breaking news
india borders
-
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం
ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం ⇒ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్ టార్గెట్‌గా పాక్ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ విదించాలని ఆదేశాలుపాక్ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్ జరిపిన ఈ చర్యకు భారత్ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్ ఇక లేనట్లే.. కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్ అవుట్3 గంట్లల్లోనే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో కాల్పులుపాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌జమ్మూ కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
ఒప్పుకొందామా? తప్పందామా?
చైనాతో మనకున్న తూర్పు, పశ్చిమ సరిహద్దుల వివాదం విషయమై భారతదేశ అనిశ్చయాత్మకత గురించి ఎ.ఎస్. భాసిన్ రాసిన పుస్తకం కలవరపరిచే అనేక ప్రశ్నలను రేకెత్తించింది. బ్రిటిష్ కాలం నుంచి 1954 వరకు సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రపంచ పటాలలో చైనాతో భారత్ పశ్చిమ సరిహద్దు కచ్చితమైన కొలతలు లేకుండానే ఉండిపోయింది. భౌగోళిక కచ్చితత్వం కోసమని నెహ్రూ ఎలాంటి కారణం గానీ, చైనా అంగీకరిస్తుందన్న నమ్మకం గానీ లేకుండా ఏకపక్షంగా భారత్‌లో కలిపేయడానికి అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. మ్యాపులో ఉన్నా, లేకున్నా భారత్ సరిహద్దు భూభాగాలు భారత్‌వే అనే నెహ్రూ మంకుపట్టు దేశానికీ, ఆయనకూ వినాశకరంగా పరిణమించాయి. కరోనా ప్రబలత గొప్ప పఠనావకాశాన్ని కలిగించింది. దురదృష్టం, ఆ చీకటి రోజుల్లో ప్రచురణతో వెలుగును చూసిన ఎన్నో పుస్తకాలు యోగ్యతను కలిగి ఉండి కూడా పాఠకుల దృష్టి ధ్యాసల్ని తమ వైపునకు మరల్చుకోలేక పోయాయి. అవతార్ సింగ్ భాసిన్ రాసిన ‘నెహ్రూ, టిబెట్ అండ్ ఇండియా’ ఇందుకొక ప్రముఖమైన ఉదాహరణ. చైనాతో మనకున్న తూర్పు, పశ్చిమ సరిహద్దుల వివాదం విషయమై భారతదేశ అనిశ్చ యాత్మకత గురించి ఆ పుస్తకం కలవరపరిచే అనేక ప్రశ్నలను రేకెత్తిం చింది. సమస్యను పరిష్కరించడంలో జవహర్లాల్ నెహ్రూ ఎలా తన బాధ్యతారాహిత్యాన్ని కనబరిచిందీ సంకేతపరచింది. విదేశీ వ్యవహా రాల మంత్రిత్వశాఖలోని చరిత్ర విభాగానికి ముప్పై ఏళ్ల పాటు అధిపతిగా ఉన్న తర్వాత భాసిన్ రాసిన పుస్తకం కనుక ఇందులో పొందుపరచిన అంశాలతో వివాదించడం కష్టమే. ముఖ్యంగా తన వెల్లడింపులకు ఆయన అనేక వాస్తవాలను జోడించినప్పుడు. పుస్త కంలో ఆయనేం రాసిందీ క్లుప్తంగా చెబుతాను. బ్రిటిష్ కాలం నుంచి 1954 వరకు సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రపంచ పటాలలో చైనాతో భారత్ పశ్చిమ సరిహద్దు కచ్చితమైన కొలతలు లేకుండానే ఉండిపోయింది. భౌగోళిక కచ్చితత్వం కోసమని నెహ్రూ ఎలాంటి కారణం గానీ, చైనా అంగీకరిస్తుందన్న నమ్మకం గానీ లేకుండా ఏకపక్షంగా భారత్‌లో కలిపేయడానికి అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక పట్ల ఆనాటి మన విదే శాంగ కార్యదర్శులిద్దరూ ఆర్.కె. నెహ్రూ, సుబిమల్ దత్ ఉదాసీనంగా ఉండిపోయారు. ఆర్.కె. నెహ్రూ అనడం...‘అక్సాయ్‌చిన్ మాది’ అనేందుకు మన దగ్గర బలమైన వాదన లేదని నిపుణులు అంటున్నా రని. సుబిమల్ దత్ కూడా అదే మాటను ఇంకోలా చెప్పారు. ‘పశ్చిమ సరిహద్దు’ల నిర్ణయం నిర్దిష్టంగా లేదని! అయితే నెహ్రూ తను అను కున్నదానిపైనే ఉండిపోయారు. అక్సాయ్‌చిన్ భూభాగంలో మన వాడకమే ఎక్కువ కనుక, పైగా అక్కడున్నవి అధికంగా మన ఆచారాలే కనుక అది మనదే అవుతుందని నెహ్రూ అభిప్రాయం. ఆయన చెప్పిన వాడుకకూ, ఆచారాలకూ తగిన రుజువులు లేవని భాసిన్ తన పుస్త కంలో రాశారు. ‘‘అధ్వాన్నం ఏమిటంటే, అక్సాయ్‌చిన్‌ను తన భూభాగంగా నిలబెట్టుకునే ప్రయత్నం ఏదీ భారత్ గట్టిగా చేయక పోవడం! 1954లోనే అక్సాయ్‌చిన్‌ను కలుపుకొంటూ సరిహద్దుల్ని మార్చిన భారత్ ఆ ప్రాంతంలో సైనిక, రాజకీయ, పాలనా పరమైన ఉనికిని చాటుకునేందుకు ఎలాంటి చర్యా తీసుకోలేదు. అక్కడ ఒక చెక్ పోస్ట్ లేదు. సార్వభౌమాధికారాన్ని ప్రకటించే విధంగా ఒక పతా కాన్ని ఎగరేసింది లేదు. హక్కును పొందేందుకు మ్యాప్‌పై ఒక గీత గీసుకుంటే చాలు అని భారత్ భావించినట్లుంది’’ అని భాసిన్ వ్యాఖ్యా నించారు. ఇంకా ఘోరం ఏంటంటే, అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా 120 కిలోమీటర్ల రహదారి నిర్మించుకుంటూ వచ్చిన ఏడేళ్ల కాలంలో ఆ సంగతి భారత్‌కు తెలియకపోవడం! 1957లో ఆ సంగతిని కనిపెట్టినా భారత్ నిరసన కేవలం అనధికారికంగానే ఉండిపోయింది. పైగా మన అభ్యంతరం ఎలా ఉందో చూడండి... అక్సాయ్‌చిన్‌లో రహదారిని నిర్మించిన చైనా కార్మికులకు ఇండియా వీసా లేదని మన ఫిర్యాదు. మరీ హాస్యాస్పదం... సరిహద్దు గస్తీ విధుల్లో ఉండగా అదృశ్యం అయిన భారత సైనికుల ఆచూకీ తెలుసుకోవడం కోసం చైనా సహా యాన్ని భారత్ కోరడం. ‘తెలిస్తే మేమే తరిమికొడతాం’ అని చైనా అన్నప్పుడు భారత్ ఇచ్చిన సమాధానమైతే... అక్సాయ్‌చిన్ అసలు ఇండియాదేనా అనే సందేహాలను ధ్రువీకరించేలా ఉంది. ‘‘ఆ నిర్దిష్ట ప్రాంతం భారతదేశంలో ఉందా లేక చైనాలో ఉందా అనే విషయం వివాదాస్పదంగా ఉంది. దానిని వేరుగా పరిష్కరించుకోవాలి’’ అని భారత్ తన ప్రతిష్ఠను తనే దెబ్బతీసుకునేలా మాట్లాడింది. ఇప్పుడిక తూర్పు సరిహద్దుకు వద్దాం. 1914 నాటి సిమ్లా ఒప్పందంలో భాగంగా టిబెట్–బ్రిటిష్ ఇండియాల మధ్య ఏర్పరచిన మెక్‌మహాన్ విభజన రేఖ ఒక్కటే అక్కడి భూభాగం తనది అని భారత్ చెప్పుకోడానికి ఆధారం. అయితే సిమ్లా ఒప్పందంలో చైనా భాగ స్వామి కాదు కనుక అక్కడి సరిహద్దు ప్రాంతంపై భారత్ హక్కును చైనా గుర్తించలేదు. ఆ సంగతి నెహ్రూకు తెలుసు. 1935లో మెక్ మహానే స్వయంగా 1914 నాటి విభజన రేఖను ప్రశ్నించారు! ఆ రేఖను ఆయన ‘‘టిబెట్–భారత్‌ల మధ్య ఒక మాటగా కుదిరిన సరిహ ద్దుల విభజన మాత్రమే’’నని అన్నారు. ఆ మాటను ఉదహరిస్తూ... ‘‘దీనర్థం.. సర్వేలు లేకుండా, హద్దు రాళ్లు లేకుండా మ్యాపులో మెక్ మహాన్ రేఖను గీశారని...’’ అని భాసిన్ రాశారు. ‘‘సర్వే జరగాలి. హద్దుల్ని గుర్తించాలి. నిర్ణయించాలి’’ అంటారు భాసిన్. ఇక్కడ నాలుగు వాస్తవాలు ముఖ్యమైనవి. మొదటిది.. బ్రిటిషర్లు ఆ కాలపు ఉత్తర, తూర్పు సరిహద్దుల మధ్య ఉన్న మొత్తం భూభా గాన్ని గానీ, మెక్‌మహాన్ గీతకు ఇరువైపుల ఉన్న ప్రదేశాన్ని గానీ ఏనాడూ అక్రమించుకోలేదు. రెండు.. మెక్‌మహాన్ చెప్పిన ప్రకారం తవాంగ్.. ఇండియాలో భాగమే అయినప్పటికీ అది టిబెట్ ఆక్రమణ లోనే ఉంది. మూడు.. భారత్ భూభాగంగా ఉన్న వివాద రహిత టిబెట్ ప్రాంతాలను తిరిగి టిబెట్‌లోకి సర్దుబాటు చేస్తూ విభజన రేఖను గీయవలసిందిగా టిబెట్ మెక్‌మహాన్‌ను కోరింది. నాలుగు.. అలా విభజించేందుకు బ్రిటన్ సుముఖతను వ్యక్తం చేసింది. దీనిని బట్టి మెక్‌మహాన్ రేఖ పరమ ప్రామాణికమైనది కాదని తెలియడం లేదా? నిజానికి 1951 వరకు తవాంగ్ టిబెట్ చేతుల్లోనే ఉంది. టిబెట్ చైనా నియంత్రణలోకి వెళ్లడం మొదలయ్యాక ఇండియానే తవాంగ్ని ఆక్రమించింది. ఎందుకంటే తవాంగ్, టిబెట్‌తో ఉంటే కనుక అప్పు డది టిబెట్‌తో పాటుగా చైనా అధీనంలోకి వెళుతుంది. ‘‘పర్యవసా నంగా భారత్ సరిహద్దు అస్సాంలోని మైదాన ప్రాంతాల వరకు కుదించుకుపోతుంది’’ అంటారు భాసిన్. చివరిగా భాసిన్ ముగింపు ఇది: సరిహద్దుల అంశాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తేలిగ్గా తీసుకున్నారు. మ్యాపులో ఉన్నా, లేకున్నా భారత్ సరిహద్దు భూభాగాలు భారత్‌వే అనే నెహ్రూ మంకుపట్టు దేశానికీ, ఆయనకూ వినాశకరంగా పరిణమించిందన్నది రుజువైంది... అని! పుస్తకంలోని ఈ విషయాలన్నీ కలవరపరిచేవీ, భారత్ వాదనలోని కొలబద్దతలను ప్రశ్నించడానికి అర్హమైనవీ. భాసిన్ తప్పయితే కనుక అతడిని నిలదీయాలి. తప్పు కాకుంటే కనుక అతడు ఎత్తి చూపిన వాస్తవాలను మనం అంగీకరించాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయులు -
భారత్‌పై చైనా దుందుడుకు వైఖరి
వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్ జలసంధి, భారత్ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచిం చిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సమర్పించింది. చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం. భారత్‌తో చర్చలు జరపాలి దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్ వెల్స్ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ య« దాతథ స్థితిని, సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని కట్టిపెట్టిæ భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్‌తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషిగాన్‌లో కరోనా ఫేస్ షీల్డ్ ధరించిన ట్రంప్ -
భారత్ సరిహద్దుల్లో ప్రమాదకర మలేరియా
లండన్: మయన్మార్-భారత్ సరిహద్దుల్లో మందులకు లొంగని మలేరియా పరాన్నజీవులు కనుగొన్నట్టు ఆక్స్ఫర్డ్ ట్రాపికల్ మెడిసిన్ రిసెర్చ్ యూనిట్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరాన్నజీవుల వ్యాప్తితో భారత్‌కు పెనుప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇవి ఆసియా నుంచి ఆఫ్రికా ఉప ఖండంలోకి ప్రవేశించినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా లక్షల సంఖ్యలో ప్రజల జీవితాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. 2013-2014 మధ్య మయన్మార్‌లో ఏర్పాటు చేసిన 55 మలేరియా చికిత్స కేంద్రాల్లోని 940 మంది నుంచి సేకరించిన సాంపిళ్లను వీరు పరీక్షించారు. ఈ పరీక్షల్లో మందులకు లొంగని మలేరియా పరాన్నజీవులను గుర్తించారు. ముఖ్యంగా మయన్మార్‌లోని హోమాలీన్, సాగైంగ్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరాన్న జీవులను గుర్తించారు. ఈ ప్రాంతం భారత సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పరాన్నజీవులు భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.