ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..! | Iranian missile hits town housing nuclear facility, says Israeli Army | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!

Mar 22 2026 1:14 AM | Updated on Mar 22 2026 1:12 PM

Iranian missile hits town housing nuclear facility, says Israeli Army

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. 

వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్‌కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్‌ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.

కొద్ది గంటల ముందే ఇరాన్‌ హిందూ మహా సముద్రంలోని యూఎస్‌-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్‌ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను రీచ్‌ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement