IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం | India And Pakistan War Updates | Sakshi
Sakshi News home page

IndiavsPak:ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం

May 10 2025 11:37 PM | Updated on May 11 2025 4:51 AM

India And Pakistan War Updates

ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్‌ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్‌ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్‌ దుర్మార్గ వైఖరిపై భారత్‌ ఆ‍గ్రహం  
పాకిస్తాన్‌ ఫేక్‌ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి ‍వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ 
⇒ భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్‌ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి 
⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు హతం

శనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌ డ్రోన్లను నిర్వీర్యం  చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ 

జమ్మూ బారాముల్లా, శ్రనగర్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్ల దాడులు
పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించిన సైన్యం

జమ్మూకశ్మీర్‌, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌
గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌
డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలు

శ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్‌ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌ విదించాలని ఆదేశాలు

పాక్‌ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశం
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించింది
పరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయి

కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్‌ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. 


ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్‌ జరిపిన ఈ చర్యకు భారత్‌ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్‌ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్‌ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్‌ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.

ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలు

కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్

సీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా

మళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. 

  • పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణం
  • మళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌
  • సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులు
  • డ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలు

జమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌

  • మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయి
  • భారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌
  • శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు
  • పాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌
  • 3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల  విరమణ ఒప్పందం ఉల్లంఘన
  • భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌
  • శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు
  • అఖ్నూర్‌,  రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌  లో కాల్పులు
  • పాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం
  • రాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌
  • జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌

Advertisement
 
Advertisement
Advertisement