Israel
-
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్‌లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్‌లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
భూతల దాడులు తప్పనట్లేనా?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్‌తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.స్వభావమే సమస్యఅయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్‌ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్‌పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు. అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు. అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్‌పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.గెలిచే యుద్ధమేనా?ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్‌తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్‌కు అది రెండవసారి.అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్లకు, ఇరాన్‌కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్లో అధిక భాగం పర్వతాలమయం. వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్‌ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.కపట నీతిఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్‌లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్‌పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్‌కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్‌కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్‌పై అరబ్ షేఖ్‌లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్‌తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్‌లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్‌ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?
-
రాజకీయ నాయకులను లేపేస్తాం.. ఇరాన్ వార్నింగ్
-
ఇజ్రాయెల్ ధీమా.. తగ్గేదేలే అంటున్న ఇరాన్
-
సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?!
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధానికి నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ సైన్యం ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్ గల్ఫ్‌లోకి పంపితే వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని హెచ్చరించారు. ఇరాన్ సైనికులు ఈ అవకాశాన్ని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్రంప్‌ను ‘ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస’గా అభివర్ణించారు.అదే సందర్భంలో ట్రంప్‌ను ‘ప్రపంచ దేశాల మధ్య అత్యంత అసత్యవాది అధ్యక్షుడు’గా పిలుస్తూ, ఆయన నిర్ణయాలు స్థిరంగా లేవని విమర్శించారు. ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారని, వెంటనే యుద్ధం చేయాలని నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. ట్రంప్‌పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి పెంచుతోందన్నారు. ట్రంప్ గత సంబంధాలు, ప్రత్యేకంగా జెఫ్రీ ఎప్స్టిన్ కేసుతో అనుబంధం కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగిందని ఆరోపించారు.అమెరికా ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. ఖార్గ్ దీవి, హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాల్లో దాడులు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా తన సైన్యాన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ కూడా ఇరాన్ సైన్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మిసైళ్ళు, వీధి నిరసనలు, హోర్ముజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ స్పష్టంగా తెలిపినట్లుగా, భూ తల దాడి జరిగితే అది అమెరికాకు ఘోర పరాజయాన్ని తెస్తుందని, పర్షియన్ గల్ఫ్‌లోని సొరచేపలు అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని పునరుద్ఘాటిస్తోంది. -
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
రియాద్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధంలో శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారం అందించే ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ విమానాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విమానాన్ని మార్చి 27న రియాద్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి లక్ష్యంగా చేసిందని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో 10–12 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.దాడిలో ధ్వంసమైన విమానం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నష్టం తీవ్రంగా ఉండటంతో, దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.ఈ-3సెంట్రీ ఎయిర్‌బోర్న్ కేవలం విమానం మాత్రమే కాదు. యుద్ధరంగంలో అమెరికాకు వెన్నెముకలాంటిది. తరచుగా ‘ఎగిరే కమాండ్ సెంటర్’గా వర్ణించబడే ఈ విమానం వందల మైళ్ల మేర గగనతలాన్ని పర్యవేక్షిస్తూ, దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తు సమాచారం అందిస్తుంది. నిఘా నుండి అడ్డుకోవడం వరకు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ స్థావరంపై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’ వంటి సైనిక ఆపరేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన మరో క్షిపణి దాడిలో 14 మంది గాయపడ్డారు. ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ ధ్వంసం కావడం చాలా పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనించే సామర్థ్యానికి, అలాగే అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండే వీలుకు ఇది విఘాతం కలిగిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. 🚨 JUST IN: 🇮🇷🇺🇸Reports suggest a U.S. Air Force aircraft may have been damaged or destroyed following Iranian strikes at Prince Sultan Air Base in Saudi Arabia. pic.twitter.com/8Gigwrq7tx— IranDefenceForce (@IranDefenceForc) March 29, 2026అమెరికా ఖరీదైన విమానాలపై ఇరాన్ దాడులుఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. 21 రోజుల యుద్ధంలో కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి.కూలిన విమానాల వివరాలుఈ దాడుల్లో ఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్, ఎఫ్‑18 జెట్, అలాగే అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్ వంటి విమానాలు ఉన్నాయి. ఇవి అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆస్తులుగా గుర్తింపు పొందాయి. ధర అంచనాలుఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్: ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు (రూ.6,600– రూ.8,300 కోట్లు). ఎఫ్‑18 జెట్: ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు).ఈ‑3 సెంట్రీ అవాక్స్ : అప్గ్రేడ్లతో కలిపి 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు)ఆర్థిక ప్రభావంఈ నష్టాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆర్థిక దెబ్బ తగిలింది. ఒక్కో విమానం ధర వందల మిలియన్ల డాలర్లలో ఉండటంతో, మొత్తం నష్టం విలువ విపరీతంగా పెరిగింది. -
ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?
-
యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్
-
యుద్ధంలోకి హౌతీలు.. ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులు
-
యుద్ధానికి నెల రోజులు.. ఊహించని మలుపు అగ్నిగుండంగా మిడిల్ ఈస్ట్!
-
రంగంలోకి హూతీలు!
దుబాయ్: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్‌కు దన్నుగా యెమన్‌కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్మందెబ్ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.దుబాయ్‌లో ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్‌లో ఒక హోటల్‌పై కామికాజ్ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. కువైట్‌పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.దక్షిణ లెబనాన్‌లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్ జోన్‌పై ఇరాన్ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్, బీర్ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఎషో్టల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్‌కు చేరుకున్నట్టు సమాచారం! దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్ నగరంలో ఒక క్లినిక్‌పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్‌లో 1,100కు పైగా, ఇజ్రాయెల్‌లో 19 మంది, గల్ఫ్ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారి్నంగ్ యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభనఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.ఇందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్‌ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 6 దాకా ట్రంప్ పొడిగించడం తెలిసిందే. ఇరాన్‌పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎత్తున హిజ్బుల్లా ఫైటర్స్‌ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన ఛానెల్ షుయబ్-అల్- మనార్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. -
సూపర్ ‘పవర్‌గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్‌ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్‌పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్‌గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్‌ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్‌ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్‌కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్‌ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్‌కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్‌లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్‌తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్‌లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్‌కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తరుగుతున్న రక్షణ నిల్వలు ప్రమాదంలో ఇజ్రాయెల్
-
ఇరాన్ మిస్సైల్ పై థాంక్యూ ఇండియా
-
ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి
దుబాయ్: పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించే చర్చల విషయంలో సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇరాన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పడం విశేషం! ‘‘ఏప్రిల్ 6 నాటికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవాల్సిందే. లేదంటే ఆ దేశ ఇంధన క్షేత్రాలన్నింటినీ సర్వనాశనం చేస్తా’’ అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఇరుపక్షాలు ముమ్మరంగా దాడులు చేసుకున్నాయి.ఇరాన్‌లోని యజ్ద్ ప్రావిన్స్‌లో అర్డకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది! సెంట్రల్ ఇరాన్‌లోని ఒక భార జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు 2,500 మంది మరైన్లు, 1,000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్‌కు చేరువవుతున్నాయి. ఇంకో 10 వేల మంది సైనికులను గల్ఫ్‌కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్‌తో చర్చించినట్టు ఈజిప్టు పేర్కొంది. గల్ఫ్‌లో దాడుల మోత ఇరాన్‌లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లిపోయాయి. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తారిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ పెద్ద పెట్టున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితానీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుంటాని ప్రకటించింది! బీరూట్‌లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, పొగ కన్పించాయి. దాడులకు ఇద్దరు పౌరులు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కన్పించారు. గల్ఫ్‌లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైనా ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అష్దోద్లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదీన్లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్రా, అల్ ఉదెయ్రీ, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్టు కువైట్ తెలిపింది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం. మరోవైపు ఇరాన్‌కు మిత్ర దేశం రష్యా 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపింది.హార్మూజ్ వద్ద ‘అధికారిక’ంగా టోల్!త్వరలో చట్టం చేసే యోచనలో ఇరాన్హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన ఇరాన్ ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. ఇరాన్‌కు దన్నుగా జమ్మూ కశ్మీర్ వాసులు నగదు మొదలుకుని నగల దాకా పలురకాలైన మానవతా సాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపడం తెలిసిందే.ఎఫ్‌బీఐ చీఫ్ ఈ మెయిల్ హ్యాకింగ్తమ పనేనన్న ఇరాన్ అనుకూల గ్రూపు వాషింగ్టన్: ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇది తమ పనేనని హందాలా అనే ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. అందులోని రెజ్యుమేతో పాటు పలు వ్యక్తిగత డాక్యుమెంట్లతో పాటు కాష్ పటేల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవన్నీ కనీసం పదేళ్ల నాటివిగా కనిపిస్తున్నాయి. హ్యాకింగ్‌ను ఎఫ్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. -
400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. దానితో పాటు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఇటు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంలోని నేరుగా సాయుధబలగాల్ని రంగంలోకి దింపింది. ఈ నేఫథ్యంలోనే ఆ ప్రాంతంలో భారీగా దాడులు చేస్తోంది. ఈ అటాక్స్ వల్ల ఇప్పటికే లక్షలో సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా 400కు పైగా హిజ్బుల్లా తీవ్రవాదులు మృతిచెందినట్లు నివేదికలు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ వివరాల్ని హిజ్బుల్లా సమూహానికి చెందిన వ్యక్తులు అందజేసినట్లు తెలిపింది.అయితే హిజ్బూల్లా మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరాలను ప్రచురించలేదు. కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు మరణించిన సందర్భంలో వారి వివరాలను వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులలో కనీసం 700 మంది హిజ్బుల్లా ఫైటర్లను మరణించినట్లు పేర్కొంది. ఇందులో వందలాది మంది ఆ సమూహానికి చెందిన ఎలైట్ 'రాద్వాన్ ఫోర్స్' సభ్యులు ఉన్నారని తెలిపింది.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడులు మరియు భూతల కార్యకలాపాల వల్ల లెబనాన్‌లో ఇప్పటివరకూ 1,142 మంది మరణించారని, వీరిలో 122 మంది పిల్లలు, 83 మంది మహిళలు మరియు 42 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొంది. కాగా 2023-2024లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో దాదాపు 5 వేల వరకూ హిజ్బుల్లా ఫైటర్స్ మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది. -
పట్టు బిగించిన ఇరాన్.. ఇక భీకర యుద్ధమే
-
ఇరాన్ కు ట్రంప్ ఆఫర్
-
ఇరాన్ సుప్రీం లీడర్‌గా డొనాల్డ్ ట్రంప్?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్కి సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించిందని, కానీ తాను తిరస్కరించానని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ఫండ్రైజర్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నాయకత్వం నన్ను సుప్రీం లీడర్‌గా చూడాలని అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆ పదవి ఎవరూ కోరుకోరు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా చర్యలను ‘మిలిటరీ డెసిమేషన్’గా వర్ణించారు. అంటే సింహ భాగం ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. తద్వారా మేం ము సాధించిన విజయాన్ని ఎవరూ చూడలేదు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ తమ ప్రజల భయంతో, అలాగే అమెరికా ప్రతీకార దాడుల భయంతో బహిరంగంగా చెప్పలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఖండించిన ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఒకవైపు ఆయన ‘ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది’ అని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ‘ఎలాంటి చర్చలు లేవు’ అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. శకలాలు మోజ్తబా కాలును ఛిద్రం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాలును తొలగించి చికిత్స కొనసాగిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం ఇరాన్లో నాయకత్వ సంక్షోభాన్ని మరింతగా పెంచుతోంది. -
యుద్ధం మరో మలుపు.. రష్యాకు వెళ్తున్న నౌకను పేల్చేసిన ఇజ్రాయెల్..
-
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్‌తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్‌కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్‌కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్‌కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్‌కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్‌తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్‌కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్‌లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసాం.. ఇరాన్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్‌కు చెందిన ఫైటర్ జెట్‌ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్‌ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026 -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
పాకిస్థాన్‌కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్‌ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్‌లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్‌తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ పతనమే లక్ష్యంగా ? సౌదీ బిగ్ ప్లాన్
-
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్‌లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
యుద్ధం తెచ్చిన కష్టాలు.. హైదరాబాద్ లో నో పెట్రోల్ ?
-
ఫలించని ట్రంప్ పిలుపు.. ఆగని ఇజ్రాయెల్,ఇరాన్ యుద్ధం
-
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు. ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.శాంతి యత్నాలకు భారత్ మద్దతు ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఐనా.. ఆగని దాడులు!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్‌కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్‌తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది. చమురు క్షేత్రాలకు నష్టం ఇరాన్‌లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్‌లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. టెల్ అవీవ్‌లో విధ్వంసం ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్‌లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్‌లో 16కు పెరిగిన మృతుల సంఖ్యఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు. యుద్ధ నెపం హెగ్సెత్‌పై!దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్‌పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్‌పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్‌పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు. -
ఇరాన్, అమెరికా చర్చల్లో భారత్ కీలక పాత్ర?
-
ట్రంప్ బ్రేక్ అన్న ఆగని యుద్ధం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ సెగలు
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
BIG BREAKING: 48 గంటల డెడ్ లైన్ పై ట్రంప్ వెనక్కి..
-
ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం. చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్. అదేం లేదన్న ఇరాన్
-
ట్రంప్‌కు జ్ఞానోదయం!
‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్‌తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్‌పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్. తీరా ఇరాన్‌తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.ఇరాన్ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగుతున్నారు? అసలు ఇరాన్ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్‌తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్‌తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్. ఆ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్‌లో 2003లో జార్జి బుష్... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్‌కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్ బోనపార్టే. యూరొప్ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి. -
ఇజ్రాయెల్ కు పీడకల.. పనిచేయని ఐరన్ డూమ్
-
LPG సిలిండర్‌పై వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన?
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్లో ఇరాన్‌పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.ఈ రోజు పార్లమెంట్లో సీసీఎస్ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. -
డర్టీ బాంబు వేయనున్న ఇరాన్.. అదే జరిగితే ఇక గల్ఫ్ దేశాలు..
-
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
-
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్‌లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్‌గావ్, పుణె, అహ్మదాబాద్‌ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్‌పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్‌లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్‌లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్‌లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్‌లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా... క్షిపణుల వర్షం
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్‌లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌లో సైరన్ల మోతలు వినిపించాయి. టెల్ అవీవ్‌పై క్షిపణి దాడులు సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్‌లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్‌లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో కీలక నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి. ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్‌కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.హార్మూజ్‌ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్ ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్‌జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి. చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. -
దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్
ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్‌లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరారు. రెజా తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్‌కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. -
యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే?
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..ఇరాన్అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన్నారు.లెబనాన్ మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.వెస్ట్ బ్యాంక్ రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.గల్ఫ్ గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. కువైట్‌లో ఆరుగురు మరణించారు.యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.బహ్రెయిన్‌లో ఇద్దరు పౌరులు మరణించారు. ఇరాక్ యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్‌లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.జోర్డాన్జోర్డాన్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది. -
ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి
-
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్‌సెప్టర్‌తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్‌లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది. అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్‌పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్‌పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు. టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్‌కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్‌లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. ఇరాన్ ముమ్మర దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్‌లో ఒక కిండర్‌గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్‌లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది. ఖర్గ్లో నౌకపై ఇజ్రాయెల్ దాడి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్‌పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను! తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్‌ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది. -
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్‌కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.కొద్ది గంటల ముందే ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను రీచ్ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. -
గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ ముందడుగు
-
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
-
ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్‌పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్‌కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్‌కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్‌ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్‌ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్‌ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్‌ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్
-
నన్ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది: రష్యన్ జర్నలిస్ట్
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్‌లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు. అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్‌పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్‌లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది. -
ఎక్కడున్నా వదలం!
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్‌లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్‌లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్‌ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్‌లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఇరాన్‌పై బాంబుల వర్షం పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్‌లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్‌కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. సిరియాపైనా దాడులు ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.వారి భ్రమలు వీడాయి: మొజ్తబా ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్ వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు హార్మూజ్‌ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. హార్మూజ్ సుంకం! రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. -
ప్రమాదకర పోకడలు
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్‌ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. దక్షిణ ఇరాన్‌లోని సహజ వాయు క్షేత్రం పార్స్‌ను ఇజ్రాయెల్ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్‌లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్ ఆ కొరతను తీర్చారు. తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనిపై ఇజ్రాయెల్ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్‌పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్ కాంగ్రెస్‌ను పెంటగాన్ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్ ఏఐ, పాలంటీర్ కలిసి ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. సైనిక దాడులకోసం తమ సాఫ్ట్వేర్ ఇచ్చేది లేదని ట్రంప్‌కు చెప్పిన ఆంత్రోపిక్ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్వేర్మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. -
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్‌లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్‌తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌తో బాటుగా, లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్‌లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్‌లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్‌కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్‌ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్‌లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్‌లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్‌పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 20 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందినట్లు, 57 మంది గాయపడినట్లు ఆ దేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. తాజా మారణహోమంతో మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెబనాన్ వాసుల సంఖ్య 1021కి చేరింది.కాగా, మార్చి 2న లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం మధ్యలోకి కాలు దూర్చింది. ఇరాన్‌కు మద్దతుగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్‌లోని అనేక ప్రాంతాలపై విస్తృత వైమానిక దాడులు ప్రారంభించింది. వాస్తవానికి 2024, నవంబర్ 27న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. -
అమెరికా భయానక దాడులు.. ఇరాన్ కు భారీ నష్టం?
-
ట్రంప్ VS నెతన్యాహు.. యుద్ధంలో విభేదాలా?
-
ఇరాన్ పై గెలుస్తాం.. నెతన్యాహు కీలక ప్రకటన
-
ఇరాన్ మిస్సైల్ ప్లాంట్‌ను నేలమట్టం చేసిన అమెరికా
ఇరాన్‌లోని కరాజ్ నగరంలో ఉన్న సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆ దేశ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఈ కేంద్రం బాలిస్టిక్ క్షిపణులు అసెంబుల్ చేయడానికి ఉపయోగించబడేదని.. అమెరికన్లు, పొరుగు దేశాల వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగిస్తుండిందని CENTCOM పేర్కొంది. అమెరికా వైమానిక దళం నిర్వహించిన ఈ దాడిలో కరాజ్ ప్లాంట్ పూర్తిగా నేలమట్టమైంది. CENTCOM విడుదల చేసిన ఏరియల్ ఫోటోలు ఆ సదుపాయం పూర్తిగా ధ్వంసమైందని చూపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ఇరాన్ క్షిపణి సామర్థ్యానికి కీలకమైన కేంద్రంగా ఉండింది.Prior to Operation Epic Fury, the Iranian regime used the Karaj Surface-to-Surface Missile Plant to assemble ballistic missiles that threatened Americans, neighboring countries, and commercial shipping. The photo dated March 1, 2026, shows the plant prior to U.S. strikes. The… pic.twitter.com/QEs5toZQpX— U.S. Central Command (@CENTCOM) March 19, 2026కరాజ్ ప్లాంట్ పూర్తిగా నిరుపయోగం కావడం వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం మరింత బలహీనపడే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి కూడా ముప్పు తగ్గుతుంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్-అమెరికా ఎన్ని దెబ్బలు కొట్టినా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాల ఇంధన సముదాయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులకు ప్రతిగా ఇరాన్ ఖతర్‌లోని ఎల్ఎన్జీ ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది. -
దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపివేస్తామని ప్రకటించారు. తాజాగా జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపి వేయమని కోరారు. మేము ఆయన అభ్యర్థనను గౌరవిస్తున్నామని అన్నారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. అలాగే ఈ దాడికి ఖతర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్‌లోని ఎల్ఎన్జీ ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకే నెతన్యాహు దాడులు నిలిపేస్తామని ప్రకటించారు.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరిన ట్రంప్.. ఇరాన్‌కు సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడి చేసిందని ఖతర్‌పై మరోసారి దాడి చేస్తే ఊహకందని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రూత్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
రగిలిపోతోన్న ఇరాన్ సైన్యం
పశ్చిమాసియా యుద్ధం అప్డేట్స్ ఇరాన్‌కు ఈరోజు చుక్కలు చూపెడతాంఇరాన్ మరోసారి భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందిపశ్చిమాసియా యుద్ధాన్ని మేమే ముగిస్తాంమేము మా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాంఅమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్దేశంలో ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది: కేంద్రంప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాంబ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాంనిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాల్లో తనిఖీలుతెలంగాణలో వెయ్యి ప్రాంతాల్లో దాడులు, 2300 సిలిండర్లు సీజ్ప్రజలు ఎల్పీజీకి బదులు పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలికిరోసిన్, బొగ్గు పొయ్యిలను కూడా వాడాలని కేంద్రం సూచన ఇరాక్‌లోనూ దాడులు చేస్తున్న ఇరాన్ ఇరాక్‌లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాపై అమెరికా దాడులుసుల్తాన్ ఆఫ్ ఒమన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్ఒమన్పై ఇరాన్ దాడులను ఖండించిన మోదీపశ్చిమాసియా యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం గల్ఫ్‌లోని చమురు కేంద్రాలే లక్ష్యం గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ భీకర దాడులు ఇరాన్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి దీంతో రగిలిపోతోన్న ఇరాన్ సైన్యంగల్ఫ్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులుమినాఅల్-అహ్మదీ రిఫైనరీపై దాడికువైట్లోని మినాఅల్-అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ దాడిపక్కనే ఉన్న మినా అబ్దుల్లా రిఫైనరీకి అంటుకున్న మంటలుఖతార్లోని రాస్ లాఫాన్ చమురు కేంద్రంపై ఇప్పటికే దాడిఅమెరికా స్థావరాలపైనా ఇరాన్ దాడులు -
గల్ఫ్ లో టెన్షన్.. టెన్షన్ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Special Story : తీవ్ర సంక్షోభంలో గల్ఫ్ దేశాలు
-
ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్ ప్రపంచ మార్కెట్లకు షాక్
-
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్ ఫార్స్’పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్‌పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌లో రైల్వే స్టేషన్‌పై దాడి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో రైల్వే స్టేషన్‌పై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్‌లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో స్వీడన్ పౌరుడికి ఉరి ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లోని లారెస్తాన్ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్‌లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్‌కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. అతడు స్వీడన్ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్‌లో హెజ్»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్‌లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ కార్యకలాపాల కోసం హెజ్»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ యాంటీ–షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది. ఇరాన్ మంత్రి ఖతీబ్ మృతి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానల్ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్‌పై బహుళ వార్హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్) అసీమ్ ఆర్.మహాజన్ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్మొహమ్మెద్ బిన్ జయేద్ అల్ నహ్యాల్లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్‌కు రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ గుండా భారత్‌కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్‌లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ప్‌లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు. -
ఇరాన్ ఊబిలో ట్రంప్!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ యుద్ధం పద్దెనిమిదో రోజుకు చేరుకున్నా ఆ రెండు దేశాలకూ దారీతెన్నూ తోచడం లేదు. మంగళవారం కీలకమైన ఇద్దరు ఇరాన్ నేతలు అలీ లారిజానీ, సులేమానీలనూ, బుధవారం మరో అగ్రశ్రేణి నేత ఇస్మాయిల్ ఖతీబ్నూ హతమార్చామని అమెరికా, ఇజ్రాయెల్ ఘనంగా చెప్పుకున్నా ఈ పరిణామాల తక్షణ ప్రభావం పెద్దగా లేదని ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులే నిరూపిస్తున్నాయి. యుద్ధకాలంలో ఎవరి ఆదేశాల కోసమూ ఎదురుచూడకుండా ఏయే దశల్లో ఎలా స్పందించాలో దేశం నలుమూలలా మోహరించి ఉన్న సైనిక దళాలకు ముందే నిర్దేశించి ఉండటం ఇందుకు కారణం. యుద్ధరంగంలో సాధిస్తున్న విజయాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా ఆయనకు ప్రతికూలతలే ఎదురవుతున్నాయని మంగళవారం నాటి రెండు పరిణామాలు చాటుతున్నాయి. హార్మూజ్ జలసంధి విముక్తికి యుద్ధ నౌకలతో, విమానాలతో తరలి రావాలన్న ట్రంప్ పిలుపును నాటో దేశాలు తిరస్కరించాయి.‘మీ యుద్ధంతో మాకేమిటి సంబంధమ’ంటూ ఎదురు ప్రశ్నించాయి. దానికితోడు అమెరికా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా భద్రతకు ఏమాత్రం ముప్పులేని ఇరాన్‌పై యుద్ధం ప్రకటించటం అనైతికమని ఆయన ప్రకటించారు. జో కెంట్ మొదటి నుంచీ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు. ‘మాగా’ ఉద్యమ సూత్రధారుల్లో ఒకరు. ట్రంప్ చుట్టూ చేరిన పాలనా వ్యవస్థలోని ఇజ్రాయెల్ అనుకూలురు, ప్రధాన మీడియా ఆయన్ను పక్కదోవ పట్టించాయన్నది కెంట్ అభియోగం. ట్రంప్‌ది అమాయకత్వమా, మూర్ఖత్వమా అన్న సంగతలా ఉంచి అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ మాటే చెల్లుబాటవుతున్నదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్ కోసమే అయినా రెండు దేశాలూ సమాన స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. అమెరికా ఇంతవరకూ 7,000 లక్ష్యాలపై విరుచుకుపడగా, ఇజ్రాయెల్ 7,600 దాడులు చేసిందని సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతున్నాయి. సైనికంగా ఇరాన్‌ను బలహీనపరచటం శక్తిమంతమైన అమెరికాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గరున్న డ్రోన్లూ, క్షిపణులూ కాలం గడుస్తున్నకొద్దీ తగ్గిపోవచ్చు. అదే పరిస్థితి కాస్త వెనకో ముందో ఇజ్రాయెల్, అమెరికాలకు కూడా ఎదురవుతుంది. కానీ దీర్ఘకాలం ఈ యుద్ధాన్ని సాగదీయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థనూ, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఇరాన్కుంది. గత నెల 24న జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించినప్పుడు అందులో ఎక్కడా ఇరాన్ ప్రస్తావన లేదు. ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం గురించే ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించటంతో అవి పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్నాయి. మున్ముందు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. అందుకే ట్రంప్ విజయాలేవీ అమెరికన్లను రంజింప జేయలేక పోతున్నాయి. కనుకనే అందరిపైనా ట్రంప్ ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మాట వినని నాటో మాత్రమే కాదు... నిలదీస్తున్న రిపబ్లికన్లు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ‘మాగా’ ఉద్యమ కారులు ఆయన్ను కుదురుగా ఉండనీయటం లేదు. ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు రుజువు. తొలుత బ్రిటన్ సాయాన్ని అర్థించి, ఆ తర్వాత హార్మూజ్ విముక్తికి సహకరించమని నాటోతోపాటు చైనాను కూడా వేడుకుని, వారంతా నిరాకరించాక ఇరాన్‌ను ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఆయన మానసిక స్థితిని వెల్లడిస్తోంది. నాటోను కోరడంలో వింతేమీ లేదు. కానీ ఆర్థిక రంగంలో సవాలుగా మారిన చైనాను అర్థించటం ట్రంప్ బలహీనతను బయటపెడుతోంది. 2003 నాటి ఇరాక్ దురాక్రమణ అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తే, ఆ మేరకు చైనా లాభపడింది. ఇప్పుడు సైతం చైనా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుండగా, అది సాయ పడుతుందని ట్రంప్ ఎలా అనుకున్నారో అనూహ్యం. మొత్తానికి ఆయన ఇరాన్ అనే ఊబిలో దిగబడ్డారు. దాన్నుంచి బయటపడటం సులభమేం కాదు. -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్‌పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్‌లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్‌చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్‌లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్‌గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
ఇరాన్ కు మరో దెబ్బ.. ఖమేనీ కుడి భుజం హతం
-
శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్
-
ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా ఇరాన్ పోరాడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ, టెహ్రాన్ బసిజ్ పారామిలిటరీ దళాల కమాండర్ సోలేమానీ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం తెలిపారు. కీలక నేత అలీ లారిజానీ మృతిఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.. ఈ దాడుల్లో బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అధిపతి సులేమానీ లక్ష్యంగా ఈదాడి జరిగిందని వెల్లడించాయి.అయితే లారిజాని ఈ దాడిలో మరణించారా లేదా గాయపడ్డారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.ఇంకా స్పందించని ఇరాన్ ఈ నివేదికలపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. లారిజానిని ఇరాన్ అధికార వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా భావిస్తారు. ఈ వార్త నిజమైతే, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్లో మరణించిన అత్యంత కీలకమైన వ్యక్తి లారిజానీ. లారిజానీ గతంలో అణు చర్చల ప్రతినిధిగా కూడా పనిచేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ, ఇరాన్ ప్రజల పోరాటం కొనసాగుతుందని తమ పోరాటంలో టెహ్రాన్ "దృఢంగా" ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి లారిజాని ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చిన మరునాడు ఈ వార్తలు వెలువడ్డాయి. -
అటు అమెరికా - ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ రాజధానిపై బాంబుల వర్షం..
-
మరణ వందతుల వేళ నౌరూజ్ శుభాకాంక్షలు..నెతన్యాహు సర్ప్రైజ్
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నౌరూజ్ పండుగ సందర్భంగా ఇరాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో హోరెత్తుతున్న సమయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు జరుపుకునే నౌరూజ్ పండుగను పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ వేదిగా విడుదల చేసిన వీడియో సందేశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ఇరాన్ ప్రజలకు నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. పర్షియన్ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈసారి కూడా వీడియో సందేశం విడుదల చేశారు. ‘ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు నేను ప్రతి సంవత్సరం చెప్పినట్లుగా ఈసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైట్ల పండుగతో ప్రారంభమయ్యే ఈ సెలవు దినాలు మీకు ఆనందాన్ని ఇవ్వాలి’ అని ఆయన పేర్కొన్నారు.నెతన్యాహు ప్రత్యేకంగా చాహర్షన్బే సూరి అనే పురాతన ఇరానియన్ కాంతి, అగ్ని పండుగను ప్రస్తావించారు. ఈ పండుగలో వెలుగులు చీకటిపై, మంచి చెడుపై విజయం సాధిస్తాయనే విశ్వాసాన్ని ఇరాన్ ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఈ సంవత్సరం ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. మీ అందరికీ స్వేచ్ఛతో కూడిన కొత్త సంవత్సరం కావాలని, ఆశతో నిండిన కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నాను’ అని నెతన్యాహు ఆకాంక్షించారు. ఇరాన్ ప్రజలకు, ముఖ్యంగా ఇస్లామిక్ రిపబ్లిక్ మతపరమైన నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారికి, నెతన్యాహు గత కొన్నేళ్లుగా తరచూ ఇలాంటి సందేశాలు పంపుతున్నారు. మార్చి 7న జరిగిన ఒక టెలివిజన్ సమావేశంలో కూడా ఆయన ‘నిజం చెప్పే సమయం దగ్గరపడుతోంది. మీరు నియంతృత్వపు బంధనాల నుండి బయటపడాలి. అప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మళ్లీ ధైర్యవంతమైన స్నేహితులుగా మారతాయి’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహు మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన ఈ సందేశం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.Prime Minister Netanyahu:To the brave people of Iran, I wish you, as I do every year a happy holiday season, beginning with the Festival of Lights.It signifies the age old belief of the Iranian people that light will triumph over darkness, that good will triumph over evil. pic.twitter.com/PoY2Mhlg6p— Prime Minister of Israel (@IsraeliPM) March 16, 2026 -
యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్‌న్యూస్
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ప్రకటన చేశారు.‘ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయి. మాపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్ముజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించం. జాతీయ భద్రత రక్షణ కోసం హర్ముజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేసింది‘ అని అన్నారు.దీంతో ఇరాన్ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని చెప్పింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విమానాశ్రయం నుంచి వెళ్లే, వచ్చే అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యే వరకు ప్రయాణం చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణ కోసం కూటమిలో చేరాలని సుమారు ఏడు దేశాలను అడిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇరాన్లో ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్‌ఫేక్’ చర్చ
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 17వ రోజుకు చేరింది. తమ సుప్రీంనేతమరణం తరువాత ఇరాన్ భీకరమైనప్రతిదాడులతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా అమెరికా సైనిక బేస్కేంద్రాలున్న గల్ఫ్ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ యుద్ధంలో గత వారం నుండి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భద్రతపై ఊహాగానాలు చెలరేగాయి.ఈనేపథ్యంలో ఆయన మరణించినట్లు వస్తున్న పుకార్లను పటాపంచలు చేయడానికి విడుదల చేసిన కాఫీ వీడియో నెతన్యాహూ ఉనికిపై మరింత చర్చకు తావిచ్చింది. అసలు అది నిజమైనదేనా లేక 'డీప్‌ఫేక్' (AI సృష్టించినదా) అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల నెతన్యాహూ రిలీజ్ అయిన వీడియో ఏఐ సృష్టి అని, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోవడంతోనే ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ వీడియోలో ఆయనకు ఎడమ చేతికి ఆరువేళ్లున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. కాఫీ వీడియోపై ఆన్లైన్లో రచ్చదీనిపై స్పందనగా తాజాగా నెతన్యాహు ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. జెరూసలేం హిల్స్‌లోని ది సతాఫ్ కేఫ్‌లో కాఫీ ఆర్డర్ చేస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదు అనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశారు. నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో లెక్కించుకోండి అంటూ తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపించారు. అంతేకాదు తాను కాఫీ కోసం చనిపోతున్నాను అంటూ పుకార్లకు కౌంటర్ ఇచ్చారు. అటు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఖండించింది.ఏఐ సృష్టే అంటున్న నెటిజన్లునెతన్యాహు ఎక్కడ, ఎలా ఉన్నారనే పుకార్ల మధ్య, కొత్త కాఫీ వీడియో మళ్లీ అనుమానాలను బలపరుస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కృత్రిమ మేధస్సు (AI) సృష్టి అని తేల్చారు. మరోవైపు గ్రోక్ కూడా 'డీప్‌ఫేక్' వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎక్స్ AI చాట్‌బాట్, గ్రోక్, కాఫీ షాప్ వీడియోను 'AI-జనరేటెడ్' కంటెంట్‌గా తెలిపింది. ఈ ఏఐ వీడియోలో ఇజ్రాయెల్ తొలుత ఫేస్ గుండ్రంగా ఉంది. ఒక్కసారిగా కోలగా మారిందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే కప్పులోని కాఫీ పడిపోకుండా వింతగా ఉందని కొందరు. కౌంటర్ వెనుక ఉన్న ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉండటంపై కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కోటు జేబులు కూడా వింతగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషించారు.It's AI-generated. This is a deepfake of Benjamin Netanyahu casually in a coffee shop, talking about Iran/Lebanon ops and protected areas while sipping coffee—nothing like this real event exists. The original post explicitly calls it advanced unreleased AI.— Grok (@grok) March 15, 2026Got some serious questions about the validity of this blatantly obvious AI video…🤷🏻♂️Magical pocket…Coffee in the cup defying gravity…Customer with mask behind the counter 😂 Nice Try…..NOTenyahu 😎 pic.twitter.com/oBA5U3HByK— Freed Ninja (@freezymfe) March 15, 2026 -
‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?
యుద్ధంతో పశ్చిమాసియా రావణకాష్టంలా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కాస్తా ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా లేక శతాబ్దాల నాటి సరిహద్దుల విస్తరణా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. లెబనాన్‌ను కబళిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.15 రోజుల్లో 20 శాతం భూభాగం కబ్జా?గడచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎప్) లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు సాగింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సుమారు 20 శాతం భూభాగాన్ని ఖాళీ చేయించడం వెనుక భారీ వ్యూహం దాగివుంది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడం పేరుతో ఇజ్రాయెల్ అక్కడ శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించడంతో ఈ ప్రాంతం శ్మశానవాటికను తలపిస్తోంది.ఏమిటీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ కల?బైబిల్ కాలం నాటి ‘ప్రామిస్డ్ ల్యాండ్’ (వాగ్దాన భూమి) సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలనేది కొందరు అతివాద ఇజ్రాయెలీ నాయకుల తీవ్ర ఆకాంక్ష. దీనినే ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లేదా 'అఖండ ఇజ్రాయెల్' అని పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ లోని కొన్ని భాగాలను కలుపుకోవాలి. నెతన్యాహు తాజా దాడులు ఈ పాత మ్యాప్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.హిజ్బుల్లా అణచివేత.. ఇరాన్ లక్ష్యంగా పావులుఇజ్రాయెల్కు అసలైన శత్రువు ఇరాన్ అని నెతన్యాహు నమ్ముతారు. ఇరాన్ అండతో నడుస్తున్న హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్‌పై పట్టు సాధించడం అసాధ్యం. అందుకే ఒకవైపు క్షిపణి దాడులతో హిజ్బుల్లా వెన్ను విరుస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని వశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారుతుంది.ట్రంప్ హయాంలో.. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇరాన్ నేతలపై దాడులు, కఠినమైన టారిఫ్‌లు, ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ఇవ్వడం ద్వారా ట్రంప్ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అమెరికా అండ ఉండటంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తోంది.పశ్చిమాసియా మ్యాప్ మారుతోందా?ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరాటం కాదు.. ఇది భౌగోళిక సరిహద్దుల మార్పిడి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ‘బఫర్ జోన్’ ఏర్పాటు ఇప్పుడు లెబనాన్ లోపలి వరకు చొచ్చుకుపోయింది. నెతన్యాహు వ్యూహం గనుక ఫలిస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పటంలో లెబనాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.శాంతి చర్చలు సాధ్యమేనా?ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు ఇరాన్ తన పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ తన లక్ష్యం నెరవేరకుండా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ మహా సంగ్రామం పశ్చిమాసియాను మరో పెను మార్పు వైపు నడిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? -
నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా.. నెతన్యాహు వీడియో రిలీజ్
-
మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం
-
ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్‌లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. వాయవ్య ఇరాన్లో ఇజ్రాయెల్‌కు సహకరించేందుకు ప్రయతి్నస్తున్నారన్న ఆరోపణలతో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లో దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని అమెరికా పరిశ్రమలను బయటకు తరలించాలని హెచ్చరించింది.అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇరాన్లో సైనికేతర పరిశ్రమలపై జరిగిన దాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందారు. ఇందుకు ప్రతీకారం తప్పదని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తామని వెల్లడించింది. ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.అమెరికా సైన్యం పశ్చిమాసియాలో క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగిస్తోందని, వాటిని ధ్వంసం చేస్తామని అన్నారు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా ప్రకటించారు. అందులో కొన్ని కీలక మార్గాలను మాత్రమే తమ నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధాన్ని కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. అల్–డాఫ్రా ఎయిర్‌బేస్‌పై 10 క్షిపణులు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్–అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్లో 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,400 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో తమ సీనియర్ మిలటరీ అధికారి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా జలాలీ నసబ్ మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు గల్ఫ్‌లో ఇరాన్ దాడుల పరంపరం ఆగడం లేదు. రియాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. అల్–ఖర్గ్పై ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను, తూర్పు ప్రావిన్స్‌లో రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ప్రకటించింది.యూఏఈలోని అమెరికా అల్–డాఫ్రా ఎయిర్‌బేస్‌పై ఐఆర్జీసీ 10 క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్‌లో సైరన్ల మోత వినిపించింది. దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బహ్రెయిన్‌లో ఆరుగురు, యూఏఈలో 33 మంది అరెస్టయ్యారు. వారిలో పలువురు భారతీయులున్నారు. ఇరాన్ దాడుల్లో గాయపడిన 108 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ భూభాగం నుంచి హెజ్»ొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించారు.రాకెట్ల శిథిలాలు తాకడంతో టెల్ అవీవ్, హోలోన్ సిటీలో మంటలు చెలరేగాయి. కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఓ అపార్టుమెంట్ భవనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్ వద్ద బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల కొరత నెలకొంది. యుద్ధం మరింత ముదిరితే ఇరాన్, హెజ్»ొల్లా దాడులను తిప్పికొట్టడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధంగా లేం: ట్రంప్ స్పష్టీకరణయుద్ధాన్ని ముగించే విషయంలో తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, అందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హార్మూజ్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడే దేశాలు యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ కోరారు. చమురు నౌకలకు ఇవి ఎస్కార్ట్‌గా పని చేస్తాయన్నారు. -
గణాంకాలు, ఫెడ్ సమీక్షపై దృష్టి
దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష తదితరాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను బలహీనపరచిన పశ్చిమాసియా యుద్ధం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. ముడిచమురు ధరల పెరుగుదల ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తోంది. వెరసి మరోసారి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ బ్రెంట్ చమురు బ్యారల్ లండన్ మార్కెట్లో గత వారం 102 డాలర్ల ఎగువకు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, హుర్ముజ్ మార్గంలో నౌకల రవాణాకు అంతరాయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా చమురు, గ్యాస్ సరఫరాల కొరత భారత్‌ను వేధిస్తోంది. నేడు(16న) చమురు ధరలు మరోసారి మండితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే వీలుంది. ఫెడ్ దారెటు? ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను బుధవారం(18న) ప్రకటించనుంది. గత పాలసీ సమీక్షలో యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ రేట్లు 3.5–3.75% వద్దే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, ప్రయివేట్ రంగ ఉపాధి, చమురు నిల్వల గణాంకాలు సైతం ఈ వారం విడుదల కానున్నాయి. వీటికితోడు పశి్చమాసియా యుద్ధం, ధరల పెరుగుదల తదితర అంశాలను ఫెడ్ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆర్ధికవేత్తలు తెలియజేశారు. దేశీయంగా.. దేశీయంగా గత నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 10 నెలల గరిష్టం 3.21 శాతాన్ని తాకింది. నేడు టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 1.81 శాతం పెరిగింది. ఫిబ్రవరి నెలకు వాణిజ్య గణాంకాలు సైతం విడులకానున్నాయి. కాగా.. బ్రెంట్ చమురు 101 డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం బలహీనపడుతోంది. యుద్ధం కొనసాగితే చమురు, గ్యాస్ కొరత పెరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.సాంకేతికంగా చూస్తే ఈ వారం .. యుద్ధ భయాలు, చమురు ఆందోళనలు ఈ వారం సైతం మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి విశ్లేషణ ప్రకారం మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశముంది. ⇒ ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,800–22,600 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఇక్కడి నుంచి బలపడకుంటే 22,200–22,100 పాయింట్లవరకూ పతనంకావచ్చు. ఒకవేళ బలాన్ని పుంజుకుంటే 23,700–23,900 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురయ్యే వీలుంది. 24,000 పాయింట్లు దాటితే మరింత పుంజుకోవచ్చు.గత వారం పతన బాటలోపశ్చిమాసియా యుద్ధం, చమురు ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నికరంగా సెన్సెక్స్ 4,355 పాయింట్లు(5.5 శాతం) పతనమై 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 1,299 పాయింట్లు(5.3 శాతం) కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 4 శాతం స్థాయిలో క్షీణించాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే సెన్సెక్స్ 6,723 పాయింట్లు(8.3 శాతం) పడిపోయింది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 34 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ నెల ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 52,704 కోట్ల(5.73 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా గత 17 నెలల్లోనే అత్యధిక పెట్టుబడులు చేపట్టారు. అయితే చమురు ధరలు, యుద్ధ భయాలతో ఈ నెల నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. -
యుద్ధమంటే...
యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్ ‘వార్ అండ్ పీస్’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! -
ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు
-
పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలతో అమెరికాలో మధ్యంతర ఎన్నిక
-
డెడ్లీ వార్.. మూడో ప్రపంచ యుద్ధం.. మొదలైనట్టేనా?
-
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ప్రజలే. అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు.ఇస్ఫాహాన్ నగరంలో రిఫ్రిజిరేటర్లు, హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి. అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది. అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది.అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు. అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. -
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
-
నెతన్యాహు ఎక్కడ?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు, పుకార్లతో శనివారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నింటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్‌పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెలీలను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లున్నట్టుగా కన్పించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి నెతన్యాహు రెండు చేతులకూ ఐదు వేళ్లే ఉంటాయి.దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచి్చంది. దానిపై రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జెనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెలిబుచ్చారు. మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కన్పించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యుద్ధం మధ్యలో ఆ విషయం బయటికొస్తే ఇరాన్‌కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటినుంచీ ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గానీ కుడి చేతికి ఆరు వేళ్లు వాస్తవం కాదని గ్రోక్ తేల్చింది. ఒకానొక ఫ్రేమ్‌లో నిర్దిష్ట కోణంలో అరచేతికి ఆరో వేలున్నట్టు కేవలం దృశ్యభ్రాంతి కలుగుతోందని పేర్కొంది.అయినా ఆన్లైన్ రగడకు తెర పడకపోవడం విశేషం! ‘నెతన్యాహు ఎక్కడ?’, ‘బిబి (నెతన్యాహు ముద్దుపేరు) క్షేమమేనా?’అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా శుక్రవారం నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్‌హౌస్‌లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ‘అత్యవసర’పిలుపు రావడంతో ఉన్నపళంగా ‘సిచ్యుయేషన్ రూమ్’కేసి పరుగెత్తారు. ఏకంగా రెండు గంటల అనంతరం తిరిగొచ్చారు.తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించినా బెసెంట్లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. ‘‘నెతన్యాహు ఇక లేరని బహుశా ట్రంప్‌కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్‌తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చు’’అని సోషల్ మీడియా యూజర్లు విశ్లేíÙస్తున్నారు. ప్రఖ్యాత రాజకీయ వ్యాఖ్యాత జోహనస్ ఎం.కొన్రాడ్త్ కూడా నెతన్యాహు మరణించారని సదరు వీడియోను ఉటంకిస్తూ పేర్కొనడం విశేషం. ఆ విషయం తెలియడం వల్లే బెసెంట్ అంతగా దిగ్భ్రాంతికి లోనైనట్టు కన్పించారని ఆయన కూడా చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు.. యుద్ధ ప్రభావం
-
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ వెలవెలబోతున్న దుబాయ్
-
ఇరాన్ గుండెపై అమెరికా మిస్సైల్స్
-
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
ఇరాన్‌తో యుద్ధం మొదలై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్ ఈస్ట్‌కు అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నిన్న (శుక్రవారం) భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరం నడిరొడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే చమురులో ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ దాదాపుగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా.. 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
లెబనాన్‌పై బాంబుల వర్షం
పశ్చిమాసియా యుద్ధ తీవ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు మద్ధతుగా నిలిచే గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. హిజ్బూల్లా స్థావరాలే లక్షంగా అటాక్స్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో అధిక సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు తీవ్రతరం చేసింది. కొద్దిరోజుల క్రితమే గ్రౌండ్ లెవల్ ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశ ఆర్మీ దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. తాజాగా బీరూట్ నగరంపై బాంబులతో విరుచుకపడింది. హిజ్బుల్లా టార్గెట్‌గా జరిగిన దాడుల్లో ఆ దేశంలోని సాధారణ పౌరులు పెద్దమెుత్తంలో మరణిస్తున్నారు. తాజాగా బీరూట్‌పై జరిపిన బాంబుదాడుల్లో 12 మంది వైద్యసిబ్బంది మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది.హిజ్బుల్లా హెచ్చరికఅయితే ఈ నేపథ్యంలో హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ తీవ్రంగా స్పందిచారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు." మమ్మల్ని మేము దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం చేసుకున్నాం. భగవంతుడు కోరుకుంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది సాధారణ యుద్ధం కాదు. అస్థిత్వ యుద్దం." అన్నారు. లెబనాన్‌లో మౌళిక సదుపాయాలపై జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాలని తెలిపారు.కాగా నిన్న శుక్రవారం జ్రారియే మరియు టేర్ ఫాల్సే పట్టణాలను కలిపే లిటాని నదిపై ఉన్న వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇది హిజ్బుల్లాకు ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్ చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేసింది.ఇజ్రాయెల్ హెచ్చరిక కాగా మరోవైపు ఇజ్రాయెల్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే మరియు హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించే హిజ్బుల్లాకు తన మద్ధతు ఉపసంహరించి దానిని నిరాయుధీకరణ చేసే వరకూ లెబనాన్ భూభాగం కోల్పోతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ హెచ్చరించారు.ఐక్యరాజ్యసమితి స్పందనఅయితే శుక్రవారం బీరుట్ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలకు మద్ధతు ఇవ్వడానికి 325 మిలియన్ డాలర్ల మానవతావాద సహాయం అందించాలని ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. -
ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. -
ఏం కావాలో ‘ట్రంప్’కు తెలుసు!
‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్‌కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట. చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే! ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి. 1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు! – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త -
ఇరాన్ ముందుచూపు.. మొజాయిక్ డిఫెన్స్!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం ముసావీ, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్ర నేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా రెండు వారాలుగా ఇరాన్‌పై ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్, దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా తొలి రోజు దాడిలోనే గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి. అయినా సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్‌ను ఓడించడం దేవుడెరుగు, ఆ దేశాన్ని కాస్త కూడాలొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశి్చమాసియా మొత్తాన్నీ యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటోంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా, డెడ్లీ కాంబినేషన్‌గా పరిగణించే ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులను దీటుగా ఎదుర్కోవడం ఇరాన్‌కు ఎలా సాధ్యపడుతోంది? ఇందుకు సమాధానం ఒక్కటే. ఆ దేశం ముందుచూపుతో సిద్ధంచేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం! అత్యంత శక్తిమంతుడైన శత్రువుపై ఇరాన్‌కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా, ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటిది!! సైనికాధికార వికేంద్రీకరణ ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపళంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్‌కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి 2005లో పుట్టుకొచి్చందే మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్కముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూలమంత్రం.ఇందులో భాగంగా సైనిక, ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయంప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కూ సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్–కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికా దళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్సీజీ చీఫ్ కమాండర్‌గా ఎంపికయ్యా మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. పొరుగునుంచే పాఠాలు ఇరాక్‌లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాఘ్చీ ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన రెండో రోజు మార్చి 1వ తేదీనే ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ఆద్యంతం ఐఆర్‌జీసీతోనే ముడిపడ్డ కెరీర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీది. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లో నిఘా విభాగంలో చేరారు. అనంతరం ఇరాక్‌తో పదేళ్ల యుద్ధంలో పోరాడారు. 1992 నాటికి ఐఆర్జీసీ పదాతి దళాల కమాండర్‌గా ఎదిగారు. 2005లో ఐఆర్జీసీ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాక మొజాయిక్ సిద్ధాంతానికి పదును పెట్టారు. 2003లో ఇరాక్‌ను అమెరికా ఆక్రమించిన తీరు నుంచి నేర్చుకున్న పాఠాలనే అందుకు ముడిసరుకుగా మార్చుకున్నారు.నిద్రలేని రాత్రులేఇరాన్ ముందుచూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైనా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పైనే గాక గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి.శత్రు దాడులకు ఎక్కడికక్కడ దీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల వంటి పౌర వ్యవస్థలపైనా దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్‌తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు. -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్‌తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ‘ఫిసైల్’పై చర్చలు ముగియక ముందే..!ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్–అమెరికా 2025 జూన్‌లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్‌పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రిసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రిసెర్చ్ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్ అయోడిన్ అండ్ జినాన్ (ఎం.ఐ.ఎక్స్.) రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్–క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్ రిసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్ న్యూక్లి యర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తర్వాత నూతన ఇస్పహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. ‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!అసలు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఇస్లామిక్ ప్రభుత్వ మద్దతు ర్యాలీలో టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
-
అగ్నిగుండంలా పశ్చిమాసియా.. ఇరాన్ పై రెచ్చిపోయిన ఇజ్రాయెల్
-
చాకచక్యంగా హార్ముజ్ దాటి ముంబై చేరిన తొలి నౌక
-
యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక
-
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్‌మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అమెరికాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్‌లోని వెస్ట్ బ్లూమ్ సిటీ ప్రాంతంలో యూదుల ప్రార్థనామందిరం వద్దకు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో వచ్చి ఢీకొట్టాడు. అనంతరం అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని కాల్చి చంపారు. ఇక కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి దాడులు మరోసారి జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభదశలోనే నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, నిందితుడు కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు? కుట్రకోణం ఉందా? లేదా అనే ఇతర కారణాలు తెలియాల్సి ఉంది. -
యుద్ధ కల్లోలం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఎడతెరిపిలేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర గురువారం 100 డాలర్లు దాటేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 38 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి, దాడులు ఆపకపోతే బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరడం తథ్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తుండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్‌ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచదేశాలపై.. ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదని తేల్చిచెప్పారు. శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా–ఇజ్రాయెల్‌లకు కొత్త ఆఫర్ ఇచ్చారు. మూడు షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తామని చెప్పారు. ముడి చమురు నౌక షెన్లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ హార్మూజ్ నుంచి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్‌లో ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న అమెరికా ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్ చేశామని, బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో 200 డాలర్లకు చేరబోతోందని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖారీ స్పష్టంచేశారు. భద్రతా మండలి తీర్మానం బేఖాతర్ ఇరాన్ యుద్ధం గురువారం పదమూడో రోజుకు చేరుకుంది. దాడులు ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్ తీరంలో కంటైనర్ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్న ముహరాఖ్ ద్వీపాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్‌ను ప్రయోగించింది. రాజధాని రియాద్‌లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌ను మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్‌లోని బస్రా పోర్టుపైనా ఇరాన్ దాడికి దిగడంతో ఇరాక్‌లోని చమురు కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గల్ఫ్‌లో దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్‌తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యూఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచే పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కువైట్‌లో ఓ భవనాన్ని ఇరాన్ క్షిపణి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. 200 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్‌లో ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా గ్రూప్‌ను క్షిపణులతో టార్గెట్ చేసింది. గురువారం జరిగిన రెండు దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్లోజరిగిన దాడిలో 8 మంది మృతిచెందగా, 31 మంది క్షతగాత్రులయ్యారు. అరామైన్ టౌన్‌పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్‌పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియల్ గల్ఫ్‌లో ఏరులై పారుతుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలిబాఫ్ హెచ్చరించారు. తమ దీవుల జోలికి రావొద్దని అన్నారు. లెబనాన్‌లో 634కి చేరిన మృతులుఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే, లెబనాన్‌లో 1,300 మందికిపైగా మరణించారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో 12 మంది, గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా జవాన్లు మృతి చెందారు.పెజెష్కియాన్ మూడు షరతులు పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలంటే స్పష్టమైన మార్గం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. మూడు షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరాన్ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలని, ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలని పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారానికి సిద్ధం అంటూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, అధ్యక్షుడు పెజెష్కియాన్ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే పరాజయం పాలయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అన్నారు. ఇరాన్ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు(రూ.1.04 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ ప్రకటించింది. మొజ్తబా ఖమేనీ యుద్ధ శంఖారావం యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నామని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ(56) తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్లో టీవీ న్యూస్ చానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుందని సంకేతాలిచ్చారు. హార్మూజ్ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోమని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్–అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతోపాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమేనని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని అన్నారు. తనను సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశానని వెల్లడించారు. ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు. -
ఇరాన్ ఓపెన్ వార్నింగ్ 200 డాలర్లకు చమురు ధర! ఇక ఆర్థిక సంక్షోభమే
-
యుద్ధం వేళ.. ఇరాన్‌తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్‌తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ మూడు షరతులు
-
పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ బీభత్సంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ విధిస్తున్న షరతులకు ఇజ్రాయెల్,అమెరికా అంగీకరించాలని తెలిపారు. షరతులపై అమెరికా,ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపేందుకు రష్యా,పాకిస్థాన్‌లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అంతేకాదు ఇరాన్ స్పష్టంగా ప్రకటించిన ఈ షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని సూచించారు. అమెరికా-ఇజ్రాయెల్‌కు విధించిన షరతులు ఇవే మొదటి షరతుగా, ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా, ఇప్పటి వరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది.మూడవ షరతుగా, భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ మూడు షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్ స్పష్టం చేసింది. లేకపోతే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ షరతులు యుద్ధానికి ముగింపు దారితీస్తాయా లేదా అన్నది అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ స్పష్టమైన షరతులు పెట్టడం వల్ల ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అనిశ్చితంగా ఉంది.Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026 -
ప్రముఖ డేటా సెంటర్లకు ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో నూతన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా సైతం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
యుద్ధ భయం.. లిక్విడ్ క్యాష్ దాచుకోవాలా? బ్యాంకులో రూ.40లక్షల కోట్లు మిస్సింగ్..!
-
వాణిజ్య నౌకలపై గురి!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం తగ్గుముఖం పట్టే సూచనలే కన్పించడం లేదు. 12వ రోజైన బుధవారం ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యూఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. నౌక పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. అంతేగాక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. రెండు డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి. ఈ ఘటనలో ఒక భారతీయునితో సహా నలుగురు గాయపడ్డారు. అయితే విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక గల్ఫ్‌లోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రాలపై కూడా ఇరాన్ ఎడాపెడా దాడులు జరిపింది. ఇకపై పశ్చిమాసియాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుని పెద్దపెట్టున దాడులు చేస్తామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. దాంతో ఆ ఆర్థిక సంస్థల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రయోగించిన 8 డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్, 5 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా నేలకూల్చినట్టు సౌదీ తెలిపింది. ఖతర్, ఒమన్, బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో రువైస్ చమురు శుద్ధి కేంద్రాన్ని మూసేస్తున్నట్టు యుఏఈ ప్రకటించింది. ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాలపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్‌పై తీవ్ర దాడులు మరోవైపు ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులు బుధవారం కూడా ఇరాన్‌ను అల్లాడించాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్‌లోని బ్యాంక్ సఫా భవనం దాడుల్లో తీవ్రంగా దెబ్బ తింది. దాని సిబ్బందిలో పలువురు మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు బుధవారమూ కొనసాగాయి. రాజధాని బీరూట్‌లో అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ఐచా బకర్ ప్రాంతంలో పలు భవనాలు దాడుల్లో పూర్తిగా దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్‌లో జరిపిన దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్టు తెలుస్తోంది. వారిలో ఒక రెడ్‌క్రాస్ సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. లెబనాన్‌లో మృతుల సంఖ్య 570 దాటినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 160 మంది అమెరికా సైనికులకు గాయాలు ఇరాన్‌పై యుద్ధంలో ఇప్పటిదాకా 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్టు పెంటగాన్ ప్రధాన అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. ‘‘వారిలో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 108 మంది ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జై విధుల్లో చేరారు’’అని చెప్పారు. అయితే గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 160 పై చిలుకేనని తెలుస్తోంది. 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల: ఐఈఏపారిస్: పశ్చిమాసియా యుద్ధంతో చమురు సరఫరా పడకేసిన నేపథ్యంలో అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఈఏ ఈ స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి! అయితే హార్మూజ్ జలసంధి గుండా చమురు, సహజ వాయువు రవాణా వీలైనంత త్వరగా పునఃప్రారంభం కావడమే సమస్యకు పరిష్కార మార్గమని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీ బిరోల్ ఆశాభావం వెలిబుచ్చారు.మధ్యవర్తిత్వానికి తెర: ఖతర్ దోహా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశం తరఫున చర్చల్లో మధ్యవర్తిగా కొనసాగబోనని ఖతర్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలకు ఆ దేశం మధ్యవర్తిత్వం వహించడం తెలిసిందే. అయినా తమపై ఇరాన్ దాడులు చేసిందంటూ ఖతర్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మహమ్మద్ బిన్ అద్బుల్ అజీజ్ అల్‌ఖులైఫీ ఆవేదన వెలిబుచ్చారు. హార్మూజ్ పొడవునా మందుపాతర్లు హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాతరలు అమర్చుతోంది! వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయప్రయాసలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హార్మూజ్‌ను దాటే మార్గం ఇరాన్‌కు మాత్రమే తెలుసు! ఈ నేపథ్యంలో ఆ మందుపాతరలను తక్షణం తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటమిచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను కనీవినీ ఎరగని స్థాయికి పెంచుతామని హెచ్చరించారు. హార్మూజ్‌లో మందుపాతరలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్ పడవలను పేల్చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు, హార్మూజ్‌ను మూసేసినట్టు ఇరాన్ ప్రకటించినా, ఆ దేశానికి చెందినవిగా భావిస్తున్న పలు చమురు నౌకలు మాత్రం దానిగుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో బ్యారెల్‌కు 200 డాలర్లు! ప్రపంచం సిద్ధపడాలి: ఇరాన్ పశ్చిమాసియా కల్లోలం నేపథ్యంలో చమురు ధరలు త్వరలో ఆకాశాన్నంటడం ఖాయమని ఇరాన్ జోస్యం చెప్పింది. ‘‘అవి త్వరలో బ్యారెల్‌కు ఏకంగా 200 డాలర్ల దాకా చేరవచ్చు. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలి’’అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫకరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీసినందుకు ఇలాంటి పర్యవసానాలు తప్పవన్నారు. ‘‘ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇప్పటిదాకా పరిమిత స్థాయి ప్రతీకార దాడులకే పరిమితమయ్యాం. కానీ ఇకపై వాటిపై పూర్తిస్థాయిలో ఎడతెరిపి లేకుండా దాడులకు దిగుతాం’’అంటూ హెచ్చరించారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ దుయ్యబట్టారు. యుద్ధానికి త్వరలో తెర: ట్రంప్ ఇరాన్లో ఏమీ మిగల్లేదన్న అధ్యక్షుడు ఇరాన్‌పై యుద్ధానికి త్వరలో తెర దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. బుధవారం ఈ మేరకు ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తమ దాడుల అనంతరం ఇరాన్లో ఇంకేమీ మిగల్లేదని అభిప్రాయపడ్డారు. ‘‘లక్ష్యం చేసుకోవడానికి ఇంకేమీ లేదక్కడ. యుద్ధం ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నీ దాదాపుగా నెరవేరినట్టే. కాబట్టి ఇక నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధానికి తెర పడుతుంది’’అని ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. -
యుద్ధం మరింత భీకరం.. టార్గెట్ అమెరికా
-
క్షిపణుల వర్షం.. యుద్ధం తీవ్రం.. పశ్చిమాసియాలో సైరన్ల మోత
-
దాడులు ఉదృతం.. నేను రెడీ.. మీరు రెడీనా..?
-
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
-
దాడులు ఉధృతం
దుబాయ్: పశ్చి మాసియా యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు ఉధృతం చేస్తోంది. యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ విరుచుకుపడింది. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఒక మహిళ(29) మరణించగా, 8 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఆరు డ్రోన్లు నేలకూల్చి నట్లు కువైట్ నేషనల్ గార్డు దళం వెల్లడించింది.యూఏఈలో పారిశ్రామిక నగరమైన రువాస్పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు బాంబులు, సైరన్ల మోతతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. జెరూసలేం, టెల్ అవీవ్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమవైపు దూసుకొచ్చిన ఇరాన్ మిస్సైళ్లను తుత్తునియలు చేశామని ఖతార్ రక్షణ శాఖ తెలియజేసింది. హొర్మూజ్‌పై ఇరాన్ గురి ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై కేవలం మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో సరిపెట్టకుండా హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇక్కడ చమురు రవాణా నౌకలను అడ్డుకుంటోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు పెరిగేకొద్దీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం తథ్యమని, ఫలితంగా ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్ అంచనా వేస్తోంది. ముడి చమురు బ్యారెల్ ధర 90 డాలర్లు దాటేసింది. ఫిబ్రవరి 28 నాటి ధరతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. హొర్మూజ్‌లో చమురు రవాణా నౌకలపై ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఏడుగురు నావికులు మరణించారు. మంగళవారం పర్షియన్ గల్ఫ్‌లో యూఏఈ తీరంలో చమురు రవాణా నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అండదండలతో దాడులకు తెగబడుతున్న హెజ్బోల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మిలిటెంట్లు హతం కాగా, నలుగురు గాయపడినట్లు తెలిసింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దక్షిణ లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. హెచ్బొల్లాపై భీకర దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటివరకు 1,230 మంది మరణించారు. లెబనాన్‌లో 397 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది మృతిచెందారు. అలాగే ఏడుగురు అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: రష్యా యుద్ధాన్ని ముగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా మని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికాలకు సూచించారు.ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు: హెగ్సెత్ ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈరోజే ఈ దాడులు జరుగబోతున్నాయని మంగళవారం ప్రకటించారు. ఇరాన్‌పై గరిష్ట సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్ సైన్యం గత 24 గంటల్లో స్వల్పంగానే క్షిపణులు ప్రయోగించిందని తెలిపారు. ఇరాన్ ఆయుధ బలం క్షీణిస్తోందని తెలిపారు. బెదిరింపులకు భయపడం: ఇరాన్యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఎక్స్’లో పోస్టుచేశారు. కాల్పుల విరమణ కోసం ఎదురు చూడడం లేదని, శత్రువులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ సైనికాధికారి అలీ లరిజానీ ఉద్ఘాటించారు. హొర్మూజ్‌లో చమురు రవాణాను అడ్డుకుంటే 20 రెట్లు బలంగా దెబ్బకొడతామన్న ట్రంప్ హెచ్చరికలను కొట్టిపారేశారు. అమెరికా కంటే బలమైన దేశం కూడా ఇరాన్‌ను ఏమీ చేయ లేన్నారు. ‘మిమ్మల్ని మీరు నాశనం చేసుకో కుండా జాగ్రత్తగా ఉండండి’ అంటూ అమెరికాకు సూచించారు. ఇరాన్ ప్రజలకు సహకరిస్తాంనియంతృత్వం, రాక్షస పాలన నుంచి బయటపడడానికి ఇరాన్ ప్రజలకు సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అంతిమంగా రాజకీయ, పాలనాపరమైన మార్పును సాధించుకోవడం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రయత్నాలతో ఇరాన్ నాయకత్వం బలహీనపడుతోందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వెన్నుముక విరిచేశామని, ఇప్పటికీ తాము క్రియాశీలకంగా ఉన్నా మని వ్యాఖ్యానించారు. ఇరాన్లో శాశ్వతమైన మార్పు రావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. -
తిప్పలు తప్పని యుద్ధం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్‌పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్కు రోమ్పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్‌కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి. నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్‌పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం. యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్‌తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే! -
ట్రంప్‌ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. “నిన్ను మించిన వారికి కూడా ఇరాన్‌ను నాశనం చేయడం సాధ్యం కాలేదు. జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వే ఖతం అవుతావు” అని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని పై విధంగా స్పందించారు.కాగా, ‘హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గత దాడుల కంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ మళ్లీ ఎప్పటికీ పునర్నిర్మాణం కాలేదు. అంతలా ఆ దాడులు ఉంటాయి’ అని తెలిపారు. కానీ, అలా జరగకూడదని తాను ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని అని ట్రంప్ అన్నారు.మొజ్తాబాను కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఆయన ప్రశాంతంగా జీవించలేరని చెప్పారు. ఇరాన్ ఎంచుకున్న లీడర్ తనకు నచ్చలేదని ట్రంప్ చెప్పారు. అలీ ఖమేనీ రెండో కుమారుడిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మోజ్తబా ఖమేనీ నియామకానికి ముందు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గతంలో వెనెజువెలా విషయంలో అమెరికా జోక్యం ఉన్నట్లే ఇప్పుడూ ఇరాన్ విషయంలో ఉండాలని అన్నారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది.హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హోర్ముజ్ జలసంధి నుంచి ఒక లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పింది. పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి ప్రపంచానికి చమురు రవాణా జరిగే అత్యంత కీలక సముద్ర మార్గమే హోర్ముజ్ జలసంధి.ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. మంగళవారం ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరిగింది.బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇరాన్ దాడి ఒక నివాస భవనాన్ని తాకింది. 29 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా తూర్పు చమురు ప్రాంతంపై వచ్చిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కువైట్ నేషనల్ గార్డ్ 6 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రువైస్ పారిశ్రామిక సిటీలో డ్రోన్ దాడి తర్వాత అగ్ని ప్రమాదం చెలరేగింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పని చేశాయి. -
ఈ క్షిపణులను ఇరాన్ ధనాధనా వేసిందనుకో..
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాను యుద్ధ భయాలు వీడడం లేదు. అయితే, ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న ఓ శక్తిమంతమైన ఆయుధం పలు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఆ ఆయుధాన్ని నాశనం చేసేందుకే.. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భూతల దాడులకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ ఆయుధం ఏమిటి? ఇరాన్ దాచిన ఆ ఆయుధాన్ని వెలికి తీయడం అమెరికా, ఇజ్రాయెల్ బలగాలకు సాధ్యమవుతుందా?భూ గర్భంలో దాచిన ఇరాన్ఆ ఆయుధాన్ని ఇరాన్ భూ గర్భంలో దాచింది. ఇరాన్ వద్ద ఉన్న ఆ శక్తిమంతమైన క్షిపణి గురించి, దాని విధ్వంసక సామర్థ్యం, పరిధి ఏమిటన్న విషయాలపై పాశ్చాత్య, పశ్చిమాసియా దేశాల నెటిజన్లు సెర్చింజన్లను జల్లెడపడుతున్నారు. ఇరాన్ వద్ద గగనతల దాడులకు కేవలం రెండు సుఖోయ్-14 యుద్ధ విమానాలుండగా.. వాటిని నాశనం చేసినట్లు ఖతార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. మిగ్-29 విమానాలు 24 దాకా ఉన్నాయి. పాత తరం ఫాంటమ్ జెట్లు 60 వరకు, ఎఫ్-14 యుద్ధ విమానాలు 40 దాకా ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఇరాన్ తన యుద్ధ విమానాలతో దాడులు జరిపిన దాఖలాలు పెద్దగా లేవు. ఇరాన్ వద్ద భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని కూడా ఇరాన్ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వినియోగించలేదు. అందుకే, అమెరికా వైమానిక దళం ఇరాన్ గగనతలంపై ఆచితూచి ముందుకు సాగుతోంది. ఇరాన్ వద్ద భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.క్షిపణులపైనే ఆధారపడి యుద్ధ తంత్రం యుద్ధంలో ఇరాన్ క్షిపణులనే నమ్ముకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ దగ్గర 3,000కు పైగా పెద్ద క్షిపణులున్నాయి. వీటిల్లో 27 రకాల బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం ఇప్పటి వరకు వినియోగించినట్లు అంచనా. క్రూయిజ్ క్షిపణులను పెద్దగా వినియోగించిన దాఖలాలు లేవు. షహబ్-1 వంటి క్షిపణుల పరిధి 300 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే.. 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఖైమ్ వంటి క్షిపణులను ఇరాన్ ఇంకా తన అమ్ముల పొది నుంచి తీయలేదని తెలుస్తోంది. 2,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న క్రూయిజ్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ శత్రుదేశాల పాలిట ముప్పుగా ఉన్నాయి.వీటిని పావ్, ఖుద్స్, రాద్ నగరాలను లక్ష్యంగా చేసుకునేలా ప్రయోగించే ప్రమాదాలు లేకపోలేదు. అయితే.. ఇరాన్ వద్ద ఉన్న భారీ బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని లేదా దిశను మార్చడం సాధ్యం కాదు. హైపర్ సోనిక్ వేగం కారణంగా నిలువరించడం అసాధ్యమేనని తెలుస్తోంది. దిశ, లక్ష్యాన్ని మార్చగలిగే క్రూయిజ్ క్షిపణులను ఇప్పటికీ ఇరాన్ వాడకపోవడంతో.. ఏ క్షణమైనా యుద్ధం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.ఇరాన్ క్షిపణుల నిల్వపై అమెరికా దృష్టిఅటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ భూగర్భంలో ఉన్న క్షిపణుల నిల్వపై దృష్టి సారించాయి. అందుకే.. ఇరుదేశాల సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దుల నుంచి భూతల దాడులను ప్రారంభించకుండా.. క్షిపణుల స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా తమ సైన్యాన్ని దింపి, గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇరాన్ తన అమ్ములపొదిలోని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించకముందే.. వాటిని గుర్తించి, ధ్వంసం చేయాలని అమెరికా అడుగులు వేస్తోంది. - సాక్షి వెబ్‌డెస్క్ -
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
-
ఇరాన్ స్కూల్ పై దాడి... దాడి అమెరికా పనేనా?
-
గ్యాస్ కొరత.. మూత పడుతున్న హోటళ్లు..
ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్ కొరత తీవ్రంగా పెరిగి హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (AHAR) హెచ్చరించింది.ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్ అసోసియేషన్ కోరింది.ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. -
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
-
ఆ ధైర్యం ఇరాన్‌కు ఎక్కడనుంచి వచ్చింది?
ఇరాన్ యుద్ధం.. ఆ దేశం కోరుకున్నది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనిని కోల్పోయి తీవ్ర వేధనను భరిస్తూనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్‌లో ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ పరిస్థితి ఇక ముగిసినట్లే అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. ‘నిండా మునిగిన వాడికి చలేమిటి’ అన్నట్లు ఇరాన్ యుద్ధం చేసే తీరును గమిస్తేనే అర్థమవుతోంది.అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గుబెల్ పుట్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట రాగానే, అంతే వేగంగా స్పందించింది ఇరాన్. తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా--ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్‌కు కౌంటరిచ్చింది. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా కంటిన్యూగా చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పిన ఇరాన్.. ఇప్పుడు పదేళ్లు అయినా యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది. ట్రంప్‌లో భయం మొదలైందా..?ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ ఒక్కసారిగా హుకుం జారీ చేశారు. ఇరాన్ చమురు నిల్వలు మన టార్గెట్ కాదని, వాటిపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. దాంతో అమెరికా-ఇజ్రాయెల్‌లో భిన్న వైఖరి కనిపించింది. ఇక ‘ మీ పని అయిపోయింది’ అంటూ ఇరాన్ స్వయంగా లొంగిపోవాలంటూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న ట్రంప్‌కు ఎక్కడో భయం ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో అది ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్‌లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాల ట్రంప్ ముఖాన్ని చీదిరించుకుంటారనే ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది విశ్లేషకులు అభిప్రాయం. మరొకవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం కూడా ట్రంప్‌లో అలజడి రేపుతున్నట్లే కనబడుతోందని అంటున్నారు. ఇరాన్‌ను తక్కువగా చూడొద్దు: అమెరికా నిఘా వర్గాలుమరొకటి ఏమిటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసే శక్తిని దాదాపు క్రోడీకరించుకుందనే అనుమానం కూడా ట్రంప్‌లో ఉంది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తాము ధ్వంసం చేశామనే ఇరాన్ అణు కేంద్రాలను ఆ దేశం తిరిగి పునరుద్ధరించే పనిలో ఉందని అమెరికా నిఘా వర్గాలే చెప్పాయి. అయితే దానిపైనే ప్రస్తుతం తమ ఫోకస్ ఉందని, వాటిని వారు ఎక్కడికి తరలిస్తారు.. ఎలా పునరుద్ధరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాయి. అంటే ఇరాన్ అణు ఆయుధాల అవసరమైన స్థాయిలో యురేనియంను శుద్ధిచేస్తోందనే విషయం అమెరికా చెప్పకనే చెప్పేసింది. అంటే అణు ఆయుధాలు ఇరాన్ నుంచి తయారైతే అదే తమకు ముప్పని అమెరికాకు బాగా తెలుసు. దాంతోనే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతుండగా, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఘనంగా ముగిస్తామని అంటోంది. అది అమెరికా-ఇజ్రాయెల్‌కు బుద్ధిచెప్పిన తర్వాతే తమ యుద్ధం ఆగుతుందని.. అంత వరకూ యుద్ధంలో వెనకడుగేసి ప్రసక్తే లేదని అంటోంది.పుతిన్‌కు ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్లు?ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం. ఇరాన్‌పై దాడిని తొలుత ఖండించిన వారిలో పుతినే ఉన్నారు. మరి అటువంటి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది. అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్‌తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తుందని ఆరోపించిన అమెరికా.. ఇప్పుడు ఆ ధేశ అధ్యక్షుడికే ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మరొక ప్రశ్న. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్‌కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్‌గా మారింది. ఒకవేళ అమెరికా అనుమానపడుతున్నట్లే అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసే పనిలో ఉంటే మాత్రం అది ప్రపంచానికి ముప్పుగానే చెప్పొచ్చు. -
చమురు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం తీవ్రతరం
-
ఇరాన్‌పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
వాషింగ్టన్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్‌పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్‌ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన వారసుడిగా ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే చమురు ధరలు భారీగా పెరిగి, 2022 తర్వాత తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని ఇరాన్లో యుద్ధం రోజులు తరబడి కొనసాగుతుందనే సంకేతంగా భావించారు.అయితే అనూహ్యంగా చమురు ధరలు పడిపోయాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదనే అంచనాల నడుమ అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో మియామి గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొంత చెడును వదిలించడానికి మేం మధ్యప్రాచ్యంలో ఓ చిన్న విహారయాత్ర చేశాం. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగా ఉంటుంది. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో, ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద చమురు రవాణా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.దాడుల ప్రభావంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో జరిగిన సంభాషణల తర్వాత ‘వివాదానికి రాజకీయ, దౌత్య పరిష్కారం అవసరం’ అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ వ్యూహమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
పీపా 100 డాలర్ల పైకి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ ముడిచమురు రేట్లు మరింతగా మండుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి ఎగసింది. నైమెక్స్ క్రూడ్ (డబ్ల్యూటీఐ) ఏప్రిల్ డెలివరీ ధర ఒక దశలో 31.44 శాతం పెరిగి 120 డాలర్లకు దాదాపు దగ్గరగా 119.48 డాలర్లను తాకింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 28.82 శాతం పెరిగి 119.46 డాలర్లకు ఎగిసింది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోవడం, ప్రాంతీయంగా పలు దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.ఉద్రిక్తతల కారణంగా కీలక షిప్పింగ్ మార్గంలో నౌకలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఉండటంతో గ్లోబల్‌గా దాదాపు అయిదో వంతు ముడిచమురు, సహజ వాయువు సరఫరా నిలి్చపోయినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ‘హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగించడం తొలి దశ. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండో దశలో మరింత తీవ్రమైన రిసు్కలు ఉండొచ్చు. ప్రాంతీయంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలపై నేరుగా దాడులు చేయొచ్చు. మూడో దశలో కీలకమైన నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఎంసీఎక్స్‌లో భగ్గు.. అంతర్జాతీయ పరిణామాలతో దేశీ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో కూడా ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. మార్చి డెలివరీ కాంట్రాక్టు ఎకాయెకిన 26 శాతం ఎగిసి (రూ. 2,186) జీవితకాల గరిష్ట స్థాయి రూ. 10,549ని తాకింది. మార్చి కాంట్రాక్టు అప్పర్ సర్క్యూట్ తాకిందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సెషన్లలో రూ. 11,300కి కూడా పెరిగే అవకాశం ఉందని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఆమిర్ మక్డా చెప్పారు.బ్యారెల్ ధర ఒక డాలరు పెరిగేతే ఏటా భారత్‌పై 1.8 బిలియన్ డాలర్ల భారం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయిల్ రేటు 50 డాలర్లు పెరిగి, ఏడాది పాటు కొనసాగితే 90 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతమని మిశ్రా పేర్కొన్నారు.సంక్షోభాలు.. యుద్ధాలతో ఆజ్యం..సుమారు దశాబ్దంన్నర కాలంగా వివిధ సంక్షోభాలు, యుద్ధాలతో ముడిచమురు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కమోడిటీల బూమ్ ఏర్పడింది. ఆయిల్ ధరలు ఆ ఏడాది జూలై 11న ఆల్‌టైం గరిష్టస్థాయి 147.50కి ఎగిశాయి. ఆ తర్వాత 2011లో పశి్చమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తిరుగుబాట్లతో దద్దరిల్లినప్పుడు 127 డాలర్ల స్థాయిని చూశాయి.అమెరికన్ షేల్ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ముంచెత్తడంతో 2015 తొలినాళ్లలో 50 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంధనానికి డిమాండ్ పడిపోయి, చమురు ఉత్పత్తి దేశాలు నిల్వలను వదిలించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రెంట్ క్రూడ్ రికార్డు కనిష్టం 15.98 డాలర్లకు కూడా పతనమైంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మైనస్ 40.32 డాలర్లను తాకింది. మళ్లీ 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆయిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. 2022 తొలినాళ్లలో 139 డాలర్లకు ఎగబాకాయి. -
వంట నూనెలు సలసల!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికా యుద్ధం మొదలైన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలు, పప్పు దినుసు లు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్ కామర్స్ ఆన్లైన్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గతవారం రోజుల్లోనే లీటరుకు రూ. 15–25 వరకు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఫిబ్రవరి చివరలో హైదరాబాద్‌లో లీటరు రూ.150కి అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి చేరింది. వేరుశనగ నూనె కూడా రూ. 180కి పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే పామాయిల్ ధర లీటరుకు రూ.15 నుంచి రూ. 20 మేర పెరిగింది. మార్కెట్లో నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగంబజార్, సికింద్రాబాద్ వంటి హోల్‌సేల్ మార్కెట్లలో కూడా హోల్‌సేల్ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్ వ్యాపారులు కూడా ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది. పెరిగిన పప్పుల ధరలు గల్ఫ్ దేశాల నుంచి రావలసిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 130–150 మధ్య పలుకుతోంది. వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల వీటి ధరలు కిలో రూ.180 నుంచి రూ.200కి చేరాయి. పెసర పప్పు, మినప్పప్పు ధరలు కూడా ఎగబాకాయి. ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెపుతున్నాయి. వంట సామగ్రి ధరలు పెరిగాయ్ ఏం యుద్ధమో ఏమో. వంట నూనెలతోపాటు పప్పులు, మిర్చి, వేరుశనగ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ రేట్లు పెంచారు. ఈ ధరలతో హోటల్ నడుపుడు ఎట్లనో తెలుస్తలేదు. ధరలు పెరిగితే మేం కూడా టిఫిన్లు, చపాతి, భోజనాల ధరలు పెంచక తప్పదు. ధరలు పెరగకుండా సర్కార్ ప్రయత్నించాలి. –శేషమ్మ, హోటల్ నిర్వాహకురాలు, నాగర్ కర్నూల్ -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్ తెలిపింది.ఈ దాడి ఇరాన్‌లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్‌లోని ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. -
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
టెహ్రాన్: ‘ట్రంప్ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో మరణించిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు తీసింది.‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్‌పై దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ, “ఆ స్కూల్‌పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్ స్కూల్ విషాదాన్ని ఇరాన్‌పై నెట్టే ప్రయత్నం చేశాడు.ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇనాబ్ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్, ఇటు ఇరాన్ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ విచారణలో మినాబ్‌లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరగగా, స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది.గత ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఇనాబ్ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్ ట్రెవర్ బాల్ తెలిపారు.అంతేకాదు, తొలిసారి ఐఆర్జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్ స్కూల్ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు. -
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..
-
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం
-
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
గ్యాస్ సంక్షోభం
-
యురేనియం నిల్వల కోసం భూతల దాడులు?
వాషింగ్టన్: ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అక్కడినుంచి ఎలాగైనా తరలించాలని అమెరికా భావిస్తోంది. అక్కడి అణుకేంద్రాలపై అమెరికా వాయుసేన కన్నేసింది. అందుకోసం సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఇజ్రాయెల్ సాయంతో భూతల దాడులకు దిగాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. ఎన్బీసీ న్యూస్ వార్తాసంస్థ ఈ మేరకు ఒక కథనంలో పేర్కొంది. అణు కేంద్రాలపై భారీ స్థాయిలో బాంబులు వేసే బదులు ప్రత్యేక సైనిక బృందాన్ని రహస్యంగా తరలించి యురేనియం నిల్వలను ఎత్తుకొచ్చే అవకాశాలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోందని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వెల్లడించారు. ఇటీవల అమెరికా ఉభయ చట్టసభల సభ్యులకు యుద్ధ వివరాలను నివేదిస్తూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో పరోక్షంగా ఈ మేరకు వెల్లడించారు.‘కొందరు వెళ్లి అక్కడున్న వాటిని పట్టుకొస్తారు’ అని అన్నారు. యురేనియం నిల్వలకు సంబంధించి అమెరికా రెండు ప్రణాళికలను సిద్ధంచేసుకుంది. నిల్వలను జాగ్రత్తగా ఎత్తుకొచ్చేయడం. లేదంటే శుద్ద యురేనియంను ఇతర మలినాలతో కలిపేసి దాని గాఢత తగ్గించి పరీక్షలకు శాశ్వతంగా పనికి రాకుండా చేయడం. అయితే యురేనియాన్ని నిరుపయోగం చేయడం సాధారణ సైనికుల వల్ల కాదు.కనుక అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లోని అణు శాస్త్రవేత్తలు, సహాయక సిబ్బందిని కూడా సైనికులతో పాటు ఇరాన్ భూగర్భ అణుకేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి వారితో పని పూర్తి చేయించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోందని తెలుస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ గడ్డ మీదకు పంపుతారా అని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా ‘‘వాళ్లను భూతల దాడులకు పంపించే యోచన లేదు. వాళ్లు వెళ్తేనే పని అవుతుందన్న సందర్భంలో మాత్రమే రంగంలోకి దింపుతా. లేదంటే వాయుసేన, డ్రోన్లతోనే ఇరాన్ కథ ముగిస్తా’’ అని బదులిచ్చారు. -
మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు
టెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అల్బోర్జ్లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్ నగరాలపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది.భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్‌లో వర్క్‌షాపులను, హార్స్‌రైడింగ్ క్లబ్‌ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్ ఎయిర్‌పోర్టులో ఇరాన్‌కు చెందిన ఎఫ్–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్‌లో ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్జీసీ ఇంటర్నల్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్ ఫోర్స్ కాంపౌండ్‌ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికా రాడార్లు నేలమట్టం కువైట్‌పై ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అల్–అదిరీ ఎయిర్‌బేస్‌పై మిస్సైల్, డ్రోన్‌ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. యూఎస్ థాడ్ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్–గైడెడ్ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్‌లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యమే తమ డిశాలినేషన్ ప్లాంట్‌పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్‌లో తాగునీటికి డిశాలినేషన్ ప్లాంట్లే ప్రాణాధారం. స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. మంటల్లో కువైట్ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలుఇరాన్ సైన్యం కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.ఇరాన్ దాడుల్లో ఇద్దరు కువైట్ బోర్డర్ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పైనా ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ సైన్యం 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు. -
పశ్చిమాసియాలో నిప్పుల వాన.. ఇజ్రాయెల్ ట్రెండింగ్‌లో యాప్
అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇరాన్ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్‌లు ఇప్పుడు ఆ దేశంలో హల్చల్ చేస్తున్నాయి. రాకెట్లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్ ఐ షవర్?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్‌లో ఇప్పుడు ఈ యాప్‌కు ట్రెండింగ్‌లో ఉంది. యాప్‌ను ఉపయోగించే యూజర్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్‌కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్‌లు, సైరన్లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్ కమాండ్’, ‘రెడ్ అలర్ట్’వంటి యాప్‌లు సైతం వార్నింగ్ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.యుద్ధంలోనూ ప్రేమ.. యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్లు మోగగానే సమీప బంకర్ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్‌లు రంగంలోకి దూకాయి. బంకర్ ముఖద్వారాల వద్ద క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్‌ను స్కాన్‌చేస్తే ఆ బంకర్లో ఉన్న వాళ్ల సోషల్‌మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం లేదా చాటింగ్ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్‌తో మాట్లాడించే డేటింగ్ యాప్‌లూ బాంబర్ల వద్ద క్యూఆర్ కోడ్‌రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. సురక్షిత మార్గాలనూ చూపుతూ.. ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్‌లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్ లొకేషన్‌ను సూచించే యాప్‌లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాకు చేరుకున్న సైనికుల పార్థివదేహాలు ట్రంప్ నివాళి
-
అమెరికాకు భారీ నష్టం.. కొండను తవ్వి ఎలుకను పట్టారా
-
నాలుగువైపుల నుంచి తగలబడుతున్న ఇరాన్
-
టెహ్రాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ బీకర దాడులు
-
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్
పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.ప్రస్తుతం లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్‌తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్‌లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్‌బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం. -
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తి..!
పశ్చిమాసియాలో కురుస్తున్న నిప్పుల వాటనఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్న అమెరికా,ఇజ్రాయెల్వెనక్కి తగ్గని ఇరాన్ -
యుద్ధ కల్లోలం.. విమానాశ్రయాలపై దాడులు
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికీ పెరుగుతూనే ఉంది. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కనీవినీ ఎరగని స్థాయిలో దాడులకు దిగాయి. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడ్డాయి. దాంతో విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగానికి చెందిన 16 విమానాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా తదితర గ్రూపుల నుంచి ఆయుధాలు, నిధుల సేకరణకు ఆ విమానాలను ఇరాన్ వినియోగిస్తోందని ఆరోపించింది.విమానాశ్రయ సమీపంలోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్ కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రంపైనా బాంబుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇరాన్‌వ్యాప్తంగా 400కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. వారం రోజుల్లో ఇరాన్లో 3,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా వెల్లడించింది. వాటిలో కీలకమైన కమాండ్ సెంటర్లు, సైనిక ప్రధాన కార్యాలయాలు, క్షిపణి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఉన్నట్టు పేర్కొంది.ఇరాన్లో మృతుల సంఖ్య 1,332కు పెరిగినట్టు ఐరాసలో ఆ దేశంలో రాయబారి ఆమిర్ సయీద్ ఇరవనీ తెలిపారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. దుబాయ్ విమానాశ్రయంపై మరోసారి డ్రోన్ దాడి చేసింది. దాంతో రన్‌వేకు అతి సమీపంలో పలుచోట్ల పొగ భారీగా పైకెగసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాంబు సైరన్లు మోగడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోని ట్రెయిన్ టన్నెళ్లలోకి పరుగులు తీశారు. విమానాశ్రయం నుంచి విమాన సరీ్వసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.దుబాయ్వ్యాప్తంగా పలుచోట్ల భారీ పేలుళ్లు విని్పంచాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోనూ ఓ సైనిక విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ప్రాంత నగరమైన నబిషిట్, పరిసరాల్లో కనీసం 47 మంది వాటికి బలయ్యారని లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 40 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 300 దాటినట్టు వెల్లడించింది. హెజ్బొల్లా దాడుల్లో తమ సైనికులు ఐదుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. ఆ దేశాలపై దాడులు చేయబోం: పెజెష్కియాన్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఎదుర్కొనే క్రమంలో గల్ఫ్ దేశాలపైనా దాడులకు దిగినందుకు వాటికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు తెలిపారు. తమకసలు వాటిపై దండెత్తే ఉద్దేశమే లేదన్నారు. ‘‘ఆ దేశాల నుంచి తమపై దాడులు జరిగితే తప్ప ఇకనుంచి వాటిపై దాడికి దిగబోం. మా నాయకత్వ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసినట్టుగా ఆ దేశానికి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ మతిలేని దాడులను పూర్తిగా నిలిపేసేదాకా వాటిని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూనే ఉంటామని ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ ఇప్పటికే పూర్తిగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.పెజెష్కియాన్ ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. ‘‘పశ్చిమాసియాను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయతి్నంచిన ఇరాన్ ఇప్పుడు తానే అతి పెద్ద ఓటమి పాలైంది. మా దాడుల తీవ్రత వల్లే గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. తద్వారా వాటికి లొంగిపోయింది. ఇరాన్ తోటి గల్ఫ్ దేశాల చేతుల్లో ఓడటం వేల ఏళ్లలో ఇదే తొలిసారి.ఇందుకు పశ్చిమాసియా దేశాలన్నీ నాకు ధన్యవాదాలు తెలిపాయి’’అన్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని పశ్చిమాసియాకే గాక ప్రపంచమంతటికీ అమెరికా చేసిన గొప్ప మేలుగా ట్రంప్ అభివరి్ణంచడం విశేషం. ఇరాన్‌కు చెందిన 42 యుద్ధ నౌకలను మూడు రోజుల్లోనే ధ్వంసం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్‌తో పాటు సమాచర వ్యవస్థలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తాము దాడులు చేయకపోతే ఇరాన్ అతి త్వరలో అణుపాటవం సంతరించుకునేదని తెలిపారు. సైన్యంపై అదుపు తప్పిందా? పెజెష్కియాన్ ప్రకటన తుంగలోకి ఇరాన్ సైన్యంపై ప్రభుత్వానికి పట్టు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగడం గమనార్హం! బాలిస్టిక్ క్షిపణులను నియంత్రించే పారామిలిటరీ విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అధ్యక్షుని ప్రకటనతో నిమిత్తం లేకుండా గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులు నిరి్నరోధంగా కొనసాగాయని చెబుతున్నారు. ఈ గందరగోళానికి తెర పడాలంటే సుప్రీం నేతను ఎన్నిక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాల్సిందేనని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’కు ప్రముఖ మత పెద్ద అయతొల్లా నాసర్ మకరం షిరాజీ విజ్ఞప్తి చేశారు. లెబనాన్‌లో... ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ దద్దరిల్లింది. నబిషిట్ వద్ద నరమేధానికి తోడు జౌతార్ అల్ షర్కియా, అరబ్ సలీం, జిబ్చిట్ తదితర ప్రాంతాలపైనా క్షిపణి, బాంబు దాడులు కొనసాగాయి. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు కనీసం ఆరుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం...అయినా గల్ఫ్‌పై దాడులు గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగింది! దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ కూడా దాడులకు గురయ్యాయి. దోహాలోనూ పేలుళ్లు విని్పంచాయి. కనీసం 86 క్షిపణులు, 148 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు బహ్రెయిన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సాగే నౌకలకు భద్రత కలి్పస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎద్దేవా చేసింది.‘అక్కడ అమెరికా సేనలను ఎదుర్కొందుకు మేం వెయిటింగ్’అంటూ అగ్ర రాజ్యాన్ని కవ్వించింది. వాటిని ఎక్కడికక్కడ తొక్కిపారేస్తామని ఇరాన్ సైన్యం కూడా ఒక ప్రకటనలో హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్‌తో పాటు అబుదాబి, కువైట్ సహా గల్ఫ్వ్యాప్తంగా అమెరికా స్థావరాలపైనా మా నావికా దళం భారీగా లక్షిత దాడులు చేసింది. తద్వారా మా యుద్ధ నౌకను ముంచేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం’’అని ప్రకటించింది. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో కుర్దు వేర్పాటువాదుల స్థావరాలపైనా దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ దాడుల తీవ్రత కొనసాగింది. జెరూసలేం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. టెల్ అవీవ్‌లో కూడా రోజంతా బాంబుల శబ్దాలు విన్పిస్తూనే ఉన్నాయి.


