సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ | Justice BR Gavai oath of Chief Justice of India | Sakshi
Sakshi News home page

సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

May 14 2025 10:46 AM | Updated on May 14 2025 1:34 PM

Justice BR Gavai oath of Chief Justice of India

ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గవాయ్‌కు అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గవాయ్‌.. చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌గా పేరు పొందారు.

ఇక, మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్‌ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ గవాయ్‌ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్‌ గవాయ్‌ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని పలు కీలక కేసులను విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement