దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్‌ మాజీ క్రౌన్ ప్రిన్స్ | Iran Exiled Crown Prince Reza Pahlavi asks US, Israel to keep targeting Iran | Sakshi
Sakshi News home page

దాడులు కొనసాగించండి.. అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరిన ఇరాన్‌ మాజీ క్రౌన్ ప్రిన్స్

Mar 23 2026 2:21 AM | Updated on Mar 23 2026 2:21 AM

Iran Exiled Crown Prince Reza Pahlavi asks US, Israel to keep targeting Iran

ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్‌లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరారు. రెజా తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్‌ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.

దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.

అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్‌కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement