
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగిన అనంతరం ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంటోంది. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సీఎంపై దాడి చేసిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం కలిగినవాడంటూ, అందుకు నిదర్శనంగా నిలిచే ఒక ఫొటోను షేర్ చేసిన దరిమిలా ఆప్ ఎదురుదాడికి దిగింది.
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ఖురానా సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. దానిలో సీఎంపై దాడి చేసిన సకారియా రాజేష్‌భాయ్.. గుజరాత్ ఆప్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా పక్కపక్కనే ఉన్నట్లు కనిపిస్తోంది. ‘ఈ ఫొటో చూసిన తరువాత సీఎంపై దాడికి రాజకీయ మద్దతు ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని’ ఖరానా కామెంట్ చేశారు. ‘ఈ ఫోటో వెనుక ఉన్న నిజాన్ని కేజ్రీవాల్ వివరిస్తారా? దయచేసి ఈ సంబంధాన్ని ఏమని పిలుస్తారో వివరించండి’అంటూ ఆయన ప్రశ్నించారు.
हरीश खुराना जी, आप की ख़ुद की तो किसी ट्रोलर से ज़्यादा इज्जत है नहीं लेकिन ऐसी घटिया हरकत करने से पहले अपने पिताजी मदनलाल जी की इज्जत की तो परवाह कर लेते?
दो रूपिये Per ट्वीट के हिसाब से काम कर रहे भाजपाई छुटभैये से भी निम्न स्तर के आप के कारनामे देखकर स्वर्गीय मदनलाल खुराना… https://t.co/KjeG09XACl— Gopal Italia (@Gopal_Italia) August 20, 2025
దీనిపై స్పందించిన ఆప్ గుజరాత్ యూనిట్ ఆ ఫోటో నకిలీదని కొట్టిపారేసింది. బీజేపీ ఒక లింక్ తయారు చేయడానికి కృత్రిమ మేధస్సు ఉపయోగించిందని ఆరోపించింది.‘ఈ ఫోటో నకిలీది. ఎడిట్ చేసినది. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కృత్రిమ మేధస్సు ఉపయోగించి దీనిని సృష్టించారని గుజరాత్ ఆప్ ప్రతినిధి కరణ్ బారోట్ పేర్కొన్నారు. అలాగే దీనిపై నేరుగా స్పందించిన ఆప్ ఎమ్మెల్యే ఇటాలియా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ఖురానాపై మాటల దాడి చేశారు.‘మీరు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడే ముందు, మీ తండ్రి మదన్ లాల్‌కున్న గౌరవం గురించి ఆలోచించలేదా?’ అని ప్రశ్నించారు. కొడుకు చిల్లర చేష్టలు చూస్తే అతను ఏమనుకుంటారు? అని అడిగారు
సీఎం రేఖా గుప్తాపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సకారియా రాజేష్‌భాయ్‌కి సంబంధించిన ఒరిజినల్ ఫొటోను ఆప్ బయటపెట్టింది. ఈ దాడిని బీజేపీ నేతల కుట్రగా అభివర్ణించింది. నిజానికి ఆమెపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొంది. కాగా సీఎంపై దాడి చేసిన రాజ్‌కోట్ నివాసి సకారియా రాజేష్‌భాయ్‌పై ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.