Live Updates
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
ట్రంప్ ప్రకటనను ఇజ్రాయెల్ లైట్‌గా తీసుకుందా?
- ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్‌పై దాడులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు
- అమెరికా ప్రకటన తర్వాత కూడా యుద్ధం ఆపని ఇజ్రాయెల్
ట్రంప్ ప్రకటనపై స్పందించిన యూకే
- యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ వచ్చిన ప్రకటనను స్వాగతిస్తున్నాం
- చర్చలపై సానుకూలంగా ఏ నివేదికలు వచ్చినా స్వాగతిస్తాం
- హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాల్సిన అవసరం ఉంది: యూకే
ట్రంప్ వెనక్కి తగ్గారు: ఇరాన్
- అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగలేదు
- ట్రంప్ వెనక్కి తగ్గారు
- ట్రంప్‌ను నమ్మలేం: ఇరాన్
యుద్ధం బంద్
- ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
- ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం
- టెహ్రాన్‌తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్
చమురు సంక్షోభం చాలా తీవ్రతరమైంది: ఐఈఏ
- హార్మూజ్ జలసంధి ఇంకా మూసి ఉంది
- ఆసియా, యూరప్‌లోని దేశాల ప్రభుత్వాలతో చర్చలు
- మరిన్ని చమురు నిల్వలను విడుదల చేయాలా?
- ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాం
- పశ్చిమాసియా సంక్షోభం చాలా తీవ్రమైంది
- చమురు విషయంలో 1970 దశకంలో తీవ్ర పరిణామాలు
- నాటి పరిణామాల కంటే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణం
- హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభిస్తేనే మార్కెట్లను స్థిరపరచవచ్చు
- ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) చీఫ్ ఫాతిహ్ బిరొల్
పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి: మోదీ
- గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు
- పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి
- యుద్ధ ప్రభావం సామాన్య ప్రజలపై పడుతోంది
- యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి భారతీయుడికి సాయం అందిస్తున్నాం
- యుద్ధం గురించి లోక్‌సభలో ప్రసంగించిన మోదీ
- యుద్ధంపై ఇంటర్ మినిస్ట్రీయల్ గ్రూప్ ఏర్పాటు చేశాం
- ప్రతిరోజు పరిస్థితులను ఈ గ్రూపు సమీక్షిస్తుంది
- రైతులకు యూరియా కొరత రాకుండా చేస్తాం
- దేశీయంగా యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేశాం.. ఉత్పత్తి చేస్తున్నాం
- ఫర్టిలైజర్ దిగుమతులను వివిధ దేశాల నుంచి చేసుకుంటున్నాం
- ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
- దేశంలో అన్ని విద్యుత్ ప్లాంట్లకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉన్నాయి
- దేశంలో అణు విద్యుత్తును ప్రోత్సహిస్తున్నాం
అమెరికాపై ఇరాన్ సీరియస్
ఇరాన్ విద్యుత్ ప్లాంట్‌ను ధ్వంసం చేస్తామని అమెరికా హెచ్చరికలు
విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్పందన
అమెరికాపై ఇరాన్ సీరియస్
మాట తప్పిన అమెరికాతో చర్చలు లేవు
ట్రంప్ బెదిరింపులకు ఏ మాత్రం లొంగమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ
అమెరికా ఉద్దేశ్య పూర్వకంగానే దాడులు చేస్తోంది.
తమ దేశ మౌలిక సదుపాయాలను తాకితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే.. హర్మూజ్‌ను తెరిచేదే లేదని స్పష్టం
పవర్ ప్లాంట్‌లనే లక్ష్యంగా చేసుకుంటే.. హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరికలు
ఇజ్రాయెల్‌లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా భాగస్వామ్య కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామని వార్నింగ్
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ఇరాన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
- తాజాగా చేపట్టిన క్షిపణి దాడుల్లో టెల్ అవీవ్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
- యుద్ధం ముగించాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ శాంతి సందేశం
- శాంతి సందేశాన్ని క్షిపణిపై అంటించి మరీ ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్
- ఇరాన్‌పై దాడి సమర్థనీయం కాదని, అది అమానవీయ చర్య అని పేర్కొన్న స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్
- కొద్ది రోజులకే ఇరాన్ ఈ చర్యలు తీసుకుంది
మీ దృష్టికి ధన్యవాదాలూ అంటూ వెటకారం
- పతాక స్థాయికి చేరిన పశ్చిమాసియా యుద్ధం
- ఇరాన్‌పై పెద్ద ఎత్తున అమెరికా ఎయిర్ స్ట్రైక్స్
- ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్
- విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న ట్రంప్
- అవసరమైతే హర్మూజ్‌ను పూర్తిగా మూసేస్తామని ఇరాన్ ప్రకటన
- ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిక
- అమెరికా భాగస్వామ్య కంపెనీలను నాశనం చేస్తామని వార్నింగ్
- విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్
- అవసరమైతే హర్మూజ్‌ను పూర్తిగా మూసేస్తామని ఇరాన్ ప్రకటన
- ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిక
- ట్రంప్ యూ ఆర్ ఫైర్డ్ అంటూ ఐఆర్‌జీసీ వీడియో
- ఈ విషయంపై మీ దృష్టికి ధన్యవాదాలూ అంటూ వెటకారం
ఇవాళ సాయంత్రంతో ముగియనున్న ట్రంప్ డెడ్‌లైన్
- హర్మూజ్ జలసంధి తెరవాలంటూ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం
- జలసంధి విషయంలో ఇరాన్‌కు 48 గంటల సమయం ఇచ్చిన ట్రంప్
- సోమవారం రాత్రి 7:44 గంటలతో ముగియనున్న డెడ్‌లైన్
- ఆ గడువులోగా బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధి తెరవాలని ఇరాన్‌కు సూచన
- ఆ వ్యూహాత్మక జలమార్గాన్ని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్‌తో మొదలుపెట్టి, ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరిక
హర్మూజ్ చుట్టూ మూడు దేశాల యుద్ధం
- కొనసాగుతున్న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం
- మూడు దేశాల యుద్ధాన్ని మలుపు తిప్పుతున్న హర్మూజ్
- హర్మూజ్ జలసంధి మూసివేతతో వణుకుతున్న ప్రపంచం
- ట్రంప్ హెచ్చరికలతో హర్మూజ్ చుట్టూ మూడు దేశాల యుద్ధం


