ఇరాన్ యుద్ధంపై ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌? | Narendra Modi will address the Lok Sabha at 2 pm on the West Asia conflict | Sakshi
Sakshi News home page

ఇరాన్ యుద్ధంపై ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌?

Mar 23 2026 12:45 PM | Updated on Mar 23 2026 1:31 PM

Narendra Modi will address the Lok Sabha at 2 pm on the West Asia conflict

సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్‌లో ఇరాన్‌పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ  ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది.   

పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.

ఈ రోజు పార్లమెంట్‌లో సీసీఎస్‌ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్‌ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్‌ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్‌, ఎంఎస్‌ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్‌, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement