India
-
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు. -
అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. -
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది. -
ఇండియా, చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా?
నేను బీజింగ్ నుండి తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచింది కానీ, నేను ఇంకా దాని గురించి రాయబోతున్నాను. అప్పట్లోనే చైనా రాజధాని నన్ను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం దాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. నిజం ఏమిటంటే బీజింగ్‌లో ఆనాడు నేను చూసిన, కనుగొన్న అంశాలు నన్ను ఆశ్చర్యచకితుడిని చేశాయి. ఇప్పుడు అదనంగా, చాలా కాలం క్రితం పరిష్కృతమైందని నేను భావించిన వాస్తవం, పాత చర్చను మళ్ళీ రేకెత్తించింది.నేను బీజింగ్‌లో మూడు రోజులు మాత్రమే ఉన్నాను. రాజధానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూశానని చెప్పాలి. కానీ గ్రేట్ వాల్, మింగ్ సమాధులను దర్శించాను. నగరంలో, గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ గడిపాను. కానీ నేను చూసిన ప్రతిదీ అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచాన్ని సూచించింది. రోడ్లు, భవనాలు, దుకాణాలు, ప్రజల వేషధారణ, వారి ప్రవర్తన... మూడవ ప్రపంచ నగరాన్ని కాదు, యూరోపియన్ లేదా ఉత్తర అమెరికా మహానగర సంçస్కృతిని తలపింపజేశాయి. ఏ అర్థంలో చూసినా ఈ అంశాలలో దేనిలోనూ ఢిల్లీ పోటీపడలేదు.బీజింగ్ నమ్మశక్యం కాని విధంగా శుభ్రంగానూ, ఆశ్చర్యకరంగా స్నేహపూర్వకంగానూ ఉంది. చైనీయులు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని నాకు చెప్పారు. నేను చైనాలో గడిపిన మూడు రోజుల్లో అలా ఉమ్మి వేసినవారిని అరడజను మందిని కూడా చూడలేదు. మింగ్ సమాధులు లేదా ఫర్బిడెన్ సిటీ వద్ద వేలాది మంది ఉన్నారు కానీ వారిలోనూ ఈ అలవాటును చూడలేదు. కాలిబాటలపై చెత్త లేదు, గోడలపై పాన్ మరకలు లేవు, దుకాణాల వెలుపల పారవేసిన సిగరెట్ పీకలు, చిరిగిన పాలిథిన్ సంచులు కూడా లేవు.అంతేకాకుండా చైనీయులు స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను హోటల్ నుండి తియానన్మెన్ స్క్వేర్‌కు వెళుతున్నప్పుడు అపరి చితులు తరచుగా నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పారు. వారు అడుగులో అడుగు వేసి, అది సహజమైన, స్పష్టమైన పని అన్నట్లుగా సంభాషణను ప్రారంభించారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ అభ్యసించే విద్యార్థులే అంటే సందేహం లేదు, కానీ మరే ఇతర నగరంలోనూ ఇంత స్వేచ్ఛాయుతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదు.ఏది మంచి వ్యవస్థ?వాస్తవానికి 1962 నాటికి చైనాతో మనకు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిపై, చైనా–ఇండియా పోటీపై స్పష్టమైన భారతీయ దృక్పథంతో నేను బీజింగ్‌కు వెళ్లాను. కానీ, చైనా పట్ల తీవ్రతకు తగ్గని ఆకర్షణ, ఏకపక్షతతో తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు అది పాత భావజాల ఘర్షణను మళ్లీ రగిలించింది.నిరంకుశ రాజ్యమైన చైనా – ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని తన ప్రాథమ్యంగా చెప్పుకొంటుంది. స్వేచ్ఛా వ్యక్తీకరణ, సహకారం, రాజకీయ ఎంపికలకు సంబంధించిన ఉదారవాద హక్కులను విస్మరిస్తుంది. క్రమశిక్షణ అనేది అక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ కంటే ముఖ్యమైనది. భిన్నాభిప్రాయాన్ని తీవ్రంగా శిక్షిస్తారు. దీనికి విరుద్ధంగా, భారతదేశం స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ, బహుళ, పోటీ రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయవ్యవస్థతో పాటు సిద్ధాంతపరంగా తాము కోరుకున్నది చేయడానికి స్వేచ్ఛ ఉన్న వ్యక్తులతో కూడిన ప్రజా స్వామ్యం. మనం తరచుగా మన ప్రభుత్వాలను మారుస్తాం. తరచుగా మన రాజకీయ నాయకులను పక్కన పెడుతుంటాం. స్పష్టంగా చెప్పాలంటే, భారత్‌తో పోలిస్తే చైనా తక్కువ ఆహ్వానించదగిన దేశంగా కనిపిస్తుంది.కానీ ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చూడండి: చైనా తన ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన జీవనశైలి, అధిక తలసరి ఆదాయం ఇచ్చింది. 1947లో (లేదా 1949లో, పీపుల్స్ రిపబ్లిక్ పుట్టినప్పుడు) భారత్, చైనాలు ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నాయి. 2010లో, నేను చైనాను సందర్శించినప్పుడు, దాని తలసరి ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. వారి పిల్లలలో 7 శాతం మందే పోషకాహార లోపంతో ఉన్నారు; కానీ మన పిల్లలలో 46 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. దేశంలో పరిస్థితులు మారాయనడంలో సందే హం లేదు. కానీ భారతీయులు పేదరికం నుంచి పూర్తిగా బయట పడతారనే భావన సందేహంగానే ఉంటుంది!కాబట్టి రెండు దేశాలకు సంబంధించి ఏది మంచి వ్యవస్థ? అత్యవసర పరిస్థితి సమయంలో గంటల తరబడి దీనిపై తీవ్రమైన చర్చను నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. 1977 ఎన్నికలు ఈ విషయాన్ని పరిష్కరించాయని నేను అనుకున్నాను. భారత ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటు వేసి, ఇందిరా గాంధీ వేసిన పురోగతి, అభివృద్ధి అనే ఎరను తిరస్కరించారు. కానీ చైనా ఆ ప్రశ్నను తిరిగి మేల్కొలిపింది. ముప్పై సంవత్సరాలుగా చైనా సాధిస్తూ వచ్చిన 10 శాతం వృద్ధి, భారత్ సాధించిన దానికి స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పైగా రానురానూ ఈ అంతరం పెరు గుతూ ఉండవచ్చు.నేను నా భావనలను స్థిరం చేసుకునే ముందు చైనా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, చూడాలి. కానీ నా విశ్వాసం దెబ్బతింది. తద్వారా వచ్చిన ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉరుముతున్న ఉష్ణోగ్రతలు
శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరిగిపోతుండడం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 57 శాతం జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76 శాతం మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తేల్చిచెప్పింది.ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హీట్ రిస్క్ అత్యధికంగా ఉన్నట్లు తెలియజేసింది. గత పదేళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది. ⇒ అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ సంస్థ 734 జిల్లాలకు సంబంధించిన హీట్ రిస్క్ ఇండెక్స్(హెచ్ఆర్ఐ)ను అభివృద్ధి చేసింది. ఇందుకోసం 1982 నుంచి 2022 వరకు.. 40 ఏళ్ల వాతావరణ గణాంకాలు, ఉపగ్రహా చిత్రాలు ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, జల వనరులు, భూవినియోగం, పచ్చదనం తదితర అంశాలను అధ్యయనం చేసింది. ⇒ జనాభా, భవనాలు, ఆరోగ్య, సామాజిక–ఆర్థిక అంశాలు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ⇒ 734 జిల్లాలకు గాను 417 జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్ కేటగిరీల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇందులో 151 జిల్లా హై రిస్క్, 266 జిల్లాలు వెరీ హై రిస్క్ విభాగంలో ఉన్నాయి. 201 జిల్లాలు సాధారణ, 166 జిల్లాలు తక్కువ లేదా అతి తక్కువ హీట్ రిస్క్ విభాగాల్లో నిలిచాయి. ⇒ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం వేడి వల్ల ముప్పు లేనట్లు కాదని, సీఈఈడబ్ల్యూ స్పష్టంచేసింది. ఇతర జిల్లాల కంటే కొంత తక్కువగా ఉన్నట్లు మాత్రమే భావించాలని పేర్కొంది. ⇒ దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క. ⇒ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్టే ఇందుకు కారణం. ⇒ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న జిల్లాలతోపాటు ముంబయి, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది. ⇒ చల్లగా ఉండే హిమాలయా ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ⇒ జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ఈ ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. ⇒ ఉత్తర భారతదేశంలో వేసవి తేమ గత పదేళ్లలో 30–40 శాతం నుంచి 40–50 శాతం పెరిగింది. ⇒ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5 శాత తగ్గుదల నమోదవుతుందని సీఈఈడబ్ల్యూ అధ్యయనం అంచనా వేసింది. ⇒ ఇండియాలో 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కుపైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Covid-19: మళ్లీ కోవిడ్ కలవరం
ముంబై: ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలవర పెడుతోంది. మంగళవారంనాటికి దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదవ్వగా ముంబైలోనే 53 కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే 164 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరణాలేవీ సంభవించలేదు. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో నగరంలోని ఆస్పత్రులు కోవిడ్ రోగుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.ప్రజల్లో ఆందోళన పెరుగుతుండటంతో, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని తెలిపారు. పరిస్థితి సాధారణంగానే ఉందని, అయిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. రోగుల సంఖ్య పెరిగినా మునుపటిలా భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఇన్ఫెక్షన్తో అంత ప్రమాదం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ చెప్పారు. కేంద్రం సూచనలు జారీ చేస్తే తప్ప కరోనాకు సంబంధించి ముందు జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. -
Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: కోవిడ్-19 మరోమారు విజృంభిస్తోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19(COVID-19) కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ తదితర దేశాలలో కరోనా కేసులు(Corona cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్-1, ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 57 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. వీటిలోని అధికశాతం తేలికపాటివిగా, ఆసుపత్రి సంరక్షణ అవసరం లేనివిగా ఉన్నాయి.ప్రభుత్వం అందించిన డేటాలోని వివరాల ప్రకారం మే 12 తరువాత కేరళలో అత్యధిక సంఖ్యలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటకలో ఎనిమిది, గుజరాత్లో ఆరు, ఢిల్లీలో మూడు, హర్యానా, రాజస్థాన్, సిక్కింలలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబైలో గల కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రిలో కోవిడ్-19తో ఇద్దరు మృతిచెందారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ ఇద్దరు రోగులకు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.వీరిలో ఒకరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతిన్న 14 ఏళ్ల బాలుడని, మరొకరు 54 ఏళ్ల క్యాన్సర్ రోగి అని వైద్యులు తెలిపారు. కాగా దేశ జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గిన కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజృంభిస్తున్న జేఎన్ వేరియంట్ లక్షణాలు ఒమిక్రాన్ తరహాలోనే ఉన్నాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.జేఎన్-1 వేరియంట్ లక్షణాలుగొంతు నొప్పిజ్వరంముక్కు కారడంపొడి దగ్గుతలనొప్పిఅలసటరుచి లేదా వాసన కోల్పోవడంతాజాగా కరోనా బారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్రమైన అలసటను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వర్షాకాలం(Rainy season) వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే.. -
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది. -
బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..
లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే.. -
శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్‌ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025 మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కానీ తాను, భారత్‌ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది. భారత్ ధర్మశాల కాదువిచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్‌కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్రశ్నించారు.భారత్ కాకుండా వేరే దేశంలో స్థిరపడండిఅందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని ప్రకటించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్‌యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు. సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందేఅదే సమయంలో పిటిషనర్ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్‌లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. -
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది. శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్–1 న్యూక్లియర్ టెస్ట్‌గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.ఏ దేశాలు వ్యతిరేకించాయి? అణుబాంబుల బాధిత దేశమైన జపాన్ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్‌పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్ క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్ సైతం ఇలాగే స్పందించాయి.అమెరికా కన్నుగప్పి...1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్ (సిరస్) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్‌కు తరలించారు!చాన్నాళ్ల క్రితమే బీజం అణుబాంబు తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్ చేశారు. ‘‘డాక్టర్ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.ఆ మీట నొక్కిందెవరు?మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్ రేబతిరంజన్ దస్తీదార్ ఫైరింగ్ బటన్ నొక్కారు. ‘‘బటన్‌ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న ప్రణబ్ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్‌గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.‘స్మైలింగ్ బుద్ధ’ ఎందుకు? 1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్ పంపారు.1998లో పోఖ్రాన్–2 అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా ఇంత బలహీనమైనదా?
ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్ 22న అమా యక భారతీయులను కశ్మీర్లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్ ప్రకటనలు పాక్ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయుధాల అమ్మకపు మార్కెట్ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్ట్రంప్ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఉండగానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆయా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్ దేశాలు కూడా ఇండియా–పాక్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్‌కు 2.3 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావాదేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించలేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్ గ్లోబల్ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది. -
భారత్ అడుగుజాడల్లో...
