టెహ్రాన్: పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్‌ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది.
ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.
ఇరాన్‌లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది.
ఈ సంఘటనతో పాకిస్తాన్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.
ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్‌తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


