ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్‌కు చెందిన ఫైటర్ జెట్‌ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్‌ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.
Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026


