిగితే పార్టీ ఎప్పటికి ఎదుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోడ్డెక్కింది తామేనని, కూటమి కోసం ఎక్కువ త్యాగం చేసింది జనసేనేనని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారని, ఆ త్యాగాలకు ఇదేనా ప్రతిఫలం అని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత ఒకరు వ్యాఖ్యానించారు. రెండు రోజులు.. సుదీర్ఘ చర్చలు.. అయినా తేలని పొత్తు సీట్ల సర్దుబాటుపై మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు చర్చలు సాగినా ఫలితం రాలేదు. బుధవారం ఉదయం జనసేన నేతలు మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఒక విడత సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజంతా సాగిన చర్చల్లోనూ ఏ పార్టీకి ఎన్ని మేయర్ సీట్లు, ఎన్ని మున్సిపాలిటీలు అనేది తేలలేదు. మరో భేటీలో ఖాయం చేసుకుంటామని ప్రకటించి సరిపెట్టారు. కార్యకర్తలను మభ్యపెట్టేందుకేనా...? ‘40 శాతం సీట్లలో పోటీ చేస్తామంటూ ట్వీట్ చేశారు కదా’ అని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని విలేకరులు అడిగితే, తాను అలాంటి ట్వీట్ చేయలేదని, ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.. కాసేపటికే మరలా అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. చర్చలు ఫలించాయని, ఎవరికి ఎక్కడ బలం ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందని మరో ట్వీట్ చేశారు.. దీనినిబట్టి చూస్తే జనసేన, టీడీపీ పొత్తుల మధ్య సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారం అంతా కేవలం కార్యకర్తలను మభ్య పెట్టేందుకేనని అర్థం అవుతోంది. జనసేన సీట్లు కోరడం, దానికి టీడీపీ అంగీకరించడం వంటివి కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలకే పరిమితమని, చంద్రబాబు ఇచ్చింది పవన్ కళ్యాణ్ తీసుకోవడం తప్ప, అంతకు మించి సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మాతో సమానంగా అడగడమేంటి?: టీడీపీలో అసంతృప్తి జనసేన కేడర్ ఇలా రగిలిపోతుంటే, టీడీపీలోనూ అసంతృప్తి చెలరేగుతోంది. రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న తమతో సమానంగా జనసేన పదవులు అడగడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బలం లేని చోట కూడా వాటా కోసం పేచీ పెట్టడం సరికాదని అంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి సగం పదవులు ఎగరేసుకుపోతే ఏళ్లుగా జెండా మోసిన తమ పరిస్థితి ఏంటని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు. జనసేనకు వెళ్తాయని ప్రచారం జరుగుతున్న విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, అనంతపురం వంటి చోట్ల టికెట్ ఆశించిన టీడీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. జనసేనకు చాలాచోట్ల మేయర్, ఛైర్మన్ పదవులకు తగిన అభ్యర్థులే లేరని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ మేయర్ సీటు కోసం జనసేన టీడీపీ నేత వంగవీటి రాధానే అరువు తెచ్చుకుంటోందని విమర్శిస్తున్నారు. ఒంటరి పోటీ బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.కూటమి ధర్మాన్ని విస్మరిస్తే ఒంటరిగా పోటీకూటమి ధర్మాన్ని పాటించకుంటే కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతామని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో రాజకీయ పక్షాలన్నీ కూటమి ధర్మాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. లేనిపక్షంలో రెండు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందని చెప్పారు. పొత్తు ధర్మాన్ని పాటించి సగం సీట్లకు పైగా ఇస్తామని గతంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారన్నారు. కచ్చితంగా పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించాలని అన్నారు.సోషల్ మీడియాలో యుద్ధం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. చర్చలు జరుగుతుండగానే 40 శాతం పోస్టర్ బహిర్గతం చేయడం ఏం పద్ధతంటూ టీడీపీ యాక్టివిస్టులు విరుచుకుపడుతుంటే, పొత్తు వల్లే గెలిచారంటే ఊరుకోబోమని జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏ ఊర్లో జనసైనికులు రోడ్డెక్కారో చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు బొలిశెట్టి ప్రకటనతో జనసైనికుల ఆగ్రహం సొంత నాయకత్వం వైపు కూడా మళ్లింది. 40 శాతం అడిగిన ఆ పార్టీకి చివరకు ఎంత దక్కుతుంది, సీట్లు ఆశించినా రాని వారు ఊరుకుంటారా, టీడీపీలో టికెట్ దక్కని ఆశావహులు ఏం చేస్తారనే ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపారు. -
ఇవాళ ఏపీలో పెద్ద డ్రామా నడిచింది!
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉదయం పెద్ద డ్రామా నడిచిందని.. జిల్లాల నుంచి పూర్తి సమాచారం రాకుండానే ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఎందుకు ప్రకటించిందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని.. మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ఎన్నికల విషయంలో కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతుందో చెప్పాలి’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘మంగళగిరిలో ఎస్టీలకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఆలస్యం చేయటం అన్యాయం కాదా?. చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత ఆత్రం ఎందుకు?. నెలా రెండు నెలలు ఆగితే వచ్చే నష్టమేంటి?. అక్టోబర్ 16న సవరించిన ఓటర్ల జాబితా వస్తుంటే పాత జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటి?. ఓటర్ల జాబితాలో 44 లక్షల మృతులు, డబుల్ ఓట్లు, వలస వెళ్లినవారి పేర్లు ఉన్నాయని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. మరో 11 లక్షల కొత్త ఓట్లు చేర్చాల్సి ఉండగా పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లడం వెనుక ఉద్దేశమేంటి?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘చనిపోయినవారి పేర్లతో ఓట్లు వేయించాలనుకుంటున్నారా?. డబుల్ ఓట్లను కొనసాగించాలనుకుంటున్నారా?. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది?. అక్టోబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చి పండుగ రోజుల్లో నామినేషన్లు వేయమనడం ఎంతవరకు సమంజసం?. హిందూ ధర్మం గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబుకు హిందువుల ప్రధాన పండుగలు కనిపించడం లేదా?. రూ.14 వేల కోట్ల నిధుల కోసమే ఎన్నికలంటున్న చంద్రబాబు, డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో కేంద్రంతో మాట్లాడి గడువు ఎందుకు పొందలేరు?. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?..ఒక వైపు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు నామినేషన్లకు తొందరపెట్టడం ఏం న్యాయం?. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండోవర్లు, రౌడీషీట్లు, పాత కేసులతో ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌పై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. ప్రజల సమస్యలపై లేని ఆత్రం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు వస్తోంది?. సవరించిన ఓటర్ల జాబితాతో, ప్రతిపక్షాలకు తగిన సమయం ఇచ్చి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల -
వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా విష ప్రచారం: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌పై విష ప్రచారమే చంద్రబాబు నిత్య కార్యక్రమంగా మారిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను తిట్టనిదే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు రోజు గడవడం లేదు.. ప్రజలు నమ్మని పాత ఆరోపణలనే మళ్లీ కొత్త కథలుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ జగన్‌పై మరోసారి రాజకీయ కుట్రలకు తెరలేపారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల పేరుతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారు. ఒక ఎఫ్ఐఆర్ను 11 కేసులుగా మార్చి వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏళ్ల తరబడి కేసులను సాగదీస్తూ వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు.‘‘కోర్టుల్లో విచారణకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు ప్రతిరోజూ హాజరవుతున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారమెందుకు?. రోజువారీ విచారణ జరుగుతుండగా ఈడీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరమేంటి?. వైఎస్ జగన్‌పై ఈడీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు కేసులపై ఎందుకు లేదు?’’ అంటూ మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్ కేసుల్లో అత్యుత్సాహం.. చంద్రబాబు కేసుల్లో మౌనం.. ఇదేనా ఈడీ నిష్పక్షపాతం?. సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు ఏమైంది?. స్కిల్ స్కామ్‌లో రూ.44 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం నిజం కాదా?. ఆస్తులు జప్తు చేసిన ఈడీ.. ఆ కేసులో తదుపరి చర్యలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. చంద్రబాబు అధికారంలోకి రాగానే స్కిల్ స్కామ్ కేసును మూసివేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీ సీఐడీ క్లోజర్ రిపోర్టు ఇస్తే ఈడీ దర్యాప్తు కూడా ఆగిపోతుందా?..స్కిల్ స్కామ్‌ను తొలుత వెలుగులోకి తెచ్చింది జీఎస్టీ అధికారులే. జీఎస్టీ అధికారులు గుర్తించిన అక్రమాలపై ఈడీ ఏం చర్యలు తీసుకుంది?. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ వ్యవహారంలో దర్యాప్తు ఏమైంది?. రూ.2 వేల కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై వచ్చిన ఆరోపణలకు సమాధానమెక్కడ?. ఆ అనుమానాస్పద లావాదేవీల్లో డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఈడీ తేల్చిందా?. వైఎస్ జగన్ కేసుల్లో వేగం.. చంద్రబాబు వ్యవహారాల్లో జాప్యం.. ఎందుకీ ద్వంద్వ వైఖరి?..కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. చట్టం అందరికీ సమానమే అయితే చంద్రబాబు కేసులపైనా అదే చురుకుదనం చూపాలి. వైఎస్ జగన్‌పై కేసుల పేరుతో ఎల్లో మీడియా విష ప్రచారానికి తెరలేపింది. కోర్టులో జరగని పరిణామాలను జరిగినట్లు చిత్రీకరిస్తూ బ్రేకింగ్ వార్తలు ఇస్తున్నారు. ఈడీ పిటిషన్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్‌పై కొత్త కథనాలు అల్లుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఎల్లో మీడియా ప్రధాన అజెండా..స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ జగన్ కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాలు. వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారంటే చంద్రబాబుకు రాజకీయ భయం పట్టుకుంటోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఆపకపోతే పరువు నష్టం దావాలు వేస్తాం...జర్నలిజం పేరుతో రాజకీయ కక్ష సాధింపు ప్రచారాలు చేయడం సరికాదు. దర్యాప్తు సంస్థలకు విశ్వసనీయత ముఖ్యం.. రాజకీయ ప్రయోజనాలకు వంతపాడటం కాదు. కేసులతో భయపెట్టాలని చూసినా జగన్ ప్రజల పక్షాన పోరాటం ఆపరు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా? -
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు
-
మీ మాటే వేదం.. జనసేన క్యాడర్ కు పవన్ షాక్
-
చిత్తూరు మేయర్ స్థానం కోసం... బాబుకు టీడీపీ మహిళా నేత హెచ్చరిక..
-
వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా పైత్యం ప్రదర్శిస్తోంది. అక్రమ కేసుల్లో వ్యక్తిగత హాజరుపై ఎలాంటి కొత్త ఆదేశాలు వెలువడకపోయినా.. సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. అసలేం జరిగిందంటే.. జగన్‌పై దాఖలైన అక్రమ కేసుల్లో ఇప్పటికే రోజూవారీ విచారణలు జరుగుతున్నాయి. అయితే మళ్లీ రోజూవారీ విచారణలు చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిన్న ఈ పిటిషన్కోర్టు ముందుకు రాలేదు. రోజూవారీ విచారణ జరుగుతున్నా.. హైకోర్టుకు ఈడీ వెళ్లిందని నిన్ననే జగన్ తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు గుర్తు చేశారు. ఈ కేసులను తామే త్వరగా తేల్చాలని కోరుకుంటున్నామని వైఎస్ జగన్ తరఫు లాయర్లు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రోజూవారీ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ తరుణంలో.. సీబీఐ కోర్టు ఈడీ తరఫు న్యాయవాదుల్ని పిలిచింది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. సీబీఐ సహా ఈడీ చార్జిషీట్లపై వింటామని తెలిపింది. అయితే సీబీఐ కోర్టులో జగన్‌కు షాక్.. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు అంటూ ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలతో పైత్యం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తరఫు లాయర్లు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈడీ కేంద్రంగా కొంత కాలంగా చంద్రబాబు కుట్రా రాజకీయాలకు తెర తీశారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నోటిఫికేషన్ ముందర ఏపీ సర్కార్‌కు సుప్రీం నోటీసులు -
చంద్రబాబు జాగింగ్, లోకేష్ వాకింగ్ 5 ఏళ్ళు మీరు ఏం చేసారో చెప్పమంటారా
-
చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. పోలీసు బలమే: కన్నబాబు ఫైర్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పుతో గెలిచే నమ్మకం లేకే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు బలాన్ని నమ్ముకుంటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు, వార్డుల విభజన నుంచి పోలీసుల వ్యవహారశైలి వరకు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. క్వాంటం కంప్యూటింగ్ గురించి మాట్లాడే చంద్రబాబు.. అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే యాప్‌ను కూడా సక్రమంగా పనిచేయించలేరా? అని కన్నబాబు ప్రశ్నించారు. అభ్యర్థులకు 24 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు అందేలా మాన్యువల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పాత కేసులను తిరగదోడి బైండోవర్ల పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఉదయం పోలీస్ స్టేషన్‌కు పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టడం రాజకీయ వేధింపులు కాదా? అని నిలదీశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యాపారాలను దెబ్బతీస్తామని అభ్యర్థులను బెదిరిస్తున్నారని విమర్శించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసు అధికారులపై న్యాయపోరాటం చేస్తామని కన్నబాబు హెచ్చరించారు. ఎన్నికల ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు తీసుకునేలా సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు నిరంతర వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించాలని డిమాండ్ చేశారు. బైండోవర్ల పేరుతో ప్రతిపక్ష కార్యకర్తలను వేధించడం తక్షణమే ఆపాలని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.రిజర్వేషన్లు, వార్డుల విభజనపై ప్రశ్నలుస్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను రాత్రికి రాత్రే మార్చడం వెనుక ఉన్న ప్రయోజనాలేమిటని కన్నబాబు ప్రశ్నించారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక వార్డులో 30వేల ఓట్లు, మరో వార్డులో కేవలం 5వేల ఓట్లు ఉండేలా విభజన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసమే వార్డులను విభజించారా? లేక అధికార పార్టీ గెలుపు కోసమా? అని నిలదీశారు. రిజర్వేషన్ల నుంచి వార్డుల విభజన వరకు వివరాలను వెల్లడించపోవడమేంటి? ఇదేనా పారదర్శక పాలన అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.దసరా పూజల్లో ప్రజలు నిమగ్నమై ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను హడావుడిగా ముగించాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఎన్నికల్లో గెలవడానికి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇప్పుడు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ఇన్ని ప్రయత్నాలు చేసి గెలిచినా అది నైతిక విజయమవుతుందా? అని ప్రశ్నించారు.ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధం..చంద్రబాబుకు ఉన్నది ప్రజాబలం కాదని, ప్రచార బలం, పోలీసు బలమేనని కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆయన బెదిరింపులకు భయపడే కార్యకర్తలు వైఎస్సార్సీపీలో లేరన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి వార్డులో, ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికలంటే వైఎస్సార్సీపీకి భయం లేదని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ డిమాండ్ అని కన్నబాబు పేర్కొన్నారు. పోలీసు బలంతో కాకుండా ప్రజాబలంతో గెలిచి చూపించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
బాబు నయా ప్లాన్ ... అయితే పొత్తులు కాకపోతే దొంగ ఓట్లు..
-
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
-
భవాని మాలలో ఉండి చెప్తున్నా.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన మార్గాని భరత్
-
చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గత కొద్ది రోజులలో లక్షల కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను ప్రకటించింది. వాటన్నిటిని అమలు చేసేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎల్లో మీడియాను ఫాలో అయ్యేవారికి సైతం ఆశ్చర్యం కలిగించేలా ఇందుకు సంబంధించిన కథనాలు కనిపిస్తాయి. ఏడు రోజుల్లో తొమ్మిది కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ మీడియా ఊదరగొట్టింది. సుమారు రెండున్నర లక్షల కోట్లు వ్యయం చేయబోతున్నట్లు ఇవి ప్రచారం చేశాయి. చంద్రబాబు ప్రచారాన్ని, స్పీచ్‌లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిట్టలదొరల మాటలుగా ఎద్దేవ చేశారు. రైతులకు చంద్రబాబు లక్ష మోసాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బహుశా పిట్టల దొరల మాటలు అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఒక బొమ్మ తుపాకి పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ గప్పాలు కొట్టడం అన్నమాట. వారు భుక్తి కోసం అలా చేస్తుంటారు. ఓట్ల కోసం చంద్రబాబు అలా పిట్టల దొరలా ప్రసంగాలు చేస్తుంటారని జగన్ విమర్శ. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గాని, లేదా ఇటీవలికాలంలో ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి, వారిని మభ్య పెట్టడం కోసం గాని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటీవలికాలంలో చంద్రబాబు దాదాపు ప్రతిరోజు హెలికాఫ్టర్‌లో ఏదో ఒక ఊరు వెళుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ఆయా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. ఉదాహరణకు పల్లెకు పట్టాభిషేకం, పేదలకు పట్టాభిషేకం, రాయలసీమకు లక్ష కోట్ల ఉద్యాన హబ్, అమరజీవి జలధార, 2029నాటికి పేదలందరికి ఇళ్లు.. ఇలాంటి ఆకర్షణీయమైన పేర్లతో వేల కోట్ల ప్రోగ్రాంలను ప్రకటించారు. ఇవన్ని కలిపితే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయి. ప్రభుత్వం ఇంత ఆర్ధిక వెసులుబాటుతో ఉందా అన్న సంశయం అందరికి వస్తుంటుంది. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నెలలో తొమ్మిదివేల కోట్ల అప్పునకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త, కొత్త నినాదాలు, డైలాగులతో ప్రజలను ఏమార్చే పనిలో చంద్రబాబు తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు. 2029 నాటికి పేదలందరికి ఇళ్లు అంటూ చంద్రబాబు బుర్రిపాలెం సభలో చెప్పారు. చిత్రమేమిటంటే పల్లెలలో పేదలకు మూడు సెంట్లు, పట్టణాలలో పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆ ఊసే ఎత్తరు. స్థలాల కోసం సుమారు నాలుగన్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. పైగా విజయవాడ,విశాఖలలో సుమారు అరవైవేల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినట్లు సభలు పెట్టేశారు. ఒక్క సెంటు స్థలం సేకరించకుండా, ఈ పట్టాభిషేకం ఏమిటా అని విస్తుపోతున్నారు. తీరా చూస్తే అవన్ని ఇప్పటికే పేదలు నివసిస్తున్న ఇళ్లకే ఇచ్చిన పట్టాలట. మరి వీరు కొత్తగా ఇచ్చిన పట్టాలేమిటి అని విపక్షం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆ సభలో ఏకంగా పేదలకు 52వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్లు చెప్పేసుకున్నారు. అదెలాగా అని అంతా బిత్తరపోవాల్సిందే. కాకపోతే ఎల్లో మీడియా పత్రికలలో పతాక శీర్షికలలో ఆ వార్త వచ్చింది కనుక ఆ రోజుకు అది ఉపయోగం అని పాలకులు సంతృప్తి పడుతుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీ కాని, ఎల్లో మీడియాకాని నానా యాగి చేశాయి. ఇదీ చదవండి: సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోంఇంటి స్థలం పొందిన ఆనందంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఒక వీడియో చేస్తే, టీడీపీ సోషల్ మీడియా నీచమైన ప్రచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. అమరావతిలో పేదలు ఏభైవేల మందికి ఇళ్ల స్థలాలను జగన్ ప్రభుత్వం ఇస్తే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.ఆ పేదల స్థలాలవల్ల అమరావతి పాడవుతుందని కూడా చంద్రబాబు అన్నారు. వీరికి పేదలపై ఉన్న శ్రద్ద ఇదన్నమాట అని వైఎస్సార్సీపీ వ్యాఖ్యానించింది. జగన్ టైమ్ లో 20 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా, తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవాటిలో అత్యధిక భాగం నిర్మాణదశలో ఉన్నాయి. ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంకాని, ఇళ్లు నిర్మించడం కాని చేసిన ఏకైక నేత జగన్ అని ఇండిపెండెంట్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయినా ఆ ఘనత జగన్ కు దక్కకూడదన్న అక్కసుతో ఆ ఇళ్లపై దుష్ప్రచారం చేస్తుంటారు. మరోవైపు వాటిలో పూర్తయిన వాటికి ప్రారంభోత్సవం చేస్తూ తామే చేశామని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు.చిత్రమేమిటంటే రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారంటే రాజకీయం కోసం అలా చేస్తున్నారులే అనుకోవచ్చు. కాని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం అసత్యాలు వల్లె వేశారు. పేదల సొంతింటి కలను జగన్ చెరిపేశారని ఆయన అన్నారట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. కేంద్రమే ఇరవై లక్షల ఇళ్లను నిర్మించడానికి జగన్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తే, అందులో దాదాపు సగం పూర్తిఅయి ఎదురుగా కనబడుతుంటే చౌహాన్ ఈ మాట అనడం ఏమిటి? అంటే టీడీపీ వారు ఇచ్చిన స్క్రిప్టు చదివి తన పరువు పోగొట్టుకున్నారన్నమాట. ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార పేరుతో 30వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారట. అయితే గత ప్రభుత్వం చేపట్టిన వివిధ స్కీములను రద్దు చేశారట. రెండేళ్లుగా ఈ పనులు ఎందుకు చేయలేదన్నది కొందరి ప్రశ్న. స్థానిక ఎన్నికలకోసం ఈ హడావుడి అన్నది అర్ధం అవుతూనే ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగమే.గత ప్రభుత్వం 27వేల కోట్లతో జల్ జీవన్ స్కీమును అమలు చేసింది. వాటిలో కొన్ని దాదాపు పూర్తి అయ్యాయి. ఇదేదో కొత్త పథకం అన్నట్లు పిక్చర్ ఇవ్వడానికి ప్రభుత్వం పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ విమర్శ. పట్టణాలలో మౌలిక వసతులకు 11 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. కాని వర్చువల్ గా చేసిన కార్యక్రమంలో మాత్రం ఏభైవేల కోట్ల పనులు చేస్తామని చెప్పారు. అయితే మున్సిపాల్టీలలో పనులను పిపిపి కింద ప్రైవేటుకు అప్పగించి రుసుములు వసూలు చేసే పద్దతిని తీసుకు వస్తున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మదనపల్లెలో ఒక భారీ సభ పెట్టి లక్ష కోట్ల ప్రపంచ ఉద్యాన కేంద్రం,ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటూ ఊదరగొట్టారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇస్తుందని చెప్పినా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆ సంగతి వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఈసీ ఇలాగేనా వ్యవహరించేది!మిగిలింది ప్రైవేటువారు వ్యయం చేస్తారట. ఇది నమ్మదగిందేనా? ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో ఉద్యానతోటలు ఉన్నాయి. కరువు కారణంగా పలు చోట్ల అవి ఎండుతున్నాయి. ఆ విషయం పై ఆలోచించకుండా కొత్తగా తొమ్మిది లక్షల ఎకరాల పండ్ల తోటలకు లక్ష కోట్లు పెడతామంటే నమ్మశక్యం అనిపిస్తుందా! పల్లెకు పట్టాభిషేకం అంటూ ఇంకో 11వేల కోట్ల పనులు ఆరంభిస్తున్నట్లు మరో సభలో హంగామా చేశారు. ఈ సభలోనే రోడ్డకు కూడా డాక్టర్ లను పెట్టామని, ఎక్కడ రోడ్డుపై గొయ్యి పడినా వెంటనే ఆ డాక్టర్ వెళ్లి పూడ్చుతారని చంద్రబాబు చిత్రమైన ప్రకటన చేశారు.అది విన్న పలువురు తమ గ్రామం వద్ద రోడ్ల దుస్థితిని వివరించి వెంటనే డాక్టర్ లను పంపాలని కోరుతుండడం విశేషం. ఒకసారి ఆర్ధిక పరిస్థితి గట్టెక్కించామని ఆయనే అంటారు. అదే మీటింగ్ లో ఆస్తులు తాకట్టు పెట్టి నిధులు సమీకరిస్తున్నామని చెబుతారు. అంటే అప్పులు చేయడం అన్నమాట. సూపర్ సిక్స్ అమలు చేసేశామని అంటారు. అదెక్కడ! ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు నెరవేర్చారా అని ఎవరైనా అడిగినా ఇచ్చేశామని అనుకో అని డబాయిస్తుంటారు. అందుకే జగన్ వ్యాఖ్యానించినట్లు చంద్రబాబువి పిట్టల దొర మాటలుగానే చూడాలా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నామినేషన్లు వేయకుండా కూటమి కుట్రలు
-
మున్సిపాలిటీల అంశం.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో సమీప గ్రామాలను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకపక్షంగా విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో విలీన ప్రక్రియపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే (అలోక్ రాథే)లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. గ్రామాల తీర్మానాలు, ఆమోదం తీసుకోకుండానే సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా.. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తుది తీర్పు వెలువడే వరకు విలీన ప్రక్రియ ఆ తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది.ఈ ప్రాంతాల్లో విలీనంపై అభ్యంతరాలుపొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజానగరం ప్రాంతాన్ని అప్‌గ్రేడ్ చేసే అంశం కూడా ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లలో ప్రస్తావనకు వచ్చింది. గ్రామాల విలీనానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియను పాటించారా? గ్రామాల అభిప్రాయాలు, తీర్మానాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారా? అన్న అంశాలు ఈ కేసులో కీలకం కానున్నాయి. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్‌మీట్ వాయిదా -
జనసేన.. తగ్గేదేలే 2091 సీట్లు ఇవ్వాల్సిందే
-
కూటమిలో సీట్ల చిచ్చు.. నో కాంప్రమైజ్
-
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా బైండోవర్లు... స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ అరాచకాలు
-
కార్పొరేట్లకు అలా.. ఎస్సీ, ఎస్టీలకు ఇలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దళిత పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు సర్కారు సవతి తల్లి ప్రేమను మరోసారి చూపించింది. ఇప్పటివరకు పారిశ్రామిక రాయితీలు పూర్తిగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేసింది. సకాలంలో నగదు చెల్లించలేదంటూ 1,600 మందికిపైగా దళిత పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వారిలో 1,200 మంది ప్లాట్లను రద్దు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దళిత పారిశ్రామిక సంఘాలు వాపోతున్నాయి.ఒకపక్క కార్పొరేట్ సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా అప్పగించినా సకాలంలో డబ్బులు కట్టకపోతే మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై వారికి గడువు పెంచుతున్నాయని, అదే ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు చెల్లించకుండా ప్లాట్లకు డబ్బులు కట్టలేదంటూ ఇలా నోటీసులు జారీచేసి రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11న నోటీసులు జారీచేసి అక్టోబర్ 10లోగా కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బడా పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే ఎకారాలకు ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈలకు మాత్రం మార్కెట్ రేటు కంటే మూడు రెట్లు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం కేటాయించిన భూములపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోతుంటే దళిత పారిశ్రామికవేత్తలు కష్టపడి బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ తెచ్చుకొని పరిశ్రమలు పెట్టే సమయానికి కుంటి సాకులు చెప్పి ఏపీఐఐసీ ఆ భూములు లాక్కోవడాన్ని వీరు తప్పు పడుతున్నారు. కార్పొరేట్లకు కంచాల్లో.. రూ.వేల కోట్ల విలువైన భూమలు తీసుకున్న ఆర్సలర్ మిట్టల్, బెంగళూరుకు చెందిన సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీలు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై వాటికి గడువు పెంచిన విషయాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేస్తున్నారు. రూ.లక్ష కోట్లతో రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి 2,080.76 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇందుకు చెల్లించాల్సిన రూ.1,069 కోట్లు తమ దగ్గర లేవని.. మూడు విడతల్లో చెల్లిస్తామని ఆర్సలర్ మిట్టల్ లేఖ రాయగానే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మరీ ఆమోదించిందంటున్నారు.అలాగే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కారుచౌకగా రూ.45 కోట్లకే చంద్రబాబు సర్కారు కేటాయిస్తే.. ఈ మొత్తం చెల్లించడానికి డబ్బులు లేవంటే ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించేందుకు 60 రోజులు గడువు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలే కాదు లులు, రేమాండ్, సిఫి ఇన్ఫినిటీ వంటి అనేక కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు చెల్లించడానికి గడువు ఇచ్చిందని.. దళితులు గడువు అడిగితే ఇవ్వకుండా కర్కశంగా రద్దు చేస్తూ నోటీసులు జారీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీల ప్లాట్లు తిరిగి ఇవ్వాలి బడాబాబులకు పావలాకి రూపాయికి వేల ఎకరాలు ఇస్తున్న ఏసీఐఐసీ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చిన్నచిన్న ఎంఎస్ఎంఈ ప్లాట్లు రద్దుచేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చిన్నచిన్న కారణాలతో గత నెలలో ఏపీఐఐసీ దాదాపు 1,200 ప్లాట్లు రద్దు చేసింది. వాటిని వెంటనే తిరిగి ఇవ్వాలి. పరిశ్రమలు పెట్టుకోవడానికి మరో మూడేళ్లు గడువు ఇవ్వాలి. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రోత్సాహకాల చెల్లింపులోనూ ఇంతే పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తల పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. వారంతా రాయితీల కోసం నెలల తరబడి ధర్నా చేస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని.. అదే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు చెందిన కంపెనీలకు ఏకంగా రూ.36.68 కోట్లు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా గ్రూపులకు రూ.15.60 కోట్లు, ఎంపీ బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌కు రూ.3.47 కోట్లు, అవంతి ఫీడ్స్‌కు రూ.2.53 కోట్లు, వల్లభనేని సుధాకర్చౌదరికి చెందిన మోహన్ స్పిన్‌టెక్స్‌కు రూ.60.50 కోట్ల ప్రోత్సాహకాలు ఎలా చెల్లించారని దళిత పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు. ఒకపక్క సబ్సిడీలు అందక, బ్యాంక్ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న దళిత పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించడానికి గడువు పెంచాలని లేకపోతే కనీసం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాట్ల రద్దు చర్యలను తక్షణమే ఆపాలి ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక ప్లాట్లు పొందిన సుమారు 1,600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను ప్రభుత్వం వేధించడం తగదు. కార్పొరేట్లకు ఎకరా రూపాయికే భూములిచ్చే ప్రభుత్వం, పేద ఎస్సీ, ఎస్టీలకు మాత్రం నోటీసులివ్వడం అన్యాయం. సెప్టెంబర్ 11న జీవో ఇచ్చి అక్టోబర్ 10 లోపు పూర్తి సొమ్ము చెల్లించమనడం లబ్ధిదారులపై భారం మోపడమే. సబ్సిడీలు అందక, బ్యాంక్ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం గడువు పొడిగించాలి. ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలి. – పినమాల నాగకుమార్, అధ్యక్షుడు, ఏపీ దళిత ఎంట్రప్రెన్యూర్స్ ఎంపవర్మెంట్ అసోసియషన్ -
జైళ్ల శాఖ నుంచి.. పౌరసరఫరాల పీఠంపైకి..!
సాక్షి, అమరావతి: జైళ్ల శాఖ నుంచి.. ఏకంగా పౌరసరఫరాల సంస్థ పీఠంపైకి! ఐఏఎస్‌గా పదోన్నతి.. వెంటనే కీలక పోస్టింగ్! ఇదీ చంద్రబాబు మార్కు పాలనలో అధికారుల నియామకాల తీరు అంటూ అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా జేసీ, కలెక్టర్ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులకు అప్పగించే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ బాధ్యతలను.. జైళ్ల శాఖలో పనిచేసిన ఎం.వరప్రసాద్‌కు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో వరప్రసాద్ ఆయన మన్ననలు పొందారనే ఆరోపణలు, ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్ పదోన్నతి, కీలక పోస్టింగ్ దక్కడంతో ఈ నియామకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు చినబాబు కనుసన్నల్లోనే ఐఏఎస్ పదోన్నతులు, పోస్టింగులు, పదవీ విరమణ చేసిన అధికారుల పునర్నియామకాలు సాగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ క్యాడర్ అధికారులను పక్కనపెట్టి, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న అసంతృప్తి అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అర్హతలు, అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాల్సిన చోట రాజకీయ ప్రాపకమే ప్రమాణంగా మారుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నాడు బాబుకు సపర్యలు.. నేడు కీలక పోస్టింగ్‌లు ఏపీక్యాడర్ ఐఏఎస్ పోస్టుల్లో 33 శాతం పదోన్నతుల ద్వారా వస్తారు. వాటిలో 85 శాతం రెవెన్యూ డిపార్టుమెంట్ నుంచి, 15 శాతం నాన్ రెవెన్యూ డిపార్టుమెంట్ నుంచి పదోన్నతి కల్పి స్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ అడుగులకు మడుగులొత్తే వారు ఏ డిపార్టుమెంట్లో ఉన్నా సరే, కన్ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో చేర్చి కేంద్రం వద్ద తమకున్న పలుకుబడితో వారికి ఐఏఎస్ క్యాడర్ వచ్చేలా చేస్తున్నారు. అయితే ఇక్కడ వరప్రసాద్ నియామకంలో కూడా ఇదే జరిగిందన్న వాదన విన్పిస్తోంది. యూపీపీఎస్సీ నిబంధనల ప్రకారం రాష్ట్ర పరిధిలో నాన్ రెవెన్యూ కేడర్‌లో గ్రూప్ వన్ సర్వీస్‌లో కనీసం 8 ఏళ్లకు తక్కువ కాకుండా పనిచేసిన వారికి ఐఏఎస్‌కు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. నాన్ రెవెన్యూ కోటాలో వాణిజ్యపన్నులు, మున్సిపల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వంటి ఇతర శాఖలకు చెందిన వారికి మాత్రమే కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. హోంశాఖ పరిధిలో ఉండే జైళ్ల శాఖ నుంచి ఇప్పటి వరకు కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఏ ఒక్కరికీ పదోన్నతి కల్పించిన దాఖలాలులేవు. జైళ్ల శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వరప్రసాద్‌కు చంద్రబాబు ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పదోన్నతి జాతీయ స్థాయిలో కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న వరప్రసాద్ అనుకూలంగా వ్యవహరించారని, అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆయన పేరు కన్ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో చేర్చారన్న వాదన విన్పిస్తోంది. ఇప్పటికే ఆ సమయంలో రాజమహేంద్రవరం జైలర్‌గా పనిచేసిన కోవెల దుర్గారమేష్ను ఏపీఎక్సైజ్ సర్వీస్ రూల్స్‌ను సడలించి మరీ ఎక్సైజ్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా నియమించిన విషయం తెలిసిందే.పునర్నియామకాలపై క్యాడర్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి మరోవైపు పదవీ విరమణ చేసిన అధికారులను పునర్నియామకాల పేరిట కీలకమైన పోస్టింగ్‌లు కట్టబెడుతూ పునరావాసం కల్పిస్తుండడం పట్ల అధికార వర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్)హోదాలో పనిచేసిన విజయానంద్‌ను పదవీ విరమణ తర్వాత పునర్నియామకం పేరిట ఎనర్జీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. 2017లో రిటైర్ అయిన రామశంకర్ నాయక్‌ను మత్స్యశాఖ కమిషనర్‌గా పునర్నియమించి రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణాకు చెందిన శరత్‌ను కూడా ఇదే రీతిలో రిటైర్ అయిన తర్వాత జేఈవోగా తిరిగి నియమించారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 75 మందికిపైగా రిటైరైన అధికారులు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. సీనియర్లను పక్కన పెట్టి రిటైరైన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ కారణంగానే గడిచిన రెండేళ్లుగా ఏపీ క్యాడర్ అధికారులకు కేంద్రంలో విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఏయ్.. ఎవరనుకున్నావ్!
యశవంతపుర/సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరు పబ్‌లో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పోలీసులపైనే దాడిచేసి రచ్చ చేశారు. ఈ ఉదంతం కన్నడనాట తీవ్ర సంచలనం కలిగించగా.. చిత్తూరు జిల్లాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ‘కుప్పం ఏరియా అభివృద్ధి అథారిటీ (కడా)’ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వికాస్ మర్మత్ ముగ్గురు స్నేహితులతో కలిసి శనివారం బెంగళూరు నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని ‘కావోర్ బార్ అండ్ రెస్టారెంట్– పబ్’కు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 1:30 గంటల సమయంలో బెంగళూరు సీసీబీ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా పబ్‌లోకి వెళ్లారు. సీసీబీ పోలీసులతో పాటు క్రైమ్ సీఐ అరుణ్ సాలుంకే కస్టమర్లను వివరాలు అడిగి వారి ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలిస్తుండగా.. వికాస్ మర్మత్, అతనితో ఉన్న అభయ్ ఉదయసింగ్, నితీశ్, రోషన్ అడ్డుపడ్డారు. ‘ఏయ్.. ఎవరనుకున్నావ్.. మమ్మల్ని తనిఖీ చేయడం ఏమిటి’ అంటూ గలాటాకు దిగారు. మర్మత్‌తో వెళ్లిన వారిలో ఒకరు ‘ఇతను ఐఏఎస్ అధికారి అని తెలియదా’ అంటూ ఏదో నంబర్‌కు ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్ను వికాస్ మర్మత్ ‘మాదర్..’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఇన్స్పెక్టర్పై చేయి సైతం చేసుకున్నారు. పోలీసులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి నెట్టేశారు. గాయపడ్డ ఇన్స్పెక్టర్ అరుణ్ సలుంకే ఆస్పత్రిలో చికిత్స పొంది.. 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్మత్.. ఆద్యంతం వివాదమే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబుకు నమ్మకస్తుడిగా పేరొందిన వికాస్ మర్మత్ కుప్పం ఏరియా అభివృద్ధి అథారిటీ (కడ) అధికారిగా నియమితులయ్యారు. కుప్పంలోని నాలుగు మండలాల్లో వికాస్ రాజ్యాంగేతర శక్తిగా మారారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు ఏది నచ్చితే ఆ పనులు మాత్రమే చేయడం, పీ–4 పథకంలో లబ్ధిదారులను దాదాపు టీడీపీకి చెందిన వాళ్లనే ఉంచడం వంటివి చేశారు. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లె, చింతరపాళ్యం, దాస్మాన్ పల్లె, అత్తినత్తం, బిసానత్తం ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయని రైతులను వారి భూముల నుంచి వెళ్లగొట్టేలా ప్రణాళికలు రచించి వాళ్ల భూములు లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. కుప్పంలో విమానాశ్రయం కోసం చక్రపాణిరెడ్డి అనే రైతుకు సంబంధించిన 80 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగా భూసేకరణ కింద బలవంతంగా తీసుకోవడంతో పాటు టీడీపీ నేతలకు మినహాయింపు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. చంద్రబాబు మెప్పు కోసం వికాస్ కుప్పంలో ఇష్టమొచ్చినట్టు పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. -
ముష్టి వేస్తున్నారా?
సాక్షి, అమరావతి: ‘‘ముష్టి వేస్తున్నారా...? ప్రతిసారీ ఇదే నరకమా..? మాకు రావలసిన న్యాయమైన వాటా కోసం ఇంత దేబిరించాలా? ’’ ఇదీ జనసేన నేతల అంతర్మథనం. ‘‘అడుగుతున్నవే కొన్ని.. వాటిలోనూ కోతలు.. బలం ఉన్న స్థానాలనే అడుగుతుంటే వాటిని కూడా మార్చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలుసుకుని తాము ఆశిస్తున్న స్థానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంత పీకులాట అవసరమా’’ అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిసారీ మోసపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగ్గించుకున్నామని, ఇపుడు కూడా తగ్గించుకోవాలంటే ఎలా అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుని అన్ని స్థానాల్లో రంగంలోకి దిగితే మేలని, అందుకు ఇదే సరైన సమయమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి కొన్ని స్థానాల్లో పట్టు సాధిస్తే వాటిపై పట్టుబట్టాల్సింది పోయి పార్టీ అధినాయకత్వం కూడా పట్టించుకోకపోతే ఎలా.. టీడీపీ చెప్పినదానికల్లా తలాడిస్తే ఎలా? ఇప్పటికైనా గట్టిగా స్పందించవద్దా? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కొలిక్కి రాని చర్చలు.. వాయిదా..మరోవైపు సీట్ల పంపకంపై మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. కూటమి పార్టీల మధ్య కసరత్తు కొలిక్కి రాలేదు. జనసేన అడుగుతున్న 6 మేయర్, 38 మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పల్లా శ్రీనివాసరావు మంగళవారం పొద్దుపోయేవరకు చర్చలు జరిపారు. అలాగే రిజర్వేషన్లు ప్రకటించడంతో.. జనసేన తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని అనుకుంటున్న స్థానాల్లో పరిస్థితి తలకిందులయ్యేలా మారింది. ఇది మరింత గందరగోళానికి కారణమయ్యింది. చర్చలు జరుగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేసేసి తమ ఆశలకు గండి కొట్టారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. అలిగినట్టు.. రాయబారం జరిగినట్టు..మంగళవారంనాటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలిగినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జనసేన కార్యాలయానికి వచ్చారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేనితో మాట్లాడుకోవాలని సూచించి పవన్ చర్చలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికైనా అధినాయకత్వం స్పందించాలి..బలం ఉన్న చోటేగా అడుగుతున్నాం.. పార్టీకోసం కష్టపడిన నాయకులను ఇలా గాలికి వదిలేస్తారా అని జనసేన నాయకులు మధనపడుతున్నారు. అడుగుతున్నవే కొన్ని కదా.. వాటినీ ఇవ్వకపోతే ఎలా.. పార్టీ అధినాయకత్వం దీనిపై గట్టిగా నిలబడాలి.. ఇప్పటికైనా గట్టిగా స్పందించాలి అని నాయకులు, శ్రేణులు కోరుతున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉండడమేమిటి అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇదంతా పార్టీ అధినాయకత్వానికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా శ్రేణుల్లో రేకెత్తుతున్నాయి.అడిగిన చోటే వేటుమేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం జనసేన, బీజేపీ ముందుగానే జాబితాలు అందించాయి. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయించేశారు. దీంతో జనసేన, బీజేపీ ముందుగా అనుకున్న స్థానాలన్నీ రిజర్వేషన్లతో తారుమారైనట్లు తెలుస్తోంది. తాము కోరిన స్థానాలను రిజర్వు చేయడం సరికాదని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీట్లు ఇవ్వలేమని చెప్పకుండా, రిజర్వేషన్ల ముసుగులో తమ నాయకులను పోటీ నుంచి తప్పించారని మండిపడుతున్నాయి. సీటు ఇచ్చినట్టే ఇచ్చి, అక్కడ నిలబెట్టేందుకు అభ్యర్థే లేకుండా చేయడం నమ్మకద్రోహం కాక మరేమిటని నిలదీస్తున్నాయి.పిఠాపురం ఎస్సీ రిజర్వుడు..పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ పరిధిలోని పిఠాపురం మున్సిపాలిటీని ఎస్సీ రిజర్వుడుగా ఖరారు చేయించారు. ఇదంతా పవన్‌కు తెలియకుండా జరిగిందా అని పార్టీ నాయకులు, శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి సొంత ఇలాకా విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ జనసేన నేతల పరిస్థితి ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు. జనసేన కోరుతున్న పలు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాల విషయంలో ఇలాగే ఏకపక్షంగా రిజర్వేషన్లు మార్చినట్లు సమాచారం. జనసేన ఆశిస్తున్న కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లో వారిని సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజమండ్రిలో బీజేపీకి షాక్బీజేపీ విషయంలోనూ అదే తంతు. రాజమండ్రి మేయర్ స్థానంపై బీజేపీ ఆశలు పెట్టుకోగా ఆ స్థానాన్ని కూడా ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో అక్కడ పోటీకి సిద్ధమైన బీజేపీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. తమను సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.చేసిందంతా చేసి.. నీతులుఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లు మార్చాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాధవ్ చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆయన మాత్రం అందుకు అంగీకరించకుండా చట్టబద్ధమైన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదని సెలవిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చేసేదిలేక కొత్త స్థానాలు, కొత్త అభ్యర్థులను వెతుక్కునేందుకు కాస్త గడువు ఇవ్వాలంటూ జనసేన, బీజేపీలు అడుగుతున్నాయి.విజయవాడపైనా మెలికజనసేనకు విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ ఇస్తామని ప్రాథమికంగా ఆశ చూపిన టీడీపీ, ఇప్పుడు అందులోనూ మెలిక పెడుతున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి కృష్ణాలో రెండు కీలక కార్పొరేషన్లు జనసేనకు ఎలా ఇస్తామంటూ టీడీపీ నేతలు అడ్డం తిరుగుతున్నారు. విజయవాడ మేయర్ స్థానం అన్రిజర్వ్డ్ కావడం, జనసేన తరఫున వంగవీటి రాధా సతీమణి పోటీ చేస్తారన్న ప్రచారంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. కాగా, బీజేపీ తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లు కావాలని కోరగా రెండింటికీ నో చెప్పినట్లు సమాచారం. వేరే ఏదైనా కార్పొరేషన్ చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. -
బరితెగించి బైండోవర్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు సర్కారు అధికారం అండతో అరాచకాలకు పదును పెట్టింది. సర్వత్రా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహంతో రెడ్‌బుక్ బరితెగింపు చర్యలకు తెగబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆశావహులను పోటీ నుంచి తప్పించేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని బైండోవర్ వేధింపులకు దిగింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే బైండోవర్ కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీని నిలువరించేందుకు పోలీసులను పురిగొల్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆశావహులకు బైండోవర్ పేరుతో పోలీసుల బెదిరింపులు మొదలయ్యాయి. గుంటూరు, పల్నాడు..చిత్తూరు, అనంతపురం, కృష్ణా తదితర జిల్లాల్లో బైండోవర్ల పేరుతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను సైతం టార్గెట్ చేసి బైండోవర్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పాలక పక్షానికి ఎదురు నిలవకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయకుండా కక్షపూరితంగా పోలీసులను ప్రయోగించటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి వెళితే.. పోలీసులకు ఫోన్ కాల్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారిని సైతం పోలీసులు వదలడంలేదు. మున్సిపాలిటీలు, రెవెన్యూ కార్యాలయాలకు అధికారపక్ష నేతలు ఇచ్చిన డైరెక్షన్‌తో వారు పోలీసులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు ఎవరైనా ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి, కుల ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే చాలు.. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతోంది. దీంతో ఆశావహులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ బైండోవర్ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పోలీసులు మరింతగా బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్న వారికి సీఐలు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మీరు పోటీ చేస్తే ఎన్నికల్లో గొడవలు జరిగితే మీదే బాధ్యత అంటూ హెచ్చరిస్తున్నారు. గొడవలకు మీపై కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. నామినేషన్ కూడా వేయకముందే బైండోవర్, ఆ తర్వాత ఏదైనా జరిగితే కేసులు పెడతామని పోలీసుల ద్వారా బెదిరిస్తూ చంద్రబాబు సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. సోషల్ మీడియానూ వదలని పోలీస్ జులుం.. స్థానిక ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసులు మరింత జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. పోలీసులు పల్నాడు జిల్లాలోని ఒక్క గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే వీడియోలు పెట్టారనే సాకుతో ఏకంగా 600 మందికిపైగా బైండోవర్ చేయడం గమనార్హం. గురజాల మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ‘సెల్ఫీ చాలెంజ్’ విసిరారు. కనీసం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సెల్ఫీ చాలెంజ్ విసిరి సామాన్య ప్రజల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియోలు పోస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్‌కు రప్పించి బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, బాగా పనిచేస్తోందని కొందరిని భయపెట్టి కౌంటర్ వీడియోలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి వాళ్ల సురేష్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. వైఎస్సార్సీపీ తిరుపూరు నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ జాకీర్‌తోపాటు పలువురు నేతలపై బైండోవర్ పేరుతో కక్ష సాధింపులకు దిగారు. గ్రామాల్లోనూ బైండోవర్లు.. పట్టణాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దశలో గ్రామాల్లో సైతం పోలీసులు బైండోవర్ల ప్రక్రియకు తెర తీయడం గమనార్హం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇదే దారుణ పరిస్థితి నెలకొంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 15 నుంచి 20 మంది వరకు బైండోవర్లు చేసినట్టు సమాచారం. మాచర్ల, గురజాల, నరసరావుపేటలో ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా రూరల్ మండలంలో తుమ్మింద, గువ్వకల్లు, మురకంబట్టు, నాయని చెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీకి చెందిన వారిని పథకం ప్రకారం పోలీసులు బైండోవర్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం బైండోవర్ కుట్రలకు పదును పెట్టింది. పోలీసులు చేయాల్సింది ఇదీ..! ఎన్నికలు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ/బీఎన్ఎస్ఎస్) ప్రకారం అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడతారు. పాత నేరస్తులను, షీట్స్ ఉన్న వారిని, గొడవలకు సంబంధించిన ఎక్కువ కేసుల్లో నిందితులను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బైండోవర్ చేస్తారు. ఎటువంటి గొడవలకు పాల్పడబోమని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సొంత హామీ (పూచీకత్తు)తో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారు. పోలీసులు చేస్తోంది ఇదీ..! బైండోవర్ ముసుగులో వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి వైఎస్సార్సీపీ ఆశావహులను కేసుల పేరుతో బెదిరించి పోటీ నుంచి తప్పించేందుకు చంద్రబాబు సర్కారు పథకం వేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కీలక కార్యకర్తల నుంచి మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు పోలీసులు వరుసగా బైండోవర్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎలాంటి రాజకీయ నిరసనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తున్నారు. బాండ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా విపక్షాన్ని టార్గెట్ చేసి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం బైండోవర్, కేసుల పేరుతో పోలీసులను ప్రయోగించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. బాబుకు ఓటమి భయం.. చతుర్ముఖ కుతంత్రం!స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండటంతో పోలీసులను పావులుగా వాడుకునేందుకు చంద్రబాబు చతుర్ముఖ కుతంత్రం పన్నారు. యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం.. బైండోవర్ పేరుతో వేధింపులకు పాల్పడటం.. శాంతి భద్రతల పేరుతో స్థానికంగా లేకుండా చేయడం... మలిదశ పోలింగ్ జరిగేలా చేసి అనుకూల పోలీసులు, అధికారులతో లబ్ది పొందే ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై రెండున్నరేళ్లుగా అనేక అక్రమ కేసులను చంద్రబాబు సర్కారు బనాయించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీటిని తెరపైకి తెచ్చి బైండోవర్ పేరుతో బెదిరిస్తోంది. కీలకమైన నామినేషన్ల దశలో విపక్ష నాయకులు, కార్యకర్తలు స్థానికంగా లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. పోటీ చేయబోతున్న అభ్యర్థులపై అక్రమ కేసులు మోపి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. కొన్నిచోట్ల మలి దశ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కల్పించి పోలీసులను మోహరించి బూత్‌లను క్యాప్చర్ చేసి ఏకపక్ష ఎన్నికలకు కుటిల వ్యూహం పన్నింది. చట్టానికి లోబడి పనిచేసే అధికారులను గుర్తించి స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఫిర్యాదులు చేయించడం, తమకు అనుకూలమైన వారిని అక్కడకు రప్పించుకోవడం లాంటి అనైతిక చర్యలకు అధికార పక్షం ప్రణాళిక రచించింది. -
బరిలో బలమైన అభ్యర్థులు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో... రెండున్నరేళ్లగా కొనసాగుతున్న దుర్మార్గ పాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ మరోమారు పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక, సమర్థంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. సంబంధిత రీజినల్ కో–ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది. బాబు అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలిరాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారుల ద్వారా అక్రమాలు చేయిస్తున్నారన్నారు. విశాఖలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై రీజినల్ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీమ్‌ను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలపై బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. -
ఏపీలో హిట్లర్ పాలన నడుస్తోంది
-
నన్ను లోపల వేసినోడిని లోపల వేసిన వాడు నా వెనుక ఉన్నాడు... వంశీ మాస్ వార్నింగ్
-
న్యాయమూర్తికి బాబు బహుమానం వెనుక మతలబిదే? పొనకా సంచలన వ్యాఖ్యలు
-
ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్ జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ దుస్థితిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఓ కుటుంబం.. ఆయన దృష్టికి తీసుకొచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌ను ముసునూరు మండలం వేల్పుచర్లకు చెందిన మహిళ జంగం మాధవి కలిశారు. తన18 నెలల పాప వినికిడి లోపంతో బాధపడుతుందని వైఎఎస్ జగన్ దృష్టికి తల్లి మాధవి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తించదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లి ఆవేదనకు వైఎస్ జగన్ చలించిపోయారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసిన సంగతి తెలిసిందూ. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: దుబారా బాబు.. డిజిటల్ డాబు -
నాడు ‘హూ ఈజ్ మోడీ?’.. నేడు ప్రశంసల వ్యాసం!
బహుశా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఇలా ఒకరిని పొగుడుతూ వ్యాసం రాయవలసి వస్తుందని ఊహించుకుని ఉండరు. కాని కాలమాన పరిస్థితులు ఎలా మారతాయో చెప్పడానికి ఇది ఉదాహరణే అవుతుంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఆయన రాసిన ఒక వ్యాసం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూలో ప్రచురితమైంది. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోడీ ఇరవైఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వ్యాసాన్ని ఆయన రాశారు. ఒకప్పుడు ఎంత గొప్పగా మోడీని విమర్శించారో, లేదా దూషించారో ఇప్పుడు అంతకన్నా గొప్పగా పొగడడమే ఇందులో ఉన్న గొప్పతనం అని చెప్పాలి. చంద్రబాబు ఇంతగా తగ్గి వ్యాసాలు రాయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న దానిపై రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో వచ్చాయి. చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పినట్లు మోడీకన్నా సీనియర్ అన్నది వాస్తవం!అదే విషయాన్ని పరోక్షంగా ఈ వ్యాసంలో ప్రస్తావించారు.తన నలభై ఎనిమిది సంవత్సరాల ప్రజా జీవితంలోపలు రాజకీయ పార్టీల ఉత్ధానపతనాలు చూశానని, గొప్ప ఆశలు కల్పిస్తూ ప్రజల ముందుకు వచ్చిన నేతలు కనుమరుగు అవడం చూశానని, ప్రభుత్వాల మార్పు, ఆర్ధిక వ్యవస్థలో మార్పులు, అందరి జీవితాలను ప్రభావితం చేసిన టెక్నాలజీ వంటివి చూశానని, ఇవన్ని తెలిపిన పాఠం ఏమిటంటే, అన్నిటికి మించి నాయకత్వం ప్రధానమని స్పష్టత వచ్చిందని చంద్రబాబు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం, పెట్టుబడి ,ఐడియాలు బాగానే అందుబాటులోకి వచ్చాయని, కాని ప్రధానమైన తేడా ఏమిటంటే జాతికి ఒక విజన్, సమగ్రత, విశ్వసనీయత ,అనుకున్నట్లుగా అమలు చేయగలిగే సమర్ధతతో నాయకత్వం వహించడం కీలకం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ రకమైన నాయకత్వానికి దేశానికి మోడీ అందించారని అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచం అంతా యుద్దాలు, తదితర సంక్షోభాలలో ఉన్నప్పుడు భారత్ స్థిరంగా నిలిచి అభివృద్ది పధంలో సాగుతోందని ఆయన మెచ్చుకున్నారు.దేశంలో రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ది, రైల్వే విద్యుద్దీకరణ తదితర రంగాలలో దేశం ప్రగతి సాధించిందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని చంద్రబాబు అన్నారు. మామూలుగా అయితే ఈ వ్యాసాన్ని ఆక్షేపించనక్కర్లేదు. పాతికేళ్ల ప్రస్తానం సందర్భం కనుక రాయవచ్చు.కాని చంద్రబాబు ఎప్పుడూ లేనట్లు ,మరీ ఇంత శ్రద్ద తీసుకుని ఈ వ్యాసం రాశారంటే ఇందులో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్న. వైఎస్సార్సీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మోడీని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. కాని చంద్రబాబు మాత్రం ఏకంగా వ్యాసం రాయడం, మంత్రివర్గ సమావేశంలో మోడీని కీర్తిస్తూ తీర్మానం చేయడం, తదుపరి ఢిల్లీ వెళ్లి ఆయనను కలిసి మీ ప్రస్థానం స్పూర్తిదాయకం అని ప్రశంసిచడం చేశారు. చంద్రబాబుకు ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది కొంతమంది విశ్లేషకుల ప్రశ్న. నిజంగా మోడీ అంత గొప్పవారని నమ్మి ఇలా పొగుడుతున్నారా?లేక తన రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారా అన్నది వారి సందేహం. దీనికి చంద్రబాబే జవాబు చెప్పాలి. ఎందుకంటే మోడీ రాజకీయ జీవితం ఆరంభం అయిన తర్వాత తొలి సంక్షోభం ఎదుర్కున్నప్పుడు చంద్రబాబు వైఖరిని ఆయన ఎప్పటికి మర్చిపోకపోవచ్చు. గుజరాత్లో మత కలహాలు జరిగిన నేపధ్యంలో మోడీని సీఎం పదవిలో కొనసాగించాలా?లేదా?అన్న చర్చ బీజేపీలో వచ్చింది. ఆనాటి ప్రధాని వాజ్ పేయి రాజధర్మ ముఖ్యమంటూ మోడీని పదవి నుంచి తప్పించాలని అనుకున్నారు. ఆ సమాచారం అందుకున్న చంద్రబాబు వెంటనే మోడీ రాజీనామాకు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రానివ్వబోమని కూడా హెచ్చరించారు.టీడీపీకి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ ఆయన ఈ డిమాండ్ చేయడం దేశంలో కలకలం అయింది. కాని బీజేపీలో ఉప ప్రధాని ఎల్.కె.అద్వాని మాట చెల్లి, మోడీ పదవిలో కొనసాగించడానికి బీజేపీ కార్యవర్గం అంగీకరించింది.దాంతో తన పరువుకు భంగం వాటిల్లిందని భావించిన చంద్రబాబు లోక్ సభలో విపక్షం పెట్టిన తీర్మానంపై వ్యతిరేకంగా ఓటు వేస్తారని అనుకున్నారు. కాని బీజేపీ రాయబారంతో అలా చేయకుండా జారుకున్నారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత బీజేపీని జీవితంలో సమర్ధించబోనని ఆయన ప్రకటించారు. కాని 2014 నాటికి దేశంలో ట్రెండ్ మోడీకి అనుకూలంగా ఉందని భావించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ను ఓడించలేమని గమనించి చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించారు. మెల్లగా మోడీకి దగ్గరవడానికి పలు వ్యూహాలు అనుసరించారు. ఎలాగైతేనేం..సఫలం అయ్యారు.ఆ తర్వాత కొంతకాలం సాఫిగానే సాగించారు.2018 నాటికి మళ్లీ నాటికి బీజేపీ గెలవదేమోనన్న అనుమానం వచ్చింది.దాంతో ఆయన బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లారు.అలా వెళితే వెళ్లవచ్చు. కాని ఈ టైమ్ లోనే చంద్రబాబు తీవ్రమైన భాష వాడి మోడీని విమర్శించేవారు.వాటిలో కొన్ని దూషణలుగా అనిపించేవి. చివరికి ఉగ్రవాదులతో కూడా పోల్చడానికి వెనుకాడలేదు. అవినీతి ఆరోపణలు చేశారు.వ్యక్తిగత జీవితంపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో హూ ఈజ్ మోడీ అని ప్రశ్నించారు.మోడీ సైతం చంద్రబాబును అవినీతి పరుడని ధ్వజమెత్తేవారు.2019లో బీజేపీ మళ్లీ కేంద్రంలో అదికారంలోకి రావడం, టీడీపీ ఏపీలో ఓడిపోవడంతో చంద్రబాబు తెలివిగా రూట్ మార్చేశారు. కేంద్రంలోని బీజేపీవారితో ఎలా సంబంధాలు పెట్టుకున్నారో కాని తన పిఎస్ పై ఆదాయపన్ను శాఖ దాడులు జరిపి పలు అభియోగాలు చేసినా, ఆ కేసు తనవరకు రాకుండా చేసుకున్నారు. 2024 నాటికి మళ్లీ మోడీ, అమిత్ షా లను ప్రసన్నం చేసుకుని తిరిగి బీజేపీతో జతకలిశారు. కాని అప్పటి నుంచి గతంలో మాదిరి స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఏది చెప్పినా తన జీవితంలో..అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. మోడీని విమర్శించాలనుకున్నా,తన జీవితంలో ఇంత అధ్వాన్నపు నేతను చూడలేదని అంటారు. పొగడాలనుకున్నా ఇంత గొప్ప నాయకత్వం చూడలేదని అంటారు. అన్నీ గుజరాత్ కే తీసుకువెళుతున్నారని,ఏపీకి ఏ సాయం చేయడం లేదని, అమరావతికి మట్టి ,నీళ్లు ఇచ్చారని అనగలరు. ఇప్పుడేమో రాష్ట్రాలతో కోఆపరేటివ్ పెడరలిజం అనుసరిస్తున్నారని ప్రశంసించగలరు. మోడీ నేతృత్వంలో దేశం నాశనం అయిందని చెప్పగలరు. ఇప్పుడు దేశం అభివృద్ది పధంలో పరుగులు తీస్తోందని చెప్పగలరు. మోడీ కన్నా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గొప్పవాడని, మోడీ కన్నా టీడీపీ సామాన్య కార్యకర్త కూడా గొప్పవాడని అనగలరు. ఇప్పుడేమో ఈ పాతికేళ్ల మోడీ ప్రస్థానంలో దేశానికి గొప్ప నాయకత్వం అందిందని, ఇది దేశ గతినే మార్చుతోందని అనగలరు. దేనికైనా చంద్రబాబు సమర్ధులే. బహుశా ఎప్పటికేది ప్రస్తుతమో దానిని పట్టుకోవడమే చంద్రబాబు విజయ రహస్యమేమో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎంత అప్రతిష్ట వచ్చినా ఆయన పట్టించుకోకపోవడం నేర్పరితనం అని చెప్పాలి. తనకు రాజకీయ ప్రయోజనం కలిగిందా?లేదా?అన్నదే ముఖ్యమని ఆయన భావిస్తారని పలు అనుభవాలు చెబుతున్నాయి. కొంతకాలం క్రితం మోడీ జన్మదినం నాడు వారణాసి వెళ్లి పూజలు చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. ఒకప్పుడు టీడీపీ ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీగా ప్రచారం చేసుకుంది. తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని చంద్రబాబు చెప్పుకునేవారు. ఆ ఆత్మగౌరవం,ఆ ఆత్మ విశ్వాసం ఏమైందో కాని ప్రస్తుతం, వాటిని పక్కనబెట్టి బీజేపీ అధిష్టానాన్ని మెప్పించడానికి నానాపాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో రాజకీయ కారణాలు ఉండవచ్చు. బీజేపీ తనను నమ్మడం లేదన్న అనుమానం ఉండవచ్చు. వైఎస్ జగన్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు గట్టిగా యత్నిస్తున్నారు.దానికి సహకరించాలని ఆయన కోరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అలాగే లోకేష్ నాయకత్వాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈ పరిస్థితిని వాడుకుంటుండవచ్చు. మోడీ కన్నా చంద్రబాబు రాజకీయంగా సుమారు 23 ఏళ్ల సీనియర్ . లోపల ఆ పాయింట్ తొలుస్తున్నా,పైకి మాత్రం మోడీ గురించి ఇంత ఘనంగా వ్యాసం రాయవలసి అవసరం ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరో న్యాయమూర్తికి బాబు బహుమానం!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేసులకు సంబంధించి అనుకూల తీర్పునిచ్చిన అప్పటి న్యాయమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక పదవి కట్టబెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆయన ఎంపిక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత జస్టిస్ సత్యనారాయణమూర్తి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. హెచ్ఆర్సీ చైర్మన్ పోస్టు భర్తీ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపిక కమిటీ సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపికపై చర్చించారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తిని చైర్మన్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన వారికి వారి పదవీ విరమణ అనంతరం చంద్రబాబు కీలక పదవులు కట్టబెడుతున్నారు. చేసిన సాయం ఎంత పెద్దది అన్న దాన్ని బట్టి అంత మంచి పోస్టు ఇస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించిన విషయం తెలిసిందే.బాబుకు అనుకూలం.. జగన్‌కు వ్యతిరేకం...!జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 2016 నుంచి 2022 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా అనేకంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తెర వెనుక మంత్రాంగాలు నడిపేవారని హైకోర్టులో అందరూ చెప్పుకునేవారు. మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతతో జస్టిస్ మూర్తికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెబుతుంటారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది.బెంచ్‌పై నుంచి తన అభిప్రాయాలను పెద్దగా వ్యక్తం చేయరు. పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు. కానీ ఆయన ఇచ్చే తీర్పులు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ ఆ తీర్పుల్లో ఉంటుంది. 2022లో ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా పలు కేసుల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు, చంద్రబాబుకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో దాఖలైన వ్యాజ్యాల్లో పలు వ్యాజ్యాలను ఆయన డ్రాఫ్ట్ చేసి ఇచ్చేవారని హైకోర్టులో టీడీపీ న్యాయవాదులు బహిరంగంగా చెప్పుకునేవారు.రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న జస్టిస్ మూర్తి...మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరుపుతుండగానే, అప్పటి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటూ కొత్త చట్టం తెచ్చింది. వాస్తవానికి ఏ చట్టాలను సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారో, ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి. అయితే త్రిసభ్య ధర్మాసనం మాత్రం ఆ పని చేయలేదు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. విచారణ సమయంలో ధర్మాసనం.. చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేమని తెలిపింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న దాని జోలికి వెళ్లబోమని చెప్పింది. అయితే తుది తీర్పు విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ తీర్పునిచ్చింది. రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ధర్మాసనం తన తీర్పులో ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమైంది. నిజానికి ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనాలు తీర్పులు వెలువరించినప్పుడు ఆ తీర్పులు ఏ న్యాయమూర్తి రాశారో ఆ న్యాయమూర్తి పేరును తప్పకుండా రాస్తారు. కాని రాజధాని తీర్పును ముగ్గురు న్యాయమూర్తుల్లో ఎవరు రాశారన్నది అధికారికంగా తెలియదు. అయితే ఆ తీర్పును జస్టిస్ సత్యనారాయణమూర్తే రాశారని అప్పట్లో హైకోర్టులో అందరూ చెప్పుకున్నారు.ఎవరెంత మేలు చేశారన్నదే ప్రామాణికం.. ఆ మేరకే జస్టిస్ మూర్తికి పోస్టు...రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి 2024 మార్చి 24 నుంచి ఖాళీగా ఉంది. ఈ పోస్టును భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్లుగా చర్యలు తీసుకోలేదు. తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు హెచ్ఆర్సీ చైర్మన్ పోస్టు భర్తీని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పోస్టును తనకు సహాయం చేసిన పలువురు విశ్రాంత న్యాయమూర్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తీవ్రమైన పోటీ ఉండటం, ఆ విశ్రాంత న్యాయమూర్తులందరూ తనకు ఏదో ఒక రకంగా సాయం చేసి ఉండటంతో ఎవరికి పదవి కట్టబెట్టాలో బాబు తేల్చుకోలేకపోయారు. దీంతో సుదీర్ఘ కాలంగా ఆ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ పోస్టుల భర్తీ గురించి ఎప్పుడు ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. చివరకు రాజధాని కేసుల్లో కావాల్సిన విధంగా తీర్పునిచ్చిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్ఆర్సీ పోస్టును కట్టబెట్టాలని చంద్రబాబు కొంత కాలం క్రితం నిర్ణయించారు. అయితే ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు న్యాయమూర్తులు కూడా ఈ పోస్టును ఆశించారు. వారందరికీ సర్ధి చెప్పుకునే క్రమంలో పోస్టు భర్తీ కొంత ఆలస్యమైంది. చివరకు చంద్రబాబు తనకు మేలు చేసిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్ఆర్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. -
పీఠాలపై పేచీ!
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. సీట్ల లెక్కలు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సోమవారం సమావేశమైనా ఎలాంటి స్పష్టత రాలేదు. కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ డుమ్మా కొట్టడం గమనార్హం. పొత్తు చర్చలు తాము ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడమే పవన్ గైర్హాజరుకు కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.మేయర్, చైర్మన్ పీఠాలపై పేచీమునిసిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కోరుతున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఆ పార్టీ కోరుతున్న స్థానాలకు టీడీపీ ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పొత్తు చర్చలు కొలిక్కి రాకముందే రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని జనసేన నేతలు నిలదీస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమంటూనే తమను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ పెత్తనం చెలాయిస్తోందన్న అసంతృప్తి జనసేన శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.భేటీ తర్వాత ఎవరి దారి వారిదేసమావేశం ముగిసిన తర్వాత కూటమి పార్టీ నేతలు ఎవరి దారి వారు పట్టడం చర్చనీయాంశమైంది. జనసేన, బీజేపీ నేతలు నేరుగా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో విడిగా సమావేశమై మంతనాలు జరిపారు. సమావేశంలో ఏం జరిగిందన్న దానిపై మూడు పార్టీల నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో పొత్తు చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.నెల్లూరు మేయర్ మాదేనంటూ హడావుడిచర్చలు ఇంకా తేలకముందే నెల్లూరు మేయర్ పీఠం బీజేపీకి ఖరారైందంటూ బీజేపీ నేతలు హడావుడి చేయడం గమనార్హం. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం వహించింది. టీడీపీ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. సీట్ల పంపకమే తేలకుండా ఒక్కో పార్టీ ఒక్కో ప్రకటన చేయడం కూటమిలో సమన్వయ లోపానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నేడు మళ్లీ భేటీప్రతిష్టంభన నేపథ్యంలో మంగళవారం మరోసారి సమావేశం కావాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి పవన్‌కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. అయితే మేయర్, చైర్మన్ పీఠాలపై టీడీపీ పట్టు వీడకుంటే ఈ భేటీ కూడా ఫలితం లేకుండానే ముగిసే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి?
సాక్షి, అమరావతి: వాన పడితే జలాశయాల్లా మారే రోడ్లు.. గుంతల రోడ్లు.. వీధి చివర కొండలా చెత్త.. దోమలు, జ్వరాలు.. గుక్కెడు తాగునీరు ఇవ్వలేని దుస్థితి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే కుక్కల బెడద.. పద్మవ్యూహంలా ట్రాఫిక్.. ఏ పట్టణానికి వెళ్లినా జనం నోట ఇదే మాట. ఈ పరిస్థితుల్లో వార్డుల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలని కూటమి పార్టీల శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. చంద్రబాబు రెండేళ్ల పాలనలో నగరాలు, పట్టణాలను గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల కోసం జనం వద్దకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా ఏమీ చేయలేకపోయామని, ఓట్లు ఎలా అడగాలని వాపోతున్నాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాల్టీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు జనం వద్దకు వెళ్లాలంటేనే వణుకుతున్నాయి. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని జనం పట్టించుకోలేదని, ఇప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు. సీఎం సొంత ఇలాకాలోనే దాహం కేకలు పట్టణాల దుస్థితికి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పమే నిలువెత్తు సాక్ష్యం. సొంత నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ఆయన పరిష్కరించలేకపోయారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసి మొత్తం సమస్య తీరిపోయిందని చెప్పుకుంటున్నారు. కానీ జనం మాత్రం సరిపడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర పట్టణాల పరిస్థితి మరీ దారుణం. కర్నూలు నగరానికి నీరందించే గాజులదిన్నె ప్రాజెక్టులో 1.5 టీఎంసీలే మిగిలాయి. వానలు పడకపోతే నగరం గొంతెండటం ఖాయం. పాలకొండ నగర పంచాయతీలో కుళాయి తిప్పితే మొదటి ఐదు నిమిషాలు బురద నీరే. మంచినీటి కోసం కుళాయిల దగ్గర సిగపట్లు పట్టాల్సిన దుస్థితి. గత్యంతరం లేక పేదలు సైతం 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 చెల్లిస్తున్నారు. రక్షిత నీరు అందించాల్సిన మున్సిపాల్టీలు చేతులెత్తేయడంతో నీళ్లు కొనుక్కోవడం పట్టణ పేదలకు అదనపు భారంగా మారింది. మురుగులో పట్టణాలు వర్షాకాలానికి ముందే డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయాలి. ఈ పనిని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చేయలేదు. ఫలితంగా చిన్న వానకే కాలువలు పొంగుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపైకి, లోతట్టు కాలనీల్లో నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. శివారు కాలనీల్లో అసలు డ్రైనేజీలే లేవు. మురుగు గుంతల్లో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేక పట్టణాల మురుగంతా నేరుగా చెరువులు, నదుల్లోకి వెళ్తోంది. వ్యర్థ జలాలతో చుట్టుపక్కల చెరువులన్నీ కలుషితమవుతున్నాయి. అదే నీరు తాగునీటి పథకాలు, బోర్లలోకి ఉబికి వస్తోంది. ఆ చెరువుల్లో పెరిగిన చేపలు తిని జనం అనారోగ్యం పాలవుతున్నారు. వాన పడితే చెరువులే వర్షపు నీరు పోయే దారిలేక ప్రధాన రహదారులే చెరువులవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నడిబొడ్డులోని మొగల్రాజపురం, ఆటోనగర్ సహా అనేక ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రోడ్డు చెరువును తలపించింది. రోడ్లపై డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లోనే వాన వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. అయినా రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. పడకేసిన పారిశుద్ధ్యం.. విజృంభిస్తున్న జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో పారిశుథ్యం అధ్వాన్నంగా మారిపోయింది. ఇంటింటి చెత్త సేకరణ పేరుకే మిగిలింది. వీధి చివర్లలో రోజుల తరబడి చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. తరలించే దారిలేక సిబ్బందే కుప్పలకు నిప్పు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ పొగతో చుట్టుపక్కల వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు పట్టణాల్లో వీధికుక్కలు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిలిచిన మురుగు, పేరుకుపోయిన చెత్త ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటివల్ల దోమలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి రాష్ట్రంలో మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కు చేరాయి. జూన్ నాటికే మలేరియాతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. డెంగీ కేసులు సైతం పెరిగాయి. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, ఎన్టీఆర్; కాకినాడ జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఫాగింగ్, దోమల నివారణ చర్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జ్వరాల బారిన పడిన పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. గుంతల రోడ్లు.. గంటల ట్రాఫిక్ పట్టణాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. వేసిన రోడ్లకూ నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హడావుడిగా అరకొరగా వేసిన రోడ్లు, చేసిన మరమ్మతులు అనేక చోట్ల వర్షాలకు కొట్టుకుపోయాయి. నాణ్యత లేకపోవడంతో ఆ రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. కొద్ది దూరం ప్రయాణానికే గంటల సమయం పడుతోంది. బిల్లుల్లేక ఆగిన పనులు పట్టణాల్లో అరకొరగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే పది నెలలుగా రూ.350 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, మెటీరియల్ ఖర్చులు భరించలేక కాంట్రాక్టర్లు ఆగస్టులో అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారు. మరోవైపు పనులు చేయకుండానే బిల్లులు దండుకున్న ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. ఏలూరు నగరపాలక సంస్థలో ఓ ఏజెన్సీకి రూ.5.36 కోట్లు, ఓ కాంట్రాక్టర్ పేరుతో రూ.2.67 కోట్ల బిల్లులు చెల్లించారు. పార్కులో జిమ్ పరికరాల మరమ్మతుల పేరుతోనే రూ.4.92 లక్షలు డ్రా చేశారు. అధికార పార్టీ నేతలు, వారి బినామీ కాంట్రాక్టర్ల కోసమే నిబంధనలు తుంగలో తొక్కి ఈ పనుల పందేరం సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన పనులకు డబ్బుల్లేవు, జరగని పనులకు బిల్లులు మాత్రం అందుతున్నాయి.ఎన్నికల ముందు శిలాఫలకాల హడావుడి రెండేళ్లకు పైగా పట్టణాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుకు స్థానిక ఎన్నికలు దగ్గర పడగానే అభివృద్ధి గుర్తొచ్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.7,469 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల పనులకు ఆగస్టులో హడావుడిగా పరిపాలనా అనుమతులు ఇచ్చి జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం ఈ పనులను ఎప్పటికి పూర్తి చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఇవన్నీ ఓట్ల కోసం వేసిన శిలాఫలకాలేనని పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వార్డుల్లోకి వెళ్లాలంటేనే వణుకు ఈ పరిస్థితుల్లో ఎన్నికలంటేనే టీడీపీ స్థానిక నేతలు బెంబేలెత్తుతున్నారు. వార్డుల్లోకి వెళ్తే పొంగుతున్న డ్రైనేజీలు, అందని తాగునీరు, గుంతల రోడ్లపై ప్రజలు నిలదీయడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. రెండున్నరేళ్లలో పట్టణాలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదని ఆ పార్టీ శ్రేణులే అంతర్గతంగా వాపోతున్నాయి. శిలాఫలకాలతో ఓట్లు రాలవని, కనీస వసతులు కల్పించలేని పాలనకు పట్టణ ఓటరు తగిన తీర్పు ఇవ్వనున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవిని BC లకు ఇవ్వండి
-
నీ ఆటలు జగన్ దగ్గర కాదు.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్..!.
-
జయలలిత సాధించారు.. బాబు వల్ల కాలేదు: తలారి రంగయ్య
సాక్షి, అనంతపురం: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో చట్టం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులు తలారి రంగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వెనుకబడిన వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు తప్పులను ఎత్తిచూపినప్పుడు గతంలో నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి నాయకులు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు నుంచి విమర్శలు ఎదురైనా చంద్రబాబు నైతిక బాధ్యత వహించడం లేదని ఆరోపించారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంతో పోరాడి బీసీ రిజర్వేషన్లు సాధించారని, చంద్రబాబు కూడా అదే విధంగా ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదిక రిజర్వేషన్ల కల్పనకు ఉపయోగపడేలా లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ వెనుకబాటుతనానికి సంబంధించి స్పష్టమైన గణాంకాలు సమర్పించి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవని పేర్కొన్నారు. బీసీలను మభ్యపెట్టడం తప్ప టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీసీలకు అత్యధిక పదవులు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ కంటే ఎక్కువగా బీసీలకు పదవులు ఇచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదీ చదవండి: ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు! -
బాబు జేబు సంస్థగా ఈడీ!
-
బీసీ రిజర్వేషన్లు.. నులకమంచం కబుర్లతో బాబు కాలక్షేపం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే నులకమంచం కబుర్లు భలేగా ఉంటాయి. స్థానిక ఎన్నికలలో బీసీలకు అధికారికంగా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటూ గారడీలు చేసి, చివరికి ఆ వర్గాలను బురిడి కొట్టించారు. ఆ బురిడి వ్యవహారం సుప్రింకోర్టు తీర్పుతో బట్టబయలు అయింది. ప్రజలలో పరువు పోయిందని తెలిసినా ఆయన మాత్రం తన నులకమంచం కబుర్లు ఆపరు. అదే ఆయన విశిష్టత. చెప్పిన అబద్దాన్ని పదే,పదే చెబుతుంటారు. కొండపి వద్ద నర్సింగోలు అనే గ్రామంలో జరిగిన సభలో బీసీల రిజర్వేషన్లు, తదితర అంశాల గురించి ప్రసంగం చేసి అన్నిటికి వైఎస్సార్‌సీపీపైనే నిందలు మోపి , ఆ తర్వాత నులక మంచం మీద గ్రామస్తులు కొందరితో కలిసి కూర్చుని ముఖాముఖి జరిపి వెళ్లారు.ఆ కార్యక్రమానికి సంబంధించిన కధనాలను ఎల్లో మీడియాలో చదివిన తర్వాత అర్ధం అయ్యేదేమిటంటే, ఏదో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకుని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి, ఆ తర్వాత నులకమంచం కబుర్లు చెప్పడం అలవాటు చేసుకున్నారనిపిస్తుంది. చెట్టు కింద,అరుగు మీద, నులక మంచంపైన కూర్చుని గ్రామీణులు కబుర్లు చెప్పుకుంటారు. వాటిలో ఎక్కువగా కాలక్షేపం కబుర్లే ఉంటాయి. చంద్రబాబు ఈ పర్యటనలో చేసిన ప్రసంగం కూడా అదే మాదిరి అనిపిస్తుంది. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని లక్షల కొద్ది వెచ్చిస్తూ తిరగడం ఒక ఎత్తు అయితే, ఆయా చోట్లకు వెళ్లి అసత్యాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని అనుకోవడం మరో ఎత్తుగా ఉంటుంది. బీసీ రిజర్వేషన్ లపై ఒక జివో ఇచ్చేసి అంతా అయిపోయిందని నమ్మించాలని చూశారు. ఆ వెంటనే తన పార్టీ వందిమాగధులు ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసేశారు.ఆహో,ఓహో అంటూ భజన చేసేవారికి తక్కువేమీ ఉండదు కదా!ఎల్లో మీడియా శభాష్ ..శెభాష్ అంటూ జాకీలు పెట్టి లేపడం కొత్తేమీ కాదు. కాని టీడీపీ ఎమ్మెల్యేలకు తెలుసు..ముఖ్యమంత్రి,మంత్రులందరికి తెలుసు..చివరికి ఎల్లో మీడియాకు కూడా తెలుసు..ఆ జిఓ చెల్లదని, ఏభై శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రింకోర్టు తీర్పులు ఉన్నాయని, తాము ప్రజలను మోసం చేస్తున్నామని వారికి తెలుసు. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఆ పనికానిచ్చేయడమే తెలుగుదేశం గొప్పదనం గా మారింది.ఇదీ చదవండి: రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!ఎవరైనా ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టుకు వెళతారని కూడా తెలుసు.అందుకే వైఎస్సార్సీపీ వారు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారని ప్రచారం చేశారు. ఎవరో ఒక లాయర్ ఈ జిఓపై హైకోర్టుకు వెళ్లడం , దానిని కొట్టివేయడం జరిగింది. అంతటితో అయినా ఈ డ్రామా ఆపారా అంటే అదీ చేయలేదు. సుప్రింకోర్టు కు అప్పీల్ కు వెళ్లారు.తాము ఇచ్చిన తీర్పు ప్రకారమే కదా హైకోర్టు నిర్ణయం వెల్లడించింది.. మళ్లీ అప్పీల్ ఏమిటని రెండు నిమిషాలు కూడా తీసుకోకుండా ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను సుప్రింకోర్టు తోసిపుచ్చింది. సుప్రిం తీర్పు తర్వాత కొత్త అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసినట్లనిపిస్తుంది. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు జరపాలని తలపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 16 న కొత్త ఓటర్ల జాబితా రావల్సి ఉందట .కాని దానికి ఒకటి,రెండు రోజుల ముందే నోటిఫికేషన్ ఇస్తారని ఎల్లో మీడియా తెలిపింది.. తద్వారా పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు జరుపుతారట. ఈ రకంగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతు ఇస్తున్నాయా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే సర్ లో అక్రమాలు జరగలేదని అనుకున్నా, లేదా గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల స్కామ్ జరగలేదని చెప్పాలనుకున్నా ,కొత్త ఓటర్ల జాబితా ప్రకారం అక్టోబర్ 16 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి కదా!అలా చేయడం లేదంటే ఏమనుకోవాలి!కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో మాత్రం ఈ పరిస్థితిని ఎలా సమర్ధిస్తుంది?సుప్రింకోర్టులో వేరొక బెంచ్ దీనికి సంబంధించిన కేసులో బట్టిప్రోలు పంచాయతీ చేసినట్లు అనిపిస్తుంది. కొత్త జాబితా వచ్చేలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే పాత జాబితా ప్రకారమే పోలింగ్ జరపవచ్చని, లేకుంటే కొత్త జాబితాను అనుసరించాలని తీర్పు ఇచ్చింది.నిజానికి వారం రోజుల్లో కొత్త ఓటర్ల జాబితా వస్తున్నప్పుడు ఇంతలో పోయేదేముందని కోర్టువారు అడిగి ఉంటే సహేతుకంగా ఉండేదనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో చేసిందంతా చేసి,ఇప్పుడు నెపం అంతా వైఎస్సార్సీపీపైన నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న చంద్రబాబు కుయుక్తులు చూస్తుంటే ఈ ఎన్నికలలో భారీగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమో అన్న భయం కనిపిస్తుంది.అక్కడికి అదికారుల ద్వారా వైఎస్సార్సీపీ పోటీదారులకు అవసరమైన కుల,ఆదాయ,నివాస,న్యూ డ్యూ తదితర అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటున్నారట. తమ వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్ధులను భయపెట్టే పని ఎటూ చేస్తారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో పోలీసు అదికారులతో ఎంత దారుణమైన అక్రమాలు చేయించారో అంతా గమనించారు.అయినా చంద్రబాబు ప్రస్తుతం భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అన్న భావన కలుగుతుంది. బీసీలకు పార్టీపరంగా స్థానిక సంస్థలలో 34 శాతం మించి సీట్లు ఇస్తామని చంద్రబాబు,లోకేష్ లు ఇప్పుడు చెబుతున్నారు.గతంలో జగన్ పార్టీపరంగా సీట్లను, వివిధ పదవులను 39 నుంచి అరవై శాతం వరకు బీసీలకు ఇచ్చారు.జనరల్ సీట్లలో కూడా బీసీలకు పదవులు ఇచ్చారు. ఒక వైపు జనసేన, మరో వైపు బీజేపీ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని ఆ స్థాయిలో బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం టీడీపీకి కష్టం అవుతుంది. అందుకే వైఎస్సార్సీపీపై వీలైనంత బురద చల్లడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు .గతంలో తాము బీసీ రిజర్వేషన్లు 34 శాతం చేశామని, దానిని వైఎస్సార్సీపీ 24 శాతం చేసిందని ఒక పచ్చి అబద్దాన్ని జనానికి చంద్రబాబు చెప్పే యత్నం చేశారు.జగన్ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నేతతో హైకోర్టులో పిటిషన్ వేయించింది టీడీపీనే అన్న సంగతి జనానికి తెలియదని ఆయన నమ్మకం. ఇప్పుడు ఆయనేదో రిజర్వేషన్లు పెంచితే వైఎస్సార్సీపీ కోర్టుకు వెళ్లి అడ్డుపడిందని అసత్యాన్ని వల్లె వేశారు.అంతే తప్ప,రాజ్యాంగం ప్రకారం 50శాతం మించి రిజర్వేషన్లు చెల్లవని, అందువల్ల 24 శాతానికి అటు,ఇటూగా చేయవలసి వస్తోందని చెప్పే నిజాయితీ,ధైర్యం చంద్రబాబులో కొరవడడం దురదృష్టకరం. స్థానిక ఎన్నికలంటే గొడ్డలి పార్టీకి వెన్నులో వణుకు పుడుతోందని, ఎన్నికలలో ఓటమి తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు బయటకు రారని భయపడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. అందరికన్నా ముందుగా జగన్ ప్రతిచోట పోటీ పెట్టాలని తన పార్టీ క్యాడర్ కు పిలుపు ఇస్తే ఆయన భయపడ్డట్లా?లేక బీసీలను మాయమాటలతో మభ్య పెట్టి వెన్నుపోటు పార్టీగా ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటున్న టీడీపీ భయపడుతున్నట్లా అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. సర్‌ను ఒకవైపు వ్యతిరేకిస్తూ , మరో వైపు అది పూర్తి అయ్యాక ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లడం రెండు నాలుకల ధోరణి అని చంద్రబాబు అంటున్నారు. సర్‌లో జరిగిన అక్రమాలను ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ ఎండగట్టింది. ఫిర్యాదులు చేసింది.కాని సర్ పూర్తి అవుతున్న తరుణంలో ఎందుకు పాత ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికలు జరపాలని చంద్రబాబు తహతహలాడుతున్నట్లో చెప్పాలి కదా!అది డబుల్ గేమ్ కాదా!అంటే 2024 ఎన్నికలలో ఏభై లక్షల దొంగ ఓట్లను గప్ చిప్ గా కూటమికి అనుకూలంగా వేయించుకున్నారన్న ఆరోపణలను అంగీకరిస్తున్నట్లే అవుతుంది కదా!మూడుపార్టీల కూటమి లేనిదే గెలవలేనన్న భయం చంద్రబాబుది .తాను సింగిల్ గా పోటీకి రెడీ అంటూ ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనను ఆరంబించిన ధైర్యం జగన్ ది.ఈ రెండిటిని దేనితో పోల్చాలి.అందుకే చంద్రబాబువి నులక మంచం కబుర్లుగా కనిపిస్తాయని ఎవరైనా అంటే ఆశ్చర్యం ఏముంటుంది!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మంత్రి స్వామికి చంద్రబాబు చురకలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీలో భాగంగా నిర్వహించిన మీ భూమి–మీ హక్కు గ్రామసభలో మంత్రి స్వామి పనితీరు బాగా లేదని, ఇంకా హుషారు అవ్వాలని సీఎం చురకలంటించడం ఆ నియోజకవర్గంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అన్ని సేవల్లో రాష్ట్రంలోని జిల్లాల పనితీరు 70.10 శాతంగా ఉంటే.. ప్రకాశం జిల్లాలో 69.29 శాతం మాత్రమే ఉందని, కొండపి నియోజకవర్గంలో 68.91 శాతం మాత్రమే ఉందని, మంత్రి స్వామి పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చురకలంటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో జిల్లా 21వ స్థానంలో ఉండగా, కొండపి నియోజకవర్గం 122వ స్థానంలో ఉందని, ఇలా అయితే సహించేది లేదని, పనితీరు మెరుగుపరచుకోవాలని మంత్రిస్వామితో పాటు అధికారులకు చంద్రబాబు చురకలంటించడంపై ఆ పార్టీ నాయకులే ఎద్దేవా చేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా నియోజకవర్గంలో పార్టీ పనితీరు బాగాలేదని, ఆరు మండలాల అధ్యక్షుల పనితీరు, క్లస్టర్ ఇన్చార్జుల పనితీరు, బూత్ కమిటీ ఇన్చార్జుల పనితీరు బాగా లేదని, కేవలం 7 బూత్ కమిటీ ఇన్చార్జుల పనితీరు మాత్రమే బాగుందని చంద్రబాబు అన్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో ఓట్ల శాతం బాగా ఉందని, కానీ నాయకుల మధ్య సమన్వయం లేదని, దామచర్ల సత్య కూడా తగ్గించుకుని స్వామితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించాలని, అలాకాకుండా ఎన్నికల తర్వాత సాకులు చెప్పాలని ప్రయత్నిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి చూస్తే.. నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని పలువురు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
నీ డబ్బా మాటలు ఇక ఆపు చంద్రబాబు.. నీకు టైం దగ్గరపడింది..
-
లీడ్ రోల్ అన్నారు... సైడ్ క్యారెక్టర్‌తో సరిపెట్టారు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జింకులో కావాలా.. బంకులో కావాలా.. స్టీల్ ప్లాంటా.. షిప్‌యార్డా అని అన్నీ అడిగి చివరకు ముంబై రోడ్ల మీద పావ్‌బజ్జీ దుకాణం పెట్టించిన పట్నాయక్ సీన్ గుర్తుంది కదా.. అచ్చం జెడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను పరిస్థితి కూడా అలాగే అయింది. ఆయన టీడీపీలో చేరగానే జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తారన్నారు.. రెండ్రోజులు గడిచాక అబ్బబ్బ అదికాదు మేయర్ అన్నారు... అది కాకపోయినా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఇచ్చి మూడు జిల్లాలను లాక్కొచ్చే పని అప్పగిస్తారన్నారు. అలాంటి ప్రోమోలు వేసి జిల్లాలో అక్కడక్కడ కొద్దిమంది వైఎస్సార్సీపీ క్యాడర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు.. ప్రోమో వరకు బాగానే ఉంది కానీ అసలు సినిమా రిలీజ్ అయ్యేసరికి సీన్ అర్థమైపోయింది. ఆయనది మెయిన్ క్యారెక్టర్ కాదు సైడ్ రోల్ అని తెలిసేసరికి ఆయన అనుచరులకు దెబ్బడిపోయింది. అరకు పరిశీలకుడిగా ఏం చేస్తారు... ఇప్పటికే అరకు టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జిగా తేజోవతి ఉన్నారు. ఆమె ఇప్పటికే సాలూరు, పాలకొండ , కురుపాం, అరకు.. పాడేరు ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఏదో చోట నుంచి టిక్కెట్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు సహాయకుడి పాత్రలో పరిశీలకుడిగా నియమితులైన చిన్నశ్రీను అక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేదానిపై క్యాడర్లో ఉన్న మబ్బులు తొలగిపోయాయి. మేయర్.. జెడ్పీ.. జిల్లా పోస్ట్.. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అనే స్థాయి నుంచి ఏకంగా మన్యం నియోజకవర్గానికి పంపడం అంటే ఆయన స్థాయిని తగ్గించడమా? కాదా? అనేది ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది.మన్యం బాట... రాజవుతాడుకున్న రాముడు కైక పుణ్యాన వనవాసం పేరిట అడవుల బాట పట్టినట్టు.. జిల్లా అధ్యక్షుడవుతాడనుకున్న చిన్నశ్రీను మన్యం బాట పట్టాల్సి వచ్చిందన్నది ఇప్పుడు జిల్లాలో సాగుతున్న చర్చ. ఇక మన్యం ఏజన్సీ ప్రాంతాల నుంచి ఆయనకు నిష్కృతి ఎప్పుడన్నది అధినేత చంద్రబాబుకు తప్ప ఎవరికి తెలియదు. టీడీపీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చిన ఎలివేషన్లకు.. క్యాడర్లో కలి్పంచిన ఆశలకు ఇప్పుడు ప్రాక్టికల్‌గా కనిపిస్తున్న దానికి బోల్డంత తేడా కనిపిస్తోంది. అయోమయంలో క్యా‘డర్ ’.. గతంలో చిన్నశ్రీను స్థాయి వేరు... పరిసరాల్లోని అన్నిజిల్లాల నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఆయన ఇంటికి వచ్చి ప్రసన్నం చేసుకునేవారు. అదే స్థాయి గుర్తింపు, ప్రాధాన్యం దక్కుతుంది. ఆయన వెంట నడిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆశతో కొంతమంది ఆయన వెంట నడిచారు. అయితే, ఇప్పుడు వారి భ్రమలు తొలగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు అవుతాడునుకున్న తమ నేత జిల్లా సరిహద్దుల అవతలకు విసిరేయబడితే ఇక తమ స్థాయి.. తమకు ఎలాంటి గుర్తింపు వస్తుంది? అక్కడికెళ్లి ఏం బావుకుంటాం అనే మీమాంస ఆయన అనుచరుల్లో నెలకొంది. లీడ్ రోల్ అన్నారు... సైడ్ క్యారెక్టర్‌తో సరిపెట్టారు.. పార్టీలో చేరగానే ప్రధాన బాధ్యతలు ఇస్తారని ప్రచారం చేశారు. కోరుకున్న పదవి.. బాధ్యత ఇచ్చి ఆయనను ముందు పెట్టీ టీడీపీ జిల్లా రాజకీయాలు నడిపిస్తారని అన్నారు. తీరా చూస్తే ఆయనను కానరాని కానలకు పరిశీలకుడిగా వేసి గెస్ట్ పాత్రకు పరిమితం చేశారు. ట్రైలర్లో చూపించిన ఎలివేషన్ సీన్లన్నీ ఎడిటింగ్‌లో కట్ అయిపోయినట్లు అయిందని ఆయన అనుచరులు కొందరు లోలోన ఫీలవుతుండగా, పెద్దదో..చిన్నదో..గుర్తింపు ఉన్నదో లేనిదో ఏదో ఒకటి ఇచ్చారులే.. లేనిబావ కన్నా గుడ్డిబావ నయం అన్నట్లుగా మరికొందరు సమాధానపర్చుకుంటున్నారు. -
‘పవన్ చెప్పేది ఏంది బోడి..’ తెలుగు తమ్ముళ్ల సెటైర్లు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో జనసైనికులు రోడ్లపైకి వచ్చి మద్దతుగా నిలిచారని, అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ‘చంద్రబాబు అరెస్టు సమయంలో మేమేం చేయలేదా?’ అని తెలుగు తమ్ముళ్లు పవన్‌ను నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలో తాము కూడా నిరసనలు తెలిపామని, అసలు ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలోనే అల్లర్లు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు సైతం చేశామని.. అందుకే అప్పటి ప్రభుత్వం భారీ భద్రత మధ్య తరలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆఖరికి.. పొరుగు రాష్ట్రంలోనూ నిరసనలు నిర్వహించిన సంగతి పవన్‌కి గుర్తు లేదేమోనని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. తాము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని, అధినేత విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ చంద్రబాబు కోసం ఆనాడు అర్ధరాత్రి రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేయలేదని.. ఆనాడు మంగళగిరి ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలోనే అది జరిగిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ పాత జనసేన ట్వీట్లను తెరపైకి తెచ్చారు.మా వల్లే 21 స్థానాలు..!గత ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాలపైనా టీడీపీ మాములు సెటైర్లు వేయడం లేదు. కూటమి విజయంలో తమ పార్టీ కేడర్ చేసిన కృషే ఎక్కువని, అసలు 21 సీట్లు కూడా ఇవ్వడం ఎక్కువేనని.. తమ జోక్యం లేకుండా అన్ని సీట్లు గెలిచేది కాదని కొన్ని పేజీలు, కొందరు టీడీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేసి(తాము లేకపోవడం వల్లే) ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని గుర్తు చేస్తున్నారు. @Telugu360 @PawanKalyan @JanaSenaParty ఏం త్యాగం చేసారు రా?? ప్రశాంత్ కిషోర్ పొత్తు వద్దు ఒంటరిగా పోటీ చేయండి అంటే... అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి రోడ్ మీద పోడుకున్నావు అని పొత్తుకి సరే అన్నారు.. అంతకు మించి పదవులు ఇచ్చారు. @JaiTDP లేకపోతే mla కే దిక్కు లేదు ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా @PawanKalyan https://t.co/6iusmGJuiN— SreenuTalks (@Sreenutalks9) October 11, 2026స్థానిక ఎన్నికల వేళ లొల్లి తప్పదా?రాష్ట్రస్థాయి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు చిచ్చు పెట్టొచ్చనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్, పీవీఎన్ మాధవ్‌లు పదే పదే భేటీ అవుతుండడం.. ఒక ఒప్పందానికి రాలేకపోతున్నారనే వాదనను మరింత బలపరుస్తోంది. దీనికి తోడు బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేసి తీరతామని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఇప్పుడు అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే తరహా కామెంట్లు చేయడం.. ఈ క్రమంలో తామే ఎక్కువ త్యాగాలు చేసినట్లు మాట్లాడడం.. తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం సహించడం లేదు. స్థానిక ఎన్నికల హడావుడి పెరిగే కొద్దీ కూటమిలో సీట్ల లెక్కలతో పాటు ఈ రాజకీయ మాటల యుద్ధం కూడా వేడెక్కే అవకాశముంది. ఈ తరుణంలో.. జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ డిమాండ్‌ను, ఇప్పుడు టీడీపీ కేడర్ జనసేనపై చేస్తున్న ట్రోలింగ్‌ను చంద్రబాబు సీరియస్‌గా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.Tweets delete chey ra pichi na kodka @JanaSenaParty 🤦 https://t.co/pVGlLAMrsq— Balaa (@BalaaOnX) October 11, 2026 ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలి -
కూటమిలో జనసేనకు సమాన గౌరవం కావాలి! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
స్థానిక ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీరుల్లా పోరాడుతాం..
-
తొలి రోజే ఫ్లాప్ షో
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మైసూర్ తర్వాత ఇక్కడే అత్యంత అద్భుతంగా చేస్తున్నామంటూ నెల రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. రాష్ట్రపతి, 11 మంది ముఖ్యమంత్రులు, పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఎంత మంది వీఐపీలు వచ్చినా, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని చెప్పారు. అయితే తీరా.. పదే పదే విజనరీగా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంటికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను నిర్వహించడంలో తొలి రోజే విఫలమయ్యారు.భక్తులకు అవససరమైన ఏర్పాట్లు చేయడంలో దుర్గగుడి అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు చేతులెత్తేశారు. ఉత్సవాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే భక్తులకు క్యూలైన్లోనే అధికారులు చుక్కలు చూపించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, ఎండకు తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి రోజు ఆదివారం కావడం, ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఊదరగొట్టడంతో భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వారికి దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. అంతే ఏకంగా 10 గంటలు పట్టింది. తర్వాత కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటలు పట్టిందంటే నిర్వహణ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ‘ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో ఉన్నాం. ఇప్పుడు 10 గంటలైంది. ఇంకా కొండ దగ్గరకు రాలేదు. మంచి నీళ్లు లేవు.. బయటకు వెళ్లటానికి వీలు లేదు.. టాబ్లెట్ వేసుకోవాలన్నా అవకాశం లేదు.. ఇలాగైతే ఎలా.. మా లాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?’ అంటూ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని పదేపదే ప్రకటనలు గుప్పించిన అధికారులు.. తొలి రోజే అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తొలి రోజు ఎంత మంది భక్తులు వస్తారు.. సెలవు రోజైతే పరిస్థితి ఏమిటి.. అనే అంశాలపై ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోక పోవటంతో మొదటి రోజు భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.టీడీపీ ఎంపీని నిలదీసిన భక్తులుదసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని భక్తులు నిలదీశారు. ఇవేం ఏర్పాట్లయ్యా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పినా ఎవరూ క్యూలైన్లలో ఉన్న భక్తుల విషయం పట్టించుకోలేదు. కేవలం వీఐపీల సేవలో తరించడానికే తమ శక్తియుక్తులను ధారపోశారు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఎక్కడైనా సమస్య ఉందని సమాచారం అందిస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం నుంచి క్యూఆర్ కోడ్, ఐవీఆర్‌ఎస్‌కు భక్తుల నుంచి సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయినా తూతూ మంత్రంగా తాత్కాలిక చర్యలు తీసుకున్నారే తప్ప చిత్తశుద్ధి కనిపించ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరుగా వీఐపీ దర్శనాలుఈ ఏడాది ఉత్సవాల్లో ఎటువంటి వీఐపీ దర్శనాలు ఉండవని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చెప్పినా, అమలు మాత్రం మరిచారు. ఉదయం దర్శనం ప్రారంభమైనప్పటి నుంచే ప్రముఖులు, రాజకీయ నాయకులకు తోడు పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన వారు క్యూ కట్టారు. కొండపైకి పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతించేలా పాసులను జారీ చేశామని చెబుతున్న దేవస్థానం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇందుకు ఆదివారం కొండపై ఉన్న వాహనాలే నిదర్శనం. మొత్తంగా ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా పోయింది.మీడియా ప్రతినిధుల ధర్నావన్టౌన్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాత్రికేయులను దూరంగా ఉంచి ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఎక్కువ పాస్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ పత్రికల ప్రతినిధులు ఆదివారం ధర్నా చేశారు. పెద్ద మీడియా సంస్థలకు అరకొరగా పాస్‌లు జారీచేసిన అధికారులు చిన్నపత్రికలు, లోకల్ చానళ్లు, సీనియర్ జర్నలిస్టులు తదితరులకు పాస్‌లు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వారి వద్దకు వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రచారం చేసే బాధ్యతను వందమందికిపైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అప్పగించినట్లు తెలిసింది.సర్కారు తప్పిదానికి సీఎఫ్ఓ మూల్యంవన్టౌన్ (విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి రోజే విఫలమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సర్కారు.. తన తప్పిదాన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్పైకి నెట్టేసింది. ఈ క్రమంలో ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథ్‌ను నియమించింది. ఇబ్బందులు ఇలా» హోల్డింగ్ పాయింట్లలో, క్యూలైన్లో మంచి నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా మహిళలు, చిన్న పిల్లలు అల్లాడిపోయారు. » భక్తులకు ఏ సమయానికి అమ్మవారి దర్శనం అవుతుందనే విషయాన్ని డిస్ ప్లే చేస్తామని చెప్పి.. చేయలేదు.» వాటర్ బబుల్స్ విధానం పూర్తిగా విఫలమైంది. » క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఉక్కపోతతో అల్లాడారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. » క్యూలైన్లలో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.» భక్తులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సెల్ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వం సాయంత్రం గానీ స్పందించ లేదు. » గంటల తరబడి లైన్లలో ఉన్న వారికి కనీసం అన్న ప్రసాదాలు కూడా అందజేయలేకపోయారు.» భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో సాయంత్రం తర్వాత ఓం టర్నింగ్ వద్ద పాలు, బిస్కెట్లు అందించారు. » పోలీసు, రెవెన్యూ, ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలియలేదు.కొందామన్నా మంచి నీళ్లు లేవుక్యూలైన్లో ఎక్కడా మంచి నీళ్లు లేవు. గంటల కొద్దీ సమయం పట్టినప్పుడు అధికారులు కనీసం మంచి నీళ్లయినా అందించాలి. కనీసం డబ్బులు పెట్టి కొనుగోలు చేద్దామన్నా క్యూలైన్ల దగ్గరలో అమ్మడం లేదు. నీళ్లు లేక దాహంతో అందరం చాలా ఇబ్బంది పడ్డాం. ఉత్సవాలను ఘనంగా చేస్తున్నామంటూనే ఇన్ని ఇబ్బందులా? – సుబ్బారావు, భక్తుడు, విజయవాడమాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?క్యూలైన్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతసేపు ఇలా వదిలేస్తే మాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి? ఐదు గంటలకు పైగా క్యూలైన్లో ఉన్నాం. ఇంకా దర్శనం కాలేదు. ఇలా అయితే ఎలా? ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి. – 70 ఏళ్ల వృద్ధురాలు, విజయవాడ -
హెచ్ఆర్సీ నియామకాల్లో ఇంత హడావుడి ఎందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియను సోమవారం చేపట్టాలని భావించినప్పుడు, తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తగినంత సమయం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఆహ్వానం పంపడం వల్ల తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబుకు బొత్స లేఖ రాశారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతిని ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్), సాధారణ పరిపాలన శాఖకు కూడా బొత్స పంపారు. ‘అక్టోబర్ 12న ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్, మొదటి అంతస్తులో జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కావాలని నాకు అక్టోబర్ 11న సాయంత్రం 4.59 గంటలకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందింది. సమావేశానికి హాజరు కావడానికి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నేను విజయనగరంలో ఉన్నాను. ఇంత తక్కువ సమయంలో విజయనగరం నుంచి రాలేను’ అని బొత్స లేఖలో పేర్కొన్నారు. కీలక నియామకంపై ఇంత నిర్లక్ష్యమా?‘మానవ హక్కుల కమిషన్ నియామకం వంటి కీలక అంశంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఎంపిక కమిటీ సభ్యులకు అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని పరిశీలించడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం సరికాదు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరం. మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కచ్చితత్వం, జాగ్రత్త, పూర్తి స్థాయి పరిశీలన అవసరం. తగిన చర్చ, లోతైన పరిశీలన లేకుండా హడావుడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం సహేతుకంగా లేదు. ఈ కారణాలతో అక్టోబర్ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కాలేను. సమావేశానికి హాజరు కావడం నాకు ఇష్టం లేదు’ అని కూడా లేఖలో బొత్స స్పష్టంచేశారు. -
దుబారా బాబు.. డిజిటల్ డాబు
సాక్షి, అమరావతి: ‘మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. పంటలకు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పూర్తిగా గాలికొదిలేసింది. పంటల్ని కాపాడేందుకు కనీస చర్యలు కూడా చేపట్టని ప్రభుత్వం ఉద్యాన రైతులను ఉద్దరిస్తున్నట్టు డప్పు కొట్టుకుంటూ డిజిటల్ సేవల పేరిట రూ.కోట్లను దుబారా చేస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏకీకృత డిజిటల్ వ్యవస్థ ‘ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీ ఎయిమ్స్) 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉద్యాన శాఖలో డిజిటల్ సేవల కోసం ప్రత్యేకంగా ఏపీ ఉద్యాన సమాచార, నిర్వహణ వ్యవస్థ (ఏపీహెచ్ఐఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.20.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు పరిపాలన ఆమోదం ఇస్తూ డిజిటల్ వ్యవస్థ ఏర్పాటుకు విధివిధానాలతో ఆదివారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల ఒప్పందం.. ఏడాదిలో సేవలు డిజిటల్ రూపంలో ఉద్యాన సమాచార వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్‌కు అప్పగిస్తున్నారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.11.77 కోట్లు, ఐదేళ్లపాటు నిర్వహణ కోసం మరో రూ.8.85 కోట్లు కేటాయించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రాజెక్టును నాలుగు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్ 2.0 ఉన్నా.. ఇప్పటికే వ్యవసాయ శాఖకు ‘ఏపీ ఎయిమ్స్ 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అనుబంధంగా ఉద్యాన పంటలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ కోసం ప్రత్యేక డిజిటల్ సేవల పేరుతో నిధులు స్వాహా చేసేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20.62 కోట్లను ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టేందుకే ఉద్యాన శాఖ పేరిట ప్రత్యేకంగా డిజిటల్ సేవలను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కుదరదు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన జారీ చేసిన జీవోను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు ఆదివారం మరో జీవో జారీ చేశాయి. గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం ఆమోదించిన బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను నిర్ణయించాలని పేర్కొంది. రిజర్వేషన్ల గణన, కేటాయింపునకు సంబంధించిన వివరణాత్మక విధానం.. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు, పదవుల నిర్ధారణ, కేటాయింపు, రోటేషన్‌పై కొత్త విధివిధానాలతో వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు భారీగా కోత పడే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవుల్లో దాదాపు పది శాతం చొప్పున తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మభ్యపెట్టి లబ్ధి పొందేలా స్కెచ్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని తెలిసినా బీసీలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు సర్కారు తొలుత వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా జారీ చేసిన జీవోలు చెల్లవని తెలిసినా కపట నాటకం ఆడింది. ఈ జీవోలను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో) రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం 251 జీవో జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కల్పించే రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలతోపాటు మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను తాజా ఉత్తర్వుల ప్రకారం ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా యూఎల్బీని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా.. మిగిలిన శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికే పరిమితమవుతాయి. మరోవైపు వార్డుల పునర్విభజన జరిగిన నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు నూతనంగా ఖరారు చేయనున్నారు. మేయర్లు, చైర్పర్సన్లకు మాత్రం 2021 ఎన్నికల్లో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.నేడు రిజర్వేషన్ల ఖరారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్, నగర పంచాయతీల చైర్పర్సన్ల రిజర్వేషన్లు సోమవారం ఖరారు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలి దశలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు మాత్రం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఖరారు చేయనున్నారు. -
చెత్తతోనూ 'దోపిడీ పంట'!
సాక్షి, అమరావతి: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు.. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, మద్యం అన్నిటిలోనూ వేల కోట్లు దోచేస్తున్నారు.. అమరావతి నిర్మాణాల పేరుచెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఎస్ఎఫ్టీకి రూ.20 వేలు చొప్పున నొక్కేస్తున్నారు. అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు అప్పగించేస్తున్నారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేసి వాటిలో కమీషన్లు కొట్టేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆకలి తీరడం లేదు. చివరకు చెత్తనూ వదలడం లేదు. చెత్త నిల్వల లెక్కలను కాగితాలపై పెంచేసి కాగితాలపైనే క్లియర్ చేసేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ వాటిలో కమీషన్లు కాజేస్తున్న విషయం బయటపడింది. చెత్తతోనూ ‘దోపిడీ పంట’ పండించవచ్చన్న విజనరీ చంద్రబాబు పాలనలో చెత్త కుంభకోణం విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అధికారంలోకి రాగానే ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలు, మంత్రి నారాయణ ప్రకటనలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఈ చెత్త లెక్కలను ఎలా పెంచుకుంటూ పోయారో తెలుస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా డబ్బులు చెల్లించడం, చెత్తను తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ తగలబెడుతుండడం చూస్తే కమీషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమౌతుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ లెక్కలు పెంచేసి.. కాగితాలపై క్లియర్ చేసి.. రూ.కోట్లు స్వాహా.. గత ప్రభుత్వ హయాంలో 123 మున్సిపాలిటీలలో లెగసీ చెత్త (దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త) 85 లక్షల టన్నులకు గానూ 4.10 లక్షల టన్నులను క్లియర్ చేసినట్లు తేల్చారు. ఆ విషయాన్ని 2024 జులై 11న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. కానీ 2025 మార్చి 16న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో లెగసీ చెత్తను మళ్లీ 85 లక్షల టన్నులుగా చూపించారు. అందులో 50 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. మళ్లీ 2025 సెప్టెంబర్ 23న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 84 లక్షల టన్నులున్నట్లు చూపించారు. అందులో 82 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులుగా చూపించారు. అందులో 1.08 కోట్ల టన్నులను ప్రాసెస్ చేసినట్లు చూపించారు. ఇదే ఏడాది జులై 31 నాటికి లెగసీ చెత్త మొత్తాన్ని 1.58 కోట్ల టన్నులకు పెంచేశారు. అందులో 1.34 కోట్ల టన్నులను ప్రాసెస్ చేశామని చూపించారు. లెగసీ చెత్త లెక్కలను ఇలా ఎందుకు పెంచుతున్నారో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. చెత్త లెక్కను కాగితాలపై పెంచుతున్నారు. చెత్తను క్లియర్ చేసేశామని కాగితాలపైనే చెబుతున్నారు. కానీ ఏమీ చేయకుండా టన్నుకు రూ.800 చొప్పున దాదాపు రూ. 1200 కోట్లకు పైగా నొక్కేయడానికి స్కెచ్ వేశారు. క్లియర్ చేసిన చెత్త కన్నా మొత్తం చెత్త తక్కువట.. లెక్కకు మించిన చెత్త మెక్కేయడంతో చంద్రబాబు సర్కారుకు మెదడు మొద్దు బారిపోయినట్లుంది. సుమారు 20 మున్సిపాలిటీలలో మొదట సమర్పించిన అఫిడవిట్లలో క్లియర్ చేసిన చెత్త కంటే... మొత్తం చెత్త తక్కువ అని తదుపరి అఫిడవిట్లో తెలియజేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో మూడు అఫిడవిట్లలో 5.12 లక్షల టన్నుల చెత్త ఉందని అందులో 5.11 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించారు. అంటే 5.11 లక్షల టన్నులకు బిల్లులు పెట్టుకుని తినేసినట్లే కదా.. కానీ మూడు నెలల తర్వాత సమర్పించిన అఫిడవిట్లో మొత్తం చెత్త 2.78లక్షల టన్నులని చూపించారు. తాడిపత్రిలో 1.27 లక్షల టన్నుల చెత్త ఉందని, అందులో 1.16 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించి మూడు నెలల తర్వాత 4వ అఫిడవిట్లో మొత్తం చెత్త 22 వేల టన్నులు అని తెలియజేశారు. అవకతవకలు ఈస్థాయిలో జరిగిన నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటపడవు. నచ్చిన కంపెనీలకే పనులు.. కాంట్రాక్టర్లపై చర్యల్లేవ్.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు మొదలు మొత్తం ప్రక్రియనంతటినీ అస్తవ్యస్తంగా మార్చేసింది. 2025 మార్చిలో సౌరాష్ట్ర కంపెనీకి కర్నూలు, పరిసరాల్లోని 11 డంపింగ్ యార్డులను కట్టబెట్టారు. మిగిలిన చోట్ల వేర్వేరు కంపెనీలకు పనులు అప్పగించారు. చెత్త మొత్తాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గడువులోగా పూర్తి చేస్తే 10శాతం అదనపు ప్రోత్సాహకం, విఫలమైతే 20శాతం పెనాల్టీ విధించాలి. అయితే 2025 గడువు ముగిసి, 2026 నాటికి కూడా పనులు పూర్తికాకపోయినా కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా క్లియర్ చేస్తున్నట్లు ఎన్జీటీకి తప్పుడు నివేదికలు సమర్పించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు చెల్లిస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. వేలాది ఇళ్లకు కనీసం ఇంటింటికీ చెత్త సేకరణ కూడా చేయడం లేదు. డంపింగ్ యార్డులలో అవినీతి కప్పిపుచ్చుకోవడానికి నిబంధనల ప్రకారం పెట్టాల్సిన సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చేసిన పర్యావరణ వినాశనం వర్ణనాతీతం. చెత్తను శాస్త్రీయంగా విడదీసి, బయో–మైనింగ్ ద్వారా భూమిని పునరుద్ధరించాల్సి ఉండగా, ఇక్కడ బిల్లులు మింగేయడానికి అడ్డదారి తొక్కారు. చెత్తను మట్టితో పూడ్చారు. టన్నుకు రూ.800 చొప్పున కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కయి చెత్తను ప్రాసెస్ చేయకుండానే భారీ ఎత్తున మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. చెత్తను మట్టితో కప్పివేయడం వల్ల (కేపింగ్) వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన విష ద్రావకం విడుదలై భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటిని పూర్తిగా విషపూరితంగా మారుస్తుంది. పర్యావరణానికి ఇంతటి ద్రోహం జరుగుతున్నా, పచ్చ చొక్కాల జేబులు నిండటమే లక్ష్యంగా ఈ దారుణాన్ని సాగనిచ్చారు.వైఎస్సార్సీపీ ‘క్లాప్’ విజయంకూటమి ‘చెత్త’ వైఫల్యంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 2న ప్రారంభించిన క్లాప్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పారిశుధ్య వ్యవస్థ రూపురేఖలను మార్చింది. నాడు కేంద్రం నిధులతో సంబంధం లేకుండా సొంత బడ్జెట్‌తో ప్రతి ఇంటికీ ఉచితంగా 1.2 కోట్ల డస్ట్బిన్లు పంపిణీ చేసి, 4,097 గార్బేజ్ ఆటోలను జీపీఎస్ ట్రాకింగ్‌తో నడిపింది. నిల్వ చెత్తను పర్యావరణ హితంగా క్లియర్ చేసింది. ఇంటింటి చెత్త సేకరణను తూతూ మంత్రంగా మార్చేసిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన క్లాప్ వాహనాలనూ డంపింగ్‌యార్డులకు పరిమితం చేసింది. విజయవాడతో పాటు పలు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో వాహనాలు మూలకు చేరాయి.100కుపైగా డంపింగ్ యార్డుల్లో చెత్తకు నిప్పునిబంధనల ప్రకారం పనులు చేయకపోగా, చెత్త పరిమాణాన్ని తగ్గించి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకున్న మరో అడ్డదారి చెత్తను తగలబెట్టడం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో దాదాపు 100 పైగా డంపింగ్ యార్డులలో రాత్రికి రాత్రే చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. దీనివల్ల వాతావరణంలోకి పీఎం2.5, పీఎం10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, డయాక్సిన్లు, బెంజీన్ వంటి అత్యంత క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు విషవాయువులు విడుదలయ్యాయి. చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతుంటే, మూగజీవాలు ఊపిరాడక మరణిస్తున్నాయి. చెత్త కాలి బూడిదవుతుంటే, ఆ బూడిదను కూడా క్లియర్ చేసినట్లు కాగితాలపై దొంగ లెక్కలు రాసి రూ.కోట్లు స్వాహా చేశారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త కడపలో కుమ్మేశారుకడప నగరంలో లెగసీ చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎన్జీటీకి సమర్పించిన మొదటి మూడు అఫిడవిట్లలో 1.08 లక్షల టన్నుల చెత్త ఉందని 100శాతం ప్రాసెస్ చేసేశామని చెప్పారు. మూడు నెలల తర్వాత సమర్పించిన నాల్గవ అఫిడవిట్లో లెగసీ చెత్త 8.41 లక్షల టన్నులుందని, అందులో 5.5 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేశామని చెప్పారు. లెగసీ చెత్త 100శాతం క్లియర్ అయ్యిందని చెప్పిన తర్వాత 800శాతం చెత్త పెరగడం ఎలా సాధ్యం? పైగా మూడు నెలల వ్యవధిలో 4.5 లక్షల టన్నుల చెత్తను అదనంగా ప్రాసెస్ చేశామనడం ఎలా సాధ్యం? దోపిడీకి ఇది ప్రబల సాక్ష్యం.ప్రొద్దుటూరులో పిండేశారుమూడు అఫిడవిట్లలో 2.06 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పి మొత్తం 2.06 లక్షల టన్నులూ క్లియర్ చేసేశామని చూపించారు. తర్వాత మూడు నెలలకు ఏకంగా 5.05లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్లో ప్రకటించారు. డంపింగ్ యార్డులో క్లియర్ అయిన చెత్త ఒక్కసారిగా అలా ఎలా పెరిగింది?కర్నూలులో కొట్టేశారు..కర్నూలులో 1.5 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని, మొత్తం క్లియర్ చేసేశామని మూడు అఫిడవిట్లలో చెప్పారు. మూడు నెలల తర్వాత 7.61 లక్షల టన్నుల చెత్త ఉందని చూపించారు. చెత్తను పెంచి క్లియర్ చేసి కొట్టేశారన్నమాట..అనంతపురంలో అడ్డగోలు లెక్క..మూడు అఫిడవిట్లలో 3.32 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. మొత్తం క్లియర్ చేసి 12 ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పారు. కానీ 2026 జనవరి నాటికి 7.10 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. ఇంతకన్నా అడ్డగోలు లెక్క ఎక్కడైనా ఉంటుందా?తిరుపతిలోనూ తినేశారు..మొదటి మూడు అఫిడవిట్లలో 2.04 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. పూర్తిగా తొలగించామని చూపించారు. 12 ఎకరాల డంపింగ్ యార్డును కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. 4వ అఫిడవిట్లో ఏకంగా 6.26 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. అంటే ఎంత తినేశారో అర్థం కావడం లేదూ?వైజాగ్‌లో దోచేశారు..మొత్తం 9.6 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని మూడు అఫిడవిట్లలోనూ చెప్పి మొత్తం క్లియర్ చేసినట్లు చూపించారు. మూడు నెలల తర్వాత 17.84లక్షల టన్నులకు చెత్తను పెంచేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో చేశారో తెలుస్తూనే ఉంది కదా..?గత ప్రభుత్వం క్లియర్ చేసిన చెత్తను కూడా కలిపేసి...మున్సిపాలిటీల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తకు గాను గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీకి) 2024 జులై 11న సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. కానీ 2025 మార్చి 16న 85 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందంటూ మరో అఫిడవిట్ ఇచ్చింది. అందులో 50 లక్షల టన్నులు క్లియర్ చేశామంది. 2025 సెప్టెంబర్ 23న మరో అఫిడవిట్లో 84 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పింది. అందులో 82 లక్షల టన్నులు క్లియర్ చేశామంది.అంతా క్లియర్ చేసేశాం మంత్రి నారాయణ గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసింది. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చెత్త తొలగింపును 2025 నాటికి పూర్తి చేయమన్నారు. ఇప్పటికే 84లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాం. అక్టోబర్ 2 నాటికి 85 లక్షలు పూర్తి చేస్తాం’ అని శాసన మండలి సాక్షిగా మంత్రి నారాయణ 2025 సెప్టెంబర్ 19న ప్రకటించారు.నాలుగో అఫిడవిట్లో 1.53 కోట్ల టన్నుల చెత్తఐదునెలలు తిరక్కుండానే కోట్ల టన్నులకు లెగసీ చెత్త పెరిగిపోయింది. లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులంటూ 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఐదో అఫిడవిట్లో 1.58 కోట్ల టన్నుల చెత్తమరో నాలుగునెలలయ్యేసరికి లెగసీ చెత్త లెక్క 1.58 కోట్ల టన్నులకు చేరుకుంది. 2026 జులై 31న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ ఈ కొత్త లెక్క చెప్పింది.1.05 కోట్ల టన్నుల చెత్త చంద్రబాబు‘గత ప్రభుత్వం 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లిపోయింది.’ అని 2026 జనవరి 24న సీఎం చంద్రబాబు చెప్పారు.ఏమిటీ చెత్త మర్మం?లెగసీ చెత్త 85 లక్షల టన్నుల్లో గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నులు క్లియర్ చేసిందని అఫిడవిట్లో చెప్పిన చంద్రబాబు 2026 జనవరి 24 నాటికి 1.05 కోట్ల టన్నుల చెత్త ఉందని ఎందుకు మార్చి చెప్పినట్లు? ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చెత్త నిల్వలను ఏకంగా 1.53 కోట్ల టన్నులకు ఎందుకు పెంచేసినట్లు? జులై 31 నాటికి ఈ లెక్కను 1.58 కోట్ల టన్నులకు పెంచి మరో అఫిడవిట్ ఎందుకు వేసినట్లు? ఈ ఐదు అఫిడవిట్లలోనూ కోట్ల టన్నులు క్లియర్ చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటి వెనక ఏదో ‘దోపిడీ మర్మం’ ఉందని అర్థం కావడం లేదూ? -
నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ
-
చంద్రబాబు జేబు సంస్థగా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ... వైఎస్సార్సీపీ నాయకులపై యథేచ్ఛగా దాడులు.. కేసులు
-
బాబు సర్కార్ నిర్వాకం.. రైతుకు శాపం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం రాష్ట్ర రైతులకు శాపంగా తయారైంది. మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల సేకరణకు ఆర్థిక చేయూత కోసం పంపే ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏపీ విషయంలో మాత్రం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నా.. చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. సాగైన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎంత మేర దిగుబడులు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది. పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ సీజన్లో కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, నూనెగింజలను కొనుగోలుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం భారీగా ఆర్థిక చేయూత ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా రూ.5,547.99 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. కానీ ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం కనిపించకపోవడం గమనార్హం.పొరుగున్న కర్ణాటక, తెలంగాణకు ఆర్థిక చేయూత...రాష్ట్రాల వారీగా కేటాయించిన కొనుగోళ్ల విలువను పరిశీలిస్తే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 4.66 లక్షల టన్నుల కందులు సేకరణకు రూ.3,937.70 కోట్లు, 6,250 టన్నుల పెసలు కొనుగోళ్లకు రూ.54.87 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కర్ణాటకకు 1.16 లక్షల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.659.27 కోట్లు, 38 వేల టన్నుల పెసలు సేకరణకు రూ.335.83 కోట్లు, 13 వేల టన్నుల పొద్దుతిరుగుడు సేకరణకు రూ.111.90 కోట్లు ఇలా ఈ రాష్ట్రంలో 1.67 లక్షల టన్నుల పంట ఉత్పత్తుల సేకరణకు రూ.1,107 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణలో 62 వేల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.353.90 కోట్లు, 11 వేల టన్నుల పెసల సేకరణకు రూ.94.52 కోట్లు కలిపి 73 వేల టన్నులు పంట ఉత్పత్తుల సేకరణకు రూ.448.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మరి ఇదే సమయంలో దేశంలోనే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీలో రైతులకు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆర్ధిక చేయూత ప్రకటించకపోవడమే ఆందోళనకు గురిచేస్తుంది. రెండేళ్లుగా ఏ పంటకు దక్కని మద్దతు ధర..గడిచిన రెండున్నరేళ్ల గా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. ప్రభుత్వ ఏజెన్సీలను రంగంలోకి దింపి రైతుల నుంచి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరలు కొనుగోలు చేసిన దాఖలాలూ లేవు. కనీసం కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపడం, ఆ మేరకు నిధులను రాబట్టి ధరలు పతనమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత సీజన్లో కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలతో పాటు మొక్కజొన్న పంటలే ఈ కాస్త సాగయ్యాయి. కనీసం వాటికైనా మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి అద్దం పడుతుంది. ఈ సీజన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఏపీ రైతుల గోడు పట్టదా?ఖరీఫ్ సీజన్లో వర్షాభావం, సాగునీటి కొరత, పెరిగిన పెట్టుబడుల ఖర్చులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు, ఎదుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభించక పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల కొనుగోళ్లకు కేంద్రం మద్దతు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగకపోతే అయినకాడకి అమ్ముకొని మరింత నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అవసరమైన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, కోతలకు ముందుగానే పంట కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
బాసులు సేఫ్.. చార్జిషీటే ప్రూఫ్!
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు పోలీస్ శాఖకు కళ్లు, చెవులు, ముక్కుగా పని చేస్తాయి. రాజకీయ నేతల కదలికల నుంచి శాంతిభద్రతల సమస్య వరకు.. తీవ్రవాద కార్యకలాపాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు చీమ చిటుక్కుమంటే పోలీస్ బాస్‌లకు చేరవేస్తారు. మరి కాపు యువకుడు గాదె సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకొచ్చిన దగ్గర్నుంచి.. పోలీసులే కొట్టి చంపి కాల్చి బూడిద చేసే వరకు పోలీస్ బాస్‌లకు తెలియదంటే నమ్మాలా? సాయికృష్ణది ముమ్మాటీకి రాజ్య హత్య. ఇందుకు బాధ్యులైన బాసులను తప్పించేందుకు పౌర హక్కులను హననం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) ఉందనే కారణంతో పట్టుకొచ్చిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను చట్ట ప్రకారం కోర్టుకు హాజరు పరచకుండా, రోజుల తరబడి లాకప్‌లోనే నిర్బంధించి పోలీసులే కొట్టి చంపేసిన దారుణ ఘటన వెనుక ఉన్న బాసులను రక్షించేందుకు సిట్ పడరానిపాట్లు పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో డైవర్షన్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని వెనుక ఉన్న బాసులను కాపాడేలా స్కెచ్ వేసింది. ఈ కేసులో కోర్టుకు సిట్ సమర్పించిన 263 డాక్యుమెంట్లతో పాటు 86 పేజీల ఛార్జిషీట్‌ను నిశితంగా గమనిస్తే.. అనేక అనుమానాలు, ఆధారాలన్నీ బాసుల వైపే వేళ్లు చూపిస్తున్నాయి. సాయికృష్ణను పట్టుకొచ్చి కొట్టి చంపే వరకు జరిగిన పోలీస్ టార్చర్ గురించి సిట్ చార్జిషీట్లో వివరించిన తీరు క్రైమ్ థిల్లర్‌ను తలపిస్తోంది. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృçష్ణను మే 6న తీసుకొచ్చింది. ఆపై సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. లాకప్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా చిత్రవధకు గురిచేశారు. పోలీసులు దారుణంగా కొట్టడంతో కిడ్నీలు పగిలిపోయాయి. మర్మాంగం నుంచి రక్తస్రావం అయ్యింది. అతని పరిస్థితి విషమించడంతో ఒక పాత భవనంలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. చివరకు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక మే 12న చనిపోయాడు. అప్పటికి కూడా పోలీసులు ఈ ప్రక్రియకు ముగింపు పలకలేదు. సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి శ్మశానంలోకి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు.ఈ కస్టోడియల్ టార్చర్‌పై పూసగుచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొన్న సిట్.. దీని వెనుక ఏం జరిగిందన్నది మాత్రం వివరించక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీస్ బాస్‌ల ప్రమేయం లేకుండానే ఇంత జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ దారుణంలో అసలు దోషులను తప్పించేందుకు పక్కా స్కెచ్ వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సిట్ ద్వారా కథ నడిపించింది. నేరం మొత్తాన్ని సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురికి పరిమితం చేసి.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, డీజీపీ హరీష్ కుమార్గుప్తాలను మాత్రం సురక్షితంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది. అంతా తెలిసినా.. సీపీ మౌనం సాయికృష్ణ ఘటనపై సీపీ మౌనం వహించడం దేనికి సంకేతం అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డీజీపీ, సీపీ, ఏసీపీలకు ఏమి తెలియదన్నట్టు కథ నడిపిస్తున్నప్పటికీ.. సిట్ చార్జిషీట్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు సీపీ ప్రమేయం ఉందనేది చెప్పకనే చెబుతున్నాయి. సీపీ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృష్ణను పట్టుకొచ్చింది. అతని అరెస్టు సైతం సీపీ రిజిస్టర్లో నమోదైందని చెబుతున్నారు. విజయవాడ నగరంలోని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. అయినా.. ఆరు వారాలపాటు కమిషనరేట్ మొత్తానికి తెలిసినా మౌనం వహించారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులు పట్టుకొచ్చారని, ఆ తర్వాత కన్పించకుండా పోయాడని అతని తల్లి నేరుగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ కేసులో తమకేమీ తెలియదని న్యాయస్థానానికి పోలీసులు అబద్ధాలు చెప్పారు. సిట్ దర్యాప్తు చేపట్టిన నిందితుల జాబితాలో సీపీ పేరు లేదు. కనీసం 120 మంది సాక్షుల జాబితాలోనూ ఆయనను ఏం జరిగిందో అడగలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు నిర్వాకం. సిట్ చార్జిషీట్లోని అంశాలపై అనుమానాలెన్నో » ఈ ఏడాది మే 6వ తేదీ తెల్లవారుజామున మార్కాపురంలోని అద్దె ఇంట్లో సాయికృష్ణను విజయవాడ సీపీ పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించింది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ పంపిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని అదే రోజున ఉదయం ఏడు గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించి రశీదు తీసుకుని, ఫొటో దిగారు. » ఆ అరెస్టు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్–2026లో 194, 195 పేజీల్లో నమోదైనట్టు సిట్ చార్జిషీట్ స్పష్టం చేసింది. అంటే తొలిరోజే సాయికృష్ణ అరెస్టు సీపీ పేరిట ఉన్న రికార్డుల్లోకి ఎక్కింది. మరి అతను కోర్టుకు వెళ్లాడా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? » మే 11న ఏడీసీపీ అధికారిక టాస్క్‌ఫోర్స్ వాట్సాప్ గ్రూపులో సాయికృష్ణ గురించి ఆరా తీశారు. ‘ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు’ అని సమాధానం వచ్చింది. ఇది సాక్షుల వాంగ్మూలంగా చార్జిషీట్‌లోనే నమోదైంది. » ఎన్బీడబ్ల్యూలో 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ఉండాల్సిన వ్యక్తి ఐదు రోజులుగా స్టేషన్లోనే మగ్గుతున్నాడని సీపీ కింది అధికారికి తెలిసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమాచారం సీపీ వరకు వెళ్లిందా? వెళ్తే ఆయన ఏం చేశారు? సిట్ ఈ ప్రశ్న అడగనే లేదు. సాయికృష్ణ స్టేషన్లో ఉన్న విషయం కమిషనరేట్‌కు సమాచారం చేరిందని చార్జిషీటే చెబుతోంది. » మే 8 తెల్లవారుజామున లాకప్ రిపోర్ట్ (డీఎస్ఆర్) కోసం ఏసీపీ సౌత్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సెంట్రీ కానిస్టేబుల్ సాయికృష్ణ పేరు రాసి వాట్సాప్‌లో పంపాడు. ఏసీపీ ఆఫీసు దాన్ని డీఎస్‌ఆర్‌లో ఎక్కించింది. ఆ తర్వాత ఆ రిపోర్టులు ’నిల్’గా మారిపోయాయి. కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ ఆఫీసు రికార్డులనే తారుమారు చేశారు. ఎవరు చేశారు.. ఎవరి అండతో చేశారు.. అనే ప్రశ్నలకు చార్జిషీట్లో జవాబు లేదు. » స్పెషల్ బ్రాంచ్ డీఎస్ఆర్లోనూ సాయికృష్ణ లాకప్‌లో ఉన్నట్టు ఎంట్రీలు ఉన్నాయని సిట్ పేర్కొంది. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు నేరుగా సీపీ టేబుల్‌కే వెళ్తాయి. టాస్క్‌ఫోర్స్, ఏసీపీ ఆఫీసు, స్పెషల్ బ్రాంచ్ అనే మూడు దారుల్లోనూ సమాచారం కమిషనరేట్‌కు చేరింది. అయినా సీపీకి తెలియదంటే నమ్మేదెవరు? » కృష్ణలంక స్టేషన్ ముందున్న రెండు సీసీ కెమెరాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చార్జిషీటే రాసింది. ఆ కమాండ్ కంట్రోల్ సీపీ ఆధీనంలోనిదే. జూన్ 14 రాత్రి ఆ రెండు కెమెరాలనూ పీకేశారు. ఎన్వీఆర్లోని నాలుగు ఒరిజినల్ హార్డ్ డిస్క్‌లు తీసేసి కొత్తవి బిగించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల ఫుటేజీ మాయమైంది. సీపీ కమాండ్ కంట్రోల్ కళ్ల ముందే కెమెరాలు ఆగిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేరం మాత్రం ఒక హోంగార్డు, ఒక హెడ్ కానిస్టేబుల్ నెత్తిన పడింది. ఒరిజినల్ హార్డ్‌డిస్క్‌లు ఇప్పటికీ దొరకలేదని చార్జిషీటే ఒప్పుకుంది. కళ్లెదుటే సాక్ష్యాల తొలగింపు » కొడుకు కనిపించకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి మే 28న సీపీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జూన్ 5న ఉన్నతాధికారులందరికీ రిజిస్టర్డ్ పోస్ట్‌లో వినతులు పంపారు. అయినా సీపీ పట్టించుకోలేదు. హైకోర్టు ఒత్తిడి పెరిగాక జూన్ 19న ఆమె నేరుగా కలిస్తేనే కేసు నమోదుకు ఆదేశించారు. ఆ 22 రోజుల్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రూమ్ గోడలపై ఉన్న రక్తపు మరకలను కత్తితో రుద్దేసి.. తొలగించి రంగులు వేశారు. మృతుడి ఫోన్‌ను గోవాకు పంపి ‘బతికే ఉన్నాడు’ అనే నాటకం ఆడారు. సీసీ కెమెరాలు పీకేశారు. ఈ సాక్ష్యాల ధ్వంసం అంతా ఆ 22 రోజుల్లోనే జరిగిందని చార్జిషీట్ చెబుతోంది. సీపీ సకాలంలో స్పందించి ఉంటే ఈ సాక్ష్యాలన్నీ మిగిలేవి కావా? » సాయికృష్ణ తల్లి వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్లో ప్రతివాదులు డీజీపీ, సీపీ. వారి తరఫున జూన్ 4న, మళ్లీ జూన్ 15న ‘సాయికృష్ణ మా కస్టడీలో లేడు’ అని హైకోర్టుకు సమాచారం వెళ్లింది. ‘మూడు ప్రత్యేక బృందాలు వేశాం. మార్కాపురం సహా పలుచోట్ల గాలించాం. 74 మందిని విచారించాం’ అంటూ న్యాయ స్థానానికే కట్టుకథ వినిపించారు. మూడు ప్రత్యేక బృందాలు వేసే అధికారం సీఐకి ఎక్కడిది? అది కమిషనరేట్ స్థాయి నిర్ణయం. అయినా ఈ అబద్ధానికి సీఐ ఒక్కడే బాధ్యుడని సిట్ తేల్చేసింది. » జూన్ 15న సీఐని వీఆర్‌కు పంపారు. అంటే ఆ రోజుకే పెద్దలకు అనుమానం వచ్చింది. అదే రోజు ‘కస్టడీలో లేడు’ అనే అబద్ధం సీపీ ప్రతివాదిగా ఉన్న కేసులో హైకోర్టుకు చేరింది. దాన్ని ఆమోదించిన అధికారి ఎవరో సిట్ కనీసం ఆరా తీయలేదు. » చార్జిషీట్లోని 120 మంది సాక్షుల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పెయింటర్, పెయింట్ షాపు యజమాని, హోటల్ సిబ్బంది ఉన్నారు. కానీ ఈ వ్యవస్థకు అధిపతి అయిన సీపీ పేరు మాత్రం లేదు. సీసీ టీవీ రికార్డుల కోసం ఆయనకు ఒక నోటీసు పంపి, ఆయన కార్యాలయం ఇచ్చిన జవాబుతో సిట్ సరిపెట్టుకుంది. సీఐ వాడిన రెండు ఫోన్లు ఇప్పటికీ దొరకలేదు. ‘ఎక్కడ పెట్టానో గుర్తులేదు’ అని సీఐ చెబితే సిట్ అదే రాసుకుని వదిలేసింది. ఆ ఫోన్లు బయట పడితే మే 6 నుంచి జూన్ 15 వరకు సీఐకి పై నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారో బయట పడుతుంది. అందుకే ఆ ఫోన్ల జోలికి వెళ్లలేదా?కీలక పరిణామాలిలా..1) సాయికృష్ణపై రెండు కేసుల్లో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.2) మే 6 తెల్లవారుజామున సీపీ టాస్క్‌ఫోర్స్ బృందం మార్కాపురంలో అతన్ని పట్టుకుంది. 3) అదే రోజు ఉదయం 7 గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించారు. 4) మే 6 నుంచి 9 వరకు నాలుగు రోజులు లాకప్‌లోనే ఉంచారు. 5) గంజాయి సమాచారం కోసం స్టేషన్ పై అంతస్తులోని క్రైమ్ రూమ్‌లో చేతులు హుక్కు వేలాడదీసి కొట్టారు. 6) దెబ్బలకు మోకాళ్లు వాచిపోయాయి. నడవలేకపోయాడు. మూత్రంలో రక్తం వచ్చింది. 7) మే 8న ఆర్ఎంపీ డాక్టర్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇంజెక్షన్లు ఇప్పించారు. 8) అదే రోజు ఆ స్థితిలోనే గుణదల ప్రాంతంతోపాటు, ఒక హోటల్‌కు తిప్పారు. 9) మే 9న పరిస్థితి విషమించడంతో రాణిగారితోటలోని పాడుబడిన భవనానికి తరలించారు. 10) మే 12 మధ్యాహ్నం అక్కడే చనిపోయాడు. 11) అదే రోజు రాత్రి బైక్‌పై శవాన్ని స్వర్గపురి శ్మశానానికి తీసుకెళ్లారు. అప్పటికే కాలుతున్న ఓ చితిపై సాయికృష్ణ శవాన్ని వేసి కాల్చేశారు.12) మే 18న మళ్లీ వెళ్లి అవశేషాలు ఏమైనా మిగిలాయేమో చూసి వచ్చారు. 13) తుదకు లాకప్ రిజిస్టర్లలో సాయికృష్ణ పేరే లేకుండా చేశారు. రిపోర్టుల్లో ‘నిల్’ అని రాశారు. 14) సాయి కృష్ణ తల్లి మే 28న సీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది జూన్ 19న.సీఐ దగ్గరే ఆగిన చార్జిషీట్» హైకోర్టు కేసులో డీజీపీ కూడా ప్రతివాది. తల్లి వినతులు డీజీపీకీ వెళ్లాయి. సిట్ ఏర్పాటైంది డీజీపీ ఉత్తర్వులతోనే. దర్యాప్తు చేసింది ఆయన కింద పనిచేసే ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు. తమ బాసే ప్రతివాదిగా ఉన్న కేసులో సొంత సీపీ పాత్రను వారు ఎలా విచారిస్తారు? అందుకే చార్జిషీట్ సీఐ దగ్గరే ఆగిపోయింది. » డీజీపీ, సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ కోరుతూ విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఆ విచారణ ముందుకు కదలకుండా ఏసీపీ మానస హైకోర్టుకు వెళ్లి ఆగస్టు 13న స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? » చివరికి సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దర్యాప్తును తానే నేరుగా పర్యవేక్షిస్తానని ప్రకటించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరు పరచలేదు.. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది.. సీసీటీవీ ఫుటేజీ ఏమైంది.. మృతదేహం ఎందుకు దొరకలేదు.. అని ధర్మాసనమే నిలదీసింది. ఆ ప్రశ్నలన్నీ వేలెత్తి చూపిస్తున్నది పోలీస్ కమిషనరేట్ వైపే. » సీఐకి డిఫాల్ట్ బెయిల్ గడువు ముంచుకొస్తుండటంతో రెండు రోజుల ముందు హడావుడిగా చార్జిషీట్ వేశారు. బూడిద, ఎముకల ఎఫ్ఎస్ఎల్ నివేదిక, తల్లి రక్త నమూనాతో డీఎన్ఏ పోలిక, ఎన్వీఆర్ లాగ్స్, 15 మెమరీ కార్డులు, 6 హార్డ్‌డిస్క్‌ల డేటా అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని చార్జిషీటే ఒప్పుకుంది. పోస్టుమార్టం లేదు. శవ దహనం కథ అంతా ఒక నిందితుడి వాంగ్మూలంపైనే నిలబడింది. పెద్దల జోలికి వెళ్లకుండా, సగం ఆధారాలు కూడా లేకుండా వేసిన ఈ చార్జిషీట్ కోర్టులో ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమే. -
బీసీ రిజర్వేషన్లు 28.18 శాతం
సాక్షి, అమరావతి: రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. యూనిట్ జనాభా ఆధారంగా కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిందని, దాని ప్రకారం రిజర్వేషన్లను కేబినెట్ ఆమోదించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిందని మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, బాల శ్రీ వీరాంజనేయులు మీడియాకు వెల్లడించారు. ఇక బంతి తమ చేతిలో లేదని, ఎన్నికల సంఘం చేతిలో ఉందని మంత్రులు తెలిపారు. ఎన్నికల ముందు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పామని, ఇందులో భాగంగా న్యాయ స్థానాలను ఆశ్రయించినా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. దీంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పోగా, మిగతా రిజర్వేషన్లను 50 శాతం మించకుండా బీసీలకు కల్పించామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాని చోట పార్టీ పరంగా ఇస్తామని స్పష్టం చేశారు. యూనిట్లు ప్రాతిపదికగా రిజర్వేషన్లుకమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల స్వభావాన్ని బట్టి వేర్వేరు యూనిట్లను ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్ పదవులకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పదవులకు సంబంధిత ప్రాంతీయ యూనిట్‌ను.. జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు నిర్దేశిత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి యూనిట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లకు కూడా సంబంధిత యూనిట్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు.స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లుప్రత్యేక కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, గ్రామ పంచాయతీ సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జెడ్పీటీసీలకు 24.60 శాతం, జిల్లా పరిషత్ చైర్మన్లకు 23.08 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్ చైర్పర్సన్లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం స్థానిక సంస్థలన్నింటికీ కలిపి బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని తెలిపారు. కొన్ని యూనిట్లలో తక్కువ శాతం కనిపించినప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని జనాభా వివరాలు, కమిషన్ సిఫార్సులు, చట్టపరమైన పరిమితుల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించినట్లు వివరించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు, 34 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉన్న చోట్ల కూటమి భాగస్వామ్య పార్టీలు పార్టీ పరంగా 34 శాతానికి పైగా అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, ఎస్.సవిత, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత పాల్గొన్నారు. -
సంక్షోభంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం సంక్షోభంలో పడుతోంది. 2030 నాటికి 1.11 కోట్ల మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. హెల్త్ వర్క్‌ఫోర్స్ లెవెల్స్, ట్రెండ్స్–2026 నివేదికను డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రచురించింది. భారత్ సహా 122 దేశాల వైద్యుల డేటాను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో వైద్యుల్లో 25 శాతం మంది 55 ఏళ్లు, ఆ పైన వయసులో ఉన్నట్లు తెలిపింది. వీరంతా వచ్చే దశాబ్ద కాలంలో రిటైరైతే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా ప్రపంచానికే వైద్యుల కొరత గండం పొంచి ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించకుండా రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కల్పన, ఎక్కువమంది వైద్యులను తయారుచేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అక్కడ తరగతులు ప్రారంభించకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. ఫలితంగా మన పేద విద్యార్థుల వైద్యవిద్య కల చెదిరిపోవడమే కాకుండా, రాష్ట్రానికి కొత్తగా వైద్యులు సమకూరే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అనుమతులు వచ్చినా ప్రారంభించకుండా..ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 45 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. కానీ, మన దేశంలో వీరు ఈ అవసరాలకు తగ్గట్లుగా లేరు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 నుంచి దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, 2014–19 మధ్య కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టారు. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయడంతో పాటు, ప్రతీ జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చేపట్టడమే కాకుండా వందేళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2023–24లో ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా సార్వత్రిక ఎన్నికల నాటికే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే, ఆ ఏడాది అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలన్నీ ప్రైవేట్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులిచ్చినా మాకు కళాశాల వద్దని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసి అనుమతులు రద్దుచేయించింది. ఇలా 2024–25లో నాలుగు, 2025–26లో ఆరు వైద్య కళాశాలలు చొప్పున 10 వైద్య కళాశాలలు ప్రారంభించకుండా చంద్రబాబు గాలికొదిలేశారు. తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులుప్రైవేట్ మోజులో చంద్రబాబు కుట్రల కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు పెద్దఎత్తున ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రచించిన ప్రణాళిక ప్రకారం 10 వైద్య కళాశాలలు ప్రారంభమై ఉంటే.. మొదటి బ్యాచ్ విద్యార్థులందరూ 2030 నుంచి వైద్య పట్టభద్రులుగా బయటకు వచ్చేవారు. 2030లో 700 మంది, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 1,750 మంది వైద్య పట్టభద్రులు రాష్ట్రానికి సమకూరేవారు. అంతేకాక.. ప్రతీ కాలేజీలో 20 వరకూ పీజీ సీట్లు సమకూరి భవిష్యత్తులో ఏటా 200 మంది కొత్త స్పెషలిస్ట్ వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. -
బీసీలకు వెన్నుపోటు అడ్డంగా దొరికినా బుకాయింపే
సాక్షి, అమరావతి : పార్లమెంట్ చట్టం ద్వారా తప్ప కేవలం జీవోలతో సాధ్యం కాని బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు సగం జనాభా ఉండే వెనుకబడిన తరగతి ప్రజలను మభ్యపెడుతోంది. ఈ క్రమంలో ఆడిన రాజకీయ డ్రామాలో అడ్డంగా దొరికి పోయినా, సీఎం చంద్రబాబు.. మంత్రులు మాత్రం ఇంకా బుకాయించడం మానుకోలేదు. బీసీలకు వెన్నుపోటు పొడవడం అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పైకి నెట్టేసి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ పిటీషన్ దాఖలు చేయకపోయినా, నింద మోపాలని చూస్తున్నారు. మరో వైపు 2020–21లో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అధికారుల స్థాయిలో ఏ స్థానంలో, ఏ సామాజిక వర్గ అభ్యర్థి పోటీ చేయాలనే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో నిలబడదని తెలిసీ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాక కేబినేట్ తీర్మానం పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. టీడీపీ నేత ద్వారా కోర్టుకు వెళ్లి అడ్డగింత2020–21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ నేతను ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ (ఎపీఎస్ఈజీసీ)లో సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 96 జారీ చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా, మంత్రులు మాత్రం తాజాగా శనివారం (అక్టోబరు 10న) కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం దారుణం అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు 2020 జనవరిలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అప్పట్లో జనవరి 17వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత బిర్రు పత్రాప్‌రెడ్డి 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి.. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 2020 జనవరి–ఫిబ్రవరి నెలల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఐదేళ్ల కిత్రం ఎన్నికల్లోనే బీసీలకు 34 శాతం పదవులు 2020–21లో జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు రాష్ట్ర హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఆదేశాల అనంతరం కూడా అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు దాదాపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటికి రాష్ట్రంలో మొత్తం 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా, వాటిలో 34 మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకే కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 2020 మార్చి 7వ తేదీన గెజిట్ నెంబరు 4 జారీ చేసింది. అప్పటికి ఉన్న 16 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు 5 పదవులు కట్టబెట్టింది. అయితే ప్రస్తుత వెన్నుపోటు ప్రభుత్వం.. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీలకు 34 శాతం పార్టీ పరంగా ఇవ్వనున్నామని చెప్పుకోవడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
ఈడీ.. ఎల్లో కేడీ!
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థ. ప్రధానంగా మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం దీని బాధ్యత. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్తా ‘ఎల్లో ఫోర్స్ డైరెక్టరేట్’గా రూపాంతరం చెందింది. బాధ్యతలను గాలికొదిలేసింది. చట్టాలను, కోర్టులను చట్టుబండలను చేసేసింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఆడమన్నట్టల్లా ఆడడం. ఏది చెబితే అది చేయడం... ఈడీ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అనుకుంటే చంద్రబాబు జేబు సంస్థ అయిపోయిందని విమర్శకులంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. ఇప్పటికే రెగ్యులర్ విచారణ జరుగుతూ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న వ్యవహారంపై మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది, ఆర్థికల్ 21 ప్రస్తావనపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు, వాటిపై ముందుగానే ఎల్లో మీడియా లో కథనాలు, ఈడీ ప్రెస్‌నోట్, పొలిటికల్ పార్టీ తరహాలో చేసిన ట్వీట్ చూస్తే ఈడీ ఏ స్థాయికి ‘ఎల్లో ఫోర్స్’గా దిగజారిందో తేటతెల్లమవుతుంది. పలు కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు, దిగువ కోర్టులు పలు మార్లు మొట్టికాయలు వేసినా ఈడీ తీరు మారడం లేదు.అవినాష్‌కు నోటీసు.. ముందే ఎల్లో మీడియాలో..వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధమూ లేని అవినాష్ రెడ్డిపై ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు, చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు అన్నీ ముగిసి కోర్టులో విచారణ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మళ్లీ ఏడేళ్ల తర్వాత అవినాష్ అవసరమొచ్చాడు. వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు చెప్పినట్టుగానే.. చెప్పిన సమయంలోనే ఓ నోటీసు ఇచ్చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. అవినాష్ కు అక్టోబర్ 3న నోటీసు ఇస్తే.. నోటీసు ఇవ్వబోతున్న విషయం చంద్రబాబుకు సన్నిహితులైన ఎల్లో మీడియా అధినేతలకు మూడు రోజులు ముందే తెలిసిపోయింది. అక్టోబర్ 1నే ఈ నోటీసు విషయాన్ని ఎల్లో పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ప్రచురించేసాయి.. ప్రసారం చేసేశాయి.అంటే అర్ధం కావడం లేదూ ఈడీ ఏం చేస్తుందో.. ఎవరి తరఫున పనిచేస్తుందో... ఒక్క అవినాషే కాదు.. చంద్రబాబు వేలు ఎవరివైపు తిరిగితే వాళ్లను వేధించడం ఈడీ ప్రధాన బాధ్యత అన్నట్టు అయిపోయింది. మిధున్‌రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావైనా, సునీలైనా, అంబటి రాంబాబైనా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా.. విక్రాంత్‌రెడ్డి అయినా.. నోటీసులు, అరెస్టులు, వేధింపులు మామూలే. చంద్రబాబుకు అవసరమొచ్చినపుడు వెంటనే ఈడీ వాలిపోతోంది. బాబు ప్రత్యర్థులకు.. అంటే వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు.. జనం దృష్టిని మళ్లించడం మామూలైపోయింది. అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలను తీర్చే ఒక పనిముట్టులా ఈడీ మారిపోయింది. టార్గెట్ జగన్... ఈడీ కొత్త మిషన్..ఈడీకి చంద్రబాబు ఇప్పుడు ఓ కొత్త మిషన్ అప్పగించారు. అదే టార్గెట్ జగన్. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ వాణి వినిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రం నుంచి తప్పించి కోర్టుల చుట్టూ తిప్పాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందులో భాగంగానే వేగవంతమైన విచారణ పేరుతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించడం. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం తప్ప ఇందులో ఈడీ చట్టబద్ధంగా చేస్తున్న డ్యూటీ ఏదీ లేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై ఇప్పటికే రోజువారీ ట్రయల్ నడుస్తోంది. జగన్ తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలంటూ ఈడీ పిటిషన్ వేయడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న దురుద్దేశ చర్య మాత్రమేనని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. చంద్రబాబు వేస్తున్న సొంత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లు ఆయన క్షేమం కోసం, ఆయన చెప్పినట్లు దర్యాప్తు చేయడం కోసం పరుగులు పెడుతుంటాయి. ఇపుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అనే గౌరవాన్ని కోల్పోయిందని, చంద్రబాబు సిట్‌కు ఎక్స్టెన్షన్ ఆఫీసులా మారిపోయిందని న్యాయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా..ఆల్రెడీ సీబీఐ కోర్టులో రెగ్యులర్‌గా విచారణ జరగడం, హైకోర్టుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేయడం జరుగుతున్నాయి. అయినా తుత్తర ఆగక ఈడీ అడిగినట్టుగానే కొద్దికాలం క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వేగవంతమైన విచారణ జరగాలంటూ కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెల్సిందే. అలాగే మరో రెండు కేసుల విచారణ సందర్భంగానూ కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. తెలంగాణ హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ 2022 సెప్టెంబర్8న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అతి ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈడీ కేసులో తుది తీర్పును సీబీఐ ప్రధాన కేసులో తీర్పు వెలువడే వరకు వాయిదా వేయాలని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంది. నేరం ద్వారా ఆదాయం వచ్చిందని నిర్ధారించే ముందు, అసలు ఆ వ్యక్తి సంబంధిత నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 2022 జులై 27న సుప్రీంకోర్టు కూడా ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. అసలు నేరం జరిగిందా? ఎవరి పాత్ర ఎంత అనే విషయాలను సీబీఐ తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాలను ఈడీ తేల్చ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. మరి జగన్ కేసుల విషయంలో ఈడీ ఎందుకు తొందర పడుతోంది? వాస్తవమేమిటో తేలకుండా తొందరపాటులో ఔచిత్యమేమిటి? ఎవరు చెబితే ఇలా నిబంధనలకు, న్యాయస్థానాలకు విరుద్ధంగా ఈడీ తొందరపడుతోంది...?తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే..నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? పొలిటికల్ ప్రెస్‌నోట్.. ట్వీట్..కొత్తగా కేసులు నమోదైనప్పుడో, లేదా ఒక కేసుకు సంబంధించి రికవరీలు ఉన్నప్పుడో ఈడీ ప్రెస్నోట్లు విడుదలచేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని, అకస్మాత్తుగా ఏ పరిణామం లేకుండానే, కొనసాగుతున్న కేసులగురించి, అందులోనూ కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న కేసులగురించి ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ ప్రెస్ నోట్ చూస్తే అందులో అది దర్యాప్తు సంస్థ ప్రెస్‌నోట్ మాదిరిగా కాకుండా, పూర్తిగా రాజకీయ అంశాలతో ముడిపడినట్టుగా స్పష్టంగా ఉంది. ఈడీ ప్రకటన వెలువడిన వెంటనే ఎల్లో మీడియా మరింత శివాలెత్తిపోయింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని అర్ధం కావడం లేదూ? అయినా ఓ రాజకీయ పార్టీ ట్వీట్ చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ట్వీట్ చేయడం చూస్తే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి ఉందో తెలుస్తూనే ఉంది.ఈడీ బరితెగింపును బట్టబయలు చేసిన హైకోర్టు..జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా మోపిన కేసుల విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈడీపై కీలక ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చినప్పుడు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంలో ఈడీ ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. సంబంధిత కేసుల విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు తమకు తెలుసని వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటు ఇతరులపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసుల్లో రోజువారీ విచారణ జరిపించి, త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసినప్పుడు, మరో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తుచేస్తూ, ఈడీ తన పిటిషన్లో ఆ నిబంధనను ఎలా ప్రస్తావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తాజా పిటిషన్ విచారణార్హతపైనా సందేహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నమోదైన సుమోటో కేసులతో కలిపి ప్రస్తుత పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
కౌటిల్యమా... కనువిప్పా?!
‘‘సాంకేతిక నైపుణ్యం, మేధస్సు, మంచి ఆలోచనలూ, పెట్టుబడులూ ఉన్నంత మాత్రాన ఒక జాతి అభివృద్ధి పథంలో పయనించదు, సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉండాలి’’. ఈ అద్భుతమైన కొటేషన్‌ను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలువరించారు. అటువంటి సమర్థ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి, విశ్వసనీయతలు కొలమానాలని కూడా ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీలో గత పాతికేళ్లుగా ఈ నాయకత్వ సుగుణాలను తాను చూస్తున్నానని బాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా పాతికేళ్ల కింద గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ పదమూడేళ్ల పాటు ఆ పదవిలో, మరో పన్నెండేళ్లుగా ప్రధాని పదవిలో నిరంతరాయంగా కొనసాగుతూ దేశాభివృద్ధికి, ప్రజల సాధికారత కోసం పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.ప్రధానమంత్రి సాధించిన ఈ రికార్డు నిజంగానే అసాధారణమైనది. నభూతో నభవిష్యతి అని కూడా అనవచ్చేమో! అరుదైన ఈ ఘనతను సాధించిన ప్రధానిని దేశంలో ఉన్న రాజకీయ ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా అభినందించారు. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది హిందూ’ పత్రికలో చంద్రబాబు నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. అందులో మోదీ నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ ఆయన సారథ్యంలో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని సోదాహరణంగా విశదీకరించారు. ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అలా రాయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. చంద్రబాబు కూడా చిన్న నాయకుడేమీ కాదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కరుణానిధి తర్వాత దక్షిణాదిన ఆయనదే ఈ రికార్డు. అటువంటి నాయకుడు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో స్థిరత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పూటకో మాట మాట్లాడితే ఇక విశ్వసనీయత ఎక్కడుంటుంది? విశ్వసనీయత, చిత్త శుద్థిలేని నాయకులు జాతిని ముందుకు నడిపించలేరనే భావన కూడా ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నాయకుడు తన అభిప్రాయాలను ఎన్నటికీ మార్చుకోకూడదని ఎవరూ చెప్పరు. అయితే అటువంటి మార్పు ఎందుకువచ్చిందో, కారణాలేమిటో స్పష్టం చేస్తేనే మారిన అభిప్రాయానికీ, మార్చుకున్న నాయకునికీ విశ్వసనీయత పెరుగుతుంది.నరేంద్ర మోదీ పాతికేళ్ల అధికార కాలాన్ని గంపగుత్తగా ‘ది హిందూ’ వ్యాసంలో చంద్రబాబు సమర్థించారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఈ పాతికేళ్ల ప్రయాణం సాగిందని బాబు అభినందించారు. మోదీ వ్యక్తిగత ఔన్నత్యం, క్రమశిక్షణ వగైరాలను ప్రస్తావించడంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ వాటి గురించి గొప్పగా కితాబులిచ్చారు. ఈ వ్యాసాన్ని చదివిన వారికి చంద్రబాబు తీసుకున్న ఇంత పెద్ద యూ టర్న్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పాతికేళ్ల వెనక్కు కూడా వెళ్లనవసరం లేదు. ఏడెనిమిదేళ్ల కిందటి చంద్రబాబు మాటలు గుర్తుకు చేసుకున్నా కూడా ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమౌతుంది. గతంలో నరేంద్ర మోదీని, ఆయన విధానాలనూ అపార్థం చేసుకున్నాననీ ఇప్పుడు జ్ఞానోదయమైన కారణంగా ప్రశంసిస్తున్నానని ఒక వాక్యం రాసి ఉన్నట్లయితే ‘ది హిందూ’ వ్యాసానికి సార్థకత చేకూరేది. అటువంటి సంజాయిషీ ఏమీ లేదు కనుక ఈ పొగడ్తలన్నీ పబ్బం గడుపుకోవడానికేనని ఎవరైనా భావిస్తే తప్పు పట్టగలమా?ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగానూ, విధానాల పరంగానూ ఎవరూ విమర్శించని స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడిన ఘటనలు కేవలం ఏడెనిమిదేళ్లు వెనక్కి వెళ్లినా కనిపిస్తాయి. 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం మోదీకి లేదు, ఆయనకు కుటుంబ బంధాల గురించి తెలియదు. విడాకులివ్వకుండా భార్యను దూరం పెట్టాడు. పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య, ఆయన పాలనలో బ్యాంకులు దివాళా తీశాయి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడని’’ బాబు విరుచుకుపడ్డారు. నిండుసభలో మాట్లాడిన ఈ మాటలకూ, హిందూ వ్యాసంలో ప్రకటించిన అభిప్రాయాలకూ ఏమైనా సామ్యం ఉన్నదా?‘‘59 వేల కోట్ల రఫేల్ ఒప్పందం దేశరక్షణ రంగంలోనే అతి పెద్ద కుంభకోణం. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నది. దేశాన్ని మోసం చేశారు. మోదీజీ... సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు’’ అంటూ 2019 ఫిబ్రవరి 8న బాబు ట్వీట్ చేశారు. అప్పుడు దేశాన్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే పరిణామం ఎలా సంభవించిందో బాబు వివరించాలి కదా! అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని’’ కూడా మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని ఆ సమయంలోనే టీడీపీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నరేంద్రమోదీ ఓ కేడీ అనీ, దేశం మొత్తం ఆయన్ను చోర్ అని పిలుస్తున్నదనీ కూడా ఆనాటి ఎన్నికల సభల్లో బాబు విమర్శలు చేశారు. మోదీకి దేశభక్తి లేదనీ, రాజకీయ భక్తి మాత్రమే ఉన్నదని దేశంలోని వ్యవస్థలన్నింటినీ ఆయన ధ్వంసం చేస్తున్నారని కూడా బాబు ధ్వజమెత్తారు.ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సందర్భంలో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలన్నీ గుదిగుచ్చితే ఓ పుస్తకం అవుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తానని అన్న విషయాన్ని గుర్తు చేయటం అప్రస్తుతం కాకపోవచ్చు. గోథ్రా అల్లర్ల నేపథ్యంలోనే చంద్రబాబు అలా మాట్లాడారు. కానీ, అప్పటినుంచే మోదీ గొప్ప నాయకత్వ లక్షణాలు కలవాడనీ, దేశాభివృద్ధికోసం కష్టపడ్డారని ఇప్పుడు మాట మార్చుతున్నారు. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అనే గిరీశం నిర్వచనానికి ఈ పిల్లిమొగ్గలు సరిపోతాయేమో కానీ, చిత్తశుద్ధి, విశ్వసనీయతలే నాయకత్వానికి కొలమానాలని చంద్రబాబు హిందూ వ్యాసంలో చెప్పిన నిర్వచనానికి మాత్రం సరిపోలవు. పోనీ, మోదీపై తీసుకున్న ఈ తాజా వైఖరికి చంద్రబాబు కట్టుబడి ఉంటారా? వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మోదీ ప్రభుత్వం ఓడిపోతే గెలిచిన కూటమిలో దూరకుండా ఉంటారా?2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవచ్చనే అంచనాలతోనే ఆయన కూటమి నుంచి వైదొలిగారనే అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయంతోనే విమర్శలతో చెలరేగిపోయారనీ, ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ప్లేటు మార్చి కాళ్ల బేరానికి దిగడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తారు. అప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలగిన సందర్భంగా తిరుపతిలో ‘ధర్మ పోరాటం’ పేరుతో జరిపిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నవాడే నాయకుడని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అంటే తను ఆచరించడానికి గిరీశం ఫిలాసఫీ, నీతులు చెప్పడానికి హిందూలో రాసిన ఫిలాసఫీ అనుకోవాలి. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’’ అంటూ హిందూలో రాసిన ప్రేమలేఖలాంటి వ్యాసం పవిత్రమైనదా, కపటంతో కూడినదా అనే సందేహం ఎవరికైనా సహజంగానే తలెత్తుతుంది.కేంద్రంలో మోదీ సర్కార్ గత పన్నెండేళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. యువతరంలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఉద్యమ రూపాలను తీసుకుంటున్నది. బూటకపు ఎన్నికల బండారం బట్టబయలై రాజకీయ పార్టీలు వీధుల్లోకి వస్తున్నాయి. యువతరంతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలు పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయాస పడుతున్నారు. వారి వీధి పోరాటాలను ఎద్దేవా చేస్తూ ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర పక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. కూటమిలో రెండో ప్రధాన పక్షమైన తెలుగుదేశం అధినేత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలకు దూరంగా ఉండిపోవడం కూడా పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. రేపు విపక్ష సంకీర్ణమే అధికారంలోకి రావచ్చు. అందుకే ఈ ముందు జాగ్రత్త అనుకోవాలి. అనుమానం రాకుండా జాతీయ పత్రికలో మోదీ భజన. జాతీయ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏలోని టీడీపీ పట్ల ఇదే స్నేహభావాన్ని ప్రదర్శిస్తుండటం కూడా గమనించదగ్గ విషయం. ఓట్చోరీ పైన ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన ఓట్చోరీ పైన ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. శుక్రవారం నాడు ఓట్చోరీ అంశంపై ప్రతిపక్ష బృందం రాష్ట్రపతిని కలిసింది. ఆధారాలుంటే ఇవ్వాలని రాష్ట్రపతి తమతో చెప్పినట్లు రాహుల్‌గాంధీ మీడియాకు వెల్లడించారు.బోగస్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల ఓట్లు పోలైనట్లు ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్నకు ఇప్పటిదాకా ఈసీ నుంచి సమాధానం లేదు. నాటి ఎన్నికల ప్రధానాధికారి పదిరోజుల్లోగానే వీవీ ప్యాట్లను ఎందుకు కాల్చేయమన్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. పోలింగ్ రోజు తగ్గిన ఈవీయమ్ బ్యాటరీ కౌంటింగ్ నాటికి ఎలా పెరిగిందంటే జవాబు చెప్పే దిక్కులేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేంద్రాల ముందు లక్షలాది మంది బారులు తీరి నిలబడ్డారని చెబుతున్న ఎన్నికల సంఘం ఆ వీడియో ఫుటేజిని ఎందుకు చూపెట్టడంలేదో తెలియదు. కానీ ఏపీలో జరిగిన బూటకపు ఎన్నికల గురించి రాహుల్ మాట్లాడరు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం అటువంటిది. చంద్రబాబు ‘ది హిందూ’లో రాసిన వ్యాసం కౌటిల్యంతో రాశారా? కనువిప్పు కలిగి రాశారా అన్న అంశాన్ని ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.- వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.comఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక -
కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ముగ్గురు సీఎంల ముచ్చట నడుస్తోందని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ.109 కోట్ల ప్రజాధనాన్ని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చుచేసిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా కేవలం ప్రచార ఆర్భాటాలతో పబ్లిసిటీ పీక్, విషయం మాత్రం వీక్ అన్న చందంగా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ లు ముగ్గురు ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో కోసం జరుగుతున్న ఖర్చును గణాంకాలతో సహా నిలదీశారు.గతంలో వైఎస్ జగన్ అందించిన 38 సంక్షేమ పథకాల్లో 34 పథకాలను అడ్డగోలుగా ఎత్తేసిన కూటమి ప్రభుత్వం, మిగిలిన అరకొర పథకాలనే ప్రతి నెలా జిల్లాల వారీగా పదే పదే ప్రారంభిస్తూ ప్రజల సొమ్ముతో ప్రచార ఈవెంట్లు నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు.రాజకీయాల్లో చంద్రబాబును మించిన బూటకపు స్టార్ లేడుసినిమాల్లో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు ఉన్నారు. వాళ్లది నటన వృత్తి. కానీ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక మాయల మరాఠీగా మారారు. నటనలో, డ్రామాల్లో, బూటకాల్లో చంద్రబాబును మించిన స్టార్ దేశంలోనే లేడు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తెస్తే వివరాలు చెప్పడం ఆనవాయితీ. కానీ 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్లు ఒకే పథకాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాలో మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారు. నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది కూడా అదే తతంగం. కేడర్‌ను ఉత్తేజపరచడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు.ఆత్మస్తుతి.. పరనింద.. జగనన్న జపం..ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వింత జీవిని ఎక్కడా చూసి ఉండం. వేదిక ఏదైనా ఆయన నోట వినిపించేది మూడే విషయాలు. ఒకటి ఆత్మస్తుతి, రెండు పరనింద, మూడు జగనన్న జపం. 45 ఏళ్ల అనుభవం ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం ఆత్మస్తుతి అయితే, ప్రసంగంలో 70 శాతం వైఎస్ జగన్‌ని విమర్శించడమే పరనింద. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బుర్రల నిండా వైఎస్ జగనే ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ జగన్ స్థానాన్ని చెరిపివేయలేక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. వర్షాభావం, కరువు, రైతాంగ సమస్యలపై మాట్లాడకుండా పదే పదే గత ప్రభుత్వంపై బురద చల్లడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు, మీ ప్రసంగాల్లో వైఎస్ జగన్ పేరునే పదేపదే ప్రస్తావిస్తున్నారు? మీ ఆలోచనల్లో, మీ రాజకీయాల్లో జగన్‌గారే కనిపిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ జగన్‌ని విమర్శించడం, ఆయన కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారం చేయడం మానేసి, మీ పాలన గురించి మాట్లాడండి. 28 నెలల పాలనలో ఏం సాధించారో, సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమిటో, సూపర్ సెవెన్ గురించి ఏం చెబుతారో ప్రజలకు వివరించండి.మద్యం కేసు, వివేకానందరెడ్డి కేసు వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడం కాకుండా, మీ ప్రభుత్వ పరిధిలోని బాధ్యతలపై సమాధానం చెప్పండి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై దృష్టి పెట్టి, వారికి ఎంత పరిహారం ఇస్తారో ప్రకటించండి. జగన్‌గారిని విమర్శించడం కాదు.. మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పమని సవాల్ చేస్తున్నా.ముగ్గురు సీఎంలు.. హెలికాప్టర్లకే మంచినీళ్లలా రూ.109 కోట్లు ఖర్చుచంద్రబాబు తాను లక్ష కోట్ల అధిపతి ఎలా అయ్యారో ప్రజలకు టెక్నిక్ చెప్పాలి. హెరిటేజ్ దుకాణాలతో, రెండు ఎకరాలతో లక్ష కోట్లు ఎలా వచ్చాయి? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. కరకట్ట ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం, గమ్యస్థానంలో మళ్లీ హెలికాప్టర్.. ఇలా ఒక్క పర్యటనకే మూడు వాహనాలు వాడుతున్నారు. ఈయనతో పాటు అబ్బాయి లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఉంటే, ఇక్కడ ముగ్గురు సీఎంలు ఉన్నట్లుగా దోపిడీ సాగుతోంది.2024-25లో విమాన ప్రయాణాలకు రూ. 54.41 కోట్లు, 2025-26లో రూ. 54.63 కోట్లు.. మొత్తంగా 28 నెలల కాలంలో కేవలం విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ. 109.04 కోట్లు తగలేశారు. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే రూ. 31 కోట్లు ఖర్చు చేసేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ కల్యాణానికి వెళ్తే టీటీడీ లెక్కల్లో రూ. 35 లక్షల ఖర్చు చూపించారు. లేస్తే ఖర్చు, కూర్చుంటే ఖర్చు అన్నట్లుగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారు.సభా వేదికలు, టెంట్లు, కుర్చీలు, మైకులు, విద్యుత్, ఎల్ఈడీ తెరలు, హెలిప్యాడ్లు, ప్రజల తరలింపునకు బస్సులు, ఇతర వాహనాలు, స్వాగత ఏర్పాట్లు, బ్యానర్లు, ప్రచార సామగ్రి, అధికారుల ద్వారా చెల్లించే బిల్లులు—వీటి ఖర్చులు ఇంకా అదనం. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా? ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ఇంత ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పర్యటనలకే ఇంత ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఈవెంట్ మేనేజ్మెంట్ పాలన - ప్రచార ఖర్చు రూ.44.62 కోట్లురాష్ట్రంలో పరిపాలన సాగడం లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుటుంబాలను కలవడం, టీ బంకుల వద్దకు వెళ్లడం, మర్మరాల వ్యాపారిణితో మాట్లాడటం వంటి కార్యక్రమాలను ప్రచార ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్టు ప్రకారం ప్రశ్నలు, సమాధానాలతో సాగిన ఈ కార్యక్రమం కోసం రూ.44.62 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు వందల మందికి మర్మరాలు అమ్ముతూ వేలల్లో ఆదాయం వస్తోందని చెప్పిన వ్యాపారినికి ముఖ్యమంత్రి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు చేసినట్లు ప్రకటించడం కూడా ప్రచారానికే పరిమితమైంది. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వం, ప్రచార కార్యక్రమాలకే ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నాం.ఒకే పథకానికి పదే పదే ప్రారంభోత్సవాలు..కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్ అన్నట్లుగా ఉంది. జగన్ హయాంలో 38 పథకాలు ఉంటే, బాబు వచ్చాక 34 పథకాలను పీకేశారు. ఇచ్చే అరకొర పథకాలకే వందల కోట్ల ప్రచారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో ఇప్పటివరకు 28 సార్లు వేర్వేరు జిల్లాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. మీ భూమి-మీ హక్కు పేరుతో 9 సార్లు సభలు పెట్టారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పేరుతో 21 సార్లు, సంజీవని ఆరోగ్య కార్యక్రమం పేరిట 4 సార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒకే పథకాన్ని ఇన్నిసార్లు ప్రారంభిస్తూ ప్రజల పన్నుల సొమ్ముతో సభలు, ఫ్లెక్సీలు, డీజేలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు.దోపిడీ కోసమే పల్లె పండుగ.. ప్రాజెక్టుల వద్ద క్రెడిట్ చోరీ..పల్లె పండుగ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో రొటీన్‌గా జరిగే పనులను తెచ్చి రూ. 11 వేల కోట్ల నిధులు తమ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. గతంలో సీ-ప్లేన్ అంటూ పెద్ద డ్రామా ఆడారు, ఇప్పుడది ఎక్కడుందో తెలియదు. వెలుగొండ ప్రాజెక్టును 85 శాతం పూర్తి చేసింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి గారే. కానీ చంద్రబాబు అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడుకుని దండాలు పెడుతూ క్రెడిట్ చోరీ డ్రామాలు ఆడుతున్నారు. అనకాపల్లి జిల్లా జిల్లాకు గోదావరి జలాలు తరలింపు అంశంలో కూడా సేమ్ డ్రోన్లు, కెమెరాలు, బొక్కబోర్లా పడుకోవడం, అప్పటికే ఉన్న లిఫ్ట్ ద్వారా నీరు తరలించి పోలవరం కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లి తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ చంద్రబాబు హంగామా చేశాడు. అక్కడ కూడా చంద్రబాబు బొక్కబోర్లా పడుకుని దండాలు పెట్టాడు. కెమెరా అనగానే చంద్రబాబులోకి పది మంది ఎన్టీఆర్‌లు, చిరంజీవులు పూనినట్లు నటిస్తారు.పాస్ పుస్తకాలపై రంగుల మార్పు.. కమిషన్ల దందా..ప్రకాశం జిల్లా కొండేపికి వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు... వైఎస్ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలకు కేవలం రంగు మార్చి ఇస్తున్నారని.. అయితే అందులో కూడా పేర్లు, సర్వే నంబర్లలో తప్పులతో ఉన్నాయని సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో రూ. 55.79 పైసలకే అత్యాధునిక క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో పుస్తకాలు ఇస్తే.. నేడు వాటి ధరను రూ. 76 చేసి.. ఒక్కో పుస్తకంపై పెంచిన రూ. 20 కమిషన్ ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు? వైఎస్ జగన్ హయాం కంటే ఒక్క విషయంలోనైనా మెరుగ్గా పరిపాలించానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఒక్క ఎస్సీలకే రూ.70 వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందించారని.. ఆయన పెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని సుధాకర్ బాబు నిలదీశారు.ఇదీ చదవండి: పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల -
BCలకు ఎగనామం.. 34% రిజర్వేషన్లను తుంగలో తొక్కిన బాబు
-
ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మేనిఫెస్టోలో హామీకి చంద్రబాబు మంగళం పాడేశారు. 34 శాతం రిజర్వేషన్ హామీకి చంద్రబాబు ఎగనామం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది.బీసీ రిజర్వేషన్ల చట్టం చేయడంపై కనీసం చర్చించని చంద్రబాబు కేబినెట్.. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించలేదు. కేంద్రాన్ని 34 శాతం రిజర్వేషన్ కోరుతూ కనీసం తీర్మానం చేయని కేబినెట్.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కి ఆమోదం తెలిపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భారీ కోత పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రులు వెల్లడించారు.ఆ జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. 26.73 శాతం పంచాయతీ వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. సర్పంచ్ లు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55, ఎంపీపీలు 24.60, జడ్పీటీసీలు 24.60, జడ్పీ ఛైర్మన్ లు 23.08 శాతం ఇస్తాం. అర్బన్ వార్డు మెంబర్లు 32.78శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02, మేయర్లు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు తీరని ద్రోహం జరిగింది. 2014-19 మధ్యలోనూ బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికలు పెట్టకుండా బీసీ నాయకత్వాన్ని తగ్గించేశారు. గతంలో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి -
బందరుకే కాదు.. ఏపీకే కమల్‌హాసన్ కొల్లు రవీంద్ర: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల విషయంలో మంత్రి వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. హార్బర్ పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో తెలియకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కొల్లు రవీంద్ర బందరుకే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కే పెద్ద కమల్‌హాసన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు 2014–19 మధ్యలోనే టెండర్లు ఖరారయ్యాయని కొల్లు రవీంద్ర చెబుతున్నారు. వాస్తవానికి 2020లోనే రూ.422 కోట్లతో హార్బర్ నిర్మాణ పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.244.8 కోట్లను నాబార్డు ద్వారా సమకూర్చుకుందని, 2020 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతులు వచ్చాయని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలుత నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించారని, అనంతరం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మరో ఆరు హార్బర్లను తీసుకొచ్చారని పేర్ని నాని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు 60 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 వరకు హార్బర్ పనులపై ఎందుకు దృష్టి పెట్టలేదని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థకే 2026 జూలైలో గడువు పొడిగించారని, ఇప్పుడు మంత్రి హార్బర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. హార్బర్ పనులను పర్యవేక్షించాల్సింది జిల్లా కలెక్టరా, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డా అని ప్రశ్నించారు. సంబంధిత మారిటైమ్ బోర్డుతో మంత్రి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.గిలకలదిండి హార్బర్లో టీడీపీ కార్యకర్త సలీమ్‌ను సూపర్వైజర్గా నియమించారని, మరో ఇద్దరు కార్యకర్తలకు రెండు బోట్లు ఏర్పాటు చేయించారని పేర్ని నాని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా పనులు ఎలా జరుగుతున్నాయో మంత్రికి వారు చెప్పలేదా అని ప్రశ్నించారు. బందరు ప్రాంతానికి తాను చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పగలనని, కొల్లు రవీంద్ర ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.గిలకలదిండిలో 22 బెల్టు షాపులు ఉన్నాయని పేర్కొన్న పేర్ని నాని.. వాటిపై సమీక్ష నిర్వహించడానికి సమయం దొరుకుతున్న మంత్రికి ఫిషింగ్ హార్బర్, మత్స్యకారుల సమస్యలపై సమీక్షించడానికి ఎందుకు సమయం దొరకడం లేదని ప్రశ్నించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని నిలదీశారు. హార్బర్ పనుల కాంట్రాక్టర్‌ను బెదిరించి, మున్సిపల్ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకోవడానికి మంత్రి అక్కడికి వచ్చారనే చర్చ గిలకలదిండిలో జరుగుతోందని ఆరోపించారు.ఇదీ చదవండి: జైల్లో పెట్టినా నా పోరాటం ఆపను: ఎమ్మెల్యే విరూపాక్షి -
సుప్రీం కోర్టు సాక్షిగా నాటకం మొత్తం బయటపడింది..
-
స్వర్ణ పరిపాలన అంట.. ఏంటయ్యా నీ స్వర్ణ పరిపాలన.. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే
-
బాబుకు సుప్రీంకోర్టు షాక్..! బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు ఏంటి?
-
బీసీలకు బాబు ద్రోహం? 34% రిజర్వేషన్లు ఏమయ్యాయి? బాబుకు జగన్ సవాల్
-
ఇక నువ్వు మారవా బాబు..! బాబుపై విరుచుకుపడ్డ బొత్స
-
చంద్రబాబూ... మీరు మిస్టర్ 420... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
2024 ఎన్నికల టెన్షన్.. భయంతో బాబు ఢిల్లీకి పరార్..
-
ఈ–పంట నమోదులో అన్నదాతలకు అగచాట్లు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా అమలైన ఈ–క్రాప్ నమోదును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ–పంట నమోదులో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కీలకమైన ఈ–పంట నమోదులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. సీజన్ ముగిసినప్పటికీ ఈ–పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్వీయ నమోదు, ప్రైవేటు సర్వేయర్ల నియామకం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు.. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు మాత్రం శూన్యమే. మరో రెండు వారాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో రైతుల ఈ–పంట నమోదు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు కరువు బారిన పడిన రైతులు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పొందాలన్నా, పంటల బీమా పరిహారానికి అర్హత పొందాలన్నా ఈ–కేవైసీ కీలకం. సీజన్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఈ–కైవేసీ నమోదు మాత్రం 19 శాతానికి పరిమితమైంది. స్వీయ నమోదుకు స్పందన శూన్యం..ఈ–పంట నమోదులో 2024 ఖరీఫ్ సీజన్లో రైతులకు మొదలైన కష్టాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్రరూపం దాల్చాయి. సీజన్ ప్రారంభమైన 20 రోజుల్లో ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏ ఒక్క సీజన్లోనూ అలా జరగలేదు. అప్లోడ్ చేసిన పంట ఫొటోలను కృత్రిమ మేధతో విశ్లేషణ చేస్తామని, ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ సమాంతరంగా చేస్తామని బాబు ప్రభుత్వం డబ్బాలు కొట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమైంది.లక్ష్యానికి ఆమడ దూరంలో..డిజిటల్ ఈ–క్రాప్ సర్వేలో ల్యాండ్ పార్శిళ్లతో పాటు రైతుల ఈ–కేవైసీ 100 శాతం పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మంజూరవుతాయి. రాష్ట్రంలో 2.76కోట్ల ల్యాండ్ పార్శిళ్లు ఉండగా, దాదాపు రెండు నెలల పాటు నమోదు ప్రక్రియ నత్తనడకనే సాగింది. చివరికి ప్రైవేటు సర్వేయర్లను నియమించడం, ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించడంతో దాదాపు 2.62 కోట్ల ల్యాండ్ పార్శిళ్లలో సాగు వివరాలను నమోదు చేయగలిగారు. కానీ కీలకమైన రైతుల ఈ–కేవైసీ నమోదు ఘోరంగా సాగుతోంది. ఈ సీజన్లో 84.34 లక్షల మంది రైతుల ఈ–కేవైసీ నమోదు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మొబైల్ యాప్‌లోనే ఈ–పంట/ఈ–కేవైసీ పూర్తి చేసే ఏర్పాటు చేశారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పని ఒత్తిడి సాకుతో వారు ఈ–కేవైసీ నమోదు జోలికి పోవడం లేదు.ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వ్యవసాయేతర పనుల కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఈ–కైవేసీ నమోదు ముందుకు సాగడం లేదు. ఓ వైపు ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతున్నాయి. ఇతర పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మరోవైపు పంటల బీమా కోసం ప్రీమియం నమోదు చేసిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపాల్సిన సమయం ముంచుకొస్తోంది. కానీ రైతుల ఈ–కేవైసీ మాత్రం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. వారానికి నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేస్తున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. దీంతో ఈ–కేవైసీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఎన్ని వేధింపులున్నా వెనక్కి తగ్గం
సాక్షి, అమరావతి: సమస్యలు పరిష్కరించకపోగా తమపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడ్డా ఏ మాత్రం వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడే సమ్మెలోకి వెళ్లామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. జీజీహెచ్‌లు, ధర్నా చౌక్‌ల్లోని నిరసన శిబిరాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు చేపట్టారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వేల సంఖ్యలో ఉద్యోగులు అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు.చంటి బిడ్డతో నిరసనవైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన ఉధృతంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా తిరుపతి రుయా ప్రాంగణంలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో గీత అనే స్టాఫ్‌నర్స్ తన చంటిబిడ్డతో కలసి పాల్గొన్నారు. ఆ చంటి బిడ్డ అమ్మఒడిలో నిద్రిస్తుండగా.. తల్లి మౌన దీక్షను కొనసాగించారు. – తిరుపతి తుడా -
అభాసుపాలయ్యాం..
సాక్షి, అమరావతి: బీసీల ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలవడంతో టీడీపీ శ్రేణులు తలెత్తుకోలేక లోలోన మథనపడుతున్నాయి. తాజా పరిణామంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ పిటిషన్ కోర్టులో నిలవదని న్యాయ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామాల్లో బీసీలకు ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చిపెట్టారని సీనియర్ నేతలు వాపోతున్నట్లు సమాచారం. అసాధ్యమని తెలిసీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి అనవసరంగా అభాసుపాలయ్యామన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ సభల్లో గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలు ఇప్పుడు బీసీల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని తలపట్టుకుంటున్నారు. 34 శాతం ఇవ్వలేమని తెలిసి కూడా చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం జీవోలు ఇచ్చి పార్టీని అభాసుపాల్జేశారని నేతలు మండిపడుతున్నారు. నిజానికి.. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటితే కోర్టులు అంగీకరించవన్నది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. 2020లో 59 శాతం రిజర్వేషన్లతో ఇచ్చిన జీవోనే హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులోనూ అప్పట్లో ఊరట దక్కలేదు. గతేడాది తెలంగాణ పెట్టిన బీసీ కోటాకు ‘సుప్రీం’లో పట్టిన గతి ఆయన కళ్ల ముందే ఉంది. అలాగే, గత పదిహేనేళ్లలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలోనూ ఇదే కారణంతో బీసీ కోటాలు కోర్టుల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసీ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బాబు ఎలా ప్రకటించారని పార్టీ సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారు.రాజ్యాంగ సవరణకు అడగని బాబు..బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఆ సవరణ కోసం కనీసం అడగలేకపోవడం చంద్రబాబు బలహీనతను బయటపెట్టిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అడిగే ధైర్యంలేక చెల్లుబాటు కాని జీవోలతో నాటకాలు ఆడామన్న విషయం బహిర్గతమైందని, బీసీల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని వారు అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఢిల్లీలో ఉంటే, ఓడిపోయే కేసు కోసం ‘సుప్రీం’ మెట్లెక్కడం వెనుక ఉద్దేశం కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడమేనని మనమే బయటపెట్టుకున్నామని వారు చెబుతున్నారు. మరోవైపు.. పార్టీలో ఇంత అసహనం వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం తన తప్పు ఒప్పుకోవడంలేదు. హైకోర్టు తీర్పు రాగానే ప్రతిపక్షమే కోర్టుకెళ్లి అడ్డుకుందంటూ నెపాన్ని వైఎస్సార్సీపీ పైకి నెట్టేశారు. అదే మాట అందరూ చెప్పాలంటూ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. కోర్టులో నిలవని హామీ ఇచ్చాక ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లిస్తామంటే ప్రజలు నమ్ముతారా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.పొత్తులపైనా ఆందోళన..ఇక కూటమిలో పొత్తుల లెక్కలపైనా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఏ కార్పొరేషన్ ఎవరికి, ఏ మున్సిపాలిటీ ఎవరికి అన్నది ఇప్పటికీ తేల్చకపోతే క్షేత్రస్థాయిలో తామెలా పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేతల స్థాయిలో ఇంకా భేటీలు, సమాలోచనల గందరగోళం కొనసాగుతుండగానే వైఎస్సార్సీపీ దూకుడు పెంచి నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అధికారంలో ఉండి కూడా ఇంతవరకూ ఏమీ తేల్చుకోలేక సతమతమవుతుంటే, వైఎస్సార్సీపీ మాత్రం స్థానిక ఎన్నికల వ్యూహాలను వేగంగా అమలుచేస్తుండడం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు. -
భూముల రీ సర్వే చేసింది నేనే
కొండపి (ప్రకాశం జిల్లా): రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు భూముల రీ సర్వే ప్రక్రియను తానే చేపట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొన్నారు. రీసర్వే 2.0 అనంతరం రాజముద్రతో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామ సభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములపై వివాదాలు సృష్టించారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించామన్నారు. వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,315 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని అన్నారు. అక్టోబరులోనే 790 గ్రామాల్లో 4 లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసింది తానే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారి అని మరోసారి తేలిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. -
హామీ ఇచ్చి డ్రామా!
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో దాదాపు సగం జనాబా ఉండే బీసీలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీ డ్రామాగా ముగిసింది. చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీ, జీవో కథ అమలుకు నోచుకోకుండానే తెర పడింది. చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని... రాజ్యాంగ సవరణతోనే అది సాకారం అవుతుందని న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు మొదటి నుంచి చెబుతున్నా చంద్రబాబు తన నాటకాన్ని ముగించలేదు. బలహీన వర్గాలను ఓట్లు కోసం పావులుగా వాడుకుంటూ తన రాజకీయ డ్రామాను కొనసాగించారు. గత ఐదారేళ్లలో దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ... 40 ఏళ్లకు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు’ అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏడాది క్రితం తెలంగాణ ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా.. ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ, మొదలైన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఏదైనా ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తే సాధారణంగా కోర్టులు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటి అసాధారణ రీతిలో కోర్టు తీర్పులు వెలువడ్డ ఉదంతాలున్నాయి. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు సర్కారు మభ్యపుచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా బీసీలకు 34 శాతం అంటూ ఆగస్టులో ఉత్తుత్తి జీవోతో డ్రామాకు తెర తీసింది.న్యాయపరంగా చెల్లవని తెలిసినా రోజుకో డ్రామాసుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న బీసీ రిజర్వేషన్ల జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదని తెలిసీ సీఎం చంద్రబాబు తన డ్రామాను రోజుకో రకంగా రక్తి కట్టించారు. జీవో ఇచ్చిన వెంటనే చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ, మిత్రపక్ష కూటమి నేతలు అది అమలుకు నోచుకోకముందే అమలైనట్లుగా ‘జయహో బీసీ’ అంటూ సంబరాలు నిర్వహించారు. పార్టీ నేతలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జీవో అమలు సాధ్యం కాదని చర్చించుకుంటూనే గత నెలన్నర రోజులకుపైగా గంభీరమైన ప్రకటనలు ఇస్తూ వచ్చారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా ఉన్నాయంటూ కొట్టివేసినా.. అత్యున్నత న్యాయస్థానానికి వెళతామంటూ ఇంకో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు. అందరూ ఊహించినట్టే సుప్రీంకోర్టు సైతం ఆ జీవో చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడం గమనార్హం. పార్లమెంట్లో చట్టబద్ధతతో అవకాశం ఉన్నా చిత్తశుద్ధి శూన్యంసుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే అందుకు పార్లమెంట్లో రాజ్యంగబద్ధంగా చట్టబద్ధత కల్పించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించడంలో టీడీపీ కూటమి పార్టీల మద్దతు కీలకం. ఇంత అవకాశం ఉన్నా బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెండున్నరేళ్లుగా చంద్రబాబు తీసుకున్న చర్యలు శూన్యం. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల రాజకీయ సాధికారతపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని బీసీ సంఘాలు, రాజకీయ వేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నాయి.తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారం..బీసీలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో విపక్షంపై నిందలు మోపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించే దుస్సాహసానికి బరి తెగించారు. ఐదేళ్ల క్రితం అడ్డుకుంది బాబు అండ్ కో నే... 2020, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దీన్ని తప్పుబడుతూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కోర్టులో కేసులు దాఖలు చేయించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు తగ్గించాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ప్రతాప్‌రెడ్డికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టడం గమనార్హం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో... న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిసూ్తనే పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి మించి అవకాశం కల్పించి మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిని చాటుకోవడం గమనార్హం.బీసీ రిజర్వేషన్లపై ఇలా...2020 జనవరి 8..పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ, బీసీలకు మొత్తం 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం. స్థానిక ఎన్నికల నిర్వహణపై అంతకు ముందే దాఖలైన పిటిషన్లపై తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు. 2020 జనవరి 10స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ల 50 శాతం దాటాయంటూ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు. 2020 జనవరి 1559 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం.2020 మార్చి2సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత కేసు దాఖలు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఎన్నికలు పూర్తి.2024 ఎన్నికల ముందు..మన రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లోని కోర్టులు స్థానిక ఎన్నికల నిర్వహణలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టమైన తీర్పులు వెలువరించిన తర్వాత కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని అమలు చేసేందుకు అవకాశం ఉన్నా మూడేళ్లుగా మభ్యపెడుతూ బాబు డ్రామాలు. 2026 ఆగస్టు...స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలోనే స్పష్టంగా తీర్పులు వెలువరించిన న్యాయస్థానాలు. చట్టపరంగా చెల్లదని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు జీవోలు. 2026 అక్టోబరు 1బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు.సుప్రీంలో... హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన. 2026 అక్టోబరు 3: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు.2026 అక్టోబరు 9: హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని పేర్కొంటూ చంద్రబాబు సర్కారు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. -
బాబు కపట నాటకానికి కోర్టులో తెర
ప్రభుత్వం నిర్వహించిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముంది? – సుప్రీం ధర్మాసనంసాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఎన్నికల మోసాలు, కపట నాటకం, మాయ వేషాలు సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి తేలిపోయాయి! బీసీ రిజర్వేషన్లపై బాబు దొంగాటకు నిమిషాల వ్యవధిలోనే అత్యున్నత న్యాయస్థానంలో తెర పడింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి అంతా బూటకమని బహిర్గతమైంది. చంద్రబాబు మోసపూరిత తీరును సాక్షాత్తూ సుప్రీంకోర్టు 1.42 నిమిషాల్లోనే బయటపెట్టింది. చంద్రబాబు సర్కారు చెల్లని డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం.. ఆ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కట్టడి చేయడం.. ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే దానికి అందించి దాని ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామనడం.. జీవోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. కమిషన్ నివేదిక పెండింగ్‌లో ఉందా లేదా? అలాంటప్పుడు దేని ఆధారంగా జీవోలిచ్చారని నిలదీసింది. ప్రభుత్వం చేసిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి.. అంటూ సూటిగా చంద్రబాబు సర్కారును నిలదీసింది. ఈ విషయంలో హైకోర్టు సరైన వైఖరినే తీసుకుందని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న గత తీర్పులను ఉద్దేశపూర్వకంగా బేఖాతర్ చేస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బాబు సర్కారు ఇచ్చిన జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (ఎస్ఎల్పీ) కొట్టి వేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఎన్నికల, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చట్టపరంగా చెల్లదని తెలిసీ చంద్రబాబు బూటకపు జీవోలతో ఈ డ్రామాను నడిపినట్లు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది. గతేడాది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంతో అప్పటికే నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలంటూ అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ కోర్టులు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కోర్టులో న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ పార్టీ నేతలతో చంద్రబాబు పాలాభిషేకాలు చేయించుకున్నారు. అనుకూల ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంతో మభ్యపుచ్చే యత్నం చేశారు.ప్రభుత్వ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని హైకోర్టు తేల్చిందిగా..?: సుప్రీంహైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చా లేదా? అనే ప్రశ్న చాలాకాలంగా ఉత్పన్నమవుతోందన్నారు. స్థానిక సంస్థల వారీగా ప్రభుత్వం సేకరించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ (సమగ్ర కుటుంబ సర్వే) డేటాను హైకోర్టు విశ్వసించకపోవడానికి ఎలాంటి కారణం లేదని రోహత్గి వాదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. అంతేకాక రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి అవసరమైన శాస్త్రీయ డేటా ఏదీ కమిషన్ వద్ద లేదని, అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేమని కూడా హైకోర్టు చెప్పిందిగా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నియామకాన్ని ఎవరూ సవాలు చేయకపోవడంతో తాము ఆ కమిషన్ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఇది చాలా సహేతుకమైన వైఖరి అని తెలిపింది.అసలు ఏ చట్టం కింద ఆ సర్వే చేశారు?కమిషన్ తన నివేదికను సమర్పించినప్పటికీ, ప్రభుత్వం దానిని ఆమోదించని విషయాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. ఈ సమయంలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ, ఆ నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటాపై ఆధారపడిందని, దానిని తాము పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని రోహత్గీ నివేదించగా... ‘అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఏ చట్టం కింద చేపట్టారు? ముందు మాకు ఆ చట్టాన్ని చూపండి’ అని ధర్మాసనం పేర్కొంది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని రోహత్గీ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఇది 57 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు అని రోహత్గీ ప్రస్తావించగా.. సారీ.. డిస్మిస్ అంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. మరోసారి రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇక్కడే ఉందని, దానిని పరిశీలించాలని కోరగా, హైకోర్టు చాలా సహేతుకమైన వైఖరితో తీర్పునిచ్చిందని సుప్రీం ధర్మాసనంస్పష్టం చేసింది. డమ్మీ కమిషన్..డెడికేటెడ్ కమిషన్ నివేదిక విషయంలో చంద్రబాబు సర్కారు తీరుపై ఆది నుంచి సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషన్ నివేదికను బహిర్గతం చేయకపోవడాన్ని ఇప్పటికే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టించుకోని కమిషన్ ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించినట్లు? డమ్మీ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని చంద్రబాబుకు తెలియదా? ఇదే విషయాలను హైకోర్టు సైతం ప్రస్తావించింది.అయితే హైకోర్టు తీర్పు తరువాత కూడా చంద్రబాబు బీసీలను మోసం చేయడం మానలేదు. అదొక డమ్మీ కమిషన్ అని హైకోర్టు తేల్చినా చంద్రబాబు ఆ కమిషన్‌ను మరికొంత కాలం పాటు పొడిగించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాదు.. చంద్రబాబు ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించాలన్న వినతిని సైతం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తద్వారా ఆ కమిషన్ నివేదికకు ఏమాత్రం విలువ లేనే లేదని చెప్పినట్లయింది. చట్టం తెలియదా బాబూ? అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పార్లమెంట్లో చట్టం చేయకుండా సాధ్యం కాదన్న సంగతి స్పష్టంగా తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబుకు చట్టం తెలియదంటే ఎవరు నమ్ముతారు? అన్నీ తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీ ఇద్దాం.. ఎలాగూ కోర్టులు దాన్ని కొట్టేస్తాయి.. ఆ నెపాన్ని న్యాయస్థానాలపై నెట్టేయవచ్చునన్న రీతిలో బాబు వ్యవహరించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తనకు సన్నిహితుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డిని రంగంలోకి దించారు. వైఎస్ జగన్ కల్పించిన రిజర్వేషన్లను హైకోర్టులో సవాలు చేయించి అక్కడ కొట్టేయించారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసేలా చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు నాడు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. 34 శాతం రిజర్వేషన్లు తాము అమలు చేసి చూపిస్తామంటూ నమ్మబలికారు. 50 శాతం పరిమితి దాటిన రిజర్వేషన్లు..రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు 20న చంద్రబాబు సర్కారు జీవో ఎంఎస్ నంబర్ 105 జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆగస్టు 19న జీవో ఆర్టీ నంబర్ 1065 తీసుకొచ్చింది. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు ఏకంగా 61.08 శాతానికి చేరుకున్నాయి. ఇది ఇందిరా సహానీ, డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావ్ గవాలీ కేసుల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఉల్లంఘించడమే. సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా, రిజర్వేషన్ల వర్గీకరణను (ఏ,బీ,సీ,డీ,ఈ) అమలు చేయకుండా కేవలం కుటుంబ సర్వే ఆధారంగా ఒకే బ్లాక్‌గా రిజర్వేషన్లు కల్పించడాన్ని హైకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను ఈ నెల 1న కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నాటి నుంచి ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న ఆయన.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?.@ncbn గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి! https://t.co/vbSjVEa2zf https://t.co/qA2PPsi4ga— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2026 -
నీకు నిజంగా BCలపై ప్రేమ ఉంటే... బాబుని ఇచ్చిపడేసిన గోరంట్ల మాధవ్
-
బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?
సాక్షి, విజయనగరం: బీసీలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోతో రిజర్వేషన్ రాదని తెలిసినా కోర్టులకు వెళ్లారు. జీవో కాదు.. రాజ్యాంగ సవరణ చేయాలని మొదటి నుంచి చెప్తున్నాం. గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ పారిపోయింది’’ అని బొత్స గుర్తు చేశారు.‘‘మాకు దమ్ము ఉంది కాబట్టే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?. వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చామో చెబుతాం. టీడీపీ.. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిందో లెక్కలు తీయాలి. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అనడానికి సిగ్గుందా?..న్యాయపరంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియ చేయలేదు. ఈ మోసాలను ఇకనైనా చంద్రబాబు ఆపాలి. ఇకనైనా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటుతో కాకుండా జీవితం గడపాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు తప్పు అని ఆ రోజే చెప్పాం. మేము ఎన్నికలను అడ్డుకోలేదు. జరపాలనే చెప్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లలో కూరగాయల ధరలు సుమారు 62 శాతం పెరిగాయని ప్రసంగంలో పేర్కొన్నారు. నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి...విద్యుత్ సరఫరా సమస్యలు, ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రచారానికే పరిమితం కావడం సరికాదు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. లేదంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు -
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబే’
తాడేపల్లి: చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్రకాశం జిల్లా కొండపిలో జరిగిన సభలో బీసీల రిజర్వేషన్ల అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పచ్చి అబద్ధాలతో బురదజల్లే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్‌రెడ్డి తో కోర్టులో పిటిషన్ వేయించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని, ఫలితంగా రిజర్వేషన్లు 24.15 శాతానికి పరిమితమయ్యాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనూ వైఎస్సార్సీపీపై నిందలు వేయడం మానకుండా, బీసీలను ఎన్నికల కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ చేయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...చంద్రబాబు సీఎం కాకమునుపే 34 శాతం రిజర్వేషన్లుస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. 1995లో తానే 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చానని, వైఎస్సార్సీపీయే వాటిని తగ్గించిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉండగా, ఫిబ్రవరి 3 నాడే ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, సెప్టెంబర్ 1న సీఎం అయిన చంద్రబాబు ఆ ఘనత తనదే అని చెప్పుకోవడం ఆయనకే చెల్లుతుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణను నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1995, ఫిబ్రవరి 3న గవర్నర్ ఆమోదించారు. 1994, డిసెంబరు 30 నుంచి ఆ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని అందులో స్పష్టంగా ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తొలి ఏడాదిలోనే జీఓ నెం:176 ద్వారా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, చంద్రబాబే తన మనిషి బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా పిటిషన్ వేయించి వాటిని అడ్డుకున్నాడు. హైకోర్టు తీర్పు కారణంగా ఆనాడు రిజర్వేషన్లు 24.15 శాతానికి పడిపోవడానికి పూర్తిగా చంద్రబాబే కారణం. హైకోర్టు కొట్టేస్తే వైఎస్సార్సీపీపై నెపంఆయన జారీ చేసిన జీవో నెం:105, 1065లను హైకోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కూడా వైఎస్సార్సీపీ పై నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈరోజు హైకోర్టులో చంద్రబాబు జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది న్యాయవాది తాండవ యోగేష్ స్వయంగా పార్టీ–ఇన్–పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు, దీనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని మాత్రమే వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది తప్ప రిజర్వేషన్లను అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ బీసీల పక్షమే ఉంటుంది కాబట్టి వారికి రాజకీయ, సామాజిక సాధికారత కల్పించింది మా ప్రభుత్వమే. చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన వెంటనే కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారుఇదీ చదవండి: బాబు పాలనంతా అబద్ధాలు.. ప్రచారాలు.. నాటకాలు..! -
BC రిజర్వేషన్లపై బాబుకు సుప్రీం చెంపదెబ్బ.. ధర్మాన ప్రసాద్ రావు రియాక్షన్
-
జగన్ స్వర్ణ పాలనపై చర్చకు సిద్ధమా? చంద్రబాబు కు లక్ష్మీ పార్వతి ఛాలెంజ్
-
బాబు పాలనంతా అబద్ధాలు.. ప్రచారాలు.. నాటకాలు..!
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, ప్రచారాలు, రాజకీయ నాటకాలేనని.. చేసిందే మళ్లీ మళ్లీ చేస్తూ.. చెప్పిందే పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం చంద్రబాబు ప్రచార పిచ్చికి నిదర్శనం. కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారా?. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కొత్త నాటకం. న్యాయస్థానాల్లో నిలబడని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించడం దుర్మార్గం. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయంగా సామాజికంగా పెద్దపీట వేసింది వైఎస్ జగన్’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.‘‘భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో వైఎస్ జగన్ చేసిన కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పనులకు పేర్లు మార్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలనే చంద్రబాబు ఐదుసార్లు పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ ఫొటో ఉందని దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు వాటిని పంపిణీ చేస్తున్నారు...రాయలసీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే చంద్రబాబుకు ప్రచారం చేసుకుంటున్నారు. రాయలసీమలో పంటలు ఎండిపోతుంటే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాయలసీమకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న చంద్రబాబు.. బడ్జెట్లో ఎంత కేటాయించారో చెప్పాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పాలి...రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటు. టమాటా, మిర్చి, పొగాకు రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో ఎన్నింటిని పూర్తిగా అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, రైతులను, పెన్షనర్లను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెడుతున్నారు...డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి పాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించడం లేదు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి.. సామాన్యుల ఆస్తులకు రక్షణ కరవైంది. ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...ముఖ్యమంత్రి, మంత్రుల ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. వైఎస్ జగన్ స్వర్ణ పాలనపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?. వైఎస్ జగన్ పాలన విధ్వంసమని ఆరోపిస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ నాటకాలను, అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు.’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
ఇబ్బంది పెట్టిన ఒక్కొక్క TDP నాయకుడికి చెప్తున్న.. పిన్నెల్లి మాస్ వార్నింగ్
-
సుప్రీంకోర్టులో బాబుకు బిగ్ షాక్.. జీవోలు కొట్టివేత
-
చంద్రబాబును కలవనివ్వడం లేదంటూ మహిళ సెల్ఫీ వీడియో..
-
ది గ్రేట్ 40 ఇయర్స్ విజనరీ చంద్రబాబు ముందు ఇది తెలుసుకోండి
-
ఎన్డీయేలో ఉండి ఏం లాభం బాబు?
సాక్షి, ఢిల్లీ/అమరావతి: వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మాములు పొలిటికల్ డ్రామాలాడలేదు. ‘చెల్లని’ జీవోలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో నారా పొలిటికల్ డ్రామాపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయినా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిసినా చంద్రబాబు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నాయి. అసలు ప్రధానితో చంద్రబాబు కనీసం దీని గురించి మాటైనా ప్రస్తావించారా? అని అంటున్నాయి. షెడ్యూల్-9 డిమాండ్ ఉందిగా..బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కేంద్రం ద్వారా పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్-9లో చేర్చాలని బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారా? సాధ్యం కాదని తెలిసినా చెల్లని జీవోలతో నాటకమాడారా? అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.గతంలోనూ ఇదే తీరంటూ ఆగ్రహంబీసీల రిజర్వేషన్ల విషయంలో టీడీపీ గతంలోనూ అడ్డంకులు సృష్టించడం.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆనాడు టీడీపీ నేత ప్రతాప్‌తో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చట్టం దిశగా అడుగులేయకుండా చెల్లని జీవోలు ఇచ్చారని మండిపడుతున్నారు.బీసీలను మరోసారి మోసం చేశారని, చంద్రబాబు తీరు వెన్నుపోటు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చంద్రబాబు చర్చించారా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? అని నిలదీస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆ కూటమిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయ నాటకమేనని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు -
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌పై సర్కారు కవరింగులు
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ప్రభుత్వం దాని కవరింగ్ కోసం నానా తంటాలు పడుతోంది. ‘వెబ్‌ల్యాండ్ హ్యాక్’ పేరుతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇచ్చిన వివరణలోనే వారి తప్పులన్నీ బయటపడ్డాయి. వెబ్‌ల్యాండ్ హ్యాక్ అవలేదని కేవలం రొటీన్ మెయింటెనెన్స్ కోసం 6వ తేదీ నుంచి రెండ్రోజులపాటు తామే సర్వర్లు నిలిపివేశామని తెలిపింది. అయితే, నిర్వహణ పేరుతో గతంలో ఎప్పుడూ వెబ్‌ల్యాండ్‌ను డౌన్ చేసిన సందర్భాలు లేవు. ప్రజలకు సంబంధించిన వివరాలు, సేవలతో ముడిపడి ఉన్న పోర్టల్స్‌ను మెయింటెనెన్స్, ఇతర కారణాలతో నిలిపివేస్తే ఆ విషయాన్ని ముందుగా ప్రజలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో సమాచారం ఇస్తారు. కానీ, ఇప్పుడు వెబ్‌ల్యాండ్ డౌన్ చేస్తే ముందే ఎందుకు ప్రకటించలేదు? ఏ కార్యాలయానికీ సర్క్యులర్ ఎందుకు పంపలేదు? ఇలాంటివి రాత్రి, సెలవు రోజుల్లో కాకుండా పని దినాల్లో, కార్యాలయాల పనివేళల్లో ఎందుకు ఆపేశారు? ఈ రెండ్రోజులు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగవని ఎందుకు ముందస్తుగా ప్రజలకు చెప్పలేదనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానంలేదు.అయితే, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడంలేదని క్రయవిక్రయాల కోసం వచ్చిన వారు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అడిగితే వెబ్‌ల్యాండ్ పనిచేయడంలేదని, ఆగిపోయిందని చేతులు దులుపుకున్నారు. నిర్వహణ కోసం నిలిచిపోయినట్లు ఎవ్వరూ చెప్పలేదు. అసలు మెయింట్‌నెన్స్ కోసం వెబ్‌ల్యాండ్ ఆగడం ఎప్పుడూ చూడలేదని రెవెన్యూ శాఖాధికారులే చెబుతున్నారు. అంటే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ కవరింగేనని స్పష్టమవుతోంది. ఊరూ, పేరు లేకుండా గుడ్డిగా వివరణ.. చివరికి.. సమాచార శాఖ ఇచ్చిన ఈ వివరణలో కనీసం ఏ శాఖ, ఏ అధికారి వివరణ పంపారో కూడా లేకపోవడం గమనార్హం. ఊరూ, పేరు లేకుండా కనీసం ఎక్కడ నుంచి వివరణ వచ్చిందో కూడా లేకుండా గుడ్డిగా రిజాయిండర్ పంపడాన్ని బట్టి ప్రభుత్వం, రెవెన్యూ శాఖలు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. సర్కారు డొల్లతనం బయటపడుతుందని.. ఇక వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయం నిజమే అయినా దాన్ని అంగీకరిస్తే భూ రికార్డుల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని తప్పును సమర్థించుకుంటున్నారు. పోర్టల్‌ను ఓపెన్ చేస్తే గురువారం రాత్రి వరకూ హ్యాక్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా హ్యాక్ కాలేదని సర్కారు బుకాయిస్తోంది. అలాగే, ప్రైవేటు వ్యక్తులకు లాగిన్లు ఇవ్వలేదని చెబుతూనే ఎన్ఐసీ ద్వారా నియమించిన రిసోర్స్ పర్సన్లకు వెబ్‌ల్యాండ్ లాగిన్లు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది. అన్నింటికీ మించి.. కీలకమైన భూముల వ్యవహారాలు, రైతుల రుణాలు, ఈ–క్రాప్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ సర్వర్ కూడా లేకపోవడం మరో వైఫల్యమేనని ఒప్పుకున్నట్లైంది. బ్లాక్‌చెయిన్, ఐటీ వంటి గొప్పలు చెప్పే ప్రభుత్వం కనీసం బ్యాకప్ కూడా సిద్ధంచేయలేకపోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగం స్వయం సమృద్ధిని తుంగలో తొక్కి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) ప్రాజెక్ట్‌ల రూపంలో ముక్కలు ముక్కలుగా చంద్రబాబు సర్కారు అమ్మేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు, పేదల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, పక్క రాష్ట్రాల్లో విఫలమైన డింక్ (డిజిటల్ నెర్వ్ సెంటర్) కార్యక్రమాన్ని సంజీవని పేరిట ప్రజల నెత్తిన రుద్దడం ద్వారా ఖజానాకు ప్రభుత్వం పెద్దఎత్తున గండికొడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రేడియాలజీ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ) సేవలను మరో పదేళ్లపాటు పీపీపీకి ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014–19 మధ్య రేడియాలజీ సేవలను పదేళ్లకు పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) ఇలా అన్ని ఆస్పత్రుల్లోని రేడియాలజీ సేవలను హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం కోసం వైద్య శాఖలో పైళ్లు వేగంగా కదులుతున్నాయని విస్తృత ప్రచారం నడుస్తోంది. తొలుత హెచ్‌ఎల్‌ఎల్‌కు సేవలన్నీ కట్టబెట్టి.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయులకు సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించేలా పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించేలా..వైద్యరంగంలో బయటి సంస్థల దోపిడీకి క్రమంగా అడ్డుకట్టవేసి ప్రభుత్వ రంగంలోనే అన్నిరకాల సేవలను బలోపేతం చేయడం కోసం గత వైఎస్ జగన్ సర్కారు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)లో డయగ్నోస్టిక్స్ విభాగం అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్ఐ, క్యాథల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి ఎంఎస్ఐడీసీ ద్వారా వాటిని నిర్వహించేలా అడుగులు వేశారు.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప జీజీహెచ్లల్లో ప్రభుత్వమే సీటీ స్కాన్ యంత్రాలను సమకూర్చింది. ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి, వాటిని నిర్వహిస్తోంది. మిగిలిన చోట్ల పీపీపీ కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసినప్పుడు కొత్తగా పీపీపీకి ఇవ్వకుండా ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్టకు వీలుండేది. కమీషన్ల కోసం ఖజానాకు గండి..ప్రస్తుతం పీపీపీ రేడియాలజీ సేవల కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో ఇది రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోనే పరికరాలు కొని ఆస్పత్రులను మరింత స్వయం సమృద్ధి చేసేలా గత ప్రభుత్వంలో అడుగులు వేశారు. ఆ విధానం ప్రకారం ప్రభుత్వమే పరికరాలను కొనుగోలు చేస్తే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు చేయడం ద్వారా వచ్చే డబ్బుతో పరికరాలకు ఈఎంఐ చెల్లించడంతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఇలా కొన్నేళ్లకు ఈఎంఐలు పూర్తయ్యాక పరికరాలన్నీ పూర్తిగా ప్రభుత్వానికి మిగిలిపోతాయి. ఈ ఉత్తమమైన విధానాన్ని గాలికొదిలేసి కమీషన్ల కోసం పీపీపీ ప్రాజెక్ట్‌లను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఖజానాకు ప్రభుత్వ పెద్దలు గండికొడుతున్నారు.‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సు.. ప్రభుత్వ యంత్రాలు ప్రైవేట్‌కు..ప్రస్తుతం పీపీపీ సేవలు నిర్వహిస్తున్న సంస్థలు లాభాపేక్షతో ఒకే స్కాన్, ఎంఆర్ఐను రెండు, మూడు రకాలుగా విభజించి దొంగ బిల్లులు పెట్టుకోవడం, ఫేక్ రెఫరల్ స్లిప్స్‌తో స్కాన్లు చేసినట్టుగా చూపించడం.. అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్లు నిర్వహించడం ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా 2019–24 మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన యంత్రాలను సైతం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) సాకుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.కాకినాడ జీజీహెచ్‌లో గుండె సంబంధిత చికిత్సల కోసం గత ప్రభుత్వంలో రూ.7 కోట్లతో క్యాథల్యాబ్‌ను సమకూర్చారు. ఇప్పుడు ‘ముఖ్య’నేత సిఫార్సుతో ఈ అధునాతన పరికరాన్ని ఓఅండ్ఎం కింద ప్రైవేట్‌కు అప్పగించేశారు. ఏకంగా సింగిల్ బిడ్ వచ్చినా ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్ అనంతపురం, ఒంగోలు జీజీహెచ్ల్లోని క్యాథ్‌ల్యాబ్‌లను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే డీఎంఈ నుంచి ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలుస్తోంది. -
నాడు 243.. నేడు 29 పోస్టులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ, మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 243 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ జీవో జారీ చేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకంగా 214 పోస్టులను గాల్లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పర్యవేక్షణ, బాలింతలు, గర్భిణులకు పోషకాహార పంపిణీ బాధ్యతలను చూసే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 243 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 61 సీడీపీవో/ఏసీడీపీవో, 161 గ్రేడ్–1 సూపర్వైజర్, 21 చి్రల్డన్స్ హోమ్స్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 2023లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీఎస్) సాధనకు 243 పోస్టులు అవసరమైతే, 2026 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 450కిపైగా ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు పోస్టులు పెంచాల్సింది పోయి ఉన్నవాటిని కుదించడమేంటని అభ్యర్థులు బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులు హోంసైన్స్, సోషల్ వర్క్, న్యూట్రిషన్ వంటి ప్రత్యేక కోర్సులు పూర్తిచేసి, నోటిఫికేషన్ వస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉద్యోగాల కల్పనపై పెద్దఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ఉన్న పోస్టులకే కోత పెట్టడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆమోదం పొందిన మొత్తం 243 పోస్టులతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఖాళీల భర్తీకి తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. -
ఫీడ్.. దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేదు.. రొయ్య రైతుల ఏకాభిప్రాయం లేదు.. అసలు రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు. అయినా రొయ్య ఫీడ్ ధరలను టన్నుకు మరో రూ.11వేలకు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. నేడో రేపో పెంచిన ధరలను అమలు చేయబోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ. 16వేలు పెంచాయి. ఇప్పుడు మరో రూ.11 వేలు. ఇలా 8 నెలల వ్యవధిలో టన్నుకు ఏకంగా రూ.27వేల మేర ఫీడ్ ధరలు పెరగడమంటే మాటలా.. తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలే కాదు, సీడ్ ధరలదీ అదే దారి. ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాలదీ అదే దారి. ఎడాపెడా పెరుగుతున్న ధరలు రొయ్యరైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు అనుయాయులవే. అందుకే వాళ్లు ఎలా కావాలంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అష్టకష్టాలు పడి, అధికధరలను భరించి ఆక్వా సాగు చేసి రొయ్యపంట చేతికొచ్చేసరికి వ్యాపారులంతా సిండికేట్‌గా తయారయ్యి రేట్లు పడిపోయేలా చేస్తున్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు సర్కార్ ఈ సిండికేట్‌కు వంతపాడుతుండడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా పెంపుఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టంతో పాటు ఫీడ్, సీడ్ «చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల పక్షాన నిలవాల్సిన రాష్ట్రప్రభుత్వం ఫీడ్కంపెనీల అడుగులకు మడుగులొత్తడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఫిబ్రవరిలో రూ.4వేలు, జూన్‌లో రూ.12వేల చొప్పున పెంచేశాయి. రైతుల ఆందోళనలతో రూ.2వేలు తగ్గించినట్టు నాటకాలాడిన కంపెనీలు 15 రోజులు తిరక్కుండానే దొడ్డిదారిన రూ.2వేలు పెంచి ఆ మేరకు రైతులపై భారం మోపాయి. 45 రోజులకోసారి ధరలపెంపును సమీక్షించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించారు.ప్రత్యేకంగా ఫీడ్ ధరల సమీక్ష కోసం రైతులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీలో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు సిఫార్సు చేసిన ప్రభుత్వ అనుకూల రైతులకే చోటు కల్పించారు. వీరు ఫీడ్ కంపెనీలకు వంతపాడడం మొదలు పెట్టారు. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలను సాకుగా చూపి టన్నుకు రూ.37 వేలు తక్కువకాకుండా పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతూ కనీసం రూ.15 వేలు తక్కువకాకుండా పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంపును అమలులోకి తీసుకొచ్చాయి. కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వతీరును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు.రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులతో చర్చించి, వారి ఆమోదంతోనే ధరలను సవరించాలని సూచించింది. అప్పటివరకు పెంపును నిలిపి వేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. తాజాగా సబ్ కమిటీ ఆమోదంతో దొడ్డిదారిన టన్నుకు రూ.11వేలు పెంచేందుకు సిద్ధపడ్డాయి. ఈ పెంపును ఒకటి రెండు రోజుల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫీడ్ ధరల సబ్ కమిటీలో సభ్యులైన రైతుప్రతినిధులు కంపెనీలు ప్రతిపాదించిన ధరల పెంపు విషయమై ఆక్వా సాగయ్యే జిల్లా సంఘాల నేతలతో కానీ, రాష్ట్ర రైతు సంఘాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మేత ధరల భారమిలా2024 ఏప్రిల్‌లో టన్నుకు వెనామీ రొయ్యల మేత ధర రూ.82 వేలు, టైగర్ రొయ్యల మేత రూ.92 వేల మధ్య ఉండగా ప్రస్తుతం వెనామీ మేత రూ.1.18 లక్షలకు, టైగర్ మేత రూ.1.34 లక్షలకు చేరింది. అంటే రెండున్నరేళ్లలో టన్నుకు వెనామీ రైతులపై రూ.36 వేలు, టైగర్ రైతులపై రూ.42 వేల మేర భారం పడినట్టవుతుంది. మేత ధరల భారంతో కిలో రొయ్యల ఉత్పత్తికి వెనామీకి రూ.300కు, టైగర్‌కు రూ.450 ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఆక్వా రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీలు ఏడాది లేదా ఆరు నెలలకు సరిపడా ముడిసరుకులను ఒకేసారి ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకుంటాయే తప్ప నెలకోసారి దిగుమతి చేసుకోవని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా నవంబర్ లేదా డిసెంబర్లో ధరల సమీక్ష చేయాలే తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల అంగీకారంలేకుండా, వారి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతే తాము ఎలా సాగు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోందని, అదేసమయంలో కౌంట్ ధరలు మాత్రం ఇష్టానుసారంగా కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం వంతపాడడం సరికాదంటున్నారు.ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుబడి ఆధారంగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ దోపిడికి గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. మరొక వైపు ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాల ధరలు కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1000కు పైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.మేత ధరల పెంపును నిరసిస్తున్నాంతాజాగా టన్నుకు రూ.11వేల మేర మేత ధరలు పెంచాలన్న ప్రతిపాదనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.16వేల మేర భారం మోపారు. మేత కంపెనీలు, ప్రాసెసింగ్ నిర్వాహకులకు సిఫార్సులతో కూటమి ప్రభుత్వం నియమించిన ఫీడ్ ధరల రైతుల సబ్ కమిటీ సభ్యులతీరు వల్లే మాకీ పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల కోసారి ఫీడ్ ధరలు సమీక్షించే విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వతీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. – దుగ్గినేని గోపీనాథ్, కన్వీనర్, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య జగన్ హయాం.. ఆక్వా రైతుకు స్వర్ణయుగం.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆక్వా జోన్స్‌ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని వర్తింపచేసింది. ఆక్వాకు సంబందించిన విద్యుత్ సర్వీసుల్లో దాదాపు 90 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా, దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. పైగా ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడు సార్లు కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఉపసంహరింపచేయడంతో టన్నుపై రూ.8,600 మేర ఆదా అయ్యింది. పైగా 15 రోజులకోసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు.దొంగల్లా మేత కంపెనీలు200 ఎకరాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆక్వా సాగు చేస్తున్నాం. మేత కంపెనీలు దొంగల్లా తయారయ్యారు. తాజా పెంపుదలతో 8 నెలల వ్యవధిలో ఏకంగా రూ.27వేలు పెంచినట్టవుతోంది. మరొక వైపు కౌంట్ ధరలకు సైతం ఎడాపెడా కోతలేస్తూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ వర్తించడం లేదు. ఓవర్ లోడ్ పేరిట ప్రతి నెలా రూ.12వేల వరకు అదనపు భారం పడుతోంది. జనరేటర్లతోనే ఆక్వా సాగు చేస్తే మేలన్నట్టుగా కన్పిస్తోంది. వైరస్లు, తెగుళ్ల కంటే చంద్రబాబు (సీబీ) వైరస్ వలనే ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. – వేగేశ్న వెంకటరాజు, చిన్నకాపురం, పశ్చిమగోదావరి జిల్లాఎకరాకు రూ.72వేల అదనపు భారంనేను 35 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటికే టన్నుకు రూ.16వేల మేర పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.11వేల మేర పెంచనుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో ఎకరాకు రూ.72వేల మేర అదనంగా భారం పడుతోంది. కౌంట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30–50 నుంచి రూ.10–30కు తగ్గించేశారు. విద్యుత్ సబ్సిడీ వస్తుందని ఎదురు చూసాం. కానీ అమలుకు నోచుకోవడంలేదు. సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారం మోపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. – అల్లూరి కృష్ణంరాజు, ఖాతాల మెరక, పశ్చిమగోదావరి జిల్లావిద్యుత్ సబ్సిడీకీ ఎగనామంజోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీని రెండున్నరేళ్లుగా అటకెక్కించేశారు. మరొక వైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదడంతో యూనిట్ రూ.1.50కే విద్యుత్ పొందే రైతు భూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు తప్ప ఈ రెండున్నరేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు ఈ రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. అదే సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, యూనిట్‌కు రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు ఛార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
‘విదేశీ నిపుణుల కమిటీని సీరియస్‌గా తీసుకోండి’
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి జీవనాడి అని, అలాంటి పోలవరానికి కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లోపించిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెబుతోందని, ఇప్పటికి ఏడుసార్లు వచ్చిన అంతర్జాతీయ కమిటీ లేవనెత్తిన అంశాలకు కూటమి ప్రభుత్వం సమాదానాలు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడబ్యూసీకీ, పోలవరం అధారిటీకీ పోలవరం నాణ్యత లోపాలపై కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని కురుసాల గుర్తు చేశారు. దీనిపై ఒక్క సమీక్ష కూడా ప్రభుత్వం చేపట్ట లేదన్నారు. ‘ఒకపక్క ప్రాజెక్టు ను ఎత్తును తగ్గించి.. మరోవైపు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. అభ్యంతరాలను కమీటీ లేవనెత్తితే ప్రభుత్వం నుండి స్పందన లేదు. చేసేవన్ని వెన్నుపోటు పనులు.. ఎదుట వారి పై బురద చల్లడమే కూటమి పరిపాటిగా పెట్టుకుంది. కమిటీ నివేదికను ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా తీసుకోవాలి. జాతీయ స్థాయి ప్రాజెక్టుకు క్వాలిటీ సర్టిఫికేట్ కాంట్రాక్టర్ ఇస్తారా?, ఏ కాంట్రాక్టర్ కోసం పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. కేంద్ర కట్టాల్సిన జాతీయ స్ధాయి ప్రాజెక్టు ను మేమే కడతామని చంద్రబాబు తీసుకున్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోది... చంద్రబాబుకు పోలవరం అంటే ఏటీఎం అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ్టీకీ కూడా పోలవరంను ఏటీఎంగా చంద్రబాబు వాడుకుంటున్నారు. డయాఫ్రం వాల్‌ను తాపత్రయ పడి చంద్రబాబు ఎందుకు ముందు కట్టారు?దాని వల్లే పోలవరం నిర్మాణానికి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికీ ఏడు సార్లు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు రిబ్బన్ కట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం కుదించేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్రానికి ఊహకి అందనంత శాశ్వతమైన నష్టం కలగబోతుంది. 75 టిఎంసిల నిల సామర్థ్యం తగ్గిపోయింది. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల గ్రావెటీ వల్ల కాలువల్లో నీరు పారదు. ఉత్తరాంధ్ర సుజల సృవంతి కలగా మిగిలిపోనుంది. గ్రేడింగ్ చేయని రాళ్ళతో నిర్మాణం చేస్తున్నారు అని కమిటీ గుర్తించింది. నాణ్యతే లేదని కమీటీ చెబుతుంటే...మీరేమో డయాఫ్రమ్ వాల్ ఇన్ని రోజుల్లో పూర్తి చేశామని సినిమా మాదిరిగా రికార్డులు చెబుతున్నారు. పోలవరంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్. ఎవరో చేసిన పనికి రిబ్బన్ కట్ చేసి నేనే చేశానని చంద్రబాబుకు చెప్పుకోవడం అలవాటు. మీ డిజైన్ల లోపం వల్లే ఆనాడు పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయింది. విదేశీ నిపుణుల కమిటీని సీరియస్‌గా తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అయ్యే అవకాశం కేంద్రంలో కనిపిస్తొందా?, కొంతమందిని ఆకర్షించడానికి చంద్రబాబు పునర్విభజన పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారు’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి? -
సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు
-
సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: వివేకా హత్య కేసుతో చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. వివేకా కేసులో న్యాయం జరగాలా? లేక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలా?. సునీత దంపతులు చంద్రబాబును కలవటానికి కారణం ఏంటి?. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసుల వార్తలు వచ్చిన వెంటనే సునీత దంపతులు.. చంద్రబాబును ఎందుకు కలిశారు’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘వివేకా హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని చంద్రబాబును కలిశారా?. లేక కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం చర్చించారా?. సునీత కుటుంబానికి రాజకీయ పదవుల విషయంలో చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా పాత కేసులకు కొత్త స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. ప్రజలు సమాధానాలు అడిగితే క్రైమ్ థ్రిల్లర్ వినిపిస్తున్నారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది చంద్రబాబూ.. కానీ ఎడిటింగ్‌లోనే మీ రాజకీయ వ్యూహం బయటపడుతోంది’’ అంటూ శైలజానాథ్ చురకలు అంటించారు.‘‘గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు.. మరి వెన్నుపోటు పార్టీ చరిత్రను ప్రజలు మర్చిపోతారా?. వివేకా హత్య కేసులో నిందితులు చంద్రబాబు దగ్గరకు ఎందుకు వస్తున్నారు?. టీడీపీ కార్యాలయానికి దస్తగిరి కుటుంబం వచ్చారన్న వార్తలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?. వివేకా హత్య కేసులో నిందితులకు రాష్ట్ర మంత్రులు మద్దతుగా తెలపడం వెనుక కారణమేంటి?. సునీత ఏనాడైనా తన తండ్రి కేసును త్వరగా ముగించాలని ఎందుకు కోరటం లేదు?. వివేకా హత్య కేసులో రాజకీయ ఆరోపణలు మానుకోవాలి..ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా? లేక చంద్రబాబు ప్రభుత్వ సిట్ కథనాన్నే కొనసాగిస్తోందా?. రాష్ట్రంలో కరువు, రైతుల కష్టాలు, డీఎస్సీ అక్రమాలపై సమాధానం లేదు. చంద్రబాబుకు గొడ్డలి రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే వివేకానందరెడ్డి గుర్తుకొస్తారా?. ఆయన మరణానికి న్యాయం జరగాల్సిన అవసరం మిగతా రోజుల్లో ఉండదా?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ! -
వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?: శ్యామల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం.. యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపామంటూ సీఎం చంద్రబాబు సినిమా డైలాగులు చెబుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితకు టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆర్తనాదాలు హోంమంత్రి అనితకు ఏమాత్రం వినిపించడం లేదు. డేగ కన్నులంటూ ప్రచారం చేసుకుంటున్న ఈగల్ విభాగం సాధించిన వాస్తవ ఫలితాలేంటో స్పష్టం చేయాలి’’ అంటూ శ్యామల నిలదీశారు.‘‘అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయిని లేకుండా చేస్తామన్న హోంమంత్రి సవాల్ ఏమైంది? కూటమి నేతలు ఆడుతున్నది స్ట్రెయిట్ గేమ్ కాదు, యువత భవిష్యత్తును నాశనం చేసే టాక్సిక్ గేమ్. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం అత్యంత సిగ్గుచేటు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్రపై ప్రజలు నిలదీస్తున్నా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, యాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.’’ అని శ్యామల ధ్వజమెత్తారు.‘‘హోంమంత్రి చెప్పిన మూడు నెలల డెడ్‌లైన్ తర్వాతే రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆగస్టు 27న గోకవరంలో 75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సెప్టెంబర్ 2న విజయవాడ శివారులో గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు. సెప్టెంబర్ 4న అనకాపల్లిలో 3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న విశాఖ పెదగంట్యాడ వద్ద బెంగళూరు నుంచి తెచ్చిన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 27న అల్లూరి జిల్లా పెద్దబయలు వద్ద 1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. సెప్టెంబర్ 28న అనకాపల్లి జిల్లా కోడూరు జంక్షన్ వద్ద 5.5 కోట్ల విలువైన 43 లీటర్ల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.,,ఈ రోజు విశాఖపట్నంలో 50 గ్రాముల ఎండీఎంఏ, లీటర్ యాష్ ఆయిల్ దొరకడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హోంమంత్రి సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నా స్పందించడం లేదు. ఈగల్ వెబ్సైట్ లెక్కల ప్రకారమే 2,444 కేసులు, 6,332 అరెస్టులు, 6 లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రంలో గంజాయే లేదని ప్రచారం చేస్తూ వెబ్సైట్లో వేల కేసులు ఎలా చూపిస్తున్నారు. ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ, సేఫ్ క్యాంపస్ వంటి కార్యక్రమాల వల్ల ఒరిగింది శూన్యం.జగనన్న ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన ద్వారా 90 శాతం గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాం. నాడు గంజాయి సాగుదారులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో అనకాపల్లి కోడూరులో 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశాం. పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పట్టుబడుతున్న డ్రగ్స్ వెనుక ఉన్న ప్రధాన ఫైనాన్షియర్లు, సూత్రధారులను ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోంది. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై నమోదైన కేసుల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించాలి.రాష్ట్ర యువతకు కావాల్సింది టీవీ షోల వినోదం కాదు, డ్రగ్స్ ముప్పు నుంచి సంపూర్ణ రక్షణ. డ్రగ్స్‌పై కంటితుడుపు ప్రచారాలు కాదు, పూర్తిస్థాయి సరఫరా నెట్వర్క్ నిర్మూలన కావాలి. మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆదేశాలను పాటిస్తూ హోంమంత్రి అనిత కేవలం కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. విపక్ష నాయకులపై నిందలు వేయడం మాని హోంమంత్రి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ సమస్యను మరింత దిగజార్చింది’’ అని శ్యామల దుయ్యబట్టారు.ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం? -
వైఎస్ జగన్ దృష్టిలో బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ప్రచార ఆర్భాటం తప్ప బీసీలకు టీడీపీ ఏమి చేయలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ (గురువారం) ఆయన వైఎస్సార్సీపీ బీసీల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేయడంలో చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు చాలా తేడా ఉందన్నారు. బీసీలను సమాజంలో తలెత్తుకునేలా వైఎస్ జగన్ చేశారన్నారు.‘‘టీడీపీ నేతలు ఎందుకు చంద్రబాబు మోసాన్ని నిలదీయలేకపోతున్నారు? పుట్టిన ప్రాంతానికి, కులానికి న్యాయం చేయమని టీడీపీ బీసీ నేతలు ఎందుకు అడగడం లేదు? టీడీపీ నేతలు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నారు. వైఎస్ జగన్ దృష్టిలో బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్. బీసీలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు వైఎస్ జగన్ ఇచ్చారు. పార్టీ కమిటీల్లో బీసీలకు పెద్ద పీట వేశారు’’ అని బొత్స వివరించారు.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకునే కుట్ర: అంబటి -
నువ్వు, నీ కొడుకు.. నీ మనవడు బాగుంటే చాలా..? మా బతుకులు ఇంతేనా..?
-
బీసీలను మోసం చేసిన చంద్రబాబు.. బిసీల కాళ్లు కడగాలి
-
వర్షం పడితే రాజధాని ఎక్కడుందో అని పడవలు ఎక్కి వెతకాల్సిన పరిస్థితి
-
దమ్ముంటే ఎన్నికలు సక్రమంగా జరిపించు.. YSRCP సత్తా ఏంటో నీకు చూపిస్తాం
-
బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విశాఖ: బీసీలపై చంద్రబాబు ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. చివరకు 24 శాతానికి తగ్గడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తప్పు చంద్రబాబు చేసి.. నెపాన్ని వైఎస్ జగన్‌పై నెడుతున్నారని మండిపడ్డారు. పేదల విద్య, వైద్యం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కృషి చేశారని పేర్కొన్నారు.విశాఖలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ పేరుతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ నేతలు హాజరయ్యారు. 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసం, బీసీ నేతలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చించారు.అనంతరం, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. బీసీలను విస్మరించిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదన్నారు. 34 శాతం రిజర్వేషన్లు నిలవవని తెలిసినా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసింది వైఎస్సార్సీపీయే అని అన్నారు. టీడీపీ బీసీలకు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ధర్మాన ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఎవరికి కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో వెల్లడించాలని ప్రశ్నించారు.బీసీల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంటే.. బీసీలు మాత్రం సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే పరిస్థితి వచ్చిందని ధర్మాన వ్యాఖ్యానించారు. రాజధానిలో బీసీలకు ఎకరం భూమి ఉందా? అని ప్రశ్నించారు. పేదల విద్య, వైద్యం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ కృషి చేశారని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని పెద్ద చెరువును తలపించిందని ధర్మాన విమర్శించారు. రాజధాని ఎక్కడుందో పడవలు ఎక్కి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి! -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకునే కుట్ర: అంబటి
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్ దశలోనే అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అంబటి ఆరోపించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మాట్లాడుతూ.. తహసీల్దార్లకు ఫోన్ చేసి ధ్రువపత్రాలు ఇవ్వొద్దని చెప్పే స్థాయికి చంద్రబాబు, లోకేశ్ దిగజారారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశామని, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గణనీయంగా పెరిగింది. అలాగే, వైఎస్సార్సీపీ ప్రజాదరణ పెరుగుతోంది. నిజాయితీగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లు తిరస్కరిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.అలాగే, తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం తమ ప్రభుత్వ హయాంలో రెండెకరాల భూమిని కేటాయించామని అంబటి తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తయ్యే దశలో భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. కోర్టు నోటీసు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ వాటిని పట్టించుకోలేదని అన్నారు. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీసు ఇచ్చారని, స్మశానవాటిక కోసం భూమిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు నివాసానికి అనుమతులు లేవని తాము ఆరోపిస్తున్నప్పటికీ, ఆయన కోర్టును ఆశ్రయించి ఇంటి కూల్చివేతను అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అంశంపైనా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం? -
రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!
ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా ప్రచారం చేస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. వైఎస్సార్సీపీ ప్రభుత్వ టైమ్‌లో విశాఖ రిషికొండపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి గుదిబండగా ఉన్నాయని ఎల్లో మీడియా ఒక కధనాన్ని ఇచ్చింది. దానిని చదివితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంత అసమర్ధంగా ఉందా అన్న అభిప్రాయం కూడా వస్తుందని ఆ మీడియా ఊహించి ఉండకపోవచ్చు. అదే టైమ్‌లో విశాఖపై ఎల్లో మీడియాకు ఇంత ద్వేషం ఉందా అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో సర్కార్‌కు అర్ధం కావడం లేదట.రిషికొండ భవనాలే గుదిబండ అయితే మరి రాజధాని అమరావతి పేరుతో అప్పులు తెచ్చి మరీ వేల కోట్ల వ్యయంతో చేస్తున్న నిర్మాణాలను దేనితో పోల్చాలి! రిషికొండలో మహా అయితే 400 కోట్లు ఖర్చు పెట్టి ఉండవచ్చు. ఆ భవనాలు సముద్ర తీరాన ఠీవిగా కనిపిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ నేతలు ఎవరైనా విశాఖకు వస్తే అక్కడ వారికి విడిది వసతి పెట్టడం గొప్పగా ఉంటుందని అప్పట్లో ఆ ప్రభుత్వం తలచింది. కాని తదుపరి అనూహ్యంగా కూటమి అదికారంలోకి వచ్చింది. దాంతో రిషికొండకు గ్రహణం పట్టించారు. ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్లకాలం పూర్తి అవుతున్నా, ఆ భవనాలను ఎలా వినియోగించాలన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారంటే ఏమనుకోవాలి! ఎంతసేపు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ అవసరాల కోసం నిర్మించారని దుష్ప్రచారం చేయడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. ప్రభుత్వ గెస్ట్ హౌస్‌గా వాడుకోవచ్చు , లేదా మరేదైనా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఆ భవనాలను ఏమి చేయాలో తెలియడం లేదని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంటున్నారంటే ఆయన సీనియారిటీ అంతా ఏమైనట్లు అనుకోవాలి! రుషులు బస చేసిన కొండ అంటూ చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు చెబుతారు. ఆ భవనాలను ప్రైవేటు హోటళ్లకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పుడు ఈ సెంటిమెంట్ ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి అందలం వేస్తారన్న అభిప్రాయానికి తగ్గట్లుగానే ఆలోచన చేశారన్నమాట. అది కూడా ఒక కొలిక్కి రాలేదు. వారు ఇంకా అదనంగా భూమి కోరారట. ఇప్పుడు దానిని సమకూర్చడం కోసం ప్లాన్ చేస్తోంది.నేరుగా ఆ భూమి కూడా కేటాయిస్తే విమర్శలు వస్తాయి కనుక, ముందుగా జగన్ పై వీలైనంత బురదచల్లి, ఆ తర్వాత కామ్ గా తన పని కానివ్వాలని భావిస్తున్నట్లు ఉన్నారు. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆ భవనాల నిర్మాణం క్రిమినల్ వేస్టు అని అన్నారట. నిజానికి భవనాలు సిద్దంగా ఉన్నప్పటికీ, చేతకానితనంతో వాడుకోలేకుండా వృధాగా పెట్టడం క్రిమినల్ వేస్టే అన్నది అనుభవజ్ఞలు వ్యాఖ్యగా ఉంది. వైసిపి ప్రభుత్వంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఒక అసత్యాన్ని ఎల్లో మీడియా ప్రచారంలోకి తెస్తోంది. అదే నిజమైతే డేటాసెంటర్ల పేరుతో పది కొండలను గుండు కొట్టినట్లే కాదు.. సింహాచలం కొండతో సహా మొత్తం కొండలే కనిపించకుండా అన్నట్లు తవ్వేస్తున్నారు కదా!దానికి ఏ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది?విశాఖకు అన్ని డేటా సెంటర్లతో, నీరు, విద్యుత్ ,కాలుష్యం తదితర సమస్యలు వస్తాయని మేధావులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదే! ఎల్లో మీడియా శరభ, శరభ అంటూ కూటమి ప్రభుత్వానికి భజన చేస్తోందే!పర్యావరణ నిబంధనలకు పూర్తి విరుద్దంగా కృష్ణా నది గర్భంలో నిర్మించిన ప్రజావేదిక తాత్కాలిక కట్టడాన్ని గత ప్రభుత్వం కూల్చితే దానిని విధ్వంసం అని విష ప్రచారం చేశారే. అంటే ఎల్లో మీడియాకు ఇష్టమైతే పర్యావరణంతో సంబంధం లేకుండా ఏమైనా చేయవచ్చు. లేకపోతే టీడీపీ కోసం పచ్చి అబద్దాలతో బురద చల్లుతుందన్నమాట. అంతేకాదు. మూడు పంటలు పండే వేలాది ఎకరాల భూమిని రాజధాని నిమిత్తం తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికార కమిటీ సూచిస్తే, ఆ కమిటీనే దూషించారే. ఆ నివేదికనే పక్కనబెట్టారే! ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పవచ్చు. రిషికొండ భవనాలకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేసిన పిటిషన్లను హైకోర్టు అప్పుడే కొట్టేసింది. ఆనాటి మంత్రి రోజా ఆ భవనాలను ప్రారంభించారు కూడా. అయినా ఆ భవనాలను లీజుకు ఇవ్వరాదంటూ మళ్లీ పిటిషన్ లు వేశారట. అది వేసింది టీడీపీ నేతలేకదా! వారితో వాటిని ఉపసంహరింప చేయడం కూడా టీడీపీ నాయకత్వానికి కుదరదా!అంటే ఏదో వంకతో భవనాలు వేస్ట్ గా ఉంచి, జగన్ పై తప్పుడు ప్రచారం చేయడమే వీరి లక్ష్యం అన్న భావన కలగదా! అదే టైమ్ లో తమకు కావల్సినవారికి ఆ భవనాలను, అక్కడే ఉన్న మరో తొమ్మిది ఎకరాలను కట్టబెట్టడానికి ప్లాన్ చేశారట. అప్పుడు రుషులు తపస్సు చేసుకోకుండా వెళ్లిపోయానా ఫర్వాలేదా! నిజానికి ఎప్పటినుంచో రిషికొండపై టూరిజం భవనాలు ఉన్నాయి. వాటి స్థానంలో అదునాతన భవనాలను జగన్ ప్రభుత్వం నిర్మించింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేసి , దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంలో భాగంగా భవనాలు నిర్మించడానికి జగన్ చేసిన కృషిని నిర్వీర్యం చేసే పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నమాట. ఒక ఐటి కంపెనీ కూడా ఈ భవనాలు తీసుకోవడానికి ముందుకు వచ్చిందని, కాని హైకోర్టులో కేసుల వల్ల లీజుకు ఇవ్వలేకపోతున్నామని లోక్ సభ సభ్యుడు భరత్ అన్నారు. మరో వైపు మంత్రి దుర్గేష్ మాత్రం త్వరలోనే ఈ భవనాలను వినియోగంలోకి తెస్తామని అన్నారు. ఇన్ని కబుర్లు చెప్పే కూటమి పెద్దలు, ఎల్లో మీడియా అమరావతిలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి మాత్రం మాట్లాడరు. పైగా అదో అధ్బుతమని ప్రచారం చేస్తారు.కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల భూమి వరద నీటితో మునిగిపోయింది.వరద కారణంగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని మీడియాలో కధనాలు వచ్చాయి. కేవలం వరద నియంత్రణ ప్రాజెక్టులకోసమే వందల కోట్లు వెచ్చిస్తున్నారు. సచివాలయ టవర్ల భవనాల అద్దాలకు 2500 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని అమరావతి జేఏసీ రైతులు కోరారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. గ్రామకంఠాల విషయంలో వారు అధికారుల తీరుతెన్నులను ఎంతగా తప్పుపట్టారో అందరికి తెలిసిందే. అమరావతిలో డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి మరో న్యాయం జరుగుతోందని కూడా వారు ధ్వజమెత్తారు. వీటిపై మాత్రం వార్తలు ఇవ్వని ఎల్లో మీడియా రోజుకో కధ అల్లి, అమరావతిలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించడానికి నానా పాట్లు పడుతుంటుంది. అందులో భాగంగా ఏ చిన్న డెవలప్మెంట్ ఉన్నా ఆహో, ఓహో అంటూ ఊదరగొడుతుంటుంది. ఐదెకరాలలో అమెజాన్ అడవిని సృష్టించబోతున్నట్లు రాసిన ఘనత కూడా ఎల్లోమీడియాదే. విజయవాడకు అమరావతిని అనుసంధానం చేస్తూ జల ప్రాజెక్టును చేపడతారట. వీటిలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయో, ఎన్ని దాల్చవో తెలియదు కాని, ఎల్లో మీడియాలో వచ్చే కధనాలు చూస్తే ఇప్పటికే అమరావతి ప్రపంచస్థాయి నగరం అయిపోయిందేమో అని జనం భ్రమపడవలసిందే. జగన్ ప్రభుత్వ టైమ్ లో విశాఖపై ఎంత విద్వేష పూరిత స్టోరీలను ఎల్లో మీడియా ప్రచారం చేసిందో గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల ముందు , విశాఖ నగర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఎల్లో మీడియాకు పట్టవన్న సంగతి తెలుస్తూనే ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ.. పుత్తా శివశంకర్ సంచలన నిజాలు
-
పోలవరం ప్రాజెక్టులో అంతా ఇష్టారాజ్యం.. పనుల్లో నాణ్యత లేదని తేల్చిచెప్పిన విదేశీ నిపుణుల కమిటీ
-
కూటమి కొంప ముంచిన CEC జ్ఞానేశ్ కుమార్..
-
చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ!
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం సీఎం చంద్రబాబును కలిశారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సునీత దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో సీఎంతో నర్రెడ్డి దంపతులు తరచూ ప్రత్యేకంగా సమావేశమౌతున్నారు. ప్రతినెలా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం, వీళ్లు కలవడం చర్చనీయాంశమవుతోంది. ఎంత సాన్నిహిత్యం లేకపోతే సీఎంను అలా పదే పదే నెలనెలా అత్యవసరంగా కలవగలుగుతారు అని విశ్లేషకులంటున్నారు. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసు గురించి 3వ తేదీన తెలిస్తే.. 1వ తేదీనే ఎల్లో మీడియా శివాలెత్తింది. రాష్ట్రంలో ఈడీ అధికారుల నోటీసులు, వాటి గురించి ఎల్లో మీడియాలో ముందే కథనాలు రావడం అందరూ గమనిస్తున్నవే. ఈడీ నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ‘ఎక్స్‌క్లూజివ్’ వార్తల పేరిట బయటకు వస్తున్నాయని, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాదాపు అదే ప్రకారం ఈడీ చర్యలు సాగుతుండడం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందగానే వివేకా కుమార్తె సునీత చంద్రబాబును కలవడం వీరి కుట్రపూరిత రాజకీయ బంధానికి తిరుగులేని నిదర్శనమని విమర్శకులంటున్నారు. టీడీపీ జడ్పీటీసీగా అనురాగ్.... మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తిరిగిన సునీత దంపతులకు టీడీపీ అధినేత ఇంతలా ఎలా సన్నిహితం అయ్యారనేది బహిరంగ రహస్యమే. టీడీపీలో లేకపోయినా సునీత దంపతులకు జడ్పీ ఛైర్మన్ పీఠం నజరానాగా దక్కింది. సునీత దంపతులు జడ్పీ ఛైర్మన్‌గిరి కోరడం, ఆమేరకు సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడం తెల్సిందే. సునీత భర్త రాజశేఖరరెడ్డి సోదరుడు శివప్రకాష్ రెడ్డి కుమారుడు నర్రెడ్డి అనురాగ్‌రెడ్డిని బరిలో నిలిపేందుకు అంతా సిద్ధమయ్యింది. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాగ్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన మండలంలో పలువురి మద్దతు కోరుతున్నారు. నర్రెడ్డి దంపతులు టీడీపీ అధిష్టానంతో టచ్‌లో ఉండి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
అంతర్జాతీయ, ప్రైవేట్ వర్సిటీల కోసం పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్ధలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తెచ్చేందుకు ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం–2026కు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, భారతీయ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు అర్హత ప్రమాణాలు, ప్రోత్సాహకాలు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రభుత్వం ఎంపిక చేసిన అకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ఆ వివరాలు.. » రాష్ట్ర విద్యా వ్యవస్థ నిబంధనల్లో మార్పుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం–1982లోని పలు సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేసి, నోటిఫికేషన్ ఇచ్చి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. » ఇళ్ల స్థలాల సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మరో మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్దిదారులు వదిలేసిన రిజిస్టర్డు స్థలాల రిజి్రస్టేషన్ రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. » విధుల్లో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ ఇస్తారు. సేవలో ఉన్న పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఆమోదం. » 2026–27 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం జారీ చేసిన జీవోకు ఆమోదం. » సంక్షేమ వసతి గృహాలు, గురు కులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అందించే నెలవారీ డైట్ ఛార్జీలను పెంచే జీవోకు ఆమోదం. » గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించడానికి విశాఖపట్నంలోని మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు జీవోకు ఆమోదం. కేబినెట్ సమావేశానికి నలుగురు డుమ్మా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్, కందుల దుర్గేష్ బుధవారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. కార్యక్రమాలు ఉన్నాయని ముగ్గురు, విదేశాల్లో ఉండడంతో ఒకరు గైర్హాజరయ్యారు. చంద్రబాబు కేబినెట్ సమావేశాలను సైతం సమీక్షా సమావేశాల తరహాలో నిర్వహిస్తుండడంతో మంత్రులు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి సమావేశానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు గైర్హాజరుకావడం పరిపాటిగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రులు అసలు వాటి గురించే పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏడాదైనా కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, అమరావతి: రోజూ జనాలకు సుద్దులు చెబుతూ కథనాలు వండివార్చే ఈనాడు దినపత్రిక యజమాని కిరణ్ సమీప బంధువుకు చెందిన కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఐపీఎల్) భూ అక్రమాలకు సంబంధించిన వ్యాజ్యంలో ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మిగిలిన ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయగా, ప్రభుత్వం ఒక్కటే కౌంటర్ దాఖలు చేయలేదని, కౌంటర్ దాఖలుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీసింది. ఏడాదిగా కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని కౌంటర్ దాఖలులో అలసత్వం ప్రదర్శించిన అధికారి జేబు నుంచి వసూలు చేసి, దాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అప్పీళ్లతో పాటు ఇతర వ్యాజ్యాలు ఏవైనా ఉంటే, వాటన్నింటినీ ఈ పిల్‌కు జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెజ్ కోసం రైతుల నుంచి తీసి ఇచ్చిన భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి తెలియకుండానే కేఐపీఎల్ అమ్మేసుకుంటున్నా బాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ, ప్రతిపక్షంపై బురదజల్లుతూ అన్ని రకాలుగా ఈనాడు పత్రిక సహకరిస్తుండటంతో బాబు సర్కార్ చోద్యం చూస్తోంది. బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎంపీఎస్ఈజెడ్) ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయకుండా ఆ భూములను థర్డ్ పార్టీ కంపెనీలకు అమ్మేసుకోవడం, ఏపీఐఐసీకి తెలియకుండా రుణాలు తీసుకుంటున్నా ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు బాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్ ఎస్ఈజెడ్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్ అక్కడ ఎలాంటి సెజ్ ఏర్పాటు చేయలేదని, దీని పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, గూడూరుకు చెందిన నాను మునీంద్రరెడ్డి 2025 సెప్టెంబర్ లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన అప్పటి సీజే ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, కేఐపీఎల్ తదితరులకు కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. భూ కేటాయింపులే పెద్ద మోసం కేఐపీఎల్కు భూ కేటాయింపులు భారీ మోసం. ఇంతకు మించిన మోసం దేశంలో ఎక్కడా జరగలేదు. బహుళ ఉత్పత్తుల ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి, రైతులకు చెందిన 4,731 ఎకరాల భూమిని పొందిన కేఐపీఎల్ ఇప్పటి వరకు అక్కడ ఏమీ చేయలేదు. చిన్నపాటి రోడ్డూ వేయలేదు. ఈ 17 ఏళ్లలో చిన్న నిర్మాణం కూడా చేయలేదు. భూములు అమ్మేసుకుంటోంది ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయాల్సింది పోయి, తీసుకున్న భూములను ఇతరులకు అమ్ముకుంటోంది. అంతేకాక కొన్ని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇలా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం ఎస్ఈజెడ్ పేరుతో తీసుకున్న భూముల్లో రూ.30 వేల కోట్ల విలువ చేసే సిలికా శాండ్ ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,500 కోట్లు రాయల్టీ వస్తుంది. కేటాయించిన భూముల్లో కేఐపీఎల్ ఏమీ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆదాయాన్ని కూడా కోల్పోతోంది. రూ.1,500 కోట్ల పన్ను మినహాయింపు కేఐపీఎల్ ఇన్ని అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. పైపెచ్చు ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల మేర పన్ను మినహాయింపులు ఇచ్చింది. మోసాల్లోకెల్లా ఇది అతిపెద్ద మోసం. ఇంత జరుగుతున్నా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. – సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు -
చిరుద్యోగులపై చంద్రబాబు సర్కార్ ప్రతాపం
సాక్షి, అమరావతి: హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న చిరుద్యోగులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపుతోంది. ఏకంగా ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేస్తామని బెదిరిస్తోంది. సర్వీస్ రెగ్యులరైజేషన్, ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూనియన్ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు దిగుతోంది. ఇంటెలిజెన్స్ పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆందోళనలు విరమించకపోతే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని కుటుంబసభ్యులను హెచ్చరిస్తున్నట్టు వెల్లడైంది. 30 మందికిపైగా నోటీసులు సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా వివిధ రూపాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు.. ఇలా వివిధ విభాగాల్లోని 14 వేలమందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు వైద్యశాఖ షోకాజ్ నోటీసులు ఇస్తోంది.అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన 30 మందికిపైగా ప్రతినిధులను ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేసిన వైద్యశాఖ.. గురు, శుక్రవారాల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనక్కి తగ్గంసమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అత్యవసర సేవలను బహిష్కరించారు. జీజీహెచ్‌లు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున చేరి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడింది.తక్షణమే రెగ్యులర్ చేయమని కోరడం లేదు కోవిడ్ వ్యాప్తి సమయంలో మేమంతా ప్రాణాలకు తెగించి పోరాడాం. కొన్నేళ్లుగా పనిచేస్తున్న మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని మేం కోరుతున్నాం. వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా మేం డిమాండ్ చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలోగా రెగ్యులర్ చేస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని అడుగుతున్నాం. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే పోలీసులు మా నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్తున్నారు. ఉద్యోగాలు పోతాయని కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. నిరసన తెలపడం భారత రాజ్యాంగం మాకిచ్చిన హక్కు. ఎన్ని బెదిరింపులకు దిగినా మేం బెదరం. – అజయ్‌కుమార్, కన్వీనర్, వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగసంఘాల జేఏసీ అన్ని సౌకర్యాలు కల్పించాలి వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపుల్లో వీరు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. చట్ట ప్రకారం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రజారోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత అమానుషంగా ఉందని, ప్రభుత్వ తీరువల్ల ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వారిని సైతం రోడ్డు మీదకు ఈడ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరు వల్ల వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న దాదాపు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. నేడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తీవ్ర మోసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీస చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ న్యాయబద్ధంగా రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు జీవో ఆర్టీ నెం:459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. రెండు నెలలుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు సేవలందించిన ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మర్చిపోయింది.అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్‌కు సమయం పడితే జీవో ఆర్టీ నెం: 459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు పే, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం మినిమం టైమ్ స్కేల్‌తో పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ, అనస్తీషియా టెక్నీషియన్లకు న్యాయం చేయాలి. 14,600 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగుల కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశాం. దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అప్పట్లో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రభుత్వ సేవల్లో కొనసాగుతూ కష్టపడి పని చేస్తున్నారని, వారిని గుర్తించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తించేలా చర్యలు తీసుకున్నాం.అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్ని శాఖల్లో గుర్తించి రెగ్యులరైజ్ చేయడానికి చట్టపరమైన చర్యలు కూడా చేపట్టాం. 2023లో ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్‌ను కూడా తీసుకొచ్చాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు.ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మంచి పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇస్తామని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పింది. మెడికల్ ఉద్యోగులతో పాటు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు, సీహెచ్‌వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సహకార బ్యాంకు ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్నాయి.రిటైర్ అయిన అధికారులకు పదేపదే రీ–అపాయింట్మెంట్లు ఇవ్వడం ఆపి, కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. -
నిజంగా విచారణ జరుగుతోందా?: ఎంపీ గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: ఈడీ వ్యవహార శైలిపై ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఈడీ స్వతంత్ర సంస్థానా..? చంద్రబాబు జేబు సంస్థా? అంటూ ట్వీట్ చేశారు. పలు వార్తా సంస్థలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన గురుమూర్తి.. ఈడీ అనేది దర్యాప్తు సంస్థా? చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్’కు పొడిగింపుగా మారిందా? అంటూ ప్రశ్నించారు.‘‘ఈడీ వ్యవహార శైలి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ఎలా వస్తున్నాయి?. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అదే ప్రకారం ఈడీ చర్యలు ఉంటున్నాయి. అక్రమ మద్యం కేసుతో పాటు అనేక చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్’ రూపొందించిన కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోంది. వైఎస్సార్సీపీ పార్టీయే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తారా?..ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్ర వ్యవస్థలా పని చేయాలి. అలా కుండా రాజకీయ కక్ష సాధింపు కోసమే పని చేస్తే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతాయి. అసలు ఇక్కడ నిజంగా విచారణ జరుగుతోందా? కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోందా?. దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడాలంటే అవి స్వతంత్రంగా, పారదర్శకంగా పని చేయాలి. విచారణ ప్రక్రియ స్థానంలో రాజకీయంగా తయారైన స్క్రిప్టులు అమలవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే.. ముందుగా దెబ్బ తినేది ఆయా సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే’’ అంటూ గురుమూర్తి ట్వీట్ చేశారు.Is the ED @dir_ed still an independent central agency, or has it become an extension of @ncbn 's coalition government’s SIT? The pattern is brazen and deeply troubling: details of notices and raids surface first as “exclusive” scoops in Yellow Media, and then, almost on cue, the ED follows the same script hours later. The ED is dancing to Chandrababu Naidu’s tunes in the foisted liquor and other cases, carrying forward his government’s SIT narrative and targeting YSRCP to serve his political interests and settle scores with the opposition. If an investigative agency starts looking less like an independent institution and more like an instrument of political vendetta, the public is left with a serious question: are we witnessing an investigation or state-sponsored theatre? Institutions earn public trust through independence, transparency, and due process. Once they are replaced by political scripts, that trust is the first casualty. @ndtv @IndiaToday @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @thewire_in @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic— Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 7, 2026ఇదీ చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ -
కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
బాబు మీటింగ్ కు పోతే.. ఏం పెట్టారో తెలుసా! చూస్తే దిమ్మతిరిగిపోద్ది
-
దమ్ముంటే రాయలసీమ ప్రాజెక్ట్ కట్టు, అబద్దాలలో బాబు, పవన్ పోటీ పడుతున్నారు
-
ప్రొద్దుటూరులో వివేకా కేసుపై బాబు కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన రోజా
-
మంత్రి మండిపల్లి రాజకీయానికి చెక్ పడిందా?
సాక్షి, అమరావతి : జిల్లా టీడీపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. నేతలను కరివేపాకులా వాడుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన మనసెరిగిన వారు చెబుతారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యూహం చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజంపేట టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌ను రాజకీయంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జిల్లాలో తన వర్గ ప్రాబల్యం కోల్పోవడంతో ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన మార్క్ రాజకీయాలను తెరపైకి తెస్తుండటం గమనార్హం. రాయచోటి నుంచి గాలివీడుకు ఓటు మార్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రసాద్ రాయచోటి మున్సిపాలిటీ నుంచి తన ఓటును గాలివీడుకు బదిలీ చేయించుకున్నారు. ఈ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఆయనను చంద్రబాబు బరిలోకి దింపి పోటీ చేయిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తే ప్రసాద్ కు జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతుండగా ఈ వ్యవహారం మండిపల్లి వర్గానికి మింగుడు పడడం లేదు. రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మండిపల్లి ప్రస్తుతం మంత్రిగా ఉండగా అదే నియోజకవర్గానికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని మండిపల్లి వర్గం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు తెలిసిన వారు ‘ఇదేమీ ఆశ్చర్యం కాదని.. రాజకీయ అవసరాలకు వాడుకొని, వదిలించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ అని వివరిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా..చంద్రబాబు అంతిమ లక్ష్యం ప్రసాద్‌ను రాయచోటి టీడీపీ అభ్యర్థిగా చేయడమేనని తెలుస్తోంది. దీని కోసమే మంత్రికి వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకయిన ప్రసాద్‌ను పక్కలో బల్లెంలా తీసుకొచ్చారని రాజకీయ పండితులు వివరిస్తున్నారు. ఇప్పటికే ఒంటరి చేశారు మండిపల్లికి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు క్రమక్రమంగా ఆయనకు జిల్లాలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కొంతకాలం క్రితం మండిపల్లి పీలేరు నియోజకవర్గం కలికిరిలో పర్యటించేందుకు కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోగా.. పార్టీ అధిష్టానం నుంచి కలికిరికి వెళ్లొద్దంటూ ఆదేశాలు రావడం తెలిసిందే. దీంతోపాటు పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో అక్కడ నేతలతో కలిసి పర్యటించలేని పరిస్థితిని తీసుకొచ్చారు. తద్వారా మండిపల్లి మంత్రి అయినప్పటికీ కేవలం రాయచోటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇదీ చదవండి: గత ఎన్నికల్లో రూ.31 కోట్లు ఖర్చు పెట్టా -
చంద్రబాబూ.. నీది నోరా లేకపోతే ఏంటి?: ఆర్కే రోజా ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. అబద్ధాల విషయంలో చంద్రబాబు, పవన్ పోటీ పడుతున్నారని అన్నారామె.బుధవారం నగరిలో రాయలసీమపై చంద్రబాబు ప్రదర్శిస్తున్న కపటప్రేమను ఆమె బయటపెట్టారు. ‘‘రాయలసీమపై ప్రేమ ఉందని చెబుతున్న మీరు.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి. రూ.24 వేల కోట్ల ప్రాజెక్టులు పెట్టామని అంటున్నారు.. అవి ఎక్కడున్నాయో ప్రజలకు చూపించండి’’ అని నిలదీశారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కరువు.. చంద్రబాబు కవల పిల్లలుచంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని రోజా అన్నారు. ‘‘కరువు, చంద్రబాబు కవల పిల్లలు’’ అంటూ విమర్శించారు. గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో సాగునీరు, వ్యవసాయంపై తీసుకున్న చర్యలను చూసి చంద్రబాబు పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో దమ్ముంటే రికార్డులు బయటపెట్టాలని సవాల్ చేశారు. ‘రైజింగ్ రాయలసీమ’ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో ఎవరూ పోటీ పడలేరని రోజా వ్యాఖ్యానించారు.అమరావతి వరదల్లో వేల కోట్లు?అమరావతి ప్రాంతంలో వరదల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా రోజా విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయలను అమరావతి వరదల్లో, బురదలో చంద్రబాబు పారబోస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు. కుప్పానికి, పిఠాపురానికి కూడా నీళ్లు ఇవ్వలేని వారు రాయలసీమ అభివృద్ధి గురించి పెద్ద మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టడం అంత సులభం కాదని, ఎన్నికల్లో ఈ విషయాలను ప్రజలు గమనిస్తారని వ్యాఖ్యానించారు.అధికారంలో వచ్చి 27 నెలలు పూర్తైన ఇంకా డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పోటీ పడుతున్నారు. జగన్ హయాంలోనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. మూడేళ్లు అవుతున్నా పనులు చేయకుండా క్రెడిట్‌చోరీ చేస్తున్నారు. రాయలసీమకు సాగునీరు, ప్రాజెక్టులు, కొత్తగా అందించిన ఆయకట్టు వివరాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచాలని ఆమె అన్నారు.ఇదీ చదవండి: లోకల్ సమరం వేళ టీడీపీ బెదిరింపులు! -
లక్ష కోట్ల ఉద్యాన హబ్.. రైతుల కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు, కథలు చెప్పడంలో మహా నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. రాయలసీమలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పనిలో పనిగా తనకు తానే తగిలించుకున్న వాటర్ మాన్ బిరుదును కూడా గుర్తు చేసుకుని రాయలసీమలో ప్రాజెక్టుల ఘనత తనదేనని కూడా తెలిపారు. మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో హబ్‌కు శ్రీకారం చుట్టారు. అక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపనకు నాంది పలికారు. ఈ స్కూల్ ఏర్పాటు చేయడం వరకు ఓకే. దానివల్ల రైతులకు ఉపయోగం జరిగితే మంచిదే. కాకపోతే దీనిపై సందేహాలు రావచ్చు. రిలయన్స్ కంపెనీ నెలకొల్పితే,సామాన్యులకు అందుబాటులో ఎంతవరకు ఉంటుందన్నది చెప్పలేం.ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదవాలంటే సుమారు ఏభై లక్షల వరకు ఫీజలు ఉంటాయట. గత రెండు దశాబ్దాలలో ఈ స్కూల్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమిటో తెలియదు. అయినా ఒక సంస్థ ఏర్పడితే దానిని ఆక్షేపించనవసరం లేదు. ఇక రాయలసీమ హబ్ గురించి విశ్లేషించుకుందాం. ఎల్లో మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ప్రస్తుతం 20.77 లక్షల ఎకరాలలో రాయలసీమలో పండ్ల తోటలు ఉన్నాయి. కొత్తగా ఈ హబ్ ద్వారా మరో తొమ్మిది లక్షల ఎకరాలకు విస్తరిస్తారట. అంటే ఏమిటి దీని అర్దం ఇప్పటికే 21 లక్షల ఎకరాలలో తోటలు ఉంటే హబ్‌గా అభివృద్ది చెందినట్లే కదా! 9 లక్షల ఎకరాలలో విస్తరిస్తే కొత్తగా హబ్ అవడం ఏమిటి? దీనితో రాయలసీమ భవిష్యత్తు మారిపోవడం ఏమిటి? దీనిపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత రెడ్డి ఒక వ్యాఖ్య చేస్తూ లక్ష కోట్ల హబ్ కాదు.. లక్ష అబద్దాలతో పాలని అని ఎద్దేవా చేశారు.వ్యవసాయాన్ని గబ్బు పట్టించి హబ్బులంటూ ప్రచారమా అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా రాయలసీమ అంటూ ఆకర్షణీయమైన డైలాగులతో అబద్దాల హబ్‌గా మార్చారా అన్న అభిప్రాయం కలగవచ్చు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపిలో ఉద్యానవన రైతులతో సహా వివిధ ఇతర పంటలు వేసే కర్షకులంతా నానా పాట్లు పడుతున్నారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతులు పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు. పండించిన మామిడికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రోడ్డు మీద కాయలను పారేసిన ఘట్టాలు కనిపించాయి.మరోవైపు ఈ ఏడాది వర్షాలు లేక తోటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకోవడం కోసం టాంకర్ల ద్వారా నీటిని తోలుకోవడానికి రైతులు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఎల్లో మీడియా వీటన్నిటిని కప్పిపుచ్చుతూ రాయలసీమకు శుభకరం, ఫలప్రదం అంటూ శీర్షికలు పెట్టి హబ్ అంటూ పాఠకులను మాయ చేయడానికి తంటాలు పడుతోంది. తన ప్రార్ధనవల్లే విశాఖలో వర్షాలు పడ్డాయని చిత్రమైన వాదన ప్రచారం చేసుకున్న చంద్రబాబు రాయలసీమలో వానల కోసం ఎందుకు ప్రార్ధనలు చేయలేదో తెలియదు. ఒకవేళ చేసినా అది ఫలించలేదా అన్నది సామాన్య రైతుల ప్రశ్నగా ఉంది. చిత్రమేమిటంటే తాను వాటర్ మాన్ అనిపించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు. కాని ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సైతం తీవ్రమైన కరువు ఉందని ప్రభుత్వం అధికారిక జాబితాలో వెల్లడించింది. 1989 నుంచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు అక్కడ కరువు జాడలు లేకుండా చేసి వాటర్ మాన్ అయ్యానని చెప్పుకుంటే ఒప్పుకోవచ్చు.ప్రాజెక్టుల నిర్మాణంపై ఆయన చేసిన కృషి అంతంతమాత్రమే అయినా, మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు వాటర్ మాన్ అని చెప్పుకుంటే జనం నమ్ముతారా! నిజంగానే ఈయనే వాటర్ మాన్ అయితే రాయలసీమలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఉద్యానవనాలతో పాటు, వివిధ పంటలకు నీళ్లందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు, నీలంసంజీవరెడ్డి వంటివారిని ఇంకెంత గొప్పగా పిలవాలి? జగన్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ తీసుకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కోరిక మేరకు దానిని నిలిపివేసిన చంద్రబాబు వాటర్ మాన్ ఎలా అవుతారో అర్ధం కాదు. ఒకపక్క సీమలో కుప్పంతో సహా అత్యధిక మండలాలు కరువుతో అల్లాడుతుంటే ఇలాంటి డైలాగుల వల్ల ప్రజలలో అపహాస్యం పాలవ్వరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.లక్ష కోట్ల రూపాయల హబ్‌లో కేంద్రం నలభై వేల కోట్లు ఇస్తుందట. ఆ మాట కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట మాత్రంగా కూడా ఎందుకు చెప్పలేదో అన్న మీమాంస ప్రజలలో ఏర్పడింది. అంటే ఇది ప్రచారం కోసమేనా అన్న సందేహం వస్తోందన్నమాట. మిగిలిన అరవైవేల కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడతాయట. ఇది నమ్మశక్యంగా ఉందా? అందుకే కల్లబొల్లి కబుర్లు, కాకమ్మ కథలుగా పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం వెల్లడించినదాని ప్రకారం తొలి దశలో 2026-27 లో 12 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తారట. ఈ ఆర్ధిక సంవత్సరం ఆరు నెలులు గడిచిపోయింది. మిగిలిన 6 నెలల్లో ఇంత భారీ మొత్తం వ్యయం చేస్తారంటే విశ్వసిస్తారా? 2029 నాటికి మూడో దశ పూర్తి అవుతుందట. ఎల్లో మీడియాలో వచ్చిన వివరాలను చూస్తే ఈ మూడేళ్లలో నలభై వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది.ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!అది కేంద్రం ఇస్తుందా? లేక రాష్ట్రం ఖర్చు చేస్తుందా? ప్రైవేటు సంస్థలు వ్యయం చేస్తాయా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.ప్రైవేటు సంస్థలైతే ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రైతులకు ఎలా ఉపయోగం కలుగుతుంది?అన్నదానిపై క్లారిటీ లేదు. రైతుల పొలాలను లీజుల పేరుతో తీసుకోవడానికి ఇందులో ఏమైనా ప్లాన్ ఉందేమో తెలియదు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్, నాణ్యత పెంపు, విస్తరణ తదితర కార్యక్రమాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ప్రపంచ ఉద్యాన కేంద్రం అని, రాయలసీమ రైజింగ్ అంటూ ప్రచార ప్రకటనలు గుప్పించి ఈ సభ జరిపారు. రైతులకు జరిగే మేలు ఏమో కాని అడ్వర్టైజ్ మెంట్లకు భారీగానే ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎల్లో మీడియాలో అదరగొట్టే హెడింగ్‌లు వచ్చాయి.ఇదీ చదవండి: చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? అద్భుత ప్రస్తానానికి నాంది అని, రాయలసీమ తలరాత మార్చే ఉద్యాన హబ్ అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే ప్రపంచంలో ప్రతి మూలకు మన ఉద్యాన ఉత్పత్తులు అని ఆయన అంటున్నారు. నిజానికి ఇప్పటికే ఆయా ఉద్యాన ఉత్పత్తులు దేశ వ్యాప్తంగాను, ఇతర దేశాలకు రాయలసీమ నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఇకపై కూడా ఎగుమతి అవుతాయి. ఆ క్రెడిట్ అంతా తమదేనని కూటమి పెద్దలు ప్రచారం చేసుకోవచ్చన్నమాట. ఇదంతా డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని, అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలలో వ్యక్తం అవుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆడే గేమ్ ఇదన్నది రాయలసీమ ప్రాంతంలో బలపడుతున్న అభిప్రాయంగా కనిపిస్తుంది. లక్ష కోట్ల హబ్ కాదు.. లక్ష మోసాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా ప్రకటనలు చేస్తే రైతుల కడుపు నిండుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పార్టీలో చేరకపోతే పాత కేసులు తిరగేస్తాం!
వైఎస్ఆర్ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టీడీపీ పడరానిపాట్లు పడుతోంది. ప్రతి వార్డు నుంచి టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. పార్టీలో చేరాలంటూ సాధారణ స్థాయి నుంచి దినసరి కూలీల వరకూ.. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరతామంటే ఫ్లెక్సీల ఏర్పాటు దగ్గర నుంచి టపాసుల ఖర్చు వరకు టీడీపీనే భరిస్తుందంటూ లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు బేరసారాలు టీడీపీ నేతలు సాగిస్తున్నారు. ఇటీవల ఒక యువకుడిని టీడీపీలో చేరకపోతే పాత కేసులు తిరగతోడుతామంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి ద్వారా బెదిరించి పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం ఇచ్చిన నిధులు శూన్యంపులివెందులలో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేయడం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా.. పులివెందులకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు శూన్యమని తెలియడంతో.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిల్ రద్దయిన తర్వాత గత మూడు నెలలుగా పులివెందుల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కనీసం చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ కూడా పట్టించే పరిస్థితి లేదని తెలుస్తోంది. చెత్త సేకరణ వాహనాలను రిపేర్ చేయడానికి కూడా డబ్బులు లేక మూలన పడే స్థాయికి మున్సిపాలిటీ చేరిందని, వీధి దీపాలు, భూగర్భ జలాలు అడుగంటి ప్రజలకు తాగు నీరు ఇచ్చే మోటార్లు కాలిపోతే వాటిని కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు.అధికారంలో లేకున్నా..మరమ్మతులకు గురైన మోటార్లకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డిలు సొంత నిధులతో పనులు చేయడం జరుగుతోంది. అధికారంలో లేని సమయంలో కూడా పులివెందుల అభివృద్ధికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు అండగా నిలిచి దాదాపు రూ.2.50 కోట్ల మేర పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ పనులు పూర్తి చేశారు. పులివెందుల నియోజకవర్గంలో కానీ, పులివెందుల మున్సిపాలిటీలో కానీ వైఎస్ కుటుంబం గత 40 ఏళ్లుగా చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేస్తోందని పులివెందుల ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే. అయితే అధికారంలో ఉన్నా పులివెందుల టీడీపీ నాయకులు పులివెందుల మున్సిపాలిటీకి కానీ, నియోజకవర్గానికి కానీ చేసిందేమి లేదు. కానీ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మీడియాలో షో చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను నమ్ముకున్న టీడీపీరాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోలీసులను నమ్ముకుంది. ఇక్కడ సబ్ డివిజనల్ అధికారి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా తొత్తుగా వ్యవహరించడమే కాకుండా.. టీడీపీ నాయకుడిగా çపని చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో కేవలం ఆ అధికారి అండతో పోలీసులను అడ్డు పెట్టుకుని గట్టెక్కాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నాయకులకు పులివెందుల ప్రజలు తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఎంతమాత్రం లేదు. అందుకే ప్రజలను విస్మరించి పోలీసుల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
చాగంటి నీ ఒక మాట అన్నాడని ఆ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి ఏం చేసారో చెప్పమంటారా
-
SIR దెబ్బతో బాబు, పవన్ లో టెన్షన్.. EVMల మాయాజాలం.. AP ఎన్నికలు చెల్లవు!
-
నిబంధనలకు ‘సెల్లు’చీటి
సాక్షి, అమరావతి: కంచె చేను మేసిన చందంగా చంద్రబాబు పాలనలో హెల్త్ వర్సిటీ తీరు తయారైంది. వైద్య విద్య పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీలోని ముఖ్య అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో నంద్యాల మెడికల్ కాలేజీలో కొందరు వైద్య విద్యార్థులను ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి సెల్ఫోన్లు సమకూర్చి కాపీ కొట్టించిన ఘటనను ఇటీవలే ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండగా సోమవారం అదే నంద్యాల మెడికల్ కాలేజీలో మరో ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల కాలేజీ వర్గాలిచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన పాథాలజీ ప్రాక్టికల్ పరీక్షల్లో సెల్ఫోన్లు దగ్గర పెట్టుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరీక్షలు నిర్వహించలేమంటూ వెళ్లిపోయిన ఎగ్జామినర్ సెల్ఫోన్లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా విద్యార్థులు పట్టుబడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కళాశాలలోని కొందరు వైద్యులు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఇందుకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ససేమిరా అనడంతో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఏకంగా విద్యార్థులను సెల్ఫోన్లతో ఎగ్జామ్ హాళ్లలోకి అనుమతించడం, దీన్ని తప్పుబడితే బెదిరింపులకు దిగడంతో ఈ కాలేజీలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేవని ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ లేఖ రాసి వెళ్లిపోయినట్టు కళాశాల వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆగస్టు నెలలోనూ 150 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కొందరు విద్యార్థులను వేరే గదిలోకి తరలించి నంద్యాల కళాశాల ఫ్యాకల్టీ కాపీ కొట్టించారు. బరితెగింపు కాపీయింగ్‌ను పట్టుకున్న స్పెషల్ అబ్జర్వర్‌ను బెదిరించడమే కాకుండా పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే కాపీ కొట్టిస్తున్నామని జవాబిచ్చారు. హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ మావాడే పైకి ఫిర్యాదు చేసినా మాకేం కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. వీరు చెప్పినట్టే స్పెషల్ అబ్జర్వర్ వర్సిటీకి ఫిర్యాదు చేసినా బరితెగించిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ కమిటీలో రిజిస్ట్రార్ నంద్యాల మెడికల్ కాలేజీలో ఆగస్టులో చోటు చేసుకున్న బరితెగింపు కాపీయింగ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు దిగింది. ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని వేసినట్టు తెలిసింది. ఆ కమిటీలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ను ఓ విచారణ అధికారిగా నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారితో విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని నంద్యాల మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ ప్రశ్నిస్తున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులే తూతూ మంత్రం విచారణతో సరిపెట్టాలని చూస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని వైద్య విద్య వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి. -
సచివాలయాల సేవలకు కోత
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాటి ద్వారా ప్రజలకందే సేవల్లో కోతలు మొదలుపెట్టింది. విద్యార్థులు, రైతులకు ఎక్కువ అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టదారు పాస్‌పుస్తకాలు, నీటితీరువా చెల్లింపు సేవల్ని సచివాలయాల నుంచి దూరం చేసింది. రెవెన్యూశాఖకు సంబంధించి కీలకమైన ఈ నాలుగు సేవలు ప్రజలకు ఎంతో అవసరం. గతంలో ప్రభుత్వాఫీసుల్లో చిన్నపని పడినా గ్రామీణ ప్రాంత ప్రజలు తమ రోజువారీ పనులన్నీ మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజలకు ఈ ఇబ్బందుల్ని తప్పించి వారి గ్రామాల్లోనే, ఇళ్లవద్దే సేవలు అందించేందుకు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 540కి పైగా ప్రభుత్వ సేవల్ని ఈ సచివాలయాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు దాదాపు 10 కోట్ల సేవలను పొందారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రజలకు ప్రతి సందర్భంలోను ఎక్కువ అవసరం పడే కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీ (రీ ఇష్యూ), పట్టాదారు పాస్‌బుక్ పునఃముద్రణ (రీ ప్రింట్), రైతుల నీటితీరువా పన్ను చెల్లింపు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా నిలిపేసింది. సచివాలయాలతోపాటు మీ–సేవ కేంద్రాల్లోను ఆ సేవలు లేకుండా చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు చదువులకు, ఉద్యోగాలకు, పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు.. గతంలో తమకు మంజూరైన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల పునఃజారీకి సచివాలయాల్లో దరఖాస్తు చేసి మళ్లీ తీసుకుంటారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆ సేవల్ని దూరం చేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊళ్లోనే ప్రజలకు సేవలందించే వ్యవస్థను కనుమరుగు చేసేందుకేనా? ప్రజలకు సొంత ఊళ్లలోనే ఆయా సేవలను అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను క్రమంగా కనుమరుగు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. అందుకే రెండేళ్లుగా సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, మంత్రులు విషం చిమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం గత ప్రభుత్వం ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడాన్ని అనవసరంగా చేసినట్లు చంద్రబాబు, మంత్రులు నిందలు వేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రేషనలైజేషన్ పేరిట ఒక్కో సచివాలయంలో ఉండే ఉద్యోగుల సంఖ్యను కుదించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందే ప్రభుత్వ సేవలను కూడా దూరం చేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను దూరం చేస్తూ.. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. చివరికి ఈ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించేదిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవల్లో కోతలు విధించిందన్న చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగులను ఇంటింటి ప్రభుత్వ సర్వేలకు, అధికార పార్టీలకు ఉపయోగపడే ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే రాజకీయ ప్రచార కార్యక్రమాలకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతూ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడినే వాడుకొని, తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రలు మరోసారి పటాపంచలయ్యాయి. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారినీ వాడుకోవాలన్న కుతంత్రాలకు తెరపడింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయంటూ నానా రాద్ధాంతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఆయన బృందం ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి తేటతెల్లం చేసింది. చంద్రబాబు అండ్ కో ఆరోపించిన విధంగా శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులు లేవని నెల్లూరు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ప్రధాన ఛార్జిషీట్లో చెప్పిన సీబీఐ.. ఇదే కోర్టుకు తాజాగా సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లోనూ ఇదే విషయం మరోమారు విస్పష్టంగా చెప్పింది. చంద్రబాబు అండ్ కో వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన బురద జల్లేందుకు గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నివేదిక ఆధారమంటూ చేసిన ప్రచారమంతా అబద్ధమని మరొకసారి సిట్ తేల్చింది. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ నివేదిక తేటతెల్లం చేసినట్లు అనుబంధ ఛార్జిషీట్లో తేల్చి చెప్పింది.ఏఆర్ డెయిరీకి చెందిన నాలుగు నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలపై హరియాణాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో కూడా జంతు కొవ్వులేవీ లేవని తేలిందని నివేదించింది. అంతే కాక మైసూర్ సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌లో పరీక్షించిన బోలే బాబా డెయిరీ నెయ్యి నమూనాల్లో కూడా జంతు కొవ్వులు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ సేకరించిన వివరాలతో నెల్లూరు ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో పేర్కొన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు జంతువుల కొవ్వు లేదని మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ప్రధాన చార్జిషీట్లోనూ ఇదే మాట... గతంలో కూడా సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కూడా లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వులు లేవని తేల్చింది. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులేవి కలవలేదని స్పష్టంగా చెప్పింది.ఎన్డీబీబీ నివేదిక అంటూ చంద్రబాబు రాద్దాంతంచంద్రబాబు, ఆయన గణం.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బురద జల్లేందుకు తిరుమల శ్రీవారినే వాడుకొన్నారు. చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూలో పంది, ఇతర జంతువుల కొవ్వు కలిపారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారం అంటూ ప్రజలను మభ్య పెట్టారు. అయితే అదే ఎన్డీడీబీ 2025లో ఇచ్చిన నివేదికలో లడ్డూ నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని విస్పష్టంగా చెప్పింది. ఈ నివేదికను కూడా సిట్ తన తాజా అనుబంధ ఛార్జిషీట్లో జత చేసి కోర్టు ముందుంచింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు చేసిన ఆరోపణలన్నీ తప్పుడువేనని, వారంతా చేసింది దుష్ప్రచారమేనని తేలిపోయింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని స్పష్టమైంది. -
చంద్రబాబు, పవన్ భేటీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను పంచుకోవాలో చర్చించినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లలో ఎవరు పోటీ చేయాలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.తిరుపతి అసెంబ్లీ జనసేన చేతిలో ఉండడంతో ఆ కార్పొరేషన్‌ను కూడా అదే పార్టీకి కేటాయించాలా లేక వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయంపై మంతనాలు జరిపినట్లు సమాచారం. తాము కోరుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో విభేదాలు పెరుగుతుండడం, స్థానిక ఎన్నికల్లో అవి ఇంకా ముదిరి గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపైనా సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది నెలకొన్నట్లు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్లడంతో కూటమి వ్యూహం బయటపడిపోయిందని, దాన్ని సరిదిద్దుకునేందుకు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
‘బీసీలను వంచించడానికి చంద్రబాబు మరో కొత్త డ్రామా’
తాడేపల్లి: బీసీలకు ద్రోహం చేయాలనుకున్న ప్రతీసారి ముందు వరసలో బీసీలనే పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత చెల్లుచోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను వంచించడానికి ఢిల్లీలో మరో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు. ‘రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడానికి వైఎస్సార్సీపీ కారణమని గతంలో వెన్నుపోటు పార్టీ చేసిన ప్రచారం పచ్చి అబద్ధం.. న్యాయస్థానం తీర్పు ఆధారంగానే ఆ మేరకు ఎన్నికలు జరిగాయి. వైఎస్ జగన్‌పై నిందలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని బీసీ వర్గాలు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేవలం జీవో ఇస్తే సరిపోదు. కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, దాన్ని కేంద్రం ఆమోదించాలి, అవసరమైతే షెడ్యూల్ 9లో చేర్చాలి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించారా? ఆ నివేదిక ఆధారంగా చట్టం చేశారా? చేయకుండానే 34 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తామని చెబుతున్నారు?, చంద్రబాబు ప్రభుత్వం నిజంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్లో చట్టం చేయించాలి. బీసీల కోసం ఢిల్లీ వెళ్లారా? చంద్రబాబు కోసం వెళ్లారా? బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారధి, సత్యప్రసాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జీవో ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకోవడం కాదు.. బీసీలకు రిజర్వేషన్ హక్కుగా కల్పించాలి. బీసీ యువతను మోసం చేయకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబు కారణమైతే, ఆయన వెంట ఢిల్లీ వెళ్లిన బీసీ మంత్రులు ఈ ద్రోహానికి సాక్షులుగా మిగలకూడదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి చేయగలిగిన పని చేయకుండా, ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని చూస్తే బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇప్పుడు బీసీ యువతకు పూర్తిగా అర్థమైంది.. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు డ్రామాలు చేస్తున్నారో బీసీలు తెలుసుకున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేవలం జీవోలు, ప్రకటనలు, ఢిల్లీ పర్యటనలతో కాలక్షేపం చేయడం బీసీలను మరోసారి మోసం చేయడమే. 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్నది రాజకీయ డ్రామానే.. ఈ డ్రామాకు అచ్చెన్నాయుడు, పార్థసారధి, సత్యప్రసాద్ సాక్షులుగా మిగిలారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి! -
వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియవనుకున్నారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజంగానే అధికంగా అసత్యాలు చెబుతారన్న నానుడి ఉంది. వాటితో పాటు కొన్ని చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో పలచన అవుతున్నారన్న భావనకు అవకాశం ఇస్తున్నారు. పల్లె పండగ పేరుతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక సభ జరిగింది. అది నిజంగా పల్లె పండగ అవుతుందా, లేదా? అన్నది పక్కనబెడితే ఎవరు ఏ కాస్త అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా మంచిదే. కాకపోతే గతంలో ఏమీ జరగనట్లు, ఇప్పుడే అన్ని జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తే సరిపోతుందా? మొత్తం వాగ్దానాలన్నీ నెరవేర్చేసినట్లు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేసినట్లు స్పీచ్‌లు ఇస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియకుండా పోతుందా? ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉండడం తదితర అనేక సమస్యలతో గ్రామీణాంధ్ర కొట్టుమిట్టాడుతోంది.ముందుగా ఆయన చేసిన చిత్రమైన వ్యాఖ్యలు చూద్దాం. ఏపిలో ఎల్‌నినో ప్రభావం ఉందని చెబుతూనే తాము ప్రార్దన చేయడం వల్లే వరుణ దేవుడు కరుణించి విశాఖలో 27 సెంటిమీటర్ల వర్షం కురిపించాడట. వర్షాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటే వచ్చే చిక్కేమిటన్నది ఆయనకు అవసరం లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అది మాట్లాడేసి జనాన్ని నమ్మించే యత్నం చేయడం ఆయనకు అలవాటే. బంగళాఖాతంలో వాయుగుండం వల్ల ఇటీవల ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి. దానివల్ల రైతులకు కొంత మేలు, మరికొంత నష్టం జరిగింది. దానిని పక్కనబెడితే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు విశాఖలో తాగు నీటి సమస్య ఉందని, ఈ ఏడాది తాము ఏమీ చేయలేమని, వచ్చే ఏడాదికి తీర్చుతామని చెప్పారు. దాంతో విశాఖ ప్రజలు తమ ఖర్మ ఇంతేనా అని సరిపెట్టుకున్నారు. అప్పుడే ఆ మాట చెప్పకుండా తాను ప్రార్దన చేయబోతున్నానని, వర్షాలు పడబోతున్నాయని చెప్పి ఉంటే.. వర్షాలు పడిన వెంటనే టీడీపీ మీడియా ఇక చంద్రబాబుకు దైవశక్తులు ఉన్నాయని ఊదరగొట్టేసి ఉండేదేమో! కాని అప్పటికి కరువు గురించే మాట్లాడారు.కరువుకు క్రెడిట్ తీసుకోరా?చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? లేక రాష్ట్రం అంతటా వర్షాలు పడాలని ప్రార్దించారా అన్నది పలువురి ప్రశ్న. చంద్రబాబు చెప్పేది నిజమే అయితే రాయలసీమలో వర్షాలు పడాలని ఎందుకు ప్రార్దనలు చేయలేదని వారు అడుగుతున్నారు. పలు చోట్ల చీని తోటలు ఎండిపోయాయి. వర్షాలు లేక పంటలే వేయలేకపోయారు. నెలల తరబడి కృష్ణా డెల్టాలో సరిపడా వర్షాలు లేక శివారు భూములకు నీరు సరిగా అందలేదు. ఆ సమయంలో చంద్రబాబు ఈ ప్రార్ధనలేవో చేసి వర్షాలు తెప్పించి ఉండాలి కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలా వర్షాలకు క్రెడిట్ తీసుకుంటే కరువుకు కూడా బాధ్యత వహించాలి అన్న సంగతి తెలియదా! ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పాలనలో ఆయా సంవత్సరాలలో వచ్చిన కరువులను ప్రస్తావించి ఆ సమస్యను ప్రత్యర్దులు ఆయన ఖాతాలో వేస్తుంటారు.చంద్రబాబు ఈ స్పీచ్ ఇచ్చిన రోజే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపి, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాలు కరువు పీడితంగా ఉన్నాయని ఢిల్లీలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఏదో తాత్కాలిక రాజకీయం కోసం జనాన్ని సెంటిమెంట్ రాజకీయాలతో మభ్య పెట్టే బదులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది. అందులోను ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలతో ప్రజలలో పలచన అవవడం మంచిదా! ఎల్లో మీడియా కూడా ఈ వ్యాఖ్యలను ప్రచురిస్తే చంద్రబాబుకు నష్టం వస్తుందని అనుకున్నదేమో కాని, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది.ఇలాంటి మాటలు చెబితే ఎలా! ఇక 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గతంలో డావోస్ వెళ్లిన సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడితే అది జాతీయ మీడియాలో సైతం వైరల్ అయింది. ప్రసంగంలో పొరపాటు దొర్లితే సరిచేసుకోవచ్చు. కాని ఒకటికి రెండుసార్లు అవే తప్పులు చెబితే ప్రజలకు భిన్నమైన సంకేతం వెళుతుంది. పైగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ పచ్చి అబద్దాలను చెబితే జనం చెవిలో పూలు పెట్టడం కాదా! నిరుద్యోగ భృతి ఎగవేయడం కోసం ఇలాంటి మాటలు చెబితే ఎలా! పది లక్షల కోట్ల అప్పు తాము అధికారంలోకి వచ్చేనాటికి ఉందని మరో అబద్దం చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అందులో ఆయన ఏడేళ్ల పాలనలో ఎంత అప్పు చేసింది, జగన్ ఐదేళ్లలో ఎంత అప్పు అయింది వివరించకుండా, మొత్తం జగన్ ఖాతాలో వేయడంలోని దురుద్దేశాన్ని సామాన్యులు పసికట్టకపోవచ్చేమో కాని, బుద్ది జీవులు కనిపెట్టలేరా!ఆ పని ఎప్పటికి చేయలేరుకూటమి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందట. టీడీపీ, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కాపీని దగ్గరపెట్టుకుని వరసగా ఇచ్చిన హామీలు చదువుతూ ఈ మాట చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఉంటే ఒప్పుకోవచ్చు. కాని ఆ పని ఎప్పటికి వారు చేయలేరు. ఎందుకంటే ప్రజలను తాము మోసం చేస్తున్నామని వారికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తన వంతు అసత్యాలు చెప్పారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో 880 కి.మీ.రోడ్లే వేశారని ఆయన అంటున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వం 7600 కిలోమీటర్ల రోడ్డు వేసిందని వైఎస్సార్సీపీ నేతలు జవాబు ఇస్తున్నారు.పవన్ ముద్ర కనబడుతోందట!అలాగే గ్రామాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి సంస్కరణలు తెచ్చి గ్రామాలకు అభివృద్ది రూపం ఇచ్చిన ఘనత జగన్ ది కాదనగలరా? బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తన ఉపన్యాసంలో గ్రామ సచివాలయాల ప్రస్తావన తెచ్చారు. అవి ఎవరి టైమ్‌లో వచ్చింది తెలియదా!. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భలే పొగుడుకున్నారు. చంద్రబాబు తన స్పీచ్‌లో పల్లె వికాసంలో పవన్ కళ్యాణ్ ముద్ర కనబడుతోందని చెబుతున్నారు. పవన్ ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ది చేస్తున్నారట. లక్షకు పైగా పంట కుంటలు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు నిర్మించారట. పల్లెకు ఆయన హుషారుతో పట్టాభిషేకం చేస్తున్నారట.ఇదీ చదవండి: బాబు 'బీసీ' బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్‌ఫ్లాప్! ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులో అద్బుతమైన ఆర్ధిక ప్రణాళిక ఉందని అంటున్నారు. సీఎంతో సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం అని చెప్పాలి. బాగా పనిచేస్తే దండ వేస్తామని, లేకుంటే దండిస్తామని చెప్పడం ద్వారా వారికి వార్నింగ్ ఇచ్చారన్నమాట. మరి కూటమి ఎన్నికల హామీల మాటేమిటని మాత్రం ఎవరూ అడగకూడదన్నమాట. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండగను కాంట్రాక్టర్ల పండుగగా అభివర్ణించారు. పాలకుల విధానాలే పల్లెలకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా పట్టాభిషేకం వంటి సినిమా డైలాగులు కాకుండా నిజంగా గ్రామాలకు మేలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు.- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేవలం పబ్లిసిటీ కోసమే బాబు సభ
-
మైక్ ముందు గట్టిగ అరిస్తే నిజమైపోతాయా? ఇమిటెట్ చేస్తూ ఏకిపారేసిన రవీంద్రనాథ్
-
జల్ జీవన్ మిషన్ సభ.. పబ్లిసిటీ కోసమే: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పబ్లిసిటీ కోసమే ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ సభ.. వైఎస్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా సాగిందని వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలోనే ఇంటింటికీ తాగునీరు, ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని.. గత ప్రభుత్వంలో పూర్తయిన పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోంది’’ అని రవీంద్రనాథ్ దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ హయాంలో 5 నియోజకవర్గాల్లో నీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రొద్దుటూరు మైలవరం రిజర్వాయర్ తాగునీటి ప్రాజెక్టులో 90 శాతానికి పైగా పనులు వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్ట్ టెస్ట్ ట్రయల్స్ 2022లోనే విజయవంతం. 2022లోనే టెస్ట్ ట్రయల్స్ పూర్తయినట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది’’ అని రవీంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.‘‘ఉద్దానంలో రూ.700 కోట్లతో కిడ్నీ బాధితులకు సురక్షిత తాగునీటి శాశ్వత పరిష్కారం లభించిందన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. వైఎస్ జగన్ ప్రభుత్వం 95.44 లక్షల ఇళ్లకు తాగునీటి వసతుల కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత ఇసుక పేరుతో కృష్ణా నదిని దోచుకుంటున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇసుక ట్రాక్టర్, టిప్పర్ ధరలు రూ.6 వేల నుంచి రూ.28 వేల వరకు పెరిగాయన్నారు.28 నెలల్లో ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం.. ఇంటింటికీ మద్యం చేరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రూ.11 వేల కోట్ల టెండర్లు రద్దు చేసి కమీషన్ల కోసం రీ-టెండర్లు పిలిచారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభలు నిర్వహిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాడు గెలిచింది బాబు కాదు.. జగనే -
అడ్డంగా దొరికిపోయిన బాబు ఇది జస్ట్ ట్రాక్ రికార్డ్ కాదు ఆల్ టైమ్ రికార్డ్
-
RTC ప్రైవేటీకరణకు అంతా సిద్ధం..?
-
ఏపీ భవిష్యత్తుకి అబద్ధాలతో సమాధి కట్టేస్తోన్న పచ్చముఠా
-
‘జల’జలా అబద్ధాలు
సాక్షి, అమరావతి: ధారాళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జల్‌జీవన్–అమరజీవి జలధార పనుల ప్రారంభం సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరులోనూ ఆయన అన్నీ అసత్యాలే వల్లెవేశారు. గత ప్రభుత్వంలో ‘నీళ్లు లేవు.. రోడ్లు లేవు’ అంటూ నిజాలకు పాతరేశారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఎప్పటి నుంచో రక్షిత మంచినీటి పథకాలు, ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి రక్షిత నీటి సరఫరా జరుగుతోంది. అయినా చంద్రబాబు తాను వచ్చిన తర్వాతే గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మిస్తున్నట్టు గొప్పలుపోవడంపై అధికారులతోపాటు ప్రజలూ విస్తుపోయారు.గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 95 లక్షల ఇళ్లు ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో 39.34 లక్షల ఇళ్లకు కొత్తగా మంచినీటి కుళాయిలు అమర్చింది. అంతకు ముందు 60 ఏళ్ల కాలంలో 30 లక్షల ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 27 లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, గత రెండేళ్ల నాలుగు నెలల కాలంలో కేవలం 2.70 లక్షల ఇళ్లకూ నీటి కుళాయిలను చంద్రబాబు సమకూర్చలేదు. తాజాగా ‘జల్‌జీవన్‌మిషన్–అమరజీవి జలధార’ కార్యకమానికి రాబోయే రెండేళ్లలో రూ.30,156 కోట్లను ఖర్చు పెట్టి ఇంటింటికీ తాగునీరు అందించే బాధ్యత తనదంటూ కోతలు కోసి నవ్వులపాలయ్యారు. వాస్తవానికి గతంలోనే రాష్ట్రంలోని గ్రామాల్లో ఉండే ప్రతి వ్యక్తికి రోజుకు గరిష్టంగా 40 లీటర్ల చొప్పున నీళ్లు అందించేలా రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం జరిగితే, 2019లో కేంద్రం జలజీవన్‌మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.26,823 కోట్ల పాత పథకాలకు అదనంగా అవసరమైన చోట కొత్త పథకాల నిర్మాణంతోపాటు ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆయా పథకాలకు వేసవిలోనూ నీరు పుష్కలంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది. అప్పటికి ఉన్న 13 జిల్లాల్లో ఉద్దానం సహా 9 జిల్లాల్లో నదీ రిజర్వాయర్ల నుంచి నేరుగా నీరు సరఫరా అయ్యేలా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకూ రూపకల్పన చేసింది.అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం రూ.84 వేల కోట్లతో కొత్త జిల్లాల ప్రాతిపదికన 64 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను చేపడతామంటూ ప్రగల్భాలుపలికింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో దాదాపు సగానికి పైగా రద్దు చేసింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రూ.84 వేల కోట్ల ప్రతి పాదనలను పక్కనబెట్టి గతంలో రద్దుచేసిన పథకాల స్థానంలో కొత్తగా మంజూరు చేసినట్టు చూపించి వాటితో కలిపి మొత్తం కేవలం రూ.30,156 కోట్లతో పథకాల నిర్మాణానికి పరిమితమైంది. దీంతో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చంద్రబాబు చెప్పిన మరికొన్ని అబద్ధాలు ఇలా..చంద్రబాబు: కల్తీలేని మద్యం అమ్ముతున్నాం. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. మాములు ఎమ్మార్పీ కన్నా ఒక్క పైసా ఎక్కువ ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే కొరడా తీసుకునే బాధ్యత నాది. వాస్తవం: ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి తూట్లు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఊరూవాడా మద్యాన్ని ఏరులా పారిస్తోంది. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి, ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్మకాలు సాగిస్తోంది. ఊరూరా ప్రతికాలనీలోనూ బెల్టుషాపుల ద్వారా తీవ్ర దోపిడీకి తెగబడుతోంది. చివరకు సీఎం ప్రొద్దుటూరు సభకు వచ్చే జనాలకూ బస్సులో మద్యం సీసాలు పంచి అభాసుపాలైంది. చంద్రబాబు: ఎవరైనా ఇసుకలో ఇన్వాల్వ్ అయితే, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. ఉచిత ఇసుక మీ హక్కు.. దానికి విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటాం. వాస్తవం: ఉచిత ఇసుక ముసుగులో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు నదులను చెరబట్టి అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లిలోని అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. ఇసుక స్మగ్లర్ల ఆగడాలపై ఎన్జీటీలో రైతులు, ప్రజలు అనేక కేసులు వేయడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు: సేవలన్నీ ఫోన్ ద్వారానే అందిస్తున్నాం వాస్తవం: వాస్తవానికి ఫోన్ ద్వారా సేవలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీజం పడింది. పథకాలను ప్రజల గడపవద్దకే వలంటీర్ల ద్వారా చేర్చింది. ఏ సమస్య ఉన్నా.. సత్వర పరిష్కారం చూపింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. పథకాల దరఖాస్తుకు ప్రజలు నానా ఇబ్బందులు పడేలా చేసింది. రెండేళ్ల మూడు నెలల వరకు పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించకుండా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురుపోసుకుంది. ఇటీవలే పింఛన్ల దరఖాస్తుకు అనుమతిచ్చినట్టే ఇచ్చి వెబ్ పోర్టల్‌ను 9 రోజుల్లోనే నిలిపివేసింది. దరఖాస్తు కోసం సచివాలయాల చుట్టూ తిరిగిన అవ్వాతాతలు, ఇతర లబి్ధదారులు గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడ్డారు. చివరకు చాలామంది దరఖాస్తు చేసుకోలేక తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు: రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసి జలహారతి ఇచ్చాం. వాస్తవం: సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఈ అవినీతికి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువ లైనింగ్, పోలవరం ఎడమ కాలువలో మిగిలిన పనులు, వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులే నిదర్శనం. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.3,850 కోట్లు వ్యయం చేశామని బాబు గొప్పలు చెబుతున్నారు.కానీ.. లైనింగ్ పనులు అత్యంత నాసిరకంగా చేయడం వల్ల 2025లో లైనింగ్ దెబ్బతిని కొట్టుకుపోయింది. లైనింగ్ పనుల వల్ల లబ్ధి జరిగింది ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు(ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్), సీఎం రమేష్(రితి్వక్ ప్రాజెక్ట్స్), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని, సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు, రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ మాత్రమే. లైనింగ్ వల్ల భూగర్బజలాలు అడుగంటిపోయి వేలాది బోర్లు ఎండిపోవడంతో రైతులు జీవనాధారం కోల్పోయిన దుస్థితి నెలకొంది. -
సీఎం చంద్రబాబు ఈవెంట్స్‌కు మరో రూ.10.59 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ పనులకు భారీగా ఖర్చు చేస్తున్నారు. జిల్లాల్లో సీఎం కార్యక్రమాలను మాన్ డెకరేటర్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.44.62 కోట్లు ఖర్చయిందని, ఇందులో 50 శాతం బకాయిలను చెల్లించాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆర్థిక శాఖ రూ.22.31 కోట్ల అదనపు నిధులను విడుదల చేసింది. ఇందులో గత నెలలో అయిన ఖర్చు రూ.11.71 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.మరో రూ.10.59 కోట్లు చెల్లించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో సీఎం ఈవెంట్లకు ఇప్పటివరకు రూ.22.31 కోట్లు చెల్లించారు. ఈ ఖర్చును ప్రముఖుల ప్రోటోకాల్ వ్యయం ఖాతా కింద విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ చెల్లింపులు ‘షెడ్యూల్ ఆఫ్ రేట్స్’ ఖరారు, చర్చలకు లోబడి జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.డీడీవోలందరూ ఆర్థిక శాఖ సూచనల ప్రకారం అడ్వాన్సులు ఇచ్చి ఉంటే వాటిని ధృవీకరించుకుని, మాన్ డెకరేటర్లకు మంజూరైన బడ్జెట్‌ను రూపొందించి, పంపిణీకి అనుమతించాలని పేర్కొన్నారు. పొరపాటున అదనంగా విడుదల చేసిన మొత్తాలంటే, వాటిని ఎటువంటి నోటీసు లేకుండా ఏజెన్సీకి చెల్లించవలసిన మిగిలిన మొత్తాల నుంచి వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
దసరా డిస్కౌంట్స్ ఏవైనా ఇద్దామా సార్! లేక ఒకటి కొంటే మరొకటి ఫ్రీ ఆప్షన్స్ కూడా పెడదామా!!
దసరా డిస్కౌంట్స్ ఏవైనా ఇద్దామా సార్! లేక ఒకటి కొంటే మరొకటి ఫ్రీ ఆప్షన్స్ కూడా పెడదామా!! -
చట్టం చేస్తారా లేదా?
తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ నెల 28వ తేదీ డెడ్‌లైన్.. ఇదే చివరి అవకాశం. ఆ లోగా చెప్పాల్సిందే. – చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: బీసీలకు దక్కాల్సిన న్యాయమైన రిజర్వేషన్లను కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ చట్టం ముందు చెల్లుబాటు కాని జీవోలను తెచ్చి బీసీలను వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన పిటిషన్లో ఏడాదికాలంగా సమాధానం ఇవ్వకుండా వాయిదాలు కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. కానీ ఇక జీవోలతో కాలయాపన కాకుండా.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనిపై కౌంటర్ దాఖలుకు ఈనెల 28 వరకు హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం ఖంగుతిన్నది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తాజా ఆదేశం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఇక సుప్రీంకోర్టులో పోరాటం పేరుతో తప్పించుకోవడం సాధ్యం కాదు. బీసీలకు శాశ్వత రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిందే. బీసీలు అడుగుతున్నట్లు జీవోలు కాదు.. చట్టం కావాలి. హామీలు కాదు.. రాజ్యాంగ రక్షణ కావాలి. చట్టం చేస్తారా లేదా చెప్పాల్సిందే.. ఇంతకాలం ఈ కీలక అంశానికి సమాధానం ఇవ్వకుండా అటు బీసీలను, ఇటు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ, చెల్లని జీవోలతో 34 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం శరాఘాతమనే చెప్పాలి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టతనివ్వాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచి్చన జీవోలను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా ఆదేశం ఊహించని పరిణామమే. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం ఖాయమని తెలిసినా న్యాయ పోరాటం అంటూ బాబు డ్రామాను రక్తికట్టిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం ఇష్టం లేని బాబు చట్టం తెచ్చే అవకాశమే లేదని టీడీపీలోని బీసీ నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. తూతూ మంత్రంగా కమిషన్.. రహస్యంగా నివేదికబీసీల కోసం ఏదో చేస్తున్నామనే రీతిలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సమగ్ర కుటుంబ సర్వే చేయించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా అంతర్గతంగా కమిషన్‌ను అడ్డుకుంది. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి, వాటి ఆధారంగా బీసీ జనాభా, వెనుకబాటుతనాన్ని లెక్కించాల్సిన కమిషన్... ఆ పని చేయకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ప్రణాళిక విభాగం సేకరించిన గణాంకాలపై ఆధారపడింది.ఆ గణాంకాలనే తీసుకుని, తామే క్షేత్రస్థాయిలో వాటిని సేకరించినట్లు కలరింగ్ ఇచ్చింది. సమగ్ర సర్వే ఏదీ చేయకపోయినా కూడా ఏదో చేసినట్లు ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచింది. దానిని హైకోర్టు అడిగినా బహిర్గతం చేయలేదు. అందులో రహస్యం ఏముందని నిలదీయడంతో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. రహస్యంగా ఉంచడంతో ప్రభుత్వంపై ప్రజలకు పలు అనుమానాలొచ్చాయి. క్యాబినెట్ ఆమోదించని నివేదికతో బీసీ రిజర్వేషన్లా? విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నను సంధించింది. అసలు రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకునే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారా? అని ప్రశి్నంచింది. కమిషన్ మొత్తం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని, కొంత భాగాన్నే తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. పైపెచ్చు సదరు కమిషన్ నివేదికను ఇంకా ఆమోదించలేదని చెప్పింది. మరి మొత్తం నివేదికను కాకుండా కొంత నివేదికనే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు? క్యాబినెట్ ఆమోదించని నివేదిక ఆధారంగా బీసీలకు చాలీచాలని రిజర్వేషన్లు ఎందుకు ఇచి్చనట్లు? దీనికి ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. డొల్ల కమిషన్ అని తేల్చిన ధర్మాసనంబీసీల సాధికారిత విషయంలో చిత్తశుద్ది ఉంటే, చంద్రబాబు ఆ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి, దానిపై మేధావుల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఉండేవారు. కమిషన్ నివేదిక ఆధారంగా చట్టం చేసి కేంద్రానికి పంపేవారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి ఉండేవారు. అయితే చంద్రబాబు ఇదేమీ చేయకుండా చెల్లని జీవోలను తెచ్చి బీసీలను వంచించారు. అంతే కాదు, బీసీ రిజర్వేషన్ల కల్పనకు రాజీవ్ రంజన్ కమిషన్ వద్ద ఎలాంటి డేటా లేదని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది. దీంతో ఆ కమిషన్ డొల్ల కమిషన్ అని తేలిపోయింది. హైకోర్టు ఆక్షేపించినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ డొల్ల కమిషన్ గడువును మళ్లీ పొడిగించింది. ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలుబీసీ రిజర్వేషన్ల విషయంలో వాస్తవాలు కోర్టు ముందుంచేందుకు పిటిషన్లు దాఖలు చేసిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న దానిపై హైకోర్టు ఎక్కడ ప్రశి్నస్తుందో.. అందుకు తామెక్కడ వాస్తవం చెప్పాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో పిటిషనర్ల అర్హతలపై ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తింది. ముఖ్యంగా చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై హైకోర్టుకు సహకరించేందుకు వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, జాతీయ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్యను లక్ష్యంగా చేసుకుంది.సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను రెండో పిటిషనర్‌గా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును ఈశ్వరయ్య కోరితే, దాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అనుబంధ పిటిషన్ దాఖలుపై ఈశ్వరయ్య అర్హతలు ప్రశి్నంచిన ప్రభుత్వం, ఆయన పిటిషనర్‌గా చేరితే తమకు వచి్చన నష్టం ఏంటో కోర్టుకు చెప్పలేదు. బీసీల విషయంలో జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తున్న ఈశ్వరయ్య తాను కోర్టు ముందు వాస్తవాలను ఉంచేందుకే వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. బాబు మోసాలను బయటపెడతారనే.. గత విచారణ సమయంలో ఈశ్వరయ్యపై ఓ ప్రభుత్వ న్యాయవాది దురుసుగా మాట్లాడారు. బీసీల విషయంలో చంద్రబాబు మోసాలను బయటపెడుతున్న ఈశ్వరయ్య కోర్టులో కూడా ఎక్కడ వాటిని బయటపెడతారోనని భయపడుతోంది. అయితే పలు అంశాలపై న్యాయస్థానం లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. దీంతో చివరకు న్యాయస్థానం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యానికి సముఖత వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అందుకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఆరుసార్లు సమయం తీసుకున్న నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. ఆర్టీకల్ 342ఏ(3)ను అమలుచేయాలి రాజ్యాంగంలోని ఆర్టీకల్ 342ఏ(3) ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023లో ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను వెంటనే పూర్తి చేసి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ సర్వే ఫలితాలను వీలైనంత త్వరగా ప్రచురించాలని ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు.అంతేకాక తమిళనాడు మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ ఆర్టీకల్ 31బి ప్రకారం సంబంధిత చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడానికి సత్వర చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.కాగా, ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అఖిల భారత వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్య ఇటీవల ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. బీసీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదేనా సర్కార్ చిత్తశుద్ధి ‘‘కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కోర్టు ఆరుసార్లు సమయం ఇచ్చింది. ,అయినా కూడా ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదు. బీసీల విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇది తెలియచేస్తోంది. మేము దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈశ్వరయ్య రెండో పిటిషనర్‌గా చేరితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. అయినా కూడా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం విస్మయపరుస్తోంది’’. – పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలుచట్టం చేయడం మినహా మరో మార్గం లేదుబీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు దక్కాలంటే చట్టం చేయడం మినహా మరో మార్గం లేదు. చట్టాలు చేసేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం ఎప్పుడో వెసులుబాటునిచ్చింది. ఇటీవలి ధర్మాసనం ఉమ్మడి తీర్పు కేవలం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకే పరిమితమైంది. ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలకు, నా ఈ వ్యాజ్యానికి ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మాత్రమే కోరడం లేదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కూడా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కోరుతున్నాం. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ వద్ద ఎలాంటి డేటా లేదని ఇటీవలి ఉమ్మడి తీర్పులో ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.అసలు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించకుండా చట్ట ప్రకారం చెల్లని విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇంటింటికెళ్లి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తేనే బీసీ లెక్కలు తేలతాయి. తెలంగాణలో కూడా ఇలాగే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. నేను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశాను.బీసీల వెనుకబాటుతనం, స్థితిగతులతో పాటు చట్టపరమైన అంశాలపై చాలా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో కోర్టుకు వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యంలో రెండో పిటిషనర్‌గా చేరాలని నిర్ణయించుకున్నాను. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకించడం దురదృష్టకరం. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బీసీల సంక్షేమ కోసమే పోరాటం చేస్తున్నాను. చట్టం చేసి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం. చట్టం చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడం లేదు. – సీనియర్ న్యాయవాది వంగల ఈశ్వరయ్య వాదనలు -
నాడు గెలిచింది బాబు కాదు.. జగనే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగానికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ప్రము ఖ సామాజికవేత్త పరకాల ప్రభాకర్ చేసిన సర్వే, విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇదంతా పరిశీలిస్తే నాడు గెలిచింది చంద్రబాబు నాయుడు కాదు.. జగన్మోహన్రెడ్డి అనేది ఒక అనాలసిస్. దీనిపై విశ్లేషకులు ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖ రాశారు’అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మంలో సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అక్రమాలు పెరిగాయి.. ఈవీఎంల నిర్వహణలో అక్రమాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్ ఏపీలో ఎన్నికల తీరుపై చేసిన సర్వేలో పలు అంశాలు బయటపడ్డాయన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలోని 1,400 పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే కొన్నింట 500 ఓట్లు అదనంగా పడ్డాయని స్పష్టమైందని చెప్పారు. 1,500 ఓట్ల సామర్థ్యం ఉన్న బూత్‌లలో 2 వేల వరకు ఓట్లు లెక్కింపులోకి రావడం దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. సర్వేలో వెల్లడైన గణాంకాల ఆధారంగా విశ్లేíÙస్తే గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోవడం, ఓడాల్సిన వారు గెలవడం జరుగుతోందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై డేటా సైంటిస్టులు, నిపుణులు సమగ్ర పరిశీలన జరిపి, పర్సంటేజీ లెక్కల్లో లేదా లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని.. ఇవన్నీ అవకతవకలేనని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదించినట్లు తెలిపారు. కేంద్రంలోనూ ఇదే తీరు.. 2024 సార్వత్రిక ఎన్నికల సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 79 పార్లమెంట్ స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని వీరభద్రం తెలిపారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ చేపట్టడమే కాకుండా తగిన చర్యలు అత్యవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, ఆర్థిక మార్పులపై ప్రస్తావిసూ అమెరికా సామ్రాజ్యవాదానికి సవాళ్లు ఎదురవుతున్నాయని.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెనుమార్పులు సంభవించబోతున్నాయని తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘బాబు పాలనలో పేదలకు విద్య, వైద్యం దూరం’
అన్నమయ్య జిల్లా: చంద్రబాబు పాలనలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు విద్య, వైద్యం దూరమైందని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్, బీటీ కాలేజీను నిలిపేశారని, అసలు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మాటే లేదని మండిపడ్డారు. మదనపల్లి, పుంగనూరులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందనే విషయాన్ని మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గం ప్రజలపై రాజకీయ కక్ష ప్రభుత్వం అవలంబిస్తుంది. పుంగనూరు హంద్రీ నీవా బ్రాంచి కెనాల్ పేరుకు మాత్రమే పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ కు హంద్రీ నీవా జలాలుతో ప్రభుత్మం వెంటనే నింపి ప్రజల దాహార్తిని తీర్చాలి. ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన కరువు అములుకోంది హంద్రీ నీవా జలాలను పోలీసులను కాపలాపెట్టి కుప్పంకు నీరు తీసుకొని వెళుతున్నారు. మదనపల్లె, పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌లు నింపి ప్రజల దాహార్తిని తీర్చండి’ అని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. ఇదీ చదవండి: కూటమి ప్రభుత్వం భయపడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి -
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
ప్రొద్దుటూరు(వైఎస్సార్ కడప జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒకవేళ చేసిందేమైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. 40 ఏళ్లుగా చూస్తే రాయలసీమ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని రాచమల్ల విమర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు కోపం అని,. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ అభివర్ణించారు.రాయలసీమ ప్రజలకు చంద్రబాబు హరికథలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ‘వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు చేసేందేమీ లేదు. 40 ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తుంది. ఏవో హరికథలు మాత్రమే రాయలసీమ ప్రజలకు చెబుతారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది. రాయలసీమకు మంచి చేసింది వైఎస్సార్, వైఎస్ జగన్‌లు మాత్రమే. వైఎస్సార్సీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 38 లక్షల 74 వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన జల్ జీవన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించింది.రూ. 700 కోట్లతో ఉద్దానానికి వైఎస్ జగన్ సురక్షిత మంచి నీరు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో తాళ్లరామాపురంలో అనేక అభివృద్ధి పనులు చేశాం’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం కుట్రలేచంద్రబాబు జీవితం మొత్తం కుట్రలేనని రాచమల్లు మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో 125 నుంచి 150 మందిని హత్యలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లా 29 హత్యలు చేశారు. అనంతపురంలో 42 మందిని వెన్నుపోటు పార్టీ నేతలు హత్య చేశారు.శ్రీసత్యసాయి జిల్లాలో 54 మందిని హత్య చేశారు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ -
బాబు ప్రొద్దుటూరు సభకు వెళ్తున్న బస్సులో మద్యం సరఫరా
-
పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ రోడ్డున పడేసారు
-
కూటమిలో చైతన్య చిచ్చు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిథి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలైన చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జెండాలు మోసి పలువురి విజయానికి కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని చిత్తూరులోని రెండు సామాజిక వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. చైతన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నగర మేయర్ పదవి ఆశిస్తుండడం కూటమి పార్టీ లో చిచ్చు రేపుతోంది. ఎవరికేమి చేశారని? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో జిల్లాలో ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇందులో కాణిపాకం వినాయక స్వామి ఆల య బోర్డు చైర్మన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా), ఏపీ వన్నెకుల క్షత్రియ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్, ఆర్టీసీ చైర్మన్, కుప్పం రెస్కో, కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్, చిత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, పెనుమూరు, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే దక్కింది.పేరుకు కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, పదవుల భర్తీలో తమను ఏ మాత్రం గుర్తించడం లేదని కూటమి లోని బీజేపీ, జనసేన నేతలు పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా పోస్టులు పెట్టారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో చిత్తూరు మేయర్ స్థానంపై కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు పట్టుగా ఉన్నాయి. మేయర్ కుర్చీ జనసేనదే! 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గురరజాల జగన్మోహన్ నాయుడు అందర నీ ఆశ్చర్యపరిచారు. అసలు గెలుపు వరిస్తుందనే విష యం ఆయన కూడా ఉహించి ఉండరు. అప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కోసం చిత్తూరు టీడీపీలోని బలిజ (కాపు) సామాజికవర్గ నేతలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక కూడా జనసేన పార్టీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు మేయర్ సీటుపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిత్తూ రు నగరంలో కాజూరు చెరువు అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్తో కలిసి పర్యటించి మేయర్ పోటీలో తాను కూడా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రెండు రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను కలిసిన ఈమె.. మేయర్ సీటు కోసం మురళీమోహన్ మద్దతు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు సీటు జనసేన పారీ్టకే దక్కాలని ఇప్పటికే స్థానిక జనసేన సైనికులు పట్టుబడుతున్నారు. తమ నాయకుడి మాట కోసం సర్వం ఒడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమకు చిత్తూరు మేయర్ కుర్చీ ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. ఆశా..? నిరాశ..? ఆదికేశవులు కుటుంబం నుంచి చిత్తూరు మేయర్ కోసం తన తాత పేరుతో పాటు, జనసేన కార్డు వా డుతుండడం చైతన్య రాజకీయ భవిష్యత్తుకు చావో, రేవో తేల్చనుంది. ఇదే సమయంలో చైతన్య రాకతో చిత్తూరులో ఇప్పటికే మేయర్ కుర్చీ ఆశిస్తు న్న రెండు సామాజిక వర్గాల్లోని ప్రధాన నాయకులు కారాలు– మిరియాలు నూరుతున్నారు. ఆదికేశవులు నాయు డు, ఆయన సతీమణి సత్యప్రభతోనే చిత్తూరులో ఆ కుటుంబం రాజకీయ పయణం ముగిసిందని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్లంతా కాలక్షేప రాజకీయాలు, ఆర్థిక హోదాకు ఓ పదవి కావాలని చూస్తున్నారని, సేవ చేయడానికి కాదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అది ముమ్మాటికీ చైతన్యకు అడ్డు కట్ట వేయడానికేనని స్పష్టమవుతోంది. కూటమి కుంపటిలో చైతన్య రాక చిచ్చురేపుతున్నా, ఇన్నాళ్లు పలు నామినేటెడ్ పదవులను వదులుకున్నట్లు చిత్తూరు మేయర్ కుర్చీని సైతం టీడీపీ నేతలకు జనసేన–బీజేపీ నేతలు త్యాగం చేస్తారో..? పోటీలో తమ తరువాతేనని కాలుదువ్వుతారో వేచి చూడాల్సి ఉంది. ఇదీ చదవండి: మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం! -
మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!
గుంటూరు: రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణంలో అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సభా వేదికపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫొటోను ప్రొటోకాల్ అధికారులు ఏర్పాటు చేయడం మరిచారు. విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు అధికారుల దష్టికి తీసుకువెళ్లడంతో ఆగమేఘాలపై అరగంట తరువాత మంత్రి మనోహర్‌తో కూడిన ఫొటోను వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పొందుపరిచారు.హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లేందుకు ఆ గ్రామ రైతులు, టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి, చివరకు చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒకానొక దశలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్నిసార్లు హెలీప్యాడ్ ప్రాంగణానికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్టపడి పనిచేసే వారికి ఇటువంటి అవమానాలు తప్పవని సీనియర్ నాయకుల ఎదుట ఒకింత అసహనం వ్యక్తం చేసింది. హెలీప్యాడ్ ప్రాంగణానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే, దాదాపు 80 మంది వివిధ మార్గాల గుండా రావడంతో ఎన్ఎస్జీ కమెండోలు పలువురిని పక్కకు తోశారు. వీరిలో జనసేన నాయకులు ఉన్నారు. ఆలస్యంగా సీఎం ప్రసంగం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి వెనుదిరిగి వచ్చారు. ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక అపశ్రుతుల మధ్య చంద్రబాబు బహిరంగ సభ కొనసాగింది. సభ ముగియడంతో ప్రజలు ‘బతికిపోయాంరా బాబు’ అంటూ బయటకు వచ్చారు. తీవ్ర ఉక్కపోత, ఎండ తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్! -
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