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్, పరస్పర సైనిక చర్యల తర్వాత ప్రతి అంశంలో భారత్‌ను పాకిస్తాన్ అనుసరిస్తోంది. పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అన్ని పార్టీల ఎంపీలు తదితరులతో ఏడు బృందాలను పలు దేశాలకు పంపుతుండటం తెలిసిందే. పాక్ కూడా అదే తరహాలో పలు దేశాలకు ఎంపీల బృందాలను పంపుతున్నట్టు హడావిడిగా ప్రకటించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వాటికి సారథ్యం వహిస్తారని చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘‘సొంత ఆలోచనే లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తోంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. ‘కాపీక్యాట్ పాక్’’ అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.బహిష్కరణల నుంచి బృందాల దాకా.. పహల్గాం ఉదంతం తర్వాత భారత్ వెంటనే భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీగా కుదించింది. వాళ్లను తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లోని భారతీయ హైకమిషన్‌లోనూ కొంత సిబ్బందిని వెనక్కివచ్చేయాలని సూచించింది. పాక్ కూడా అచ్చం అవే చర్యలకు దిగింది. మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెడితే తానూ ‘ఆపరేషన్ బున్యాన్ మో§అల్ మర్సూస్’ అని నామకరణం చేసింది. మోదీ బాటలో షహబాజ్... ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్‌ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లనుద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలాగే చేశారు. సియాల్కోట్లోని పస్రూర్ కంటోన్మెంట్లో యుద్ధట్యాంక్పై నిలబడి సైనిక యూనిఫామ్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. గూఢచర్యం ఆరోపణలపై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగిని బహిష్కరిస్తే మర్నాడే పాక్ కూడా అదే పనిచేసింది. నిజానికి ఆ భారత ఉద్యోగిని కేంద్రం అప్పటికే వెనక్కి రప్పించడం ఇందులో కొసమెరుపు! -
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ -
ఆపరేషన్ సిందూర్ న్యూ వీడియో షేర్..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రమూకల్ని అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మరో వీడియోను షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన భారత ఆర్మీ.. పాక్ లోని పలు ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. తొలుత ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టింది. దీనికి బదులుగా పాక్ లో ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.దీనికి సంబంధించి ఒక్కో వీడియోను భారత ఆర్మీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో వీడియోను భారత ఆర్మీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి జరిగిన న్యాయం మాత్రమే ఇది.. ప్రతీకారం కాదు’ అని పేర్కొంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ ను జోడించింది. ‘ప్రణాళిక.. శిక్షణ.. అమలు’ అంటూ ట్యాగ్ చేసింది భారత ఆర్మీ. #StrongAndCapable#OpSindoorPlanned, trained & executed.Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025 -
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది. -
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు? -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్ మీదుగా నేపాల్, భూటాన్ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్‌కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింకులు, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్ యాన్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది. చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ యూనుస్ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్‌లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్‌కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది. 🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025 -
పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం
-
అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు. -
జీడీపీ వృద్ధి 6.3 శాతం
ఐక్యరాజ్యసమితి: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను 2025లో 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రకటించింది. అయినప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల్లో 2025కు భారత్ జీడీపీ 6.6 శాతం మేర వృద్ధి చెందుతుందని యూఎన్ పేర్కొనడం గమనార్హం. 2024లో భారత జీడీపీ 7.1గా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, వినియోగం బలంగా ఉండడానికితోడు సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తాయని ప్రస్తావించింది. ఈ మేరకు 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తాజా నివేదికను విడుదల చేసింది. ‘‘అధిక స్థాయి వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సందిగ్ధ స్థితిలో ఉంది. ఇటీవల యూఎస్ టారిఫ్‌ల పెంపుతో తయారీ వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఇది అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థకు అవరోధం కల్పించడంతోపాటు ఆర్థిక గందరగోళాన్ని పెంచుతుంది’’అని యూఎన్ నివేదిక పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్లు, ఇంధనం, కాపర్‌కు అమెరికా టారిఫ్‌లు మినహాయించడంతో వీటిపై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అయినప్పటికీ ఈ రంగాలకు టారిఫ్‌ల మినహాయింపు తాత్కాలికమేనన్న విషయాన్ని గుర్తు చేసింది. 2026లో 6.4 శాతం.. భారత జీడీపీ 2026లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘‘భారత్‌లో బలమైన ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో నిరుద్యోగం నియంత్రణలోనే ఉంది. అయినప్పటికీ పని ప్రదేశాల్లో లింగ అసమానతలు కొనసాగుతున్నాయి. ఇది స్త్రీ, పురుషుల పరంగా మరింత సమాన అవకాశాల కల్పన అవసరాన్ని సూచిస్తోంది’’అని యూఎన్ నివేదిక తెలిపింది. ఇక ద్రవ్యోల్బణం ఈ ఏడాది 4.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. గతేడాది 4.9 శాతం కంటే తక్కువని పేర్కొంది. 2025లో ప్రపంచ జీడీపీ 2.4 శాతం వృద్ధి చెందొచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. 2024లో నమోదైన 2.9 శాతం కంటే తక్కువ. ఈ ఏడాది ఆరంభంలో యూఎన్ వేసిన అంచనాతో పోల్చి చూస్తే 0.4 శాతం తగ్గింది. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా మారిపోయిన పరిణామాల నేపథ్యంలో జనవరిలో వేసిన అంచనా కంటే 0.4 శాతం తగ్గించాల్సి వచి్చనట్టు వివరించింది. ఇది మాంద్యం కాకపోయినప్పటికీ వృద్ధి రేటు తగ్గడం ఎన్నో దేశాలు, ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక విధానాల్లో అనిశ్చితులు, అస్థిరతలు, భౌగోళిక ఉద్రిక్తతలతో కీలక పెట్టుబడుల నిర్ణయాలు వెనక్కి వెళ్లిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక రుణ భారం, నిదానించిన ఉత్పత్తి వంటి ఇప్పటికే ఉన్న సవాళ్లను ఇవి మరింత పెంచుతాయని.. ప్రపంచ వృద్ధి అవకాశాలను దెబ్బతీయొచ్చని పేర్కొంది. అమెరికా జీడీపీ వృద్ధి 2024లో 2.8 శాతంగా ఉంటే, 2025కు 1.6 శాతంగా యూఎన్ నివేదిక అంచనా వేసింది. చైనా జీడీపీ 4.6 శాతానికి తగ్గొచ్చని తెలిపింది. -
భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం. -
భారత్, అఫ్గాన్ స్నేహ గీతం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజాగా అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ సిద్ధపడగా, అప్పటి తాలిబన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు శతాబ్దాల పాటు అఖండ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. అఫ్గాన్‌ను భారత్ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది. పాకిస్తాన్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్ సర్కార్‌ను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్–అఫ్గాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్‌పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు. ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు! మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్–అఫ్గాన్ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం అఫ్గాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్‌ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌కు ఇక ముసళ్ల పండుగే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగినట్లు భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్‌కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. పాక్–అఫ్గాన్ మధ్య రగులుతున్న విభేదాలు తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్లో పాక్ సైన్యం అఫ్గాన్‌లోని పాక్తీకా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్ధారించిన డురాండ్ లైన్‌ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్ గుర్తిస్తుండగా, అఫ్గాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్ శరణార్థులను పాక్ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
BSF Jawan: బ్రష్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదట..!
న్యూఢిల్లీ: గత నెల 23వ తేదీన పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే(పూర్ణం కుమార్) షాను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పీకే షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో పాకిస్తాన్ ఆ బీఎస్ఎప్ జవాన్ విడిచిపెట్టక తప్పలేదునిద్రలేని రాత్రులు.. మానసిక వేధన!జవాన్ పీకే షా పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా ఆ జవాన్ భార్య పలు విషయాలను వెల్లడించారు. పీకే షా భార్య రజని మాట్లాడుతూ.. ‘ నా భర్తను శారీకంగా హింసించలేదని, ప్రతీ రాత్రి విచారించారని, ఇది మానసికంగా కుంగదీసిందని భర్త చెప్పినట్లు భార్య రజనీ తెలిపింది.మూడు వారాలకు పైగా పాక్ కస్టడీలో ఉన్న షాను సైనికుడిలా కాకుండా గూఢచారిలా చూశారని, మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించారని చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. ఆ ప్రదేశాలల్లో ఒకటి ఎయిర్ బేస్ అయి ఉండొచ్చనే అనుమానం కల్గిందని భర్త చెప్పిన విషయాన్ని ఆమె వెల్లడించింది.భర్త పీకే షాకు తిండి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా, బ్రష్ చేసుకోవడానికి అనుమతించే వారు కాదని. భర్త నిద్రలేమితో ఉన్నట్లు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందని ఆమె పేర్కొంది. -
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే.. -
చరిత్రలో తొలిసారి తాలిబన్లతో భారత్ చర్చలు
-
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి ఎయిర్‌బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్‌కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
భారత్‌లో ఇంధన డిమాండ్ జోరు
న్యూఢిల్లీ: ప్రధాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధనానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025, 2026లో చైనాకు రెండింతల వేగంతో వృద్ధి చెందనుంది. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా 2024లో రోజుకు 5.55 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉన్న డిమాండ్ 2025లో 3.39 శాతం వృద్ధితో 5.74 ఎంబీపీడీకి చేరనుంది. అలాగే 206లో 4.28 శాతం పెరిగి 5.99 ఎంబీపీడీకి ఎగియనుంది. అదే సమయంలో చైనాలో ఆయిల్‌కు డిమాండ్ ఈ ఏడాది, వచ్చే ఏడాది వరుసగా 1.5 శాతం, 1.25 శాతం మేర పెరగనుంది. వినియోగదారులు ఖర్చు పెడుతుండటం, పెట్టుబడుల ప్రవాహం, కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు తదితర అంశాలతో భారత్ పటిష్టమైన ఆర్థిక వృద్ధిని సాధించే ధోరణి కొనసాగుతుందని ఒపెక్ పేర్కొంది. అమెరికా ఇటీవల ప్రకటించిన టారిఫ్‌లతో భారత జీడీపీపై ప్రభావం చూపినప్పటికీ, ద్రవ్య..ఆర్థిక విధానాలపరమైన ఉద్దీపన చర్యలతో దాన్ని కొంత మేర అధిగమించవచ్చని వివరించింది. సమీప భవిష్యత్తులో భారత్‌లో ఆయిల్‌కి డిమాండ్ స్థిరంగా ఉంటుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనికి డీజిల్ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఒపెక్ వివరించింది. భారత్ సింహభాగం క్రూడాయిల్ కోసం (85 శాతం) దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. మార్చి డేటా ప్రకారం రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరిలో నమోదైన 31 శాతంతో పోలిస్తే అత్యధిక స్థాయి 36 శాతానికి పెరిగాయి. 17 శాతం వాటాతో ఇరాక్ రెండో స్థానంలో, 11 శాతంతో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. → రహదారుల విస్తరణ భారీ స్థాయిలో జరుగుతున్నందున తారుకు కూడా డిమాండ్ పెరుగుతోంది. రవాణా ఇంధనాలు, తయారీ రంగం పుంజుకుంటుందనే బలమైన అంచనాలు, పెట్రోకెమికల్ రంగం ఫీడ్‌స్టాక్ అవసరాలు పెరగడం వంటి అంశాలు ఆయిల్ డిమాండ్‌కి కారణంగా నిలవనున్నాయి. → 2026లో వాణిజ్య సంబంధ చర్చల దన్నుతో టారిఫ్‌లు గణనీయంగా తగ్గొచ్చు. దీనితో వాటి ప్రతికూల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉండొచ్చు. → తయారీ, సేవల రంగాలు పటిష్టంగా ఉండటం, కీలక రంగాలకు ప్రస్తుత ప్రభుత్వం మద్దతునిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం లాంటి అంశాల వల్ల భారత ఎకానమీ వృద్ధి బాటలో ముందుకెళ్లనుంది. → అంతర్జాతీయంగా చమురు డిమాండ్ కాస్త నెమ్మదించినా వరుసగా రెండేళ్లలో 1.3 ఎంబీపీడీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. → చమురుకు డిమాండ్‌లో అమెరికా అగ్రస్థానంలోనే కొనసాగనుంది. 2025లో 20.5 ఎంబీపీడీతో అమెరికా మొదటి స్థానంలో, 16.90 ఎంబీపీడీతో చైనా రెండో స్థానంలో ఉండనుంది. భారత్ మూడో స్థానంలో ఉంటుంది. -
తుర్కియేకు భారీ ఝలక్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ ఆత్మాహుతి డ్రోన్లు, శిక్షణా సిబ్బందిని పాకిస్తాన్‌కు తరలించిన పాపానికి తుర్కియేపై భారత్ ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీంతో తుర్కియేపై నిరసన చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన వైమానిక సేవల సంస్థకు గతంలో ఇచ్చిన భద్రతా క్లియరెన్స్‌ను భారత్ రద్దుచేసింది. ఈ మేరకు సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌కు ఇచ్చిన క్లియరెన్స్‌ను రద్దుచేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) గురువారం ప్రకటించింది. తుర్కియే మాతృసంస్థకు చెందిన రెండు అనుబంధ సంస్థలను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, కానూర్, కొచ్చిన్‌లలో సెలెబీ అనుబంధ సంస్థలే గత 15 సంవత్సరాలుగా పలు రకాల సేవలు అందించాయి. ఈ సంస్థల సిబ్బందే ఇన్నాళ్లూ విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లలో విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను వీళ్లే చూసుకున్నారు. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లే నెరవేర్చారు. ఇకపై ఈ పనులను వేరే సంస్థలకు అప్పగించనున్నారు. బీసీఏఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఇకపై ఢిల్లీలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తున్న ‘సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా’ సంస్థతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) గురువారం ప్రకటించింది. ప్రయాణికులకు, సరకు రవాణాకు ఎలాంటి ఇబ్బంది, ఆటంకం కల్గకుండా సత్వర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. జామియా మిలియా సైతం..విద్యా సంస్థలు సైతం బహిష్కరణ నినాదం చేస్తున్నాయి. ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తుర్కియేకు చెందిన ఇనోను యూనివర్సిటీతో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. తుర్కియేలోని విద్యాసంస్థలతో ఒప్పందాలను తక్షణం నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. యూనుస్ అమీర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఆపేస్తున్నట్లు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది. పుణె వ్యాపారులు సైతం తుర్కియే ఆపిల్లను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇకపై తుర్కియే నుంచి పండ్ల దిగుమతులు ఆపేస్తామన్న ట్రేడర్ల నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వాగతించారు.తుర్కియే, అజర్‌బైజాన్‌కు వెళ్లొద్దు!‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం జోరందుకున్న నేప థ్యంలో ఇకపై పర్యా టకం, ప్రీ–వెడ్డింగ్, సిని మాల చిత్రీకరణల కోసం తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచన చేయబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తుర్కియేలో షూటింగ్ కోణంలో సినీరంగానికి ప్రభుత్వ మద్దతు ఆపేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సినిమా కార్మిక సంఘాలు సైతం కేంద్రసర్కార్ నిర్ణయానికి మద్దతు పలికాయి. భారతీయ నటులు, నిర్మాతలు తుర్కియేకు ప్రాధాన్యత నివ్వడాన్ని పూర్తిగా మానుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసీడబ్ల్యూఏ) కోరాయి. కార్పొరేట్ సమావేశాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తుర్కియేలో జరపొద్దని ప్రభుత్వం పలు రంగాలకు సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటకానికి సంబంధించిన పలు భారతీయ ట్రావెలింగ్ ఏజెన్సీలు బుకింగ్‌లు నిలిపేశాయి. అక్కడి వెళ్లాలని గతంలో భావించిన వాళ్లు భారీ సంఖ్యలో క్యాన్సలేషన్లు చేసుకుంటున్నారు. -
అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. -
2025లో తొలిసారి 25000 పైకి నిఫ్టీ
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. → దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.లాభాలు ఎందుకంటే → ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. → ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. → వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
భారత్ మామిడి డాలర్ల ‘పంట’!
సాక్షి, అమరావతి: అమెరికాకు భారత్ మామిడి ఎగుమతుల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే), నేపాల్, అమెరికా, కువైట్, ఒమన్, ఖతార్, కెనడా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో అట్టడుగునున్న అమెరికా, అనూహ్యంగా ప్రస్తుతం నాలుగో స్థానానికి ఎగబాకింది. సమీప భవిష్యత్‌లో రెండో స్థానానికి మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు రూ.100 కోట్లకు చేరిన మామిడి ఎగుమతులుప్రపంచ వ్యాప్తంగా చూస్తే మెక్సికో, నెదర్లాండ్స్, బ్రెజిల్ తర్వాత మామిడి ఎగుమతుల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటిస్థానంలో ఉన్న మెక్సికో మొన్నటి వరకు అమెరికా మామిడి మార్కెట్‌ను శాసించింది. మెక్సికో తర్వాత బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ వంటి దేశాలు అమెరికాకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. అలాంటిది నేడు భారతదేశం అమెరికాకు ప్రధాన మామిడి ఎగుమతిదారుగా అవతరిస్తోంది. 2020– 21లో తొలిసారి అమెరికా విమానమెక్కిన మన మామిడి పండ్లు, గడిచిన ఐదేళ్లలో అగ్రరాజ్యానికి ప్రీతిపాత్రమైపోయాయి. 2020–21లో కేవలం రూ.లక్ష విలువైన 1.45 టన్నుల మామిడి ఎగుమతి జరగ్గా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లోనే (2024 ఏప్రిల్–2025 జనవరి) దాదాపు రూ.100 కోట్ల విలువైన 2,137 టన్నుల మామిడి పండ్లు అగ్రరాజ్యానికి ఎగుమతయ్యాయి.సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే..ఇక విదేశాలకు ఎగుమతయ్యే మామిడిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. అయితే ఏపీలో సాగయ్యే బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, హిమాయుద్దీన్ వంటి రకాల్లో ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి రకాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతానికి పైగా ఏపీకి చెందినవే. అయితే ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని ముంబై మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముంబై నుంచి ఎగుమతి అయ్యే మామిడిలో దాదాపు 80 శాతం ఏపీకి చెందినవేనని చెబుతున్నారు. ఏటా సగటున 2.5 లక్షల టన్నులకుపైగా మామిడి గుజ్జు విదేశాలకు ఎగుమతి అవుతోంది.అమెరికాకు కొత్త రుచి.. ‘కేసర్ ’భారతదేశంలో సాగయ్యే మామిడి రకాల్లో అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, తోతాపురి, చౌసా, దసేరి ప్రధానమైనవి. అయితే, అమెరికాకు ఎగుమతులలో కేసర్, అల్ఫోన్సో రకాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2024లో అమెరికాకు ఎగుమతైన మామిడిలో ‘కేసర్’ది అగ్రస్థానం. ఆ తర్వాత జాబితాలో ‘అల్ఫోన్సో’ ఉంది. అంతకుముందు అమెరికా వినియోగదారులకు ఇష్టమైన అల్ఫోన్సోను కేసర్ అధిగమించడం గమనార్హం. కేసర్ మామిడి రకం గుజరాత్‌లోని జునాగఢ్, అమరేలీ జిల్లాలలో ప్రధానంగా సాగవుతోంది. ఇది 1930ల్లో గుజరాత్‌లోని ఒక రైతు ద్వారా అభివృద్ధి చేసిన రకం ఇవి అమితమైన తీపి, రుచి, రసవంతమైన గుజ్జు, దీర్ఘకాల షెల్ఫ్ లైఫ్ కలిగి ఉండడంతో పాటు అల్ఫోన్సో కంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్. -
కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు. #WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd— ANI (@ANI) May 15, 2025కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది. -
మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్ సింధూర్ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
శత్రు డ్రోన్లపై మన భార్గవాస్త్రం
-
పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. -
భారత్‌లో ఆసియా కప్ హాకీ: పాక్‌కు ఎంట్రీ కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది. భారత్‌లో జరిగే టోర్నీ కోసం పాక్‌ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్‌కోట్‌లో భారత ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్‌కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు. అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి. -
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మొన్న గుజరాత్ .. నేడు రాజస్థాన్!
జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారుల్ని ఏరివేసే పనిలో పడ్డాయి. ఇటీవల గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులను వెనక్కి పంపించగా, తాజాగా రాజస్తాన్ లో కూడా వెయ్యికి పైగా బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వీరిని ప్రస్తుతం తమ దేశానికి పంపించే యత్నం చేస్తున్నారు. రాజస్తాన్ లోని 17 జిల్లాల్లో జల్లెడ పడితే 1,008 మంది బంగ్లాదేశీయులు దొరికారు. ఒక్క సిల్కార్ జిల్లాలోనే 394 మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటం గమనార్హం. వీరందర్నీ ఇప్పుడు దేశం దాటించే పనిలో పడ్డాయి ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది.పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉండే అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు. ప్రధానంగా అక్రమంగా ఉండే పాకిస్తానీయులిపై వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో అక్రమంగా స్థిరపడిన వారు వేలల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. #WATCH | Rajasthan: First batch of Bangladeshi nationals, who were living illegally in India, and were caught in the past few days were brought to Jodhpur today. They are being deported to Bangladesh. pic.twitter.com/hLqKxDSlb5— ANI (@ANI) May 14, 2025 ఇది కూడా చదవండి:జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు! -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్ సల్మాన్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్ సల్మాన్ ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025 -
భారత్ కు పాకిస్థాన్ లేఖ
-
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
ఇస్లామాబాద్: భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.👉పాక్‌పై భారత్ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు. -
మీ వైఖరేంటో?... మొన్న కాల్పుల విరమణ.. నేడు డిన్నర్!
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. ఆయన రెండోసారి అధ్యక్షుడైన దగ్గర్నుంచి సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్ని రాజీకి వచ్చేలా చేయడం, ఆపై దేశాల మధ్య సమస్యలకు, యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించడం మాత్రమే చేస్తున్నారు. ట్రంప్.. ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు అమెరికా ఎలా ఉందో చూసుకుంటున్నారో, లేదో కానీ మిగతా దేశాలపై ఆసక్తి మాత్రం ట్రంప్‌లో విపరీతంగా పెరిగిపోయింది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.భారత్, పాకిస్తాన్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని ;పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇది మంచిదే. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అయితే ఏ సందర్బంలో పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఉగ్రదాడులతో జనాల ప్రాణాల్ని తీసేస్తుంటే, భారత్ కు యుద్ధ పరిస్థితిని కల్పించింది దాయాది పాక్ . అది ఆపరేషన్ సిందూర్ తో మొదలుపెట్టింది. ఇక్కడ పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ షురూ చేసింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ రక్షణ స్థావరాలపై దాడులకు చేసి ఆ దాయాది దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి తగిన బుద్ధి చెప్పింది.మిమ్మల్ని అడిగింది ఎవరు?అసలు విషయం వదిలేసి, కొసరు విషయం చెప్పే అలవాటు ట్రంప్ కే ఉందా.. లేదా అగ్రరాజ్యమే అలా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ట్రంప్.. యుద్ధం ఆపడానికి తనను ఎవరు ఆశ్రయించారనే విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు.భారత్, పాక్‌ల కాల్పుల విరమణ అంటూ తనకు తానుగా ప్రకటించారు ట్రంప్. తమకు క్లయింట్ అయిన పాకిస్థాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే, మరొకవైపు ఇండియాతో స్నేహాన్ని నటిస్తున్నారనేది భారత ప్రజలకు బాగా అర్ధమైంది. భారత్ దాడి ముమ్మరం చేసిన వేళ.. పాక్ ప్రధాని మిమ్మల్ని ఆశ్రయించారా? లేదా? అనేది మీరు చెప్పకపోయినా భారత్ ప్రజలకు ఆ విషయం అర్దమైంది. పాక్ భారీగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే కాల్పుల విరమణకు ఒప్పించారని అంతా అనుకుంటున్నారు. కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తే ఓ పనైపోతుందన్నట్టుగా ట్రంప్ చేసిన వాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని, పీవోకేను భారత్‌కు పాక్ అప్పగించడమే ఒక్కటే మార్గమని క్లియర్ చేసేశారు.ఇప్పుడు కలిసి డిన్నర్ చేయాలా?తాజాగా ట్రంప్ మరో రాగం అందుకున్నారు. భారత్, పాకిస్థాన్‌లు కలిసి డిన్నర్ చేయాల్సిందేనని అంటున్నారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్.. తొలిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో పర్యటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌లు కలిసి డిన్నర్ చేస్తే చూడాలని అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ఎలా కలిసి డిన్నర్ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అన్న మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని మరి ఆ దేశాన్ని ఎలా నమ్మాలని కొంతమంది నిలదీస్తున్నారు. మీ వైఖరేంటో మాకు బాగా అర్ధమైందని మరికొందరు ట్రంప్‌ను విమర్శిస్తున్నారు. -
ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైలెవిల్ సీసీఎస్ సమావేశం జరిగింది. పలువురు కీలక కేబినెట్ మంత్రులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా సీసీఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ.గత 20 రోజుల్లో సీసీఎస్ భేటీ కావడం ఇది ఐదోసారి. అయితే భారత్-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన తర్వాత సీసీఎస్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కేబినెట్ ప్రశంసించింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారని మోదీని అభినందించింది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ కొనియాడింది.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
బయటపడుతున్న తుర్కియే కుట్రలు
-
మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన చైనా
-
Indo-Pak war సగం పర్యటనలు రద్దు, భారీ నష్టం
వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో సరదాగా పొగ మంచు అందాలు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకున్న నగర పర్యాటకులు అంతర్మథనంలో పడ్డారు. పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించింది. తరువాత పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఉత్తర భారత దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఎలా ఉంటుందో అనే ఆందోళన నగరవాసుల్లో కనిపిస్తోంది. దీంతో చాలా మంది తమ పర్యటనలను రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు పర్యటనలను రద్దు చేసుకోడానికే మొగ్గుచూపుతున్నారని ట్రావెల్ ఏజన్సీలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు మాత్రం వేరే ప్రాంతాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడం, పలువురు సెలబ్రిటీలు సైతం ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో పర్యటించడంతో పరిస్థితులు సద్దుమణిగాయనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వెళ్లి రావడానికి మరికొందరు మొగ్గుచూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఉత్తర భారతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్న యాత్రికులకు ఉగ్రదాడి అనంతరం పర్యటనలను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోడానికి మొగ్గుచూపుతున్నారు. మా సంస్థలోనే వెయ్యికి పైగా బుకింగ్స్ ఉండేవి. విమానాల రద్దుతో పర్యాటకులు తమ టూర్ ప్లాన్‌ను మార్చుకున్నారు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత 25 ఏళ్లుగా వేలాది మంది పర్యాటకులను పంపిస్తున్నా ఎన్నడూ ఈ స్థాయి ఒడిదుడుకులు చూడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరభారత దేశం అంటే యాత్రికులు అంత సుముఖంగా లేరు. రెండు రోజుల క్రితం ప్రధాని ప్రజలకు భరోసా కలి్పంచడంతో పరిస్థితులు కొద్దివరకూ మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. పూర్వ వైభవం రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నాం. – ఆర్వి రమణ, ఆర్వీ ట్రావెల్స్ ఛైర్మన్, హైదరాబాద్కుటుంబంతో కలసి నాలుగు రోజుల టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. మొన్నటి వరకూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దేశ సైనికుల పోరాటం ఫలించింది. తాజాగా పర్యటనకు కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తోంది. ట్రావెల్ ప్రతినిధులతోనూ సంప్రదించాం. సానుకూలంగానే స్పందించారు. వెళ్లవచ్చని భావిస్తున్నాం. – ప్రసాద్, ఉద్యోగి, హైదరాబాద్ శ్రీనగర్, కశ్మీర్ యాత్రకు ప్లాన్ చేసుకున్నాం. ఉగ్రదాడి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మా పర్యటన ప్లాన్ రద్దు చేసుకున్నాం. ప్రస్తుతం శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. నెలాఖరులోగా వెళ్లి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. భూతల స్వర్గమైన కశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరగడం బాధాకరం. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. – సుమిత్ర దేవి, హైదరాబాద్ ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?విమానం రద్దయ్యింది..భాగ్యనగరం నుంచి ఈ వేసవిలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కశ్మీర్, రాజస్థాన్, చార్ధామ్, రిషీకేశ్, జమ్మూ, శ్రీనగర్, సిమ్లా, డల్ హౌసీ, కాట్రా వైష్ణోదేవి ఆలయం, శ్రీనగర్, గుల్మార్గ్, లేహ్, ముస్సోరీ తదితర ప్రాంతాలకు సుమారు పదివేల మందికిపైగా ముందస్తు బుకింగ్ చేసుకున్నట్లు పర్యాటక ఏజన్సీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సుమారు 50 శాతం మంది తమ టూర్ ప్లాన్స్ రద్దుచేసుకుందామనే ఆలోచనకు వచ్చారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన నెలకొనడంతో ఎక్కువ మంది తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. మరో వైపు రైలు, విమాన సర్వీసులు రద్దు చేయడం, రవాణా సదుపాయాలు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా అనేక మంది తమ గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో పర్యాటకులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత వరకూ శాంతించడంతో తిరిగి ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. చదవండి: అలా రిటైర్మెంట్ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్! -
భారత్, పాక్ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు
ఢిల్లీ: భారత్ విషయంలో డ్రాగన్ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.Here's the actual names and places of Arunachal Pradesh which China has renamed! 👇@MEAIndia has reiterated that creative naming will not alter the undeniable reality that Arunachal Pradesh was, is, and will always remain an integral and inalienable part of India. pic.twitter.com/o4rcgiflfK— Sashanka Chakraborty (@SashankGuw) May 14, 2025అయితే, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటెన్ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.India’s Foreign Ministry slams China for presenting new names of cities in the state of Arunachal Pradesh, which China claims as its own:"Creative naming won’t alter the undeniable fact that Arunachal Pradesh was, is & will always remain an integral & inalienable part of India” pic.twitter.com/hsbLg3jbC7— DR Yadav (@DrYadav5197) May 14, 2025 -
సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్
ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గవాయ్‌కు అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గవాయ్.. చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌గా పేరు పొందారు.ఇక, మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని పలు కీలక కేసులను విచారించారు.#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw— ANI (@ANI) May 14, 2025 -
దడ పుట్టించే ‘డ్రోణా’స్త్రం
సాక్షి స్పెషల్ డెస్క్,సాక్షి, హైదరాబాద్:రాజుల కాలంలో కత్తులు, బల్లేలతో సైనికులు రణక్షేత్రంలో పోరాడారు. తరవాత.. యుద్ధ భూమిలో తుపాకులు, బాంబుల మోత మోగింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మానవ రహిత విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా వేల మైళ్ల దూరం నుంచే శత్రుదేశంపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్.. తాజాగా భారత్–పాక్... యుద్ధం ఏదైనా.. డ్రోన్స్ (మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)) ఇప్పుడు సైనిక సంపదలో అత్యంత కీలకంగా మారాయి. పెళ్లిళ్ల వంటి వేడుకల్లో ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్స్ మాత్రమే చాలా మందికి సుపరిచితం. కానీ, డ్రోన్స్ అంటే అంతకుమించి. డ్రోన్లు అధునాతన ఆయుధాలు. ఎవ్వరూ ప్రాణాలను పణంగా పెట్టకుండానే కచి్చతమైన దాడులు చేయడం, వేగంగా మోహరించే సామర్థ్యం వీటి సొంతం. క్షిపణులతో పోలిస్తే వీటి అభివృద్ధికి అయ్యే వ్యయమూ తక్కువే. మన దేశంలో డ్రోన్ల వాడకం.. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం తొలిసారి యూఏవీలను వినియోగించింది. ఆ తర్వాత ఇండియా అధికారికంగా వీటి కొనుగోలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మన సైన్యం వద్ద ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న సెర్చర్ ఎంకే–2 టాక్టికల్ డ్రోన్స్, హెరాన్మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్‌ఈ), హార్పీ యాంటీ రాడార్ డ్రోన్లు ఉన్నాయి. హార్పీ అనేది ఆత్మాహుతి డ్రోన్(లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసే క్రమంలో దీన్ని వినియోగించారు). వీటితో పాటు హరోప్ లాయిటరింగ్ అటాక్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రాడార్ సైట్లు, వాహనాలే లక్ష్యంగా మందుగుండుతో ఢీకొట్టి సర్వనాశనం చేయడం దీని స్పెషాలిటీ. దీంతో పాటు అధిక మన్నిక, పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇజ్రాయిల్ ఎంఏఎల్‌ఈ డ్రోన్’హెరాన్టీపీ/మార్క్ 2’కూడా మన దగ్గర ఉంది.మొదటి ప్రపంచ యుద్ధంలో..మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా రెండూ తొలిసారిగా యూఏవీతో ప్రయోగాలు చేశాయి. 1950–60లలో శత్రు భూభాగంపై గూఢచర్యం చేయడానికి యూఎస్ చిన్న రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నిఘా యూఏవీలు తొలిసారిగా మోహరించారు. 2000వ సంవత్సరంలో అమెరికా హెల్ఫైర్ క్షిపణులతో కూడిన ప్రిడేటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇక్కడి నుంచే సైనిక ఆయుధ భాండాగారంలోపెనుమార్పులు వచ్చాయి. మగ తేనెటీగను ఇంగ్లీషులో డ్రోన్ అంటారు. శ్రామిక తేనెటీగలకన్నాఇవి పెద్దగానే ఉంటాయి. కానీ తేనెనూ సంపాదించలేవు. తమను తామూపోషించుకోలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇవి చేసే పని ఏమీ ఉండదు. కానీ, ఆడ తేనెటీగ కోసం వెతుకుతూ ఎగిరి, దాన్ని కలిశాక పడిపోతుంది. డ్రోన్ మాత్రం అలాకాదు.. చూసి రమ్మంటే కాల్చి వస్తుంది.హైదరాబాద్ నుంచి..రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇప్పటికే నిలిచింది. డిఫెన్స్ డ్రోన్విభాగంలోనూ ఇదే బాటలో పయనిస్తోంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. భారత రక్షణ శాఖ కోసం ఏఎల్ఎస్–250 యూఏవీలను ఉత్పత్తి చేస్తోంది. అదానీ–ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియా.. హెర్మీస్ 900 యూఏవీలను తయారు చేస్తోంది. రక్షణ రంగానికి కావాల్సిన కీలక యంత్ర, పరికరాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్థ ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌కు చెందిన ట్రిన్నోవేట్ సినర్జీ టెక్నాలజీస్ చిన్న యూఏవీలు, హైబ్రిడ్ డ్రోన్స్ సరఫరా చేస్తోంది.ఆయుధాలను మోసే యూఏవీలను ఇండియన్ ఆర్మీకి అందిస్తోంది. జెన్ టెక్నాలజీస్ చిన్న యూఏవీలను భారత రక్షణ విభాగాలకు సరఫరా చేస్తోంది. ఎస్ఈసీ డీఆర్వీఏఎన్ఇన్నోవెన్షన్స్.. మిలిటరీ టెస్టింగ్ కోసం టార్గెట్ డ్రోన్లను; శిక్షణ, మదింపు కోసం శత్రు డ్రోన్లను అనుకరించే యూఏవీలను ఆఫర్ చేస్తోంది. మారుత్ డ్రోన్స్ రక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. టీ–హబ్, టీ–వర్క్స్ కేంద్రంగా కొన్ని స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి రానున్నాయి. భారత్ ఎలక్ట్రికల్స్ – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తయారీ భాగస్వాములుగా డీఆర్డీఓ రుస్తోమ్ – 2 డ్రోన్స్ అభివృద్ధి చేసింది. దక్ష యూఏవీ, ఐడియా ఫోర్జ్ వంటివి కూడా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2030 నాటికి రూ.34,860 కోట్లకు..డ్రోన్స్, యూఏవీల తయారీలో 75% వరకు విడి భాగాలు దేశీయంగా ఉత్పత్తి అయినవే. కొన్ని నెలల్లో ఇది 100 శాతానికి చేరడం ఖాయమని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిఫెన్స్ డ్రోన్కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీకి ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టాయి. పరిశ్రమకు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారత సైనిక డ్రోన్ మార్కెట్ 2024లో రూ.13,040 కోట్లు. 2030 నాటికి ఇది రూ.34,860 కోట్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రిసర్చ్ అంచనా. -
బద్దలైన బేస్‌లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్ ఖాన్, దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీం యార్ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్కోట్లోని రాడార్ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆటగాళ్ల ఇష్టానికి... యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా రెండు సిరీస్‌ల కారణంగా ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్ ఉంది. మరో వైపు జూన్ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్ టీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్గిడి, స్టబ్స్, మార్క్రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్ ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో ఉన్నారు.అహ్మదాబాద్‌లోనే ఫైనల్! ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు హైదరాబాద్, మరో రెండు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది. పైగా ‘ప్లే ఆఫ్స్’ తేదీల్లో హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్ తమ హోం గ్రౌండ్లో ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్–1, ఎలిమినేటర్లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించవచ్చు. -
అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం
ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. కానీ శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. యుద్ధక్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. వాయుసేన వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానిక స్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినా వాయుసేన కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. – ప్రధాని మోదీన్యూఢిల్లీ: దుష్టదేశ గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టంచేస్తూ, దాయాదిదేశం యుద్ధం ఆపాలని కాళ్లబేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసి తిరుగులేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. పాక్ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి స్వయంగా వెళ్లి అక్కడి వాయుసేన బలగాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించి పొగిడారు.తర్వాత అక్కడి ఎయిర్‌ఫోర్స్ జవాన్లనుద్దేశించి దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. మరోసారి తెగించేందుకు దుస్సాహసం చేయొద్దని సరిహద్దు వెంట భారతవాయుసేన బలగాలు లక్ష్మణరేఖ గీశాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలోని భారత అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన చక్ర(ఎస్–400) మిస్సైల్ లాంఛర్లను ముక్కలుచెక్కలు చేశామని పాక్ పలికిన ప్రగల్భాలన్నీ ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ మంగళవారం ఆ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ ఎదుటే నిలబడి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే మోదీ ఎయిర్‌ఫోర్స్‌నుద్దేశిస్తూ మాట్లాడటం గమనార్హం. త్రిశూలం చిహ్నంతో ఉన్న ఎయిర్ కమాండ్ క్యాప్ ధరించి భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. అనుపమాన పరాక్రమం ‘‘పాక్ గడ్డపై మీరు చేసిన యుద్ధం అనుపమానం. అపూర్వం. అసాధారణం. అద్భుతం. పాకిస్తాన్ నడిబొడ్డున బాంబులు పేల్చారు. కేవలం 20–25 నిమిషాల్లో లక్ష్యాలను నేలమట్టంచేశారు. మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసింది. చూసుకునేలోపే ఛాతీని చీల్చేశాం. మీ పోరాటంతో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంతో ఉప్పొంగిపోయాడు. మేం మీకు రుణపడిపోయాం. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. ఊహకందనంతటి శక్తియుక్తుల్ని ప్రదర్శించి దేశానికి విజయం చేకూర్చిన మీ నుంచి ఆశీస్సులు తీసుకోవడానికే నేను వచ్చా.ఆపరేషన్ సిందూర్ ధాటికి ఇక లక్ష్మణరేఖ దాటొద్దని పాకిస్తాన్‌కు బాగా అర్థమైంది. తరచూ అణుబాంబులతో బెదిరించాలని చూస్తున్న దాయాదికి మన బలగాలు భారత్ మాతాకీ జై నినాదంలోని అపారశక్తిని బయటకు తీసి చూపారు. భారత్ మాతాకీ జై అనేది కేవలం నినాదం కాదు. దేశం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామని బలగాలు చేసిన ప్రతిజ్ఞ. మన డ్రోన్లు, క్షిపణుల మోత పాక్ గడ్డపై ప్రతిధ్వనించిన ప్రతిసారీ పాకిస్తాన్ సైనికుల చెవుల్లో భారత్ మాతాకీ జై అనే నినాదమే మార్మోగింది. వాయుసేన శౌర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన సైనిక, వాయు, నావికా దళాలకు నా సెల్యూట్’’ అంటూ మోదీ సెల్యూట్ చేశారు. కన్నేస్తే కనుమరుగు ఖాయం ‘‘భారత గడ్డపై కన్నేస్తే తాము కనుమరుగు అవడం ఖాయమని ఉగ్రపోషకులకు ఆపరేషన్ సిందూర్ తర్వాత బాగా గుర్తుంటుంది. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూరం నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. శత్రువులు ఈ ఎయిర్‌ఫోర్స్‌ను నాశనంచేద్దామని కంకణం కట్టుకుని ఎడాపెడా దాడులు చేశారు. వాళ్ల ప్రయత్నాలను మీరు సులభంగా వమ్ముచేశారు. మన వైమానిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వాళ్ల 9 కీలక ఉగ్రస్థావరాలను సమాధులుగా మార్చేశాం. 100 మందికిపైగా ముష్కరులను మట్టుపెట్టాం. పాక్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ గీసిన లక్ష్మణరేఖ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం ‘‘ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శత్రు సంహారం కోసం ఆయుధం చేతబట్టి యుద్ధంచేయడం భారతీయుల సంప్రదాయం. మన అక్కచెల్లెళ్ల, కుమార్తెల పసుపు కుంకుమలు, సిందూరాన్ని తుచ్ఛమైన ముష్కరులు తుడిచేయగానే మనం వాళ్ల నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశాం. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. పహల్గాంలో వాళ్లు దొంగదెబ్బ తీస్తే మనం మాత్రం నేరుగా వెళ్లి, ఎదురునిలిచి పోరాడాం. పాకిస్తాన్ సైన్యం చంకనెక్కి భద్రంగా ఉండొచ్చని ఇన్నాళ్లు ఉగ్రవాదులు భావించారు. కానీ మన బలగాలు ఇక పాక్‌లో ఉగ్రవాదానికి సురక్షిత స్థలమంటూ ఏదీ లేదని నిరూపించాయి.సూర్యోదయం వేళ మీ సుందర దర్శనం చేసుకునేందుకే నేను ఇక్కడికొచ్చా. మీరు ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతలు. మరోసారి సాహసిస్తే నాశనం, వినాశనం అని శత్రువులకు సందేశం ఇచ్చారు. భారత్ మాతాకీ జై అన్నప్పుడల్లా భయంతో శత్రువుల గుండెలు జారిపోయాయి. పరాక్రమవంతుల అడుగులతో నేల కూడా పులకిస్తుంది. అంతటి ధైర్యవంతులను నేరుగా చూడటంతో జన్మ ధన్యమవుతుంది. ఆ భాగ్యం కోసమే నేను ఇక్కడికొచ్చా. వీరుల నేలపై నిలబడి ఇప్పుడు నేను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లోని యోధులకు సలామ్ చేస్తున్నా. మీ వీరత్వంతో ఆపరేషన్ సిందూర్ నినాదం నేల నలుచెరుగులా ప్రతిధ్వనిస్తోంది’’ అంటూ బలగాలను మోదీ పొగిడారు.త్రికరణ శుద్ధితో..‘‘ఇప్పుడు భారత్ మూడే సూత్రాలతో ముందుకెళ్తోంది. ఒకటి.. ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తాం. రెండు.. అణుబాంబులకు భయపడేదే లేదు. మూడు.. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచే వాళ్లను, ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారత్ వేర్వేరుగా చూడబోదు’’ అని మోదీ స్పష్టంచేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్ అనేది దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ అత్యంత అధునాతన రఫేల్, మిగ్–29 యుద్ధవిమానాల స్క్వాడ్రన్ దళాలు ఉంటాయి. 1965, 1971 యుద్ధాల్లోనూ ఆదంపూర్ వైమానిక స్థావరం అత్యంత కీలకపాత్ర పోషించింది. మానవ యుక్తి.. మెషీన్ శక్తి‘‘వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానికస్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినాసరే మన వాయుసేన అత్యంత కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. అమాయక పౌరులకు ఏ హానీ తలపెట్టలేదు. ఒక్క పౌరవిమానాన్నీ మీరు ధ్వంసంచేయలేదు. ఈ విషయంలో నేను నిజంగా గర్వపడుతున్నా. దాడుల్లో మీరు శత్రు స్థావరాలు, ఉగ్రశిబిరాలనే కాదు మరోసారి దుస్సాహసం చేయాలనే దుర్బుద్ధినీ దెబ్బతీశారు.గగనతల, భూతల యుద్ధ వ్యవస్థల మధ్య అద్భుతమైన సమన్వయం సాధించారు. మానవ యుక్తిని మెషీన్ శక్తిని చక్కగా మేళవించారు. మీరు భారత్ మాతా కీ జై అన్న ప్రతిసారీ శత్రువుల వెన్నులో వణుకుపుట్టింది. మీ సారథ్యంలో దేశీయ తయారీ ఆకాశ్ మిస్సైళ్లు, అధునాతన సుదర్శన చక్ర(ఎస్–400) వ్యవస్థలు శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా మీరు దేశ ఆత్మవిశ్వాసం, సమైక్యత, ప్రతిష్టను నూతన శిఖరాలపై నిలిపారు. అణుబూచికి ఏమాత్రం భారత బలగాలు బెదరవని నిరూపించారు. మన శక్తియుక్తుల ముందు పాకిస్తాన్ అన్ని డ్రోన్లు, యూఏవీలు, క్షిపణులన్నీ దిగదుడుపే. నమ్మశక్యంకాని రీతిలో రణతంత్రం ప్రదర్శించారు.గత దశాబ్దకాలంలో అత్యంత అధునాతన సమర సాంకేతికతలన్నింటినీ మన బలగాలు అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీ వాడకంలో, యుద్ధం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలో మీకు బాగా తెలుసు. రియల్ గేమ్‌లో మీరు అదరగొట్టారు. మీరు ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేయలేదు. భారత్ ఇప్పుడు డ్రోన్లు, డేటా, టెక్నాలజీ సహిత రణాల్లో రాటుదేలింది. మీరు దమ్ము చూపించి శత్రువులను దుమ్ములో కలిపేశారు’’ అని మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్ అశ్వమైన చేతక్ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు మన ఆధునిక యుద్ధవిమానాలకు పాటవానికి సరిగ్గా సరిపోతుంది అంటూ నాటి వచనాలను మోదీ గుర్తుచేశారు. ‘‘కదలికల్లో నైపుణ్యం కనబరిచాయి. మెరుపువేగంతో దూకుడు చూపాయి. శత్రుసైన్యం మధ్యల్లోంచే శ్రస్తాలు సంధించాయి’’ అని మోదీ ఆ వచనాలను వల్లెవేశారు. శాంతంగా ఉంటాం.. సమరమూ చేస్తాం‘‘ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. శాంతంగా ఉంటాం. శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. యుద్ధ క్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. శాంతంగా ఉంటాం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. ఆపరేషన్ సిందూర్ అంటే పోరాటానికి పెట్టుకున్న పేరు కాదు. భారత విధాననిర్ణయ పతాక. దృఢ సంకల్పానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. శాంతిమయ జీవనం సాగించాలని ప్రపంచానికి బోధించిన బుద్ధుని నేల మాత్రమేకాదు శత్రువులను చీల్చి చెండాడిన గురు గోవింద్ సింగ్ లాంటి వీరపరాక్రముల పవిత్రభూమి’’ అని అన్నారు. -
నీళ్ల కోసం ఇక పాక్ కాళ్లబేరం!
ఇండియా, పాకిస్తాన్ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్ 22 పహల్ గామ్ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్ వాటర్ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)లు టెక్నికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్–ఎల్ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్ రేంజ్ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్ చర్చల్లో పాకిస్తాన్ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్ ఇకముందు కూడా కశ్మీర్ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్ మీదే...1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్లో యూఎన్ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్–కన్వెన్షనల్) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్–కన్వెన్షనల్ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు. -
PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను
-
నాటి భారత్-పాక్ యుద్ధం: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..!
ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు ప్రధాని మోదీ పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి..ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. అలాగే పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో 1971 ఇండియా-పాక్ యుద్ధంలో ధ్వంసమైన భుజ్ వైమానిక దళ స్థావరాన్ని గంటల వ్యవధిలో పునర్నిర్మించి.. పాక్ దాడులను తిప్పిగొట్టిన గాథ గురించి తెలుసుకుందామా..!.1971 ఇండియా-పాక్ యుద్ధంలో..డిసెంబర్లో ఒక రాత్రి గుజరాత్‌లోని భుజ్ వైమానిక స్థావరంపై 14 ప్రాణాంతకమైన నాపామ్ బాంబులను జారవిడిచి కల్లోలం సృష్టించింది. ఆబాంబుల ధాటికి భుజ్ రన్‌వే ధ్వంసమైపోయింది. దాంతో భారత్ యుద్ద విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధ కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానికి దళాలకు ఏం చేయాలో పాలిపోలేదు. అదీగాక ఆ స్థావరంపై కేవలం రెండు వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. మరోవైపు పాక్ శత్రు మూకలు ఆస్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. చెప్పాలంటే..రన్‌వే లేకపోతే మొత్తం భారతవైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం అయినట్లేనని పేర్కొనచ్చు. అలాగే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే మందే. సరిగ్గా అప్పుడే భుజ్ ఎయిర్‌బేస్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ మెరుపులాంటి ఆలోచన తట్టింది. అది ఫలిస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేసే వ్యవధిలేని సంకటస్థితి. పైగా ప్రతి సెకను అత్యంత అమూల్యమైనది. దాంతో ఆయన సమీపంలోని మాదాపూర్ గ్రామంలోని మహిళలను సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు కూడా ఉన్నారు. ఆకుపచ్చ చీరలే ఎందుకంటే..వారంతా శత్రు విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్‌వే నిర్మాణంకు పూనుకున్నారు. బరువైన రాళ్లను, సిమెంట్ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మెర్టార్ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్‌వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడి సైరన్లు మోగినప్పుడల్లా పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లు. ఆ ఆకుపచ్చని వస్త్రం ప్రకృతిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతుందని..ఆ వస్త్రం ధరించే ఈ పనికి పూనుకున్నట్లు సమాచారం. ఆ మహిళలంతా ఆకలి, భయం, నిద్రలేని రాత్రులతో ఆహర్నిశలు కష్టపడ్డారు. పగుళ్లు మూపివేసేలా ఆవుపేడ ఉపయోగించారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్‌వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్ అందుకోగలిగింది. నిజానికి ఆ మహిళలకు ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు, అలాగే యుద్ధ అనుభం, రక్షణాయుధాలు కూడా లేకుండా అజేయమైన ధైర్యమైన సాహసాలతో ముందుకొచ్చిన వీర వనితలు. ఆ రాత్రి ఏం జరిగిందంటే..నాటి రన్‌వే పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మహిళల్లో ఒకరైన కనాబాయి శివ్జీ హిరానీ మాట్లాడుతూ..1971 భారత్-పాక్‌కి యుద్ధం జరుగుతున్నప్పుడూ..నాకు 24 ఏళ్లు. డిసెంబర్లో ఒక రోజు రాత్రి భుజ్‌లోని విమానాశ్రయం రన్‌వేపై బాంబు దాడి చేసింది పాక్. రాత్రిపూట దాడి చేయడంతో అక్కడున్న ప్రతిదీ నాశనమైపోయింది. ఏం చేయాలో తోచని స్థితి. కాని యావత్తు దేశాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితి కాబట్టి మా గ్రామంలోని మహిళ ఇందుకు తమ వంతుగా సహకరించేందుకు ముందుకొచ్చారు అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు". హిరానీ. దశాబ్దాలు గడుస్తున్న పాక్ తీరులో మార్పురావడంలో లేదు. కచ్చితంగా ప్రధాని మోదీ దీనిపై గట్టి చర్య తీసుకోవాలి. అలాగే పాక్‌కు నీరు, ఆహార సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడుగానీ వారికి తాము ఏం తప్పు చేశామన్నాది తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. పైగా తాను పాక్‌పై ద్వేషంతో ఇలా అనడం లేదని..తన జీవితానుభవంతో చెబుతున్న ఆవేధనభరితమైన మాటలని అన్నారు హిరానీ.(చదవండి: Indian Army soldier: మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!) -
పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?
-
త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్ సెక్రటరీ,సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది. Delhi | Defence Minister Rajnath Singh held a meeting with Defence Secretary, CDS, Navy Chief and Army Chief(Source: Defence Minister's office) pic.twitter.com/BF9AHZwkc4— ANI (@ANI) May 13, 2025మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్మీట్లో ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్ ఎయిర్ బేస్ ధ్వంసంపై కీలక విషయాలు వెల్లడించనుంది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇవ్వనుంది. -
పాకిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసిన డ్రాగన్ కంట్రీ
-
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025 -
మళ్లీ డ్రోన్ల కలకలం.. నేలమట్టం చేసిన భారత బలగాలు
జమ్మూ/చండీగఢ్: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. మే 8వ తేదీన సైతం ఇదే సాంబా సెక్టార్లో పాకిస్తానీ డ్రోన్లు రావడం, భారత బలగాలు పేల్చేయడం తెల్సిందే. అమృత్సర్, హోషియార్‌పూర్‌లో బ్లాక్ఔట్ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్‌లోని అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాల్లో సోమవారం స్థానిక యంత్రాంగం బ్లాక్ఔట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో సరిహద్దు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. జలంధర్ పరిధిలోని ప్రాంతాల్లోనూ పాక్షికంగా బ్లాక్‌ఔట్‌ను అమలుచేశామని జలంధర్ డిప్యూటీ కమిషన్ హిమాన్షు అగర్వాల్ తెలిపారు. పాకిస్తాన్‌తో పంజాబ్ 553 కి.మీ.ల మేర సరిహద్దు పంచుకుంటోంది. సోమవారం సైతం అమృత్‌సర్‌లో సైరన్ శబ్దాలు వినిపించాయి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని అమృత్సర్ ప్రజలకు ఇప్పటికే సందేశాలు పంపించామని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా అమృత్సర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్, తర్న్ తరన్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. పఠాన్‌కోట్, అమృత్సర్ జిల్లాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలకూ మంగళవారం సెలవు ప్రకటించారు. -
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్. -
దృఢనిశ్చయం
ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి. జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్ విషయంలో పాక్ తీరుతెన్నులపై భారత్ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం. కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్ సిందూర్’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది. మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది. కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి. ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్ గ్రహించటం అవసరం. ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా? తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్–పాక్ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు. మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే! -
ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో) -
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025 -
భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025 -
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు: పీఎం మోదీ
ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరుపహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్ సిందూర్ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్ సిందూర్ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాంభారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. పాక్ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఆశ్రయించిందిపాక్ శరణు గోరిందిఈ నెల 10 భారత్ డీజీఎంవోను పాక్ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాంఅణ్వాయుధాల బ్లాక్ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్ చర్యను బట్టి భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది.నీరు,రక్తం కలిసి పారలేవు ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ -పాకిస్తాన్ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా
-
దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్
-
కాళ్లబేరానికి పాక్.. భారత్ డిమాండ్లు ఇవే
-
పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిందే! DGMOల మీటింగులో మోదీ మాస్టర్ ప్లాన్
-
ఈ ఛాన్స్ వదలొద్దు.. దేశం కోసం యుద్ధం చేయాల్సిందే! మోదీ వెనక్కి తగ్గొద్దు
-
ఇవాళ భారత్-పాక్ మధ్య హాట్ లైన్ లో చర్చలు
-
భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..
-
ఆపరేషన్ సిందూర్‌పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్
న్యూఢిల్లీ: పాడ్‌కాస్టర్ రణ్వీర్ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రణ్వీర్.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్‌ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రియమైన పాకిస్తానీ సోదర సోదరీమణులారా.. ఇది రాయడం వల్ల మరో వివాదానికి ఆహ్వానం పలుకుతానని నాకు తెలుసు. చాలా మంది భారతీయులు నాపై ద్వేషం చిందిస్తారు. అయితే.. చాలా మంది భారతీయుల్లా నా హృదయంలో మీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మాలాగే శాంతిని కోరుకుంటున్నారు. తరువాత ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలిసినప్పుడు మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తారు. మేం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనిపిస్తే క్షమించేయండి. మిమ్మల్ని కలిసినప్పుడు భారతీయులు కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల్లో మీడియా చానళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ.. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ కోరుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఆర్మీ పెంచి పోషిస్తుందనడానికి మూడు ఉదాహరణలున్నాయి. ఒకటి.. ఇన్నేళ్లలో పట్టుబడిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌వారే. రెండోది.. జైషే మహ్మద్ చీఫ్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. దానికి పాక్ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు. మూడోది.. పాక్ రక్షణ శాఖా మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ టెర్రరిజాన్ని పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని అంగీకరించాడు. అయినా.. పాకిస్తాన్ ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ఆపరేషన్ భారతీయులు, పాకిస్తానీయుల మధ్య యుద్ధం కాదు. భారత్.. పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐపై చేస్తున్నది. శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పోస్టులో పేర్కొన్నాడు. రణ్వీర్ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, భారత ఆర్మీని కూడా అవమానించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో.. ఆయన పోస్టును డెలిట్ చేశారు. రణ్వీర్ అల్లహాబాదియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తల్లిదండ్రుల గురించి అనుచిత జోకులు వేసినందుకు ఈ ఏడాది ప్రారంభంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. -
అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది. -
ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగికతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమానవీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అనిత్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టాయనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు. బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికతలోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్యడమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది. విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యాలకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామాజిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు. అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించినట్లు బుద్ధుడు శాకాహారి కాడు. అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామాజిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు. బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది. బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది. - ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్ (మే 12న బుద్ధ పూర్ణిమ) -
పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. -
IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. -
జయం మనదే
కొలంబో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా అవతరించింది. ఆతిథ్య శ్రీలంక జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచి్చన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తుదిపోరులో వీరోచిత శతకంతో భారత్‌కు ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీస్కోరు చేసింది. వైస్ కెప్టేన్ స్మృతి మంధాన (101 బంతుల్లో 116; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 47; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. కెప్టేన్ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), నీలాక్షిక సిల్వా (58 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్పిన్నర్ స్నేహ్ రాణా 4, పేసర్ అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో 15 వికెట్లు తీసిన స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సూపర్ స్మృతి... ఓపెనర్లు స్మృతి, ప్రతీక రావల్ (30; 2 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 70 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత హర్లీన్ జతయ్యాక 55 బంతుల్లో స్మృతి అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఇద్దరు నిలదొక్కుకోవడంతో 22వ ఓవర్లో భారత్ 100 పరుగులకు చేరింది. మరోవైపు లంక శిబిరం ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలయ్యాయి. చమరి వేసిన 31వ ఓవర్లో వరుసగా 4, 4, 4, 4లతో స్మృతి వన్డేల్లో 11వ సెంచరీని 92 బంతుల్లో పూర్తి చేసుకుంది. కాసేపటికి జట్టు స్కోరు 190 వద్ద ఆమె ని్రష్కమించింది. తర్వాత వచి్చన హర్మన్‌ప్రీత్, జెమీమాలు కూడా లంక బౌలర్లపై యథేచ్చగా పరుగులు సాధించడంతో భారత్ స్కోరు దూసుకెళ్లింది. ముఖ్యంగా జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడంతో భారత జట్టు చివరి 10 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆఖర్లో దీప్తి (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), అమన్‌జ్యోత్ (12 బంతుల్లో 18; 2 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశారు. ఆరంభం నుంచే తడబాటు... ఆరంభం నుంచి ఇన్నింగ్స్ ముగిసేదాకా లంక జట్టు ఏ దశలోనూ లక్ష్యఛేదనవైపు నడవ లేదు. మీడియం పేసర్ అమన్‌జ్యోత్ వైవిధ్యమైన బంతులతో లంక ఓపెనర్లను హడలెత్తించింది. ఖాతా తెరువక ముందే హాసిని (0) డకౌట్ కాగా, కాసేపటికి విష్మీ గుణరత్నే (36; 5 ఫోర్లు)ని కూడా అమన్జ్యోతే క్లీన్»ౌల్డ్ చేసింది. కెప్టేన్ చమరి, నీలాక్షిక కాసేపు భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్నారే తప్ప లక్ష్యానికి అవసరమైన వేగాన్ని అందిపుచ్చుకోలేదు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న చమరి 121 స్కోరు వద్ద పెవిలియన్ చేరింది. తర్వాత హర్షిత నిలబడేందుకు ప్రయత్నం చేసినా... స్నేహ్ రాణా, అమన్‌జ్యోత్, శ్రీచరణి చావుదెబ్బ తీశారు. దీంతో 173/2తో పటిష్టంగా కనిపించిన లంక 19 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయి 192/7 వద్ద కుదేలైంది. సుగందిక (27; 5 ఫోర్లు) చేసిన ఆ మాత్రం స్కోరుతో జట్టు 240 పైచిలుకు స్కోరు చేయగలిగింది.భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) వత్సల (బి) ఇనోక 30; స్మృతి (సి) హర్షిత (బి) విహంగ 116; హర్లీన్ (సి అండ్ బి) విహంగ 47; హర్మన్‌ప్రీత్ (సి) మాల్కి మదర (బి) సుగంధిక 41; జెమీమా (సి) నీలాక్షిక (బి) సుగంధిక 44; రిచా ఘోష్ (సి) సబ్–కరుణరత్నే (బి) మాల్కి మదర 8; అమన్‌జ్యోత్ (సి) సబ్–కరుణరత్నే (బి) మాల్కి మదర 18; దీప్తి శర్మ (నాటౌట్) 20; క్రాంతి గౌడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 342. వికెట్ల పతనం: 1–70, 2–190, 3–219, 4–267, 5–294, 6–304, 7–341.బౌలింగ్: మాల్కి మదర 10–0–74–2, దేమి విహంగ 10–0–69–2, సుగంధిక 10–0–59–2, ఇనొక రణవీర 10–0–62–1, చమరి 8–0–61–0, పియుమి వత్సల 2–0–17–0. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (బి) అమన్‌జ్యోత్ 0; విష్మీ గుణరత్నే (బి) అమన్‌జ్యోత్ 36; చమరి (బి) స్నేహ్ రాణా 51; నీలాక్షిక (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 48; హర్షిత (సి) స్మృతి (బి) అమన్‌జ్యోత్ 26; దేమి విహంగ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీ చరణి 4; అనుష్క (సి) అమన్‌జ్యోత్ (బి) స్నేహ్ రాణా 28; వత్సల రనౌట్ 9; సుగంధిక (రనౌట్) 27; మాల్కి మదర (బి) స్నేహ్ రాణా 0; ఇనోక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–0, 2–68, 3–121, 4–173, 5–178, 6–178, 7–192, 8–243, 9–244, 10–245. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 8–0–54–3, క్రాంతి 5–0–22–0, దీప్తి శర్మ 10–0–43–0, శ్రీచరణి 10–0–55–1, స్నేహ్ రాణా 9.2–1–38–4, ప్రతీక రావల్ 5–0–18–0, హర్లీన్ డియోల్ 1–0–12–0. -
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్గామ్లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
Jana Tantram: కాల్పుల విరమణ వ్యవహారంలో ట్రంప్ పాత్రపై ఆసక్తికరం
-
పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్
-
పాక్‌ను ఎలా నమ్మగలం.. శశిథరూర్
ఢిల్లీ: పాక్‌ను ఎలా నమ్మగలం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ దేశ తీరుపై మండిపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. దీనిపై శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అంటూ దుయ్యబట్టారు.భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని.. కానీ.. ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా వారికి తెలిసేలా చేసిందన్నారు. పాక్ గుణపాఠం నేర్చుకోవాలని.. ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ శిశిథరూర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించి పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కన్పించాయి.మరో వైపు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కనిపించాయి. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
పాక్ ఫేక్ ప్రచార సారధి ఓ ఉగ్రవాది కొడుకు
-
ఆపరేషన్ సిందూర్.. భారత వజ్రాయుధాలకు పాక్ గజగజ
-
యుద్ధానికి మా సైన్యం పనికిరాదు.. పాక్ ప్రజల రియాక్షన్
-
పాక్ కు భారత్ వార్నింగ్.. ఇక కాస్కోండి
-
బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌ను దారికి తెచ్చిన భారత్?
ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్‌తో పాకిస్థాన్‌ను భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.అణు ఆయుధ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది. -
పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు. -
మాకు పీవోకేను పాక్ అప్పగించడం తప్పితే వేరే మార్గం లేదు: మోదీ
War Related Updates..ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్భారత్, పాక్ ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడిన జేడీ వాన్స్పాక్ దాడి చేస్తే దీటుగా బదులిస్తామని చెప్పిన మోదీమా సంయమనం బలహీనత కాదుదేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడంఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్ కు మరోసారి చెప్పిన మోదీ పీవోకేపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలుఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. ముగియలేదు. పీవోకే విషయంలో మాకు మధ్య వర్తిత్వం అవసరం లేదుపీవోకేని మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు : మోదీ 3:10 PMప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీసమావేశంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, సీడీఎస్కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తాజా పరిస్థితులపై చర్చరేపు భారత్, పాక్ మధ్య కీలక చర్చలుకాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గింపుపై చర్చలు ఢిల్లీ..ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీసమావేశానికి హాజరైన ఎయిర్‌ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్‌అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పుర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్‌లోనూ డ్రోన్ దాడులు?👉గుజరాత్‌లోనూ డ్రోన్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్అవుట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025 -
కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం
-
కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు. గతంలో అర్మేనియా–అజర్బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్‌ను ఆత్మాహుతి డ్రోన్‌గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత. విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్‌లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్‌లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి. తుర్కియే నుంచే తెప్పించారు తుర్కియే దేశంలోని అసిస్‌గార్డ్ సోన్‌గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకీ పేరు? కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు. -
పాక్‌కు ఐఎంఎఫ్ రుణంపై విమర్శల వెల్లువ
న్యూయార్క్: పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు పహల్గాంలో అనాగరిక దాడులకు తెగబడినందుకే సైనిక చర్య చేపట్టామని భారత్ ఓవైపు అంతర్జాతీయ సమాజానికి చెబుతుంటే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అదే దాయాదిదేశానికి భారీ సాయం చేయడం వివాదాస్పదమైంది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతో ఉగ్ర, పాక్ దోస్తీ బట్టబయలైన సమయంలోనే ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ ఇలా నిధులు ఇవ్వడమేంటని పలువురు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌కు మరో 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,540 కోట్లు వెంటనే ఇచ్చేందుకు ఐఎంఎఫ్ శుక్రవారం అంగీకరించడమే ఈ విమర్శలకు అసలు కారణం. ఇటీవలే మరో 1.1 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ పచ్చజెండా ఊపడంతో మొత్తంగా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల నిధుల వరద పారనుందని తెలుస్తోంది. వాతావరణ సంబంధ ప్రాజెక్టులు, పనుల నిమిత్తం పాకిస్తాన్ ఈ నిధులను కోరగా రుణంగా అందజేసేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. అయితే ప్రజాపనుల నిమిత్తం నిధులు ఇస్తున్నాసరే, ఉద్రిక్తతల వేళ నిధుల విడుదల సహేతుకంగా లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పరస్పర సైనిక చర్యల కారణంగా ఆయుధాల సేకరణ అనేది పాకిస్తాన్‌కు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ సమయంలో ఒకేసారి వేల కోట్ల రూపాయల నిధులు వచి్చపడితే వాటిని సంబంధిత లక్ష్యం కోసం కాకుండా సైనిక సన్నద్ధత, ఆయుధాల కొనుగోలు కోసం దురి్వనియోగం చేసే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. సమకాలీన పరిస్థితులను, కనీసం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని అయినా నిధుల విడుదలపై ఐఎంఎఫ్ పునరాలోచన చేస్తే బాగుండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అభ్యంతరం తెలిపిన భారత్ పాకిస్తాన్‌కు అదనపు నిధుల విడుదల(ఈఎఫ్ఎఫ్)పై శుక్రవారమే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం జరిగింది. రెసీలెన్స్ అండ్ సస్టేనబిలిటీ ఫెసిలిటీ పథకంలో భాగంగా పాక్‌కు అదనపు నిధులు ఇవ్వడంపై సమావేశం నిర్వహించారు. ఇందులో సభ్యదేశంగా భారత్ పాల్గొని ఉద్రిక్తత వేళ పాక్‌కు రుణవితరణ ఆపాలని డిమాండ్చేసింది. అయితే ఇక్కడ ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి తరహాలో ఓటింగ్‌లో గైర్హాజరు వంటి అవకాశం ఉండదు. కేవలం అభ్యంతరం మాత్రమే వ్యక్తంచేయగలం. దీంతో గతంలో ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్ల రుణాల్లో భాగంగా కొంతమేర నిధుల విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది. సైనిక చర్యలో మునిగిన దేశానికి నిధులెలా ఇస్తారని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబాల్ తప్పుబట్టారు. ఐఎంఎఫ్ తన చేతులకు అనవసరంగా రక్తం అంటించుకుంటోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ విమర్శించారు. పాక్ తన ఆర్థిక సంస్కరణల ఊసే మర్చిపోయి మారణాయుధాల కొనుగోళ్లకు ఈ నిధులను కేటాయించడం ఖాయమని ‘అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్’లో నిపుణుడు సుశాంత్ సరీన్ అన్నారు. గత 35 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఇలా 28 రుణాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ వాటిని సవ్యంగా అమలుచేసిన చరిత్ర ధూర్తదేశానికి లేదని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భారత్‌పై బాంబులేస్తున్న వేళ ఈ రుణవితరణ ఏవిధంగా హేతుబద్ధం అనిపించుకుంటుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రుణగ్రస్త పాకిస్తాన్‌ను ఐఎంఎఫ్ నిధుల సాయంతో ఒడ్డున పడేయట్లేదు. మరింతగా నెత్తుటేర్లు పారించేందుకు సాయపడుతోంది. ఇలా హంతక పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఇంకెన్నాళ్లు నిధులిస్తాయి?’అని ప్రవాసంలో గడుపుతున్న అఫ్గానిస్తాన్ మహిళా ఎంపీ మరియం సోలాయ్మన్ఖిల్ అన్నారు. -
మెటా గ్లాస్.. మొబైల్‌కి లాస్?
ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్‌మనిపిస్తుంది.. వాయిస్ కమాండ్ వినగానే వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్ లేకుండానే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్ కంపెనీ.. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్ గ్లాసె స్ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానున్నాయి. అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్‌పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్ గేమ్–ఛేంజర్‌గా నిలుస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ విలువ 18.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐఎమ్ఏఆర్సీ గ్రూప్ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ గ్లాసెస్ ప్రత్యేకత?వాయిస్ అసిస్టెంట్: మెటా ఏఐతో సంభాషించి రియల్ టైమ్ సమాధానాలు పొందవచ్చు. ఫొటో, వీడియో క్యాప్చర్: వాయిస్ కమాండ్‌తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.లైవ్ స్ట్రీమింగ్: ఏదైనా కార్యక్రమానికి ఇన్‌స్ట్రాగామ్ లేదా ఫేస్బుక్లో నేరుగా ప్రసారం చేయవచ్చు.సంగీతం, పాడ్‌కాస్ట్‌లు: ఇయర్‌బడ్స్ లేకుండానే సంగీతం లేదా పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు. ఫోన్ కాల్స్: బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్స్ స్వీకరించవచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్: విదేశీ భాషల సైన్‌బోర్డ్‌లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.ఆబ్జెక్ట్ రికగ్నిషన్: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్‌లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు. స్క్రీన్ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్ తెర అవసరం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.స్మార్ట్ గ్లాసెస్ ప్రయోజనాలు..సహజ కదలిక: స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మల్టీ టాస్కింగ్: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్‌ఫోన్ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు. తక్కువ స్క్రీన్ టైమ్: నిరంతర ఫోన్‌ను చూస్తూ స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.ఎదురయ్యే సవాళ్లు..బ్యాటరీ లైఫ్: రోజంతా గ్లాసెస్‌ను చార్జ్‌లో ఉంచడం కష్టం. వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ధర: ఈ హై–టెక్ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ వాచ్‌ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే బెటర్.. త్వరలోనే ఈ గ్లాసెస్ స్మార్ట్ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్‌ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్‌కు బదులుగా వాయిస్ కమాండ్స్, విజువల్స్‌తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’ – మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీఈఓ -
మన వెలుగులు భద్రం
సాక్షి, అమరావతి: యుద్ధంలో సైబర్ దాడులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయనేది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రుజువు చేసింది. ఒక దేశాన్ని చావుదెబ్బ కొట్టాలంటే ఆయుధాలతో కాకుండా సైన్స్, టెక్నాలజీతో సాధ్యమవుతుందని అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలతో నిరూపితమైంది. మన దేశంలోనూ పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ సైబర్ దాడికి పాల్పడి భారతదేశ విద్యుత్ గ్రిడ్‌లో 70 శాతం నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దానిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. సైబర్ దాడి అనేది పూర్తిగా అవాస్తవమంటూ పీఐబీ ఫ్యాక్ట్–చెక్‌లో ట్వీట్ చేసింది. అయితే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇంధనరంగ నిపుణులు అంటున్నారు. పవర్ ఐలాండ్ సిస్టమ్‌తో పరిష్కారంపవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. సీఈఏ గతేడాది విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనల్ని తెచ్చింది. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్త్రన్, నార్త్ ఈస్త్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐలాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీని వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాటురాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సీఐఎస్‌ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్(డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్(పీఎస్)ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సీఈఏ వెల్లడించింది. కానీ ఇవన్నీ ఇంకా పూర్తి ఆచరణలోకి రాలేదు.గత ప్రభుత్వం పటిష్ట చర్యలు కేవలం పవర్ గ్రిడ్లే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది.దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్‌లోని పగ్వరా రైల్వే స్టేషన్‌కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్‌రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్‌లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్‌లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్‌లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్‌లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్‌రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
భారత్‌పై సైబర్ దాడికి పాక్ హ్యాకర్ల యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈమెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేయాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించాయి. పాక్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్‌ను అభివృధ్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగిలించేందుకు ఈ మాల్వేర్ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తోంది. ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్ పరికరాలను, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదముందని ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘.exe', "tasksche.exe' వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా, చాలా హానికరమైనవని, ఒకసారి క్లిక్ చేసిన తర్వాత, అవి హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్‌ను ఇచ్చేస్తాయని చెబుతున్నారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియా ట్రెండ్లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్‌లను కేంద్రం అప్రమత్తం చేసింది. -
పాక్ ఫేక్ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు
లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి. భారత్‌పై పాకిస్తాన్ సాగిస్తున్న గోబెల్స్ ప్రచారానికి సారథి. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్. పహల్గాం ఉగ్ర దాడి నుంచీ భారత్‌పై పథకం ప్రచారం దాయాది తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చౌధురే. అతను ఓ ఉగ్రవాది కుమారుడు కావడం విశేషం. ఉగ్రవాదంతో విడదీయలేని రీతిలో పెనవేసుకు పోయిన పాకిస్తాన్ బంధానికి నిలువెత్తు నిదర్శనం. దారితప్పిన సైంటిస్టు చౌధురి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మెహమూద్. అవడానికి అణు శాస్త్రవేత్త. పాక్ అణ్వాయుధ పిత అబ్దుల్ ఖదీర్ఖాన్తో కలిసి అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించాడు. యురేనియం శుద్ధి తదితరాల్లో చురుగ్గా వ్యవహరించాడు. అందుకోసం గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ నుంచి తస్కరించాడు. కానీ నిజానికి అతనో కరడుగట్టిన మతోన్మాది. అంతకుమించి పేరుమోసిన ఉగ్రవాది. నరనరానా భారత విద్వేషాన్ని నింపుకున్న వ్యక్తి. ఐరాస భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. పాక్ అణ్వాయుధ పరిజ్ఞానాన్ని దాదాపుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా చేతిలో పెట్టిన ధూర్తుడు. అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు. బషీర్ చేసిన ఈ నిర్వాకం అప్పట్లో పాశ్చాత్య దేశాలకు పెద్ద సంకటంగా మారింది. అలాంటి వ్యక్తి కొడుకైన చౌధురి భారత్‌తో సైనిక సంఘర్షణ గురించి పాక్ తరఫున నాలుగు రోజులుగా అధికారికంగా బయటి ప్రపంచానికి చెబుతున్నాడు! ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కొడుకే పాక్‌కు అంతర్జాతీయ గొంతుకగా మారాడు. ‘మాది ఉగ్రవాద బాధిత దేశం’అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేగాక అధికారికంగానూ, ఆన్‌లైన్‌లోనూ భారత్‌పై ఇబ్బడిముబ్బడిగా ఫేక్ న్యూస్ ప్రచారం వ్యాప్తి చేస్తున్నాడు. చౌధురి తీరును పాక్ ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. భారత సైన్యం చేతిలో పాక్ రోజూ చావుదెబ్బలు తింటున్నా అతను మాత్రం ఆ వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి లేనిపోని గొప్పలకు పోతున్నాడంటూ మండిపడుతున్నారు. డీఎన్ఏలోనే ఉగ్రవాదం లెఫ్టినెంట్ జనరల్ చౌధురి తండ్రి బషీర్‌ను 2001లో ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బిన్‌లాడెన్ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడితో మరో దారిలేక అదే ఏడాది పాక్ ఐఎస్ఐ అతన్ని అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ బషీర్‌ను స్వయంగా విచారించింది. బిన్‌లాడెన్‌ను కలిసినట్టు దర్యాప్తులో అతను అంగీకరించాడు. 2009లో ప్రభుత్వ విధుల నుంచి తప్పించింది. ముసుగు తొలగిపోవడంతో బషీర్ మరింత రెచ్చిపోయాడు. ఉమ్మా తమీరీ నౌ (యూటీఎన్) అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఓ ఉగ్ర సంస్థను స్థాపించాడు. రసాయన, జీవాయుధాలతో పాటు ఏకంగా అణ్వాయుధాలను గురించి లాడెన్‌కు, తాలిబన్లకు కావాల్సిన సమాచారం అందించడం మొదలుపెట్టాడు. తాలిబన్ల నాటి చీఫ్ ముల్లా ఒమర్‌తో తరచూ భేటీ అయ్యేవాడు. మునీర్.. ఓ మతోన్మాది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌ది కూడా పూర్తిగా జిహాదీ నేపథ్యమే. ఆయన తండ్రి సయ్యర్ సర్వర్ మునీర్ ఓ మదర్సాలో ఇస్లాం బోధకుడు. ఆ ఛాయల్లో పెరిగిన మునీర్ కూడా కరడుగట్టిన మతోన్మాదిగా మారాడు. నరనరానా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. 2019లో జమ్మూలోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి ఉగ్ర దాడికి మునీరే వ్యూహకర్త. అప్పట్లో పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ చీఫ్‌గా ఆ దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
IPL 2025: బీసీసీఐ కొత్త ప్రణాళికలు .. ‘మే’లోనే ముగించాలని..
