
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ సింధు జలాల నిలిపివేతపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని వరల్డ్ బ్యాంక్ చీఫ్ 'అజయ్ బంగా' స్పష్టం చేశారు. మా పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని అన్నారు.
భారతదేశంలో పర్యటిస్తున్న అజయ్ బంగా.. గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అదే రోజు ఉత్తరప్రదేశ్ మ్యాఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్'ను కలిసిన తరువాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ అధినేతగా పదవిని స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్ సిక్కుగా రికార్డ్ క్రియేట్ చేసిన బంగా.. ఇండియా - పాకిస్తాన్ యుద్ధం సమయంలో మన దేశంలో పర్యటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
1960లో సింధు జలాల పంపకంపై భారతదేశం-పాక్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంది. ఆ సమయంలో రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సహాయపడింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, రెండు దేశాల ఇంజనీర్లు.. ప్రపంచ బ్యాంకు మధ్య సంప్రదింపులు, రాజకీయ కుతంత్రాలను అధిగమించడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో మేము జోక్యం చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేసారు.
We have no role to play beyond a facilitator. There’s a lot of speculation in the media about how the World Bank will step in & fix the problem but it’s all bunk. The World Bank’s role is merely as a facilitator
-World Bank President, Ajay Banga on #IndusWaterTreaty Suspension… pic.twitter.com/6bbiZpKf0o— PIB India (@PIB_India) May 9, 2025