యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే? | Here Are the Latest Casualty Figures From Across The Middle-East Region | Sakshi
Sakshi News home page

యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే?

Mar 22 2026 9:34 PM | Updated on Mar 22 2026 9:34 PM

  Here Are the Latest Casualty Figures From Across The Middle-East Region

అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..

ఇరాన్
అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్‌లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన‍్నారు.


లెబనాన్ 
మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.

ఇజ్రాయెల్ 
ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.

వెస్ట్ బ్యాంక్ 
రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.

గల్ఫ్ 
గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. 
కువైట్‌లో ఆరుగురు మరణించారు.
యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.
సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.
బహ్రెయిన్‌లో ఇద్దరు పౌరులు మరణించారు. 

ఇరాక్  
యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్‌లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.

జోర్డాన్

జోర్డాన్‌లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు.
 

గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement