LPG సిలిండర్‌పై వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌?! | State Owned Oil Firms Plan Smaller 10 Kg Domestic Cylinders Amid Hormuz Disruption Due To Iran Tensions, Check More Details | Sakshi
Sakshi News home page

LPG సిలిండర్‌పై వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌?!

Mar 23 2026 1:49 PM | Updated on Mar 23 2026 2:20 PM

State owned oil firms plan smaller 10 kg domestic cylinders amid Hormuz disruption

సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో వంటగ్యాస్‌ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్న‌ట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు 10 కిలోల గ్యాస్‌ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ దిగుమతుల‌కు అంతరాయం క‌లుగుతోంది. భారత్‌ వినియోగించే ఎల్‌పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్‌ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 

చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్‌ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్‌ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.

ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్‌ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్‌ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement