యుద్ధ నేరాలు బయటకు రావొద్దనే దాడి చేస్తోందని ఆరోపణ
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్‌లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు.
అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్‌పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్‌లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆర్‌టీలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది.