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు వారం రోజుల పాటు విరామం ఇచ్చిన బీసీసీఐ భారత్, పాక్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాల తర్వాత మళ్లీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనతో ఉంది. ఈ వారాంతంలో టోర్నీ మళ్లీ మొదలు కావచ్చని వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 నుంచే మ్యాచ్‌లు జరగవచ్చు. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్‌ను ముగించాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మూడు వేదికల్లో మ్యాచ్‌లు... ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని ‘రద్దు’గా పరిగణించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా లేక మళ్లీ నిర్వహించాలా అనే అంశంపై ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ముందుగా ఊహించినట్లుగానే దక్షిణాదిలో ఉన్న వేదికలను ఎంచుకొని మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆటగాళ్లు వెనక్కి వస్తారా... ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు మిగిలిన మ్యాచ్‌ల కోసం విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఐపీఎల్ వాయిదా గురించి తెలిసిన వెంటనే శుక్ర, శనివారాల్లో పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ స్వస్థలాలను బయల్దేరి వెళ్లిపోయారు. వీరందరికీ ఐపీఎల్ ఇప్పట్లో మళ్లీ జరగదని, ఏడాది చివర్లో మళ్లీ నిర్వహించవచ్చనే సమాచారమే ఉంది. దాంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి తాజా సమాచారాన్ని అందించాయని, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లు సమాచారం. కొందరు ఆదివారం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా వారిని ఆగిపోవాలని ఒక ఫ్రాంచైజీ చెప్పగా... మరికొందరు సగం దూరం ప్రయాణించగా, ఎక్కడ ఉన్నారో అక్కడినుంచే వెనక్కి రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెళ్లిపోయిన బట్లర్, కొయెట్జీలను వెనక్కి రమ్మని గుజరాత్ టైటాన్స్ కోరింది. అయితే అందరు విదేశీ ఆటగాళ్లు దాదాపు ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 25 తర్వాత లీగ్ కొనసాగితే తాము ఉండలేమని తేల్చేశారు. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఈ రెండు టీమ్‌ల ప్లేయర్లు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పూర్తిగా లేనట్లే. -
ఫేక్ న్యూస్‌తో జాగ్రత్త సుమా!
దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. పహెల్గామ్లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్ రిఫరెన్స్ తదితర యూ ట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. అలాగే భారత్‌లోని అనేక వెబ్సైట్లనూ, యూట్యూబ్ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్ చేసింది. అందులో ‘ద వైర్’ న్యూస్ పోర్టల్ ఒకటి. ఇటువంటి వెబ్‌సైట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్’ వంటి వెబ్‌సైట్‌ను నిషేధించవలసిన అవసరం లేదు. ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్గామ్లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్’ న్యాయవాదీ, ఫౌండర్ డైరెక్టర్ అయిన అపర్ గుప్తా అన్నారు. ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్... ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయీ సూసైడ్ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్ బెటాలి యన్ అనే యూనిట్ లేనే లేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్నది. పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏదికాదో తేల్చుకోవలసింది మనమే!మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
విరమణ సరే, విధానం సంగతి!
భారత్ – పాకిస్తాన్ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్ ట్వీట్ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్ ఆఫ్ వార్’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్ సాధించిందేమీ లేదు. భారత్ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్‌గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ -
కాల్పులకు విరమణ: కీలక పాత్ర వీరిదే!
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత.. భారత్ ప్రతీకారదాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పాక్ ప్రతిదాడులకు ప్రయత్నించినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ ముందు నిలబడలేకపోయింది. చేసేదేమీ లేక ఉద్రిక్తతలు తగ్గించాలని వేసుకోవడంతో.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు.భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో డీజీఎంవో (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) అధికారులే కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందు పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నత సైనిక అధికారి భారతదేశానికి ఫోన్ చేశారని, ఆ తర్వాత రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.కాల్పుల విరమణ ప్రకటన రావడానికి గంట ముందు, పాకిస్తాన్ భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని, భారతదేశం దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని భారతదేశం తెలిపింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్ & క్షిపణి దాడులకు పాల్పడినప్పటికి వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ శాఖ విజయవంతంగా అడ్డుకుంది.సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో.. డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు.. సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక, కార్యాచరణలను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రుమూకలను దీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు.బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా.. వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవైపు నిఘా వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు వ్యూహాలు రచిస్తారు. మనదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతల వేళ కూడా డీజీఎంవోదే ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే. ఎందుకంటే కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. -
దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం: భారత ఆర్మీ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈరోజు(శనివారం) సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయగా, దీన్ని భారత కూడా ధృవీకరించడంతో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ముగింపు దొరికింది.అనంతరం ఇండియన్ ఆర్మీ.. ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘ దేశ రక్షణ కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల యుద్ధంలో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లింది. పాక్ తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. భారత్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు అసత్య ప్రచారం చేశారు. పాక్ చెప్పినట్లు.. భారత్ ఆర్మీకి ఏమీ నష్టం జరగలేదు. భారత సైన్యం.. పాక్ ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసింది. భారత్ పై కవ్వింపు చర్యలకు దిగి, పాక్ తీవ్రంగా నష్టపోయింది. ఎల్ఓసీ దగ్గర పాక్ తీవ్రంగా నష్టపోయింది. బారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది’ అని భారత ఆర్మీ స్పష్టం చేసింది.భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణభారత్-పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం(శనివారం, మే10) 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ట్రంప్ పెద్దన్న పాత్రఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్రలో ఇరు దేశాల మధ్య రాజీ కోసం ప్రయత్నించారు. కాల్పుల విరమణకు అమెరికాను పాకిస్తాన్ ఆశ్రయించడంతో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి భారత్‌తో చర్చించారు. దీనికి భారత్ కూడా అంగీకరించి మే 12వ తేదీన పాక్‌తో చర్చలకు సిద్ధమైంది. -
'అతడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.. మరి ఎప్పుడూ పాక్‌కు రానున్నాడు'
భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చకునేందుకు భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. తొలుత మంగళవారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం క్షిపణి దాడులు చేసింది.దీంతో పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. అంతేకాకుండా సరిహద్దులో ఉన్న నగరాలపై డ్రోన్ దాడి చేయడానికి యత్నించింది. కానీ భారత్ మాత్రం ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి డ్రోన్స్‌ను, క్షిపణులను గాల్లోనే నేలకూల్చి దాయాదికి ధీటుగా సమాధనం చెబుతోంది. భారత్ కూడా పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.ఈ క్రమంలో భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ను పీసీబీ ఆకస్మికంగా నిలపివేసింది. ఈ టోర్నీలో భాగంగా మే 8(గురువారం) రావల్పిండి వేదికగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ మ్యాచ్‌కు ముందు రోజు రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కూలిపోవడంతో పీసీబీ అప్రమత్తమైంది. వెంటనే ఆ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లను కూడా వాయిదా వేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన విదేశీ ఆటగాళ్లు సైతం తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ సస్పెన్షన్‌కు ముందు తమ పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వివరించాడు. రెండు రోజుల పాటు భయందోళనకు గురైనట్లు రిషద్ హుస్సేన్ తెలిపాడు."ఆ దేవుడు దయవల్ల తీవ్ర ఉద్రిక్తల నడుమ మేము దుబాయ్‌కు చేరుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేము లహోర్ నుంచి బయలు దేరిన 20 నిమిషాల తర్వాత విమానాశ్రయంపై మిస్సైల్ ఎటాక్ జరిగిందని దుబాయ్‌లో దిగాక తెలిసింది. ఆ వార్త విని మేము చాలా భయపడ్డాము. నా కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. బాంబు పేలుళ్లు, క్షిపణి దాడుల గురించి వారు తీవ్ర ఆందోళన చెందారు. నిరంతంరం మా ఫ్యామిలీతో టచ్‌లో ఉండేవాడిని. నా సహచర ఆటగాడు నహిద్ రాణా చాలా భయపడ్డాడు. నేను అతడికి టెన్షన్ పడొద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చాను. ఏదేమైనప్పటికి మేము దుబాయ్‌కి సురక్షితంగా చేరుకున్నాము. నహిద్ మాత్రమే కాదు ఇతర విదేశీ ఆటగాళ్లు సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ సైతం చాలా భయపడ్డారు. మరోసారి పాకిస్తాన్‌కు తాను తిరిగి రానని మిచెల్ నాతో చెప్పాడు. టామ్ కుర్రాన్ ఓ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఎయిర్పోర్ట్ మూసివేయబడింది. దీంతో అతడు చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. అతడిని మేమందరం ఓదార్చాము అని రిషద్ హుస్సేన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం
-
సైరన్ల మోత.. మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక సూచన
ఢిల్లీ: మీడియా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. సైరన్ల శబ్దాలు వాడొద్దంటూ సూచించింది. అలా వాడితే.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం అవగాహన కార్యక్రమాల్లోని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.భారత్-పాకిస్తాన్ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సంబంధించి స్థానిక, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తోంది. ఈ క్రమంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను న్యూస్ కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్స్ సమయంలో మాత్రమే ప్రజలు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. -
పాకిస్థాన్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందన్నారు. ‘‘దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.పాకిస్థాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అసదుద్దీన్ అన్నారు. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుంది. అమాయకులను, చిన్న పిల్లలను చంపడం దారుణమన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బతకాలి’ అని అసదుద్దీన్ అన్నారు. -
S400 చూసి వణికిపోతున్న పాక్ ఫేక్ ప్రచారంతో శునకానందం
-
మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం
-
26/11 దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఢిల్లీ: 26/11 దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడి సూత్రధారిని భారత్ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడిలో అబూ జిందాల్ హతమయ్యారు. భారత్ దాడిలో టాప్-5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 7న భారత్ దళాలు చేసిన దాడిలో టాప్-5 ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతమయ్యారు.మురిద్కే, బవహాల్పూర్లో జరిగిన దాడుల్లో ఉగ్రనేతలను భారత్ హతమార్చింది. ముర్కిదే దాడిలో అబు జిందాల్ హతమవ్వగా.. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ హాజరయ్యారు. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసుఫ్ అజార్‌ను కూడా భారత్ హతం చేసేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ తుడిచిపెట్టేసింది. -
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జై శంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్
ఢిల్లీ: భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియా సూచించారు. జై శంకర్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని కోరారు. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలన్న రూబియో.. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత్ విధానం ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగానే ఉంటుందని జైశంకర్ అన్నారు.అదే విధంగా.. కొన్ని గంటల ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కూడా ఫోన్ చేసి రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రూబియో.. జైశంకర్‌తో మాట్లాడటం ఇది రెండోసారి. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కూడా విడిగా మాట్లాడుతూ, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.మరోవైపు, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము నిత్యం సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, చైనా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. గురువారం సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ఢిల్లీకి రావడం తెల్సిందే. అనంతరం శుక్రవారం ఆయన పాక్ చేరుకున్నారు. ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో చర్చలు జరపనున్న వేళ మంత్రి ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పాక్ కు చావు దెబ్బ.. టాప్ మిస్సైల్స్ కూల్చేసిన భారత్
-
India Pakistan War: బోర్డర్ నుంచి లైవ్ అప్డేట్స్
-
మోదీ సిగ్నల్ ఇస్తే..? పాక్ ని 5 రోజుల్లో లేపేస్తాం: మాజీ జర్నల్
-
పాక్ దొంగ దెబ్బ.. మిస్సైల్స్ ని గాల్లోనే పేల్చేసిన భారత్
-
దూసుకొచ్చిన పాక్ బాలిస్టిక్ క్షిపణి.. నిర్వీర్యం చేసిన భారత్
-
ఉగ్రవాదులతో సహవాసం.. భారత్ దెబ్బకు కళ్లు తేలేసిన పాక్
-
రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
-
36 నగరాలపై రెచ్చగొట్టేల 400 డ్రోన్లతో పాక్ దాడి
-
దేశవ్యాప్తంగా హై అలర్ట్
-
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
పాక్ చెయ్యి వదిలేసిన అమెరికా
గిల్లి కయ్యం పెట్టుకోవటం.. గట్టిగా నాలుగు దెబ్బలు తగిలేసరికి అమెరికా కాళ్లపై పడి కాపాడాలని వేడుకోవటం.. ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్‌కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం.. 1971 నుంచీ పాకిస్తాన్ తీరు ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా తెలిసి వచ్చింది. పొరుగుదేశంతో నువ్వు గొడవ పెట్టుకుంటే నిన్ను నేనెందుకు కాపాడాలని అమెరికా నిలదీస్తోంది. ‘భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో దాయాది దేశానికి దిక్కు తోచటం లేదు. కాపాడుతూ వచ్చిన అమెరికా 1971 యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2001లో ఘర్షణ, 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు.. ఇలా భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న ప్రతిసారీ పాకిస్తాన్ పాలకులు రాత్రికి రాత్రి అమెరికాలో వాలిపోయి కాపాడాలని ఆ దేశ పెద్దలకు మొరపెట్టుకున్నారు. నాడు పాకిస్తాన్ పక్షపాతిగా ఉన్న అమెరికా అడిగిందే తడవుగా రంగంలోకి దిగి భారత్‌తో చర్చలు జరిపి శాంతించేలా చేసేది. 1971 యుద్ధ సమయంలో పాక్‌కు మద్దతుగా ఏకంగా అణ్వాయుధాలు గల విమాన వాహక నౌక యూఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ నాయకత్వంలో 7వ ఫ్లీట్‌ను బంగాళాఖాతంలో మోహరించింది. 1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌ను ఉగ్రమూకల ముసుగులో పాక్ సైన్యం ఆక్రమించింది. ఆలస్యంగా గుర్తించిన భారత సైన్యం.. భీకర దాడులతో వారిని తరిమికొట్టింది. అంతటితో వదలకూడదని పాక్‌పై సైనిక చర్యకు ప్రణాళిక వేసింది. భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి పాక్‌కు ఉప్పందించింది. దీంతో భయపడిన నాటి పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్.. అమెరికాకు పరుగు పెట్టి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సమావేశమయ్యాడు. మొదట కార్గిల్‌ను తాము ఆక్రమించలేదని బుకాయించిన నవాజ్‌షరీఫ్.. క్లింటన్‌తో సమావేశం తర్వాత 1999, జూలై 12న కార్గిల్ నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. 2001లో పాక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయటంతో రెండు దేశాలు మరోసారి యుద్ధం ముందు నిలిచాయి. ఆ సమయంలో కూడా పాక్‌ను కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. తన రాయబారిని ఢిల్లీకి పంపి భారత్‌ను శాంతింపజేసింది. ఇలా దౌత్యంతోపాటు ఎప్పటికప్పుడు ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తూ పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం కాపాడుతూ వచ్చింది. ఎఫ్–16 సూపర్సోనిక్ యుద్ధ విమానాలను కూడా పాక్‌కు అందించింది. కాలం మారింది.. కథ అడ్డం తిరిగింది చాలాకాలంపాటు ఆత్మరక్షణ విధానాన్నే అవలంబించిన భారత్.. కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరుప్రతిష్టలు పెంచుకోవటంతోపాటు తెలివైన దౌత్య విధానాలతో కొత్త మిత్రులను సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీ వాన్స్ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘చూడండి.. ఆయుధాలు వదిలేయాలని భారత్‌కుగానీ, పాకిస్తాన్‌కు గానీ మేము చెప్పలేము. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కూడా కాదు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఈ ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అణు యుద్ధంగా మారబోదనే నమ్ముతున్నాం’అని వాన్స్ పేర్కొన్నారు. వాన్స్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్‌పై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుదారైన నిక్కీ హేలీ మరో బాంబు వేశారు. పహల్గాంలో సామాన్యులను చంపిన ఉగ్రవాదులను శిక్షించే హక్కు, అధికారం భారత్‌కు ఉన్నాయని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్‌కు చురకలంటించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఉద్రిక్తతలు తగ్గే మార్గం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ పై, అది కూడాపంజాబ్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్ ప్రతిదాడి చేశాక పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ఠ దెబ్బతింది.అసీమ్ మునీర్ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్‌లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.జనరల్ మునీర్ దూకుడుపాక్ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు. జనరల్ మునీర్ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్‌కు కలిగించింది.మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్‌తో సహా మరి కొందరు సీనియర్ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాక్ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్– పాక్ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచంవిస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు. ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్ యూనియన్ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు. ఇరు దేశాలు ఏం చేయొచ్చు?అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీమ్ మాలిక్‌ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.-వ్యాసకర్త డైరెక్టర్ (రిసెర్చ్), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-తారా కార్థా -
వారం రోజుల విరామం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది. -
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్‌ను వాయిదా వేశాం. ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. -
పాక్‌కు బిలియన్ డాలర్లు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి తనకు 100 కోట్ల డాలర్లు మంజూరైనట్టు పాకిస్తాన్ పేర్కొంది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో ఇందుకు ఆమోదముద్ర పడ్డట్టు పేర్కొంది. ఇది పాక్‌కు 700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణ ప్యాకేజీలో భాగం. ఈ మొత్తాన్ని మూడేళ్ల వ్యవధిలో ఇచ్చేందుకు గత జూలైలో ఐఎంఎఫ్ అంగీకరించింది. రుణ వాయిదాల వినియోగాన్ని ఆర్నెల్లకోసారి సమీక్షిస్తూ ఏడు వాయిదాల్లో రుణాన్ని అందజేస్తామని పేర్కొంది. తొలి వాయిదాగా గతంలోనే 100 కోట్ల డాలర్లు అందజేసింది. ఈ రుణంపై భారత్ తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతూ వస్తోంది. ‘‘ఈ నిధులను పాక్ ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలపైనే వెచ్చిస్తుంది. అంతిమంగా ఇది భారత్‌కే గాక అంతర్జాతీయ సమాజానికే పెనుముప్పుగా పరిణమిస్తుంది. కనుక పాక్‌కు రుణసాయాన్ని పూర్తిగా నిలిపేయాలి’’అని కోరుతూ వస్తోంది. పాక్‌కు 100 కోట్ల డాలర్ల విడుదల ప్రతిపాదనను శుక్రవారం నాటి ఐఎంఎఫ్ బోర్డు భేటీలో భారత్ వ్యతిరేకించింది. దానిపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పాక్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రచారం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఎందుకు ఉన్నట్టు? అలాగాక వ్యతిరేకంగా ఓటేస్తే మన వైఖరిని సమర్థంగా వినిపించినట్టుగా ఉండేది’’అంటూ ఆక్షేపించింది. దివాలా స్థితిలో ఉన్న పాక్‌ను చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌తో పాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌లే ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాయి. 2024 నాటికి పాక్ విదేశీ రుణభారం 130 బిలియన్ డాలర్లు దాటింది. -
Himanshi Narwal: ఆ వీరుడి ఆత్మకు సంపూర్ణ శాంతి
-
400 డ్రోన్లతో విరుచుకుపడ్డ పాక్ ఒక్కటి కూడా మిగల్లేదు
-
141కోట్ల ప్రజల రక్షణకై అడ్డునిలిచి వీర మరణం పొందాడు
-
భారత అమ్ములపొదిలో మూడు ప్రధాన యుద్ధ ట్యాంకులు
-
మోదీని కలిసిన వరల్డ్ బ్యాంక్ చీఫ్: సింధు జలాల ఒప్పందంపై..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ సింధు జలాల నిలిపివేతపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని వరల్డ్ బ్యాంక్ చీఫ్ 'అజయ్ బంగా' స్పష్టం చేశారు. మా పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని అన్నారు.భారతదేశంలో పర్యటిస్తున్న అజయ్ బంగా.. గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అదే రోజు ఉత్తరప్రదేశ్ మ్యాఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్'ను కలిసిన తరువాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ అధినేతగా పదవిని స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్ సిక్కుగా రికార్డ్ క్రియేట్ చేసిన బంగా.. ఇండియా - పాకిస్తాన్ యుద్ధం సమయంలో మన దేశంలో పర్యటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.1960లో సింధు జలాల పంపకంపై భారతదేశం-పాక్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంది. ఆ సమయంలో రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సహాయపడింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, రెండు దేశాల ఇంజనీర్లు.. ప్రపంచ బ్యాంకు మధ్య సంప్రదింపులు, రాజకీయ కుతంత్రాలను అధిగమించడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో మేము జోక్యం చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేసారు.We have no role to play beyond a facilitator. There’s a lot of speculation in the media about how the World Bank will step in & fix the problem but it’s all bunk. The World Bank’s role is merely as a facilitator-World Bank President, Ajay Banga on #IndusWaterTreaty Suspension… pic.twitter.com/6bbiZpKf0o— PIB India (@PIB_India) May 9, 2025 -
పాక్ ను చీల్చి చెండాడిన ఆయుధాలను.. గూస్ బంప్స్ గ్యారెంటి వీడియో
-
పాక్ ఆర్మీ బేస్ పై విరుచుకుపడిన భారత్ డ్రోన్లు
-
భారత్ చేసింది న్యాయం..! పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు
పహల్గాం ఘటనకు ప్రతిగా భారత్ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్ వ్యక్తి భారత్ చేసింది న్యాయమే అంటూ పోస్ట్ చేసిన వైరల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలా మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో దుబాయ్‌కి చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత్ సిందూర్ ఆపరేషన్‌తో పాక్‌పై చేసిన దాడిని సరైదని, అది న్యాయం అని మాట్లాడారు. అంతేగాదు భారత ప్రభుత్వం చర్యను, భారత సాయుధ దళాల ప్రతిస్పందనను మెచ్చకున్నాడు. ఇప్పుడు పాక్ వరకు వచ్చేటప్పటికీ తామూ బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నప్పుడూ ఏమైంది ఇదంతా అని నిలదీశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి, మానవహక్కులు అంటూ నీతి కబర్లు చెప్పడమే గాక పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని తిట్టిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా స్పందించే హక్కు భారత్‌కి పూర్తిగా ఉందన్నారు. అలాగే భారత్ చేసింది న్యాయమే అని ప్రశంసించాడు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడూ తెలియలేదా పాక్‌కి ఇది ఎప్పటికైనా నష్టమే అని అంటూ ఫైర్ అయ్యాడు. ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు..భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ..శాంతికి పీటవేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేగాదు భారత్ చేసింది యుద్ధ చర్య కాదు..కేవలం అది న్యాయం.. అనినొక్కి చెప్పాడు అభయ్ వీడియోలో. పైగా ఆ వీడియోకి ఒక పాకిస్తానీ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s)source: Live Mint english website ఆధారంగా..(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..) -
పాక్ పై ఆర్థిక ఆంక్షలు..! IMF కి వాదనలు వినిపించనున్న భారత్
-
భారత్-పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్
భారత్-పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు. -
'54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో బదులిచ్చింది. దీంతో పాకిస్తాన్ యుద్ధానికి కాలుదువ్వుతూ ..పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. రాజస్థాన్ నుంచి కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి పాక్ చేసిన దాడులన్నింటినీ భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. అంతేగాదు దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇరుదేశాల నడుమ తీవ్ర యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఈ నేపథ్యంలో దాయాది దేశం పాక్ గతంలో భారత్‌తో యుద్ధానికి దిగినప్పడు..భారత్ దేశభక్తిని చాటేలా ఎలా ఐక్యతగా వ్యవహరించి చక్కబెట్టిందో తెలుసుకుందామా. ఆ సమయంలో ఉన్న నాటి ప్రధానులు ఎలాంటి నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించారు తదితర విశేషాలు చూద్దామా..!భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు వినగానే కళ్ల ముందు ఆ నాయకుడి అసామాన్య ధైర్యసాహసాలు కదలాడతాయి. భారతదేశ ప్రయోజనాల కోసం ఉత్తేజకరమైన పదాలతో ఇచ్చే ఉపన్యాసాలు అందర్నీ ప్రభావితం చేసేలా ధైర్యాన్ని నింపుతాయి. ఆయన చాలా డేరింగ్‌గా పోఖ్రాన్-II అణు పరీక్షలకు అధికారం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దాంతోనే దశాబ్దాలుగా అణ్వాయుధ పరీక్షలపై ఉన్న తాత్కాలిక నిషేధానికి ముగింపు పలికారు. అందువల్లే ఇప్పుడు భారతదేశం అణ్వాయుధ దేశంగా మారింది.నాటి అమెరికా అధ్యక్షుడుకి రహస్య లేఖ..1999 కార్గిల్ యుద్ధం సమయంలో, వాజ్‌పేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ఒక ‘రహస్య లేఖ’ పంపారు. అయితే క్లింటన్ ఆ సమయంలో జెనీవాలో ఉన్నారు. దాంతో ఆ సందేశాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శామ్యూల్ ఆర్.శాడీ బెర్గర్ అందుకున్నారు. ఆ లేఖలో వాజ్‌పేయి వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని భారత స్థావరాలను స్వాధీనం చేసుకున్న దళాలను వెనక్కి తీసుకోకపోతే భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేయాల్సి వస్తుందని వాజ్‌పేయి హెచ్చరించారు. అయితే అందుకు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశంపై అణు దాడి చేస్తామని బెదిరింపులకు దిగినట్లు అమెరికా తెలియజేసింది భారత్‌కి. అంతే మాజీ ప్రధాని వాజ్‌పేయి దానికి ఇలా సమాధానం ఇచ్చారు. తాను 25% భారతీయులను కోల్పోవడానికి సిద్ధమే..కానీ పాకిస్తాన్ మరుసటి రోజు సూర్యుడిని చూడదని మీకు హామీ ఇస్తున్నా అని తేల్చి చెప్పారు. ఇక ఆ కార్గిల్ యుద్ధంలో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లోని పర్వతాలను పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టి భారత్ ఈ యుద్ధంలో గట్టి విజయం సాదించింది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది.అధికారం లేకపోయినా..1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో, వాజ్‌పేయి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు ముఖ్యం కావని ఘంటాపథంగా చెప్పేవారు. నిజానికి ఆ సమయంలో వాజ్‌పేయి జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ తర్వాత ఆ జనసంఘ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీ (BJP)గా, ప్రముఖ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడూ..ఐక్యతకు పెద్దపీటవేసిన మహోన్నత వ్యక్తి. మొదటి యుద్ధం టైంలో గుండెల్ని తాకే ప్రసంగం..పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగం చూస్తే.. నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగిలే..ఉంటుంది. ఆ హిందీ ప్రసంగం అనువాదం.."మనం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాము. అగ్ని నుంచి బంగారం శుద్ధి చేయబడి బయటకొచ్చినట్లుగా ఈ సమస్య నుంచి బయటపడి గెలుపు మనదే అయ్యేలా చేసుకుందాం. అలాగే మన సరిహద్దులను రక్షించుకుని, పాకిస్తాన్ పాలకులకు మర్చిపోలేని గట్టి గుణపాఠం నేర్పిద్దాం. ఈ రోజు నేను ఏ రాజకీయ పార్టీ తరపున మాట్లాడటానికి సిద్ధంగా లేను. ప్రస్తుతం దేశంలో మనమంతా ఒకే పార్టీ. మన మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి.. యావత్ దేశం విజయం వైపు ముందుకు సాగాలి . భుజం-భుజం కలిపి, దశలవారీగా దాడులతో చిత్తుచేసి గట్టి విజయం అందుకుందాం. అంతేగాదు ఈ పోరాటం ఏ త్యాగాలను కోరినా..అందుకు సంసిద్ధంగా ఉందాం." అని ప్రసంగించారు వాజ్‌పేయి. హృదయాలను కదలించే ప్రసంగం ఇప్పటికి చెవుల్లో మారుమ్రెగుతున్నట్లే ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు.(చదవండి: Operation Sindoor: 'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం)